new project
-
ముత్తూట్ వివాహ సన్మానం.. దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ముత్తూట్ వివాహ సన్మానం ప్రాజెక్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వితంతువులైన తల్లుల కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం అందించడానికి సంస్థ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్పొరేట్ సేవా బాధ్యత(సీఎస్ఆర్) కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి లబ్ధిదారు ర.50 వేల ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. అర్హత కలిగిన లబ్ధిదారులు డిసెంబర్ 25 సాయంత్రం 5.30 గంటలలోగా లక్ష్మీ నారాయణ యమగాని, మేనేజర్ సీఆర్ఎస్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, హైదరాబాద్ చిరునామాకు సమర్పించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వితంతు తల్లులకు ఆర్థిక సాయం ద్వారా వారి ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముత్తూట్ ఫైనాన్స్ సీఎస్ఆర్ హెడ్ బాబు జాన్ మలయల్ తెలిపారు. -
ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు ధీటుగా, దేశాల మధ్య వేగవంతమైన అనుసంధానమే ధ్యేయంగా భారత్, అమెరికా తదితర దేశాలు ప్రతిష్టాత్మక ఆర్థిక నడవా(ఎకనామిక్ కారిడార్)ను తెరపైకి తీసుకొచ్చాయి. ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ నూతన ప్రాజెక్టును భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు శనివారం సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై వారు సంతకాలు చేశారు. ఈ కారిడార్‌తో ఆసియా, అరేబియన్ గల్ఫ్, యూరప్ మధ్య భౌతిక అనుసంధానం మాత్రమే కాదు, ఆర్థిక అనుసంధానం సైతం మరింత పెరుగుతుందని నిర్ణయానికొచ్చారు. దేశాల నడుమ అనుసంధానాన్ని ప్రోత్సాహిస్తూనే అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కనెక్టివిటీని ప్రాంతీయ సరిహద్దుల వరకే పరిమితం చేయాలని తాను అనుకోవడం లేదన్నారు. దేశాల నడుమ పరస్పర నమ్మకం బలోపేతం కావాలంటే అనుసంధానం పెరగడం చాలా కీలకమని స్పష్టం చేశారు. రెండు భాగాలుగా ప్రాజెక్టు ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌లో రెండు వేర్వేరు కారిడార్‌లో ఉంటాయి. ఇందులో ఈస్ట్ కారిడార్ ఇండియాను, పశి్చమ ఆసియా/మధ్య ప్రాచ్యాన్ని కలుపుతుంది. ఉత్తర కారిడార్ పశి్చమ ఆసియా/మిడిల్ఈస్ట్ను యూరప్‌తో అనుసంధానిస్తుంది. సముద్ర మార్గమే కాకుండా రైల్వే లైన్ కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగమే. ఇదొక సీమాంతర షిప్–టు–రైలు ట్రాన్సిట్ నెట్వర్క్. దీంతో దేశాల నడుమ నమ్మకమైన, చౌకైన రవాణా సాధ్యమవుతుంది. వస్తువులను సులభంగా రవాణా చేయొచ్చు. రైలు మార్గం వెంట డిజిటల్, విద్యుత్ కేబుల్స్, క్లీన్ హైడ్రోజన్ ఎగుమతి కోసం పైపులు ఏర్పాటు చేస్తారు. ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది చరిత్రాత్మకమని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివరి్ణంచారంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. -
ఇండియా చెరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమా ఊహించని రిస్క్ చేయబోతున్న రాజమౌళి
-
రాజమౌళి, మహేష్ మూవీ అప్డేట్ వచ్చేసింది.. సీక్రెట్స్ రివీల్ చేసిన విజయెంద్రప్రసాద్
-
మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెరకెక్కించిన డెడ్ పిక్సెల్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 19న హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: విడాకులపై ఇన్‌డైరెక్ట్ హింట్ ఇస్తున్న నిహారిక?.. పోస్ట్ వైరల్) అయితే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది నిహారిక. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిహారిక తెలిపింది. (ఇది చదవండి: ఈ విశ్వం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: నిహారిక పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
శేఖర్ కమ్ములతో సినిమా ఎప్పుడు?
-
ఫ్యూచర్ లో రిపీట్ కాబోతున్న అరవింద సమేత కాంబో...?
-
హ్యాపీ గృహాలు! ఎటుచూసినా హ్యాపీనెస్సే
సాక్షి, హైదరాబాద్: ఆఫీసులో పని ఒత్తిడి నుంచి బయటికి రాగానే ట్రాఫిక్ జాంలు, రణగొణధ్వనులు.. వీటన్నింటి నుంచి తప్పించుకొని కాసేపు సేదతీరాలంటే సొంతిల్లు ఆహ్లాదకరంగా ఉండాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నీటి పరవళ్ల సప్పుళ్లు, ఎటు చూసినా మెదడును ఉత్తేజ పరిచే చిహ్నాలు, బొమ్మలు, కొటేషన్స్, మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకునే మెమొరీ బ్యాంక్.. ఆహా ఊహించుకుంటే ఎంతో బాగుంది కదూ! ఎస్.. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌కే శ్రీకారం చుట్టింది గిరిధారి హోమ్స్. థీమ్ ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన గిరిధారి మరో వినూత్న ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మనిషి ఆనందంగా ఉండాలంటే ఆదాయం, పెట్టుబడులు మాత్రమే రెట్టింపయితే చాలదు.. వారి సంతోషాలూ డబులవ్వాలి. అంటే ఉండే పరిసరాలు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. ఇదే థీమ్‌గా హ్యాపీనెస్ హబ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన హ్యాపీనెస్ కాన్సెప్ట్‌తో కిస్మత్పూర్లో ఐదున్నర ఎకరాలలో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. జీ+5 అంతస్తులలో మొత్తం 567 ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. 1,033 చ.అ. నుంచి 1,601 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. ఎటుచూసినా హ్యాపీనెస్సే: హ్యాపీనెస్ హబ్‌లో ఎటు చూసినా ఆనందాన్ని సూచించే సంకేతాలు, మనస్సును ఆహ్లాదపరిచే ప్రకృతి, పక్షుల కిలకిలారావాలు ప్రతిదీ సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌కు 200 మీటర్ల దూరంలో ఈసా రివర్ ఉంటుంది. హ్యాపీ బాడీ, మైండ్, సోల్, హార్ట్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో 20 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్ ఉంటుంది. రెండు బ్యాడ్మింటన్ కోర్టులకు ఉత్సాహ, ఉల్లాస అని నామకరణం చేశారు. ఇలా నలభైకి పైగా పేర్లు, హ్యాపీనెస్‌ను ప్రేరేపించే చిహ్నాలను ఎంచుకున్నారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, 2 కి.మీ. జాగింగ్, వాకింగ్ ట్రాక్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కూడా ఈ ప్రాజెక్ట్‌కు వర్తిస్తుంది. దీంతో రూ.2.5 లక్షల వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. లో రైజ్ అపార్ట్మెంట్ కారణంగా కొనుగోలుదారులకు అవిభాస్య స్థలం (యూడీఎస్) ఎక్కువ వస్తుంది. ప్రతి వెయ్యి చ.అ.కు 40 గజాల స్థలం వస్తుంది. మెమొరీ బ్యాంక్: ఈ ప్రాజెక్ట్‌లో నివాసితులకు వినూత్న అనుభూతిని కలిగించేందుకు తొలిసారిగా మెమొరీ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క కొనుగోలుదారులకు ఒక లాకర్‌ను ఇస్తారు. ఇందులో వారి మధుర జ్ఞాపకాలను భద్రపరుచుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత వాటిని చూసుకుంటే అప్పటి మధుర క్షణాలు కళ్లముందు సాక్షాత్కారమవుతాయి. ఇప్పటివరకు గిరిధారి హోమ్స్ కిస్మత్పూర్లో 2 వేల గృహాలను పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించింది. వచ్చే 12 నెలల్లో మరో 30 లక్షల చ.అ.లలో ప్రాజెక్ట్‌లను ప్రారంభించనుంది. -
కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు 24 శాతం జంప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు దాదాపు 24 శాతం ఎగశాయి. ఏప్రిల్-జూన్ (క్యూ1)లో రూ. 3.64 లక్షల కోట్లను తాకాయి. గతేడాది (2021-22) క్యూ1తో పోలిస్తే పెట్టుబడులు పుంజుకున్నప్పటికీ జనవరి-మార్చి(క్యూ4)తో పోలిస్తే 38 శాతంపైగా క్షీణించినట్లు బ్రిక్‌వర్క్ రేటింగ్స్ రూపొందించిన నివేదిక తెలియజేసింది. అయితే గత క్యూ4లో ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్స్ వార్షిక ప్రాతిపదికన 130 శాతం జంప్ చేసినట్లు నివేదిక పేర్కొంది. రూ. 5.91 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. కరోనా ఎఫెక్ట్ కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో ప్రాజెక్ట్ పెట్టుబడులు క్షీణిస్తూ వచ్చాయి. తదుపరి గతేడాది క్యూ4 నుంచి మాత్రమే పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొన‘సాగు’తుండటంతో తలెత్తిన అనిశ్చితులు, వీటితో ఆంక్షల విధింపు వంటి అంశాలు ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంటును దెబ్బ తీస్తున్నాయి. అంతేకాకుండా కొనసాగుతున్న చిప్‌ల కొరత, వడ్డీ రేట్ల పెరుగుదల సైతం వీటికి జత కలుస్తున్నాయి. ప్రభావం క్యూ1లో కొత్త ప్రాజెక్టులపై పడింది. వెరసి వీటి సంఖ్య సగానికి పడిపోయింది. అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 545 నుంచి 247కు వెనకడుగు వేశాయి. ఇదేవిధంగా ప్రభుత్వం నుంచి కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు సైతం 59 శాతం క్షీణించి రూ. 32,700 కోట్లకు పరిమిత మయ్యాయి. ఇక ప్రయివేట్ రంగంలో మాత్రం కొత్త ప్రాజెక్టుల సంఖ్య 188కు ఎగశాయి. వీటి ప్రతిపాదిత పెట్టుబడులు రూ. 3.3 లక్షల కోట్లకు చేరాయి. క్యూ4లో ప్రయివేట్ రంగ పెట్టుబడి వ్యయాలు రూ. 3.9 లక్షల కోట్లుకాగా.. ప్రభుత్వం నుంచి రూ. 2.1 లక్షల కోట్లుగా నమోదైనాయి. ఆర్థిక పరిస్థితులతో బడ్జెట్లో కేంద్రం గరిష్ట స్థాయిలో పెట్టుబడి వ్యయాలు ప్రతిపాదించినప్పటికీ నీరసించిన ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ద్యవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. వడ్డీ రహితం (సున్నా రేటు)లో రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల రుణాలను అందించడంలో తాత్సారం చేస్తోంది. మరోపక్క రాష్ట్రాలు సైతం కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించిన కొత్త ప్రాజెక్టులలో రాష్ట్రాల వాటా 8 శాతమే కావడం గమనార్హం! ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. 7.5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాలను ప్రతిపాదించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే ఇవి 24.5 శాతం అధికం!! -
కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు అప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు దాదాపు 24 శాతం ఎగశాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3.64 లక్షల కోట్లను తాకాయి. గతేడాది(2021–22) క్యూ1తో పోలిస్తే పెట్టుబడులు పుంజుకున్నప్పటికీ జనవరి–మార్చి(క్యూ4)తో పోలిస్తే 38 శాతంపైగా క్షీణించినట్లు బ్రిక్‌వర్క్ రేటింగ్స్ రూపొందించిన నివేదిక తెలియజేసింది. అయితే గత క్యూ4లో ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్స్ వార్షిక ప్రాతిపదికన 130 శాతం జంప్ చేసినట్లు నివేదిక పేర్కొంది. రూ. 5.91 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. నివేదిక ప్రకారం.. కరోనా ఎఫెక్ట్ కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో ప్రాజెక్ట్ పెట్టుబడులు క్షీణిస్తూ వచ్చాయి. తదుపరి గతేడాది క్యూ4 నుంచి మాత్రమే పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కొన‘సాగు’తుండటంతో తలెత్తిన అనిశ్చితులు, వీటితో ఆంక్షల విధింపు వంటి అంశాలు ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా కొనసాగుతున్న చిప్‌ల కొరత, వడ్డీ రేట్ల పెరుగుదల సైతం వీటికి జత కలుస్తున్నాయి. ఈ ప్రభావం క్యూ1లో కొత్త ప్రాజెక్టులపై పడింది. వెరసి వీటి సంఖ్య సగానికి పడిపోయింది. అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 545 నుంచి 247కు వెనకడుగు వేశాయి. ఇదేవిధంగా ప్రభుత్వం నుంచి కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు సైతం 59 శాతం క్షీణించి రూ. 32,700 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక ప్రయివేట్ రంగంలో మాత్రం కొత్త ప్రాజెక్టుల సంఖ్య 188కు ఎగశాయి. వీటి ప్రతిపాదిత పెట్టుబడులు రూ. 3.3 లక్షల కోట్లకు చేరాయి. క్యూ4లో ప్రయివేట్ రంగ పెట్టుబడి వ్యయాలు రూ. 3.9 లక్షల కోట్లుకాగా.. ప్రభుత్వం నుంచి రూ. 2.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక పరిస్థితులతో బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గరిష్ట స్థాయిలో పెట్టుబడి వ్యయాలు ప్రతిపాదించినప్పటికీ నీరసించిన ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ద్యవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. వడ్డీ రహితం(సున్నా రేటు)లో రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల రుణాలను అందించడంలో తాత్సారం చేస్తోంది. మరోపక్క రాష్ట్రాలు సైతం కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించిన కొత్త ప్రాజెక్టులలో రాష్ట్రాల వాటా 8 శాతమే కావడం గమనార్హం! ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. 7.5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాలను ప్రతిపాదించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే ఇవి 24.5 శాతం అధికం!! -
ప్రతిష్టాత్మక ‘మై హోమ్ సయూక్’ ను లాంచ్ చేసిన స్టైలిష్‌స్టార్
సాక్షి, హైదరాబాద్: పాపులర్ రియల్ ఎస్టేట్ సంస్థ మై హోమ్ గ్రూప్ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. ‘మై హోమ్ సయూక్’ పేరుతో దీన్ని ప్రారంభించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. గోపనపల్లి-తెల్లాపూర్ రోడ్లో,ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలకు అత్యంత సమీపంలో మై హోమ్ సయూక్ ప్రాజెక్ట్. 12 టవర్లతో, 3780 ఫ్లాట్స్‌గా నిర్మించనున్నారు.మై హోమ్ సయూక్‌లో 6 టవర్ల కోసం బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో భాగం మై హోమ్ సయూక్, మైహోమ్ గ్రూప్ ప్రతిమ గ్రూప్‌ల ఉమ్మడి వెంచర్. హైదరాబాద్ సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విల్లా ప్రాజెక్ట్- ప్రిస్టిన్ ఎస్టేట్స్‌ను ప్రతిమ గ్రూప్ అభివృద్ది చేసింది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో తొలిదశలో మై హోమ్ సయూక్ 25.37 ఎకరాలలో జీ+39 ఫ్లోర్లతో ఉండటంతోపాటు, 82శాతం ఓపెన్ ఏరియాలను అందిస్తుంది. మొత్తం 12 టవర్లు కలిగి ఉండటంతో పాటుగా ఫ్లోర్‌కు 8 ఫ్లాట్స్‌తో ఇది వస్తుంది. వీటిలో 2, 2.5 3బీహెచ్‌కె ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్మెంట్లు 1355 చదరపు అడుగుల నుంచి 2262 చదరపు అడుగుల విస్తీర్ణంలో మై హోమ్ నుంచి సిగ్నేచర్ ఫ్లోర్ ప్లాన్స్‌తో ఉంటాయి. ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణలు • 7.5 ఎకరాలలో సెంట్రల్ ల్యాండ్‌స్కేప్ • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 5 నిమిషాల ప్రయాణం • ప్రతి టవర్‌కూ డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీ • ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ • రాబోతున్న ఇంటర్నేషనల్ స్కూల్, సయూక్ కు పక్కనే • 2 రూఫ్‌టాప్ టెన్నిస్ కోర్టులు • ఏసీ స్విమ్మింగ్ పూల్ ‘సౌకర్యవంతమైన జీవనం, అంతే సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాలలో, కమ్యూనిటీలకు అతి చేరువగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను మూడు దశాబ్దాలకు పైగా అభివృద్ధి చేస్తూ అగ్రగామిగా మై హోమ్ వెలుగొందుతోందని, దానికి కొనసాగింపే మై హోమ్ సయూక్’’ అని మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు వెల్లడించారు -
యూఏఈలో రామ్కీ ఎన్విరో ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ తాజాగా యూఏఈలో ఓ ప్రాజెక్టును దక్కించుకుంది. రస్ అల్ ఖైమాలో పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రస్ అల్ ఖైమా వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో ఈ మేరకు రామ్కీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
Rajinikanth: కాంబినేషన్ కుదిరేనా?
‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) రిలీజ్ తర్వాత రజనీకాంత్ హీరోగా నటించనున్న సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. కార్తీక్ సుబ్బరాజు, వెంకట్ ప్రభు, కేఎస్ రవికుమార్ వంటి దర్శకులు రజనీకి కథలు వినిపించారని కోలీవుడ్ టాక్. తాజాగా ఈ జాబితాలో ‘చీనీ కమ్’, ‘పా’, ‘ప్యాడ్మాన్’ వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వíß ంచిన ఆర్. బాల్కీ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల రజనీని కలిసి ఓ కథను వినిపించారట బాల్కీ. ఆ కథ రజనీకి బాగా నచ్చిందని సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలను కుంటున్నారట. ఇక ఇప్పటివరకూ బాల్కీ తెరకెక్కించిన వాటిలో చీనీ కమ్, పా, షమితాబ్ తదితర చిత్రాలకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఒకవేళ రజనీ – బాల్కీ కాంబినేషన్ కుదిరితే ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. 1994లో వచ్చిన ‘వీర’ చిత్రం తర్వాత రజనీ–ఇళయరాజా కలిసి వర్క్ చేయలేదు. మరి... 28 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కుదురుతుందా? అసలు రజనీ–బాల్కీ కాంబినేషన్ కుదిరిందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
కొత్త ప్రాజెక్టులపై ఒక బిలియన్ డాలర్లు..
న్యూఢిల్లీ: రాబోయే కొన్ని సంవత్సరాల్లో కొత్త ప్రాజెక్టుల కొనుగోలు, అభివృద్ధిపై 1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు రియల్టీ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ వెల్లడించారు. అధిక వృద్ధి సాధన లక్ష్యాల్లో భాగంగా ఈ మేరకు ప్రణాళికలను అమలు చేయనున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో ఆయన వివరించారు. కరోనా వైరస్‌పరమైన ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్ 14 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 6,725 కోట్లకు చేరాయని గోద్రెజ్ తెలిపారు. మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) నమోదు చేసిన రూ. 6,000 కోట్ల బుకింగ్స్ స్థాయిని అధిగమించినట్లు వివరించారు. ‘రోజుకు సగటున 25 గృహాల చొప్పున మొత్తం 9,345 గృహాలను విక్రయించాం‘ అని గోద్రెజ్ పేర్కొన్నారు. మార్చి నెలలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ప్రక్రియ ద్వారా రూ. 3,750 కోట్లు సమీకరించిన నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మిగులు నిధులతో ముగించినట్లయిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం వ్యాపార అభివృద్ధికి పటిష్టమైన అవకాశాలు ఉన్నట్లు గోద్రెజ్ వివరించారు. ప్రధానంగా ముంబై, పుణె, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)పై ప్రధానంగా దృష్టి పెడుతున్న గోద్రెజ్ ప్రాపర్టీస్.. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో కీలక మార్కెట్లో సుమారు రూ. 1,300 కోట్ల పైగా విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించింది. -
కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ కొట్టేసిన శివాత్మిక
‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్న శివాత్మికకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చిత్రంలో నటిస్తున్న శివాత్మక చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది‘ఆనందం విలయాడుమ్ వీడు’ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గౌతమ్ కార్తిక్‌కి జోడిగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. అయితే మొదటి సినిమా విడుదల కాకముందే కోలీవుడ్ నుంచి మరో ప్రాజెక్టుకు సైన్ చేసింది. ఆర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రేమకథా చిత్రంలో శివాత్మిక కథానాయికగా నటించనుంది. ఆమెతో పాటు రీతూవర్మ, అపర్ణబాలమురళి కూడా ఈ సినిమాలో నటించనున్నారు. రోడ్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి శివాత్మిక అధికారికంగా ప్రకటించింది. నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. అద్భుతమైన బృందంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ శివాత్మిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది. My next in Tamil, This one is going to be special 💜 Can’t wait to work with this fab team!@AshokSelvan@riturv @Aparnabala2 @Rkarthik_dir@PentelaSagar @george_dop @GopiSundarOffl @editoranthony@riseeastcre@AndhareAjit #Viacom18Studios pic.twitter.com/lBezrbGzIK — Shivathmika Rajashekar (@ShivathmikaR) June 28, 2021 చదవండి : Shakuntalam: సమంత ఫస్ట్‌లుక్‌పై క్రేజీ అప్డేట్ పెళ్లికి రెడీ అయిపోయిన లవ్ బర్డ్స్ నయన్-విఘ్నేష్ -
న్యూ ప్రాజెక్టు: కేటీఆర్‌కు టాలీవుడ్ హీరో కృతజ్ఞతలు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆదివారం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశాడు. ఈ సందర్భంగా తను త్వరలో ప్రారంభించబోయే ఓ ప్రాజెక్టు గురించి మంత్రికి వివరించాడు. ఈ ప్రాజెక్టుకు కేటీఆర్ తన మద్దతివ్వడంతో మనోజ్ హర్షం వ్యక్తం చేశాడు. ఇందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ విషయాన్ని మనోజ్ ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘ఒక పెద్ద, గొప్ప కార్యం మొదలు కానుంది. నా కొత్త ప్రాజెక్టు, స్పోర్ట్స్ అండ్ ఎడ్యుటైన్మెంట్ ద్వారా యువతకు, సీనియర్లకు సాయం చేయాలనుకునే ఆలోచనను కేటీఆర్ గారితో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. దీనికి మీరు మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు. నా కల త్వరలోనే సాకారం కానుంది. వేచి ఉండండి’ అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: అభిమానులకు షాక్ ఇచ్చిన హీరో Something big and something great brewing. Had the privilege to share my vision to help seniors and youth through my new one of a kind exciting Sports and Edutainment project with #KTR Garu. Grateful for your support @KTRTRS. The dream will be a reality soon 🙏🏻❤️ Stay tuned pic.twitter.com/Z1jVKFYAIl — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 10, 2021 ఇదిలా ఉండగా మూడేళ్లుగా సినిమాలకు విరామం ఇచ్చిన మనోజ్ త్వరలో ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. అహం బ్రహ్మస్మినే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న రెండు సినిమాలను ఒప్పుకున్నాడు. ఇవి వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. ఇందులో ఓ సినిమా కోసం మనోజ్ ఏకంగా 15 కిలోలు సన్నబడ్డాడు. మనోజ్ ఒక్కసారిగా ఇలా సన్నగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి: చైతూ, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ టీజర్ రిలీజ్ -
డ్రోన్ల ద్వారా కరోనా టెస్ట్ కిట్ల సరఫరా
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో ఇద్దరు ట్రైనీ డాక్టర్లు ప్రారంభించిన స్టార్టప్ ప్రాజెక్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. హమాద్ జిలానీ, క్రిస్టోఫర్ లా అనే ఈ వైద్యులు మెడికల్ డ్రోన్ డెలివరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి సేకరించిన కరోనా వైరస్ నమూనాలు, టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి.. ఆసుపత్రుల నుంచి ఇళ్లకు డ్రోన్ల ద్వారా చేరవేయడమే దీని ఉద్దేశ్యం. ఈ డ్రోన్లకు చిన్న రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు 2 కిలోల బరువును 96 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలవు. మెడికల్ డ్రోన్ డెలివరీ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.12.48 కోట్ల ఆర్థిక సాయం అందజేయడానికి యూకే అంతరిక్ష పరిశోధనా సంస్థ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందుకొచ్చాయి. వైరస్ శాంపిల్స్, టెస్టింగ్ కిట్లను డ్రోన్లతో చేరవేస్తే కరోనా వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చని జిలానీ, క్రిస్టోఫర్ లా చెబుతున్నారు. -
మేఘా చేతికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్మూకాశ్మీ ర్–లద్దాఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ టెండర్లలో కంపెనీ లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. నేషనల్ హైవేస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్ బిడ్లను శుక్రవారం తెరిచింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,509.50 కోట్లు. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా చేపట్టాల్సి ఉంటుంది. మొదట 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేయాలి. 2 కిలోమీటర్లు, 0.5 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలను (టన్నెల్స్) నిర్మించాలి. అలాగే జోజిల్లా టన్నెల్‌ను 14.15 కిలోమీటర్ల మేర రెండు వరుసల్లో రోడ్డును 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తులో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతన రీతిలో, క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్.సుబ్బయ్య తెలిపారు. ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ ప్రాంతంలో ఉన్న రహదారిని ఏడాదిలో 6 నెలలపాటు పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్‌కు రహదారి టన్నెల్ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. మొత్తం మూడు సంస్థలు పోటీపడ్డాయి. -
కరోనా నేపథ్యంలో రక్షిత్ కొత్త సినిమా
సింపుల్ స్టార్ రక్షిత్ ఇటీవల నటించిన చిత్రం ‘పలాస 1978’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రక్షిత్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు రెడీ అయిపోయాడు. కరోనా నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘‘డబ్ల్యూహెచ్ఓ’’(వరల్డ్ హజార్డ్ ఆర్డినెన్స్) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. కరోనా సంక్షోభం సమయంలో ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్లో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాను సుధాస్ మీడియా సమర్ఫణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతోంది. (రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్) రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు విశేష స్పందన లభిస్తుంది. ‘‘ఐయామ్ గోనా టెల్ గాడ్ ఎవ్రీథింగ్’’ వంటి వైవిధ్యమైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో విమర్శకుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధిచిన మిగతా వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. -
పరిహారం... నాలుగింతలు
సాక్షి, హైదరాబాద్: వివిధ అభివృద్ధిపనుల్లో భూసేకరణకు గాను ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్లేలా జీహెచ్ఎంసీ ప్రణాళిక రచిస్తోంది. స్థలాల సేకరణకు పరిహారంగా నగదు చెల్లింపు బదులు అభివృద్ధి హక్కు బదిలీ పత్రాల్లో వెసులుబాటు కలి్పస్తూ సుందరీకరణ చేపట్టాలని భావిస్తోంది.ఇలా ఎస్పార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనుల భూసేకరణల కోసం జీహెచ్ఎంసీ ఖజానా నుంచి నిధులు చెల్లించకుండా అభివృద్ధి హక్కు బదిలీ పత్రాలను అంటే టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) తీసుకునేలా స్థల యజమానులను ప్రోత్సహిస్తోన్న జీహెచ్ఎంసీ.. నాలాల విస్తరణ, చెరువుల బఫర్జోన్ల సుందరీకరణ కోసం సైతం ఈ విధానాన్ని అనుసరించనుంది. ఇందులో భాగంగా యజమానులు కోల్పోయే భూములకు ప్రస్తుతం కలి్పస్తున్న 200% ఉన్న టీడీఆర్ హక్కులను 400 శాతానికి పెంచేందుకు సిద్ధమైంది. ఫ్లై ఓవర్లు, జంక్షన్ల వంటి సాధారణ ప్రాంతాల్లో ఆస్తులు/భూములు సేకరించినప్పుడు ఈ విధానం అమల్లో ఉంది. చెరువులు, నాలాల ప్రదేశాల్లో మాత్రం ఇది కేవలం 200% మాత్రమే ఉంది. నగర అవసరాలకోసం నాలాలను విస్తరించాల్సి ఉంది. అందుకుగాను భూములిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూసేకరణ చట్టం మేరకు నోటిఫికేషన్‌తో అమలుచేసే ఆర్థిక స్థితిలో జీహెచ్ఎంసీ లేదు. దీంతో గతేడాది కాలంగా టీడీఆర్ పద్ధతిపై ముమ్మర ప్రచారం చేయడంతోపాటు భూ యజమానులను ఒప్పించడంలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సఫలమయ్యారు. ప్రస్తుతం ఉన్న 200% టీడీఆర్‌ను 400% చేస్తే ముందుకొస్తారని భావిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అనుమతి వస్తే ఫ్లై ఓవర్ల తరహాలోనే చెరువుల బఫర్జోన్ల సుందరీకరణ, నాలాల విస్తరణ పనులకు టీడీఆర్‌ను ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. తద్వారా వాటిని అభివృద్ధిచేసేందుకు, పచ్చదనం పెంచేందుకు మార్గం సుగమం కాగలదని భావిస్తున్నారు.దీనివల్ల నాలాల విస్తరణతోపాటు చెరువుల పరిరక్షణకు, వాటిని వినోదకేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని మేయర్ అన్నారు. బతుకమ్మ చెరువుల సుందరీకరణ.. వినాయక నిమజ్జనాలతోపాటు బతుకమ్మల నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన 32 చెరువుల ను కూడా తీర్చిదిద్దనున్నారు. ఇకపై నిర్మించబోయే నిమజ్జన కొలనుల్ని 5 ఎకరాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో నిర్మించాలని భావిస్తున్నారు. వీటిలో ఐదారడుగుల పెద్ద గణేశ్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేయవచ్చునని, తద్వారా హుస్సేన్‌సాగర్‌కు వెళ్లే పెద్ద విగ్రహాల సంఖ్య తగ్గుతుందని అంచనా. టీడీఆర్ అమలు ఇలా.. వివిధ ప్రాజెక్టులు చేపట్టేప్పుడు ప్రభుత్వం అవసరమైన ఆస్తులు, భూసేకరణకు పరిహారంగా నగదు చెల్లించడం తెలిసిందే. నగరంలో భూముల విలువ ఎక్కువ కావడంతో ఆస్తులు కోల్పోయే వారికి నగదుకు బదులు వారు కోల్పోయే భూమికి నాలుగు రెట్ల బిల్టప్ ఏరియాతో మరో స్థలంలో నిర్మాణం చేసుకునేందుకు వెసులుబాటు కలి్పస్తూ ఇచ్చేవే ఈ హక్కు (టీడీఆర్) పత్రాలు. వీటితో హక్కుదారులు తాము కోల్పోయిన ప్లాట్ఏరియా బిల్టప్ ఏరియాకు నాలుగింతల బిల్టప్ ఏరియాను పొందవచ్చు. అందుకుగాను నిరీ్ణత సెట్‌బ్యాక్ వదలకుండానే అదనపు అంతస్తు వేసుకోవచ్చు.ఆయా ప్రాంతాల్లోని రిజి్రస్టేషన్ విలువ కనుగుణంగా నగరంలోని ఏ ప్రాంతంలోనైనా ఈ నిర్మాణం చేసుకోవచ్చు. లేదా తమకున్న ఈ హక్కుల్ని బిల్డర్లకు అమ్ముకోవచ్చు.ఈ ప్రయోజనాలు ఆకట్టుకోవడంతో దాదాపు 325 మంది టీడీఆర్ సరి్టఫికెట్లు తీసుకోవడం ద్వారా జీహె చ్‌ఎంసీకి రూ. 200 కోట్ల వరకు చెల్లింపులు మి గిలాయి. చెరువులు, నాలాల ప్రాంతాల్లో ప్రస్తు తం టీడీఆర్ పరిహారం 200% మాత్రమే ఉంది. దాన్ని 400 శాతానికి పెంచితే ఎక్కువ మంది ముందుకొస్తారని.. జీహెచ్ఎంసీ అంచనా. -
కోలీవుడ్ బ్రూస్లీ వస్తున్నాడు!
సాక్షి, చెన్నై : హాలీవుడ్ నటుడు బ్రూస్లీ కీర్తి కిరీటాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రాలు, కరాటే కిక్ ఫైట్స్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన అంటే పిచ్చి అభిమానం కలిగిన అచ్చం ఆయన మాదిరిగానే ఉన్న బ్రూస్లీ షాన్ నటిస్తున్న చిత్రం పుదియ బ్రూస్లీ. ఎస్కే.అమ్మాళ్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై వందవాసి కే.అమ్మాళ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళైయూర్ ఏ.సోణై కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ బ్రూస్లీ అభిమానినైన తనకు ఆయన ఛాయలున్న బ్రూస్లీ షాన్ కంటపడడంతో ఈ చిత్రం చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. వెంటనే కథను తయారు చేశానని తెలిపారు. అతనూ కరాటేలో రెండు బ్లాక్బెల్ట్లు సాధించడంతో తనకు అదనపు శక్తి వచ్చిందని అన్నారు. ఒక గ్రామంలో నివశించే హీరో ఒక దుర్ఘటనలో తన కుటుంబాన్ని కోల్పోతాడన్నారు. దీంతో నగరంలోని తన మామ వద్దకు వెళతాడన్నారు. అక్కడ తన మామ సమస్యల్లో చిక్కుకుంటే ఆయన్ని వాటి నుంచి కాపాడి సొంత గ్రామానికి చేరుకోవడమే పుదియ బ్రూస్లీ చిత్ర ప్రధాన అంశం అని చెప్పారు.తనకు బ్రూస్లీ గురించి తెలిసిన అన్ని అంశాలను ఈ చిత్ర హీరో బ్రూస్లీ షాన్ ద్వారా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశానన్నారు. చిత్రంలోని ఐదు ఫైట్స్‌ను స్టంట్ మాస్టర్ థ్రిల్ శేఖర్ అద్భుతంగా కంపోజ్ చేశారన్నారు. చిత్రంలో విలన్, ఫైట్స్ సన్నివేశాలవిషయంలో తగిన జాగ్రత్తలను తీసుకున్నానని తెలిపారు. ఇందులో సురేశ్నరగ్ అనే నటుడిని ఎంపిక చేశామని, క్లైమాక్స్ పోరాట సన్నివేశాల్లో జితేంద్ర హుడాను నటింపజేసినట్లు చెప్పారు. హీరోయిన్గా రజియాను పరిచయం చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది
గత రెండు చిత్రాలు నిరాశపరచటంతో అక్కినేని హీరో అఖిల్ ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ క్రమంలో మూడో చిత్రం ఏమై ఉంటుందా? అన్న సస్పెన్స్ గత కొన్ని రోజులుగా నెలకొంది. అయితే ఉగాది సందర్భంగా ఆ సస్పెన్స్‌ను రివీల్ చేస్తూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.తన డెబ్యూ చిత్రం తొలిప్రేమతో బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో మూడో ప్రాజెక్టు అన్న విషయాన్ని అఖిల్ చెప్పేశాడు. తొలిప్రేమ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర.. అఖిల్-వెంకీ చిత్రాన్నీ నిర్మించబోతోంది. నటీనటులు, పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాణ సంస్థ తన ట్వీట్లో తెలియజేసింది. Here's a special #Ugadi surprise to all the movie lovers. After super successful #TholiPrema, teaming up with @dirvenky_atluri yet again for another wonderful project with @AkhilAkkineni8. Keep watching the space for more details.#Akhil3 #SVCC https://t.co/hERrqfJPNN — SVCC (@SVCCofficial) 18 March 2018 -
బ్యాంకింగ్, టెలికాం, రైల్వేల్లో ఇక ఒకే టైమ్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఒకే ప్రామాణిక సమయాన్ని అమల్లోకి తేవడానికి కేంద్రం త్వరలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం. ఇది ఆచరణకు నోచుకుంటే ఒకే ప్రామాణిక సమయంతో పాటు మరింత కచ్చితత్వంతో కూడిన సమయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల బ్యాంకింగ్, టెలికాం, వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ, రైల్వే ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ తదితర రంగాల్లో ఏకరూపత రావడంతో పాటు పలు ఇతర కీలక మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు ప్రాంతీయ రెఫరెన్స్ స్టాండర్డ్స్ లేబొరేటరీ(ఆర్ఆర్ఎస్ఎల్)ల మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు అలాంటివి మరో రెండింటిని నెలకొల్పుతారు. అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, ఫరీదాబాద్, గువాహటిల్లో ఉన్న ల్యాబ్‌ల బలోపేతానికి నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ(ఎన్పీఎల్) సాయం తీసుకుంటారు. జాతీయ భద్రతకే..: దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లు, కంప్యూటర్లను ఒకే జాతీయ గడియారంతో అనుసంధానించడం తప్పనిసరని వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేర్వేరు రంగాల్లో వేర్వేరు ప్రామాణిక సమయాలు అమల్లో ఉండటం వల్ల సైబర్ నేరాల విచారణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వ్యూహాత్మక ప్రణాళికలు, జాతీయ భద్రత నిమిత్తం ఈ మేరకు మార్పులు జరగాలని అన్నారు. ఒకే ప్రామాణిక సమయంతో మొబైల్ ఫోన్ బిల్లులు కూడా తగ్గుతాయని ఆ శాఖ కార్యదర్శి అవినాశ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదించిన రూ.100 కోట్లలో ఈ ఏడాది బడ్జెట్లోనే రూ.20 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. టెలికాం, ఇంటర్నెట్ సేవలందిస్తున్న సంస్థలు ఒకే ప్రామాణిక సమయాన్ని పాటించడం లేదని సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శుల బృందం లోగడే తేల్చింది. -
వారి కోసం ఎం అండ్ ఎం కొత్త ప్రాజెక్టు
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా మహిళా రైతుల కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రేరణ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సోమవారం ప్రకటించింది. మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా మహిళా రైతులకు ప్రోత్సాహ్నన్నందించే దిశగా ఈ పథకాన్ని లాంచ్ చేసినట్టు మహీంద్ర అండ్ మహీంద్ర ఒక ప్రకటనలో తెలిపింది. 19 బిలియన్ డాలర్ల వ్యయంతో మహిళలకు మెరుగైన వ్యవసాయ సామగ్రి అందించడం, ప్రచారం ద్వారా, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూ మహిళా రైతులు ఎదిగేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులు, సమర్థతా వ్యవసాయ పరికరాలను, సామగ్రిని అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళా రైతుల సాధికారత సాధన, మద్దతు అందించనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. 30కి పైగా గ్రామాల్లో 1,500 కుటుంబాలపై ప్రభావం చూపే ఉద్దేశంతో ఈ ప్రేరణ ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు మహీంద్రా అండ్ మహీంద్ర ఒక ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా అండ్ మహీంద్ర సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ (CIWA), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఎన్జీవో ప్రధాన్ (ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్) ల సంయుక్త సహకారంతో ప్రెన్నాలో మొదటి ప్రాజెక్ట్‌ను రూపొందించింది. 100 మిలియన్ల మంది మహిళలు వ్యవసాయ రంగంలో ఉన్నారని, వీరిలో చాలామంది పొలాలలో ఎక్కువ సమయం పనిచేసేవారేనని తెలిపింది. అలాగే వీరికి అనువైన వ్యవసాయ సాధనాలు, ఇతర పరికరాలు చాలావరకు అందుబాటులో లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రేరణ పథకంలో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్టుగా కింద ఈ సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. -
లేత‘చిరుత’లకు ఊతంగా..
‘ఇండియన్ స్పీడ్ స్టార్’ ప్రాజెక్టు పాఠశాల స్థాయి నుంచే ‘పరుగు మెరిక’లకు ప్రత్యేక శిక్షణ l 2020, 2024 ఒలింపిక్స్‌లే లక్ష్యం అమలాపురం : వర్తమాన ప్రపంచంలో మేటి క్రీడాతారలుగా వెలుగొందుతున్న వారిలో ప్రతిభ ముడి వజ్రం వంటిదైతే.. ప్రభుత్వాలో, వ్యక్తులో, సంస్థలో ప్రోత్సహించడం వల్లే అది విజయాల మెరుగులీనిందన్నది.. మోటారు వాహనం సరికొత్తదైనా ఇంధనం లేని పరుగిడలేదన్నంత యథార్థం. మానవవనరుల పరంగా శిఖరాగ్రాలన ఉన్న భారతదేశం క్రీడావిజయా ల పరంగా అగాధంలో ఉండడానికి కారణం పాటవం కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం కొరవడడమే. ఈ నేపథ్యంలోనే.. దశాదిశ లేని పాఠశాల స్థాయి క్రీడలకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ, నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ (ఎ¯ŒSవైసీఎస్) కలిసి కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఇండియ¯ŒS స్పీడ్ స్టార్ (ఐఎస్ఎస్)’ పథకం పరుగుల క్రీడకు ఓ వరం కానుంది. కనీస సదుపాయాలు లేకున్నా తమ ప్రతిభా పాటవాలతో రాణిస్తున్న పాఠశాల క్రీడాకారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దీనికి ఎంపికైతే రానున్న ఒలింపిక్స్‌లో ‘దౌడు’ తీసే సువర్ణావకాశం వారి తలుపు తట్టనుంది. అంచెలంచెలుగా దూసుకుపోయే అవకాశం.. 2020, 2024లలో జరిగే ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఐఎస్ఎస్ను తెరమీదకు తెచ్చింది. దీనిలో భాగంగా పరుగులో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసేందుకు తెరదీసింది. పాఠశాల స్థాయిలో, జో¯ŒS స్థాయిలో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచినవారిని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో ఉన్న 13 జోన్ల నుంచి అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలను విడిగా ఎంపిక చేస్తారు. వీరందరికీ ఈనెల 15న విశాఖ పోర్టు స్టేడియంలో నిర్వహించే ఐదు జిల్లాల (ఉభయ గోదావరులతోపాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) పరిధిలో పోటీలు నిర్వహిస్తారు. గెలిచినవారు త్వరలో బెంగళూరులో జరిగే సౌత్ జో¯ŒS పోటీల్లో పాల్గొంటారు. అక్కడ కూడా విజయం సాధించిన వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారికి 2020, 2024ల్లో జరిగే ఒలింపిక్స్ పోటీలకు శిక్షణ ఇస్తారు. అప్పటి వరకూ వారికి సాధనకు అయ్యే ఖర్చుతోపాటు, చదువు, ఇతర సౌకర్యాలను ఎ¯ŒSవైసీఎస్ చూసుకుంటుంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వసంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) సహకారం అందిస్తోంది. ప్రస్తుతం మన జిల్లాలో జోనల్ గ్రిగ్ పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీల నుంచి 234 మందిని ఆయా విభాగాలకు ఎంపిక చేసి విశాఖలోని ఐదు జిల్లాల పోటీలకు పంపనున్నారు. అరుదైన అవకాశం పాఠశాల క్రీడాకారులకు ఇది అరుదైన అవకాశం. జోనల్ స్థాయి పోటీలో విజేతలు జిల్లాస్థాయిలో నిలిచిపోతున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ)లో జాతీయస్థాయి ఎంపిక వరకు మాత్రమే ఉంది. కాని ఇండియ¯ŒS స్పీడ్ స్టార్‌కు ఎంపికైతే ఏకంగా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశముంది. – పప్పుల శ్రీరామచంద్రమూర్తి, ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, అమలాపురం వివరాలు నమోదు చేయించాలి.. జోనల్ గ్రిగ్ పోటీల్లో 100, 200, 400 మీటర్ల పరుగులో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన బాలబాలికలు విశాఖలో జరిగే ఐదు జిల్లాల పోటీల్లో పాల్గొనే అవకాశముంది. పాఠశాలల పీడీలు, పీఈటీలు వివరాలు వెంటనే నమోదు చేయించుకోవాలి. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఇండియ¯ŒS స్పీడ్ స్టార్ ఒక సువర్ణావకాశం. – కె.రామకృష్ణ, ఎ¯ŒSవైసీఎస్ ఏరియా కో–ఆర్డినేటర్ -
స్థిరపడుతున్న సానుకూలత!
సాక్షి, హైదరాబాద్ : నగర స్థిరాస్తి మార్కెట్లో అమ్మకాల ప్రవాహం మొదలైంది. పాత నిర్మాణాల్లో ఫ్లాట్లు లేకపోవడంతో కొత్త ప్రాజెక్ట్‌ల ధరలు కొద్దిగా పెంచేశారు బిల్డర్లు. మరోవైపు బడా ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం సరైన స్థలాల కోసం సంస్థల మధ్య పోటీ మొదలైంది. తక్షణమే ప్రాజెక్ట్‌లను ప్రకటించడానికి డెవలపర్లు అడుగులేస్తున్నారు. ⇔నిన్నటిదాకా వేచిచూసే ధోరణికి అలవాటు పడ్డవారిలో కొందరు మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొనడంతో స్థానిక పరిస్థితులను పక్కన పెట్టేసి సొంతిళ్లను కొనడానికి ముందుకొస్తున్నారు. స్థిరాస్తి రంగం చాలా భిన్నమైంది. మార్కెట్ ప్రతికూలంగా ఉందనుకోండి.. ధర తక్కువైనా ఇళ్లను కొనడానికి కొనుగోలుదారులు ముందుకు రారు. అదే కొంచెం తేరుకోగానే చాలు.. చ.అ.కు రూ.100 ఎక్కువ పెట్టయినా ఇళ్లను కొనేస్తారు. ⇔రెండు నెలల నుంచి వాణిజ్య స్థిరాస్తి రంగం కూడా మెరుగైంది. నిర్మాణ రంగం అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు ప్రతికూల పరిస్థితుల్లో ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ⇔మార్కెట్లో పెరిగిన సానుకూల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని డెవలపర్లు సరైన స్థలాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. స్థానిక సంస్థల నుంచి మెట్రో నగరాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో స్థలాల కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. మార్కె ట్లో నెలకొన్న గిరాకీని అర్థం చేసుకున్న పలువురు స్థల యజమానులు ఇష్టమొచ్చిన రేట్లు చెబుతున్నారు. తమ కోర్కెల చిట్టాను డెవలపర్ల ముందు పెడుతున్నారు. అయితే భూయజమానులు చెబుతున్న నిబంధనలకు కొందరు డెవలపర్లు అంగీకరిస్తున్నప్పటికీ పొరపాటున ప్రతికూల పరిస్థితులు ఎదురైతే గనక ప్రాజెక్ట్ పూర్తి కావడ మే ప్రశ్నార్థకం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా రు. మార్కెట్ మెరుగవ్వగానే నిర్మాణాన్ని ఆరంభించి ఆ తర్వాత చేతులు కాల్చుకోవడం బదులు వాస్తవాల్ని అర్థం చేసుకుని నిర్మాణాల్ని మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే స్థల య జమానులు వాస్తవిక పరిస్థితులు అర్థం చేసుకుని డెవలపర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. లేకపోతే ఇరువురికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెబుతున్నారు. మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో.. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లైన మెట్రో రైలుతో నగరంలో, ఔటర్ రింగ్ రోడ్డుతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి మార్కెట్ జోరందుకుంటుంది. ఓఆర్ఆర్తో ప్రయాణం సులువవుతుంది కాబట్టి ఔటర్ చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలూ ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో రూ.70-80 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనేబదులు.. శివార్లలో లగ్జరీ విల్లాలను కొనేయచ్చని కస్టమర్ల అభిప్రాయం. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
కొంగర కలాన్ లో విదేశీ ఆస్పత్రి
వంద ఎకరాల్లో వెయ్యి పడకల వైద్యశాల సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో మరో కొత్త ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో సకల వసతులున్న వైద్యశాల ఏర్పాటు చేసేందుకు ఇండో -యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ముందుకొచ్చింది. వెయ్యి పడకలతో కూడిన ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాల్సిందిగా ఆ సంస్థ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించింది. ఔటర్ రింగురోడ్డు సమీపంలో స్థలం కేటాయిస్తే రవాణాకు సులభమవుతుందని వారు సీఎంకు వివరించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుకు ఔటర్ సమీపంలో మూడు చోట్ల స్థలాలు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం యూకే సంస్థకు సూచించింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌లో దాదాపు 50 నుంచి 100 ఎకరాల స్థలం అందుబాటులో ఉండడంతో ఇదే విషయాన్ని యూకే బృందానికి వివరించారు. దీంతో వారు కూడా ఆస్పత్రి ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇంకా ప్రభుత్వంతో ఆ సంస్థ ఎంఓయూ కుదుర్చుకోవాల్సి ఉంది. ఈ ఆస్పత్రి జిల్లాలో ఏర్పాటైతే అందులో మెజార్టీ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించ గా.. అందుకు యూకే సంస్థ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. -
హీరోయిన్ ఓరియంటెడ్ జ్యోతిక
హీరో సూర్యను పెళ్ళి చేసుకున్నాక సినిమా రంగానికి దూరంగా కాలక్షేపం చేస్తున్న నటి జ్యోతిక. ఇంట్లో పిల్లల బాగోగుల మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతూ వచ్చిన ఆమె చాలా విరామం తరువాత గత ఏడాది ‘36 వయదునిలే’ (36 ఏళ్ళ వయసులో అని అర్థం) అనే తమిళ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకురావడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించి పెట్టింది. కానీ, ఎందుకనో ఆమె మళ్ళీ ఏ కొత్త ప్రాజెక్ట్కూ పచ్చజెండా ఊపలేదు. తాజాగా జ్యోతిక ఒక కొత్త సినిమా స్క్రిప్ట్‌కు ఓకే చెప్పారు. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం మొన్నటి ‘36 వయదునిలే’ లాగానే ఇదీ పూర్తిగా హీరోయిన్‌కు ప్రాధాన్య మున్న స్రిప్ట్. ‘కుట్రమ్ కడిదళ్’కి గాను జాతీయస్థాయిలో ఉత్తమ తమిళచలనచిత్ర అవార్డును అందుకున్న దర్శకుడు బ్రహ్మనాథన్ ఈ చిత్రాన్ని రూపొందించ నున్నారు. నిజానికి, రీ-ఎంట్రీ తరువాత మరో కొత్త ప్రాజెక్ట్‌ను వెంటనే చేపట్టేందుకు జ్యోతిక తొందరపడలేదు. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూశారు. ఈ పరిస్థితుల్లో బ్రహ్మ ఇటీవల కలసి, ఈ కొత్త సినిమా స్క్రిప్ట్‌ను చర్చిం చారు. ‘‘జ్యోతిక మేడమ్‌కు స్క్రిప్ట్ నచ్చింది. అందులోని బలమైన స్త్రీ పాత్ర నచ్చింది. అందుకే, ఈ సినిమాలో పనిచేయడానికి అంగీకరిం చారు’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కొత్త సినిమా పేరు, ఇతర వివరాలన్నీ తెలియడానికి మరికొంత కాలం ఆగాలి. -
ఇక పోరుబాట!
పట్టిసీమ పేరుతో కొత్త ప్రాజెక్టు చేపట్టి రూ.1600కోట్లు ఖర్చు చేస్తున్నారు... గోదావరి పుష్కరాలకు రూ.1600కోట్లు ఖర్చు చేశారు. ‘అనంత’లో నాలుగేళ్లుగా వర్షాలు లేక... సాగునీళ్లు ‘కరువై’ పంటపండించలేక లక్షలమంది వలసలు పోతున్నా... ఏడాదిలో 87మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఇక్కడి రైతులపై చంద్రబాబుకు కనికరం కూడా కలగలేదు. పంటలకు నీళ్లిచ్చి రైతులను ఆదుకుందామనే ఆలోచన రాలేదు. చిత్తూరు జిల్లా కుప్పంకు నీళ్ల తరలించడమే లక్ష్యంగా హంద్రీ- నీవా పనులు చేయిస్తున్నారు. కళ్లెదుట నీళ్లు ఉన్నా పారించుకోలేని స్థితి ‘అనంత’కు కల్పించారు. ఈ క్రమంలో ‘అఖిలపక్షం’ ఆధ్వర్యంలో సోమవారం రైతు సదస్సును నిర్వహించనున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’రైతు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బతికేందుకు ఇతర రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. జిల్లాలో 4లక్షల మంది రైతులు వలసెళ్లారంటే కరువు ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ ఏడాది వర్షాలు కురవకపోతే ‘అనంత’రైతాంగం, ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితులన్నీ కేవలం సాగునీటి వనరులు లేక వస్తున్నవే! 2003 ముందు కూడా ‘అనంత’ పరిస్థితులు దుర్భరంగానే ఉండేవి. తినేందుకు తిండి లేక గంజికేంద్రాలు ఏర్పాటు చేసిన రోజులు కూడా ఇప్పటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. 2014లోపు 85శాతం పనులు పూర్తయ్యాయి. 2012లోనే హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణాజలాలు వచ్చాయి. జీడిపల్లి రిజర్వాయర్‌లో తొణికిసలాడుతున్న కృష్ణమ్మను చూసి ‘అనంత’ రైతులు సంబరపడిపోయారు. ‘అనంత’ రాత మారుతుందని ఆశపడ్డారు. ఆశలు అడియాశలు చేస్తున్న బాబు సర్కారు హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో 3.45లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ఫేజ్-1 ద్వారా 1.18లక్షలు, ఫేజ్-2 ద్వారా 2.27లక్షల ఎకరాలకు నీరు అందించాలి. ఫేజ్-1లో జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ప్రధాన కాలువకు పనులు పూర్తయ్యాయి. గతేడాది 16.9 టీఎంసీల నీళ్లు కూడా వచ్చాయి. వీటితో కనీసం 1.50లక్షల ఎకరాలకు నీరందించవచ్చు. అంటే మొదటి విడతలోని 1.18లక్షల ఎకరాలకు కాకుండా చెరువులనూ కృష్ణానీటితో నింపొచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం సాగునీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ (ఉప, పిల్లకాలువల నిర్మాణం) వ్యవస్థకు ఫుల్స్టాప్ పెట్టింది. నెలకోసారి జిల్లాకు వస్తున్న చంద్రబాబు ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ పనులు ఆలస్యం చేయండని అధికారికంగా జీవో(నెంబర్ 22) జారీ చేశారు. వందకోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మొదటి విడతలో డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తవుతాయి. ఇది పూర్తయితే 1.18లక్షల ఎకరాలకు నీరందుతుంది. చెరువులకూ నీరు నింపేందుకు ‘మార్గం’ దొరుకుతుంది. తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. పంటలు పండి రైతులు సంతోషంగా జీవిస్తారు. వలసలు, ఆత్మహత్యలకు చెక్‌పెట్టొచ్చు. అయితే చంద్రబాబు మాత్రం కుప్పంకు నీళ్లు తీసుకెళ్లేదాకా ‘అనంత’కు నీళ్లివ్వకూడదని కంకణం కట్టుకున్నారు. కుప్పం వెనుకబడిన ప్రాంతమే! ఈ ప్రాంతానికి నీరు తీసుకెళ్లాలి. దీన్ని ‘అనంత’ వాసులు వ్యతిరేకించడం లేదు. అయితే వస్తున్న జలాలను ‘అనంత’కు ఇచ్చి తీసుకెళ్లాలని అడుగుతున్నారు. బాబు పట్టించుకోకపోవడం దారుణం. ప్రభుత్వంపై పోరుబాట ప్రభుత్వ వైఖరిని నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయపార్టీలు, రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టారు. ప్రభుత్వంపై పోరు చేసి హక్కుగా దక్కాల్సిన జలాలను దక్కించుకునేందుకు సోమవారం ఉరవకొండలో స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతుసదస్సు నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి హాజరుకానున్నారు. రైతుసదస్సు నిర్వహిస్తున్నారని సమాచారంతో ప్రభుత్వంలో కాస్త కదలిక వచ్చింది. జీడిపల్లి రిజర్వాయర్ పరిధిలో 25వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లిస్తామని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఎన్నిమాటలు చెప్పినా ‘అనంత’వాసులను మోసం చేయడమే అని, నీళ్లిచ్చేదాకా ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తామని అఖిలపక్షం నేతలు చెబుతున్నారు. -
ప్రాజెక్టులకు భూములు సిద్ధం చేయండి
కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు ఆదేశం..అధికారులతో సమీక్ష విశాఖ రూరల్: జిల్లాలో కొత్త ప్రాజెక్టుల కోసం భూములు సిద్ధం చేయాలని, ఆర్అండ్ఆర్ ఇబ్బందులు లేకుండా అమలు చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రాజెక్టులపై ఆయనతోపాటు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ప్రభుత్వ అతిథి గృహంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో 80 శాతం వాటా రాష్ట్రానికి దక్కనుందని తెలిపారు. దీంతో పాటు స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రాజెక్టులకు భూముల గుర్తింపు వేగవంతంగా జరగాలని, నిర్వాసితులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
తిరుమలలో ఉద్రిక్తత
సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. కొత్త ప్రాజెక్టు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయ నాలుగు మాడవీధుల్లో అఖండ హరినామ సంకీర్తన చేయాలని భజన బృందాలు తిరుమలకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంతంలో నిషేధిత కార్యక్రమాలు చేపట్టకూడదని విజిలెన్స్ అధికారులు మాడవీధుల్లోని గేట్లను మూసివేసి వారిని వెనక్కు పంపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. భజన కార్యక్రమాలకు టీటీడీ ప్రాధాన్యం ఇచ్చి, జానపద కళాకారులను ఆదుకోవాలని కొంతకాలంగా భజన బృందాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అదే డిమాండ్‌తో ఆదివారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో తెలుగు భజన బృందాలు సుమారు 11 వేల మంది అలిపిరి కాలిబాటలో మెట్లోత్సవం నిర్వహించారు. తర్వాత ఆలయ నాలుగు మాడవీధుల్లో అఖండ హరినామ సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఆలయం ఎదురుగా ఆస్థాన మండపం వద్దకు తరలివచ్చారు. ఆందోళన కార్యక్రమాలు మాడవీధుల్లో నిర్వహించరాదన్న నిబంధన ఉంది. దాంతో ఆలయ విజిలెన్స్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న టీటీడీ జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు భజన బృందాల నేతలతో చర్చించారు. హరినామ సంకీర్తనకు ముళ్లగుంత స్థలాన్ని కేటాయించామన్నారు. దీంతో కళాకారులు అక్కడకు వెళ్లి హరినామ సంకీర్తన నిర్వహించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి దర్శనం నిలిపివేత బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం శ్రీవారి ఆల యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు అన్ని రకాల దర్శనాలు నిలిపివేస్తారు. తర్వాత ఆలయాన్ని శుద్ధిచేసి ఉదయం 11 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. -
పాలమూరుకు..పవర్ ప్రాజెక్టులు
గద్వాల: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తక్షణ ం కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టాలని ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం పాల మూరు జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టును మొదటి దశలో చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ లోటును భ ర్తీ చేసేందుకు రాష్ట్రంలో నాలుగు వేల మోగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందని విభజన బిల్లులోనే కేంద్రం నిర్ధేశించింది. ఆ మేరకు త క్షణం రాష్ర్టంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని శనివారం ఢిలీ ్లలో పర్యటించిన సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర ఇం దన శాఖ మంత్రి పీయూస్ గోయల్ పాల మూరు జిల్లా గద్వాల వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రకటించారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా మొదటిదశలో 1380 మోగా వాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలను తక్షణం చేపడతామన్నారు. మిగతా ప్రాజెక్టులను త్వరలోనే చేపట్టేందుకు ఆయన సుముఖత వ్యక్తం చే శారు. దీంతో గద్వాల ప్రాంతంలో ప్రతిపాదనలో ఉన్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టుతో పాటు, థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి కదలిక వచ్చినట్లయింది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులు, జల విద్యుదుత్పత్తికేంద్రాలకు కేంద్రంగా నిలిచిన గద్వాల ప్రాంతం కొత్త ప్రాజెక్టులతో మరింత వేగవంతమైన ప్రగతి పథంలో దూసుకుపోనుంది. గట్టు, ధరూరు మండలాల ప్రాంతంలో కొత్త విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు ప్రభుత్వ పొలాలు అందుబాటులో ఉండడం. జూరాల ప్రాజెక్టు ఆధారంగా అవసరమైర నీటి వనరులు కూడా తొడయ్యాయి. ఇలా గద్వాల తెలంగాణకు వెలుగులను అందించే ముఖ్యమైన ప్రాంతంగా నిలవబోతుంది. -
నిరాశ పరిచిన బడ్జెట్
టీడీపీ ప్రభుత్వం జిల్లాకు మొండిచేయి చూపింది. ఏవేవో ఆశలు కల్పించి చివరకు నిరాశ మిగిల్చింది. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఒక విధంగా జిల్లాను పూర్తిగా విస్మరించారని వివిధ రంగాల నిపుణులు, ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. చివరకు నీటి పారుదల ప్రాజెక్టులకూ నిధులు కేటాయించలేదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : నవ్వాంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్లో జిల్లాకు అన్యాయం చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం జిల్లాను పూర్తిగా విస్మరించింది. కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన పక్కన పెడితే ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులకే నిధులు కేటాయించలేదు. అత్తెసరు కేటాయింపులతో చేతులు దులుపుకొంది. గిరిజన యూనివర్సిటీ ప్రస్తావనే లేదు. ఆశలురెకెత్తించిన కొత్త ఎయిర్ పోర్ట్ అంశాన్నే చేర్చలేదు. ఊరిస్తున్న వైద్య కళాశాల ఊసే లేదు. వెనుక బడిన జిల్లాగా ఆదుకునే ప్రత్యేక ప్యాకేజీ సాయమేది కేటాయించలేదు. ఇదంతా చూస్తుంటే అంతన్నాడు...ఇంతన్నాడు..అన్న చందంగా బడ్జెట్ మిగిలిపోయింది. చారిత్రాత్మక, అన్నీ వర్గాల ఆకట్టుకునే బడ్జెట్ అంటూ గొప్పలు పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు జిల్లాకు సాధించిందేంటో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజనతో జిల్లాకు ఏదో ఒరుగుతుందనుకుంటే బడ్జెట్లో ప్రత్యేకతేమీ లేకపోవడంతో ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. కొత్తగా ఏ ఒక్కటీ మంజూరు చేసిన దాఖలాలు బడ్జెట్లో కనిపించలేదు. పొరుగు జిల్లాలకు ఒకటి రెండు ప్రాజెక్టులను కేటాయించినా విజయనగరం జిల్లాకొచ్చేసరికి పూర్తిగా వివక్ష చూపింది. అంకెల బడ్జెట్ రాష్ట్ర విభజన అనంతరం తొలి సారిగా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం గారెడీని తలపిస్తోంది. వాస్తవ బడ్జెట్‌కు ఆమడదూరంలో ఉంది. ఆర్థిక మంత్రి యనమల తన అనుభవాన్ని ఉపయోగించి బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్ వల్ల ప్రజలకు నేరుగా లబ్ధిచేకూరే పరిస్థితి లేదు. ప్రధానంగా హౌసింగ్‌కు కేటాయించిన నిధులు పాత బిల్లులు మంజూరుకే సరిపోతుంది. ఇలా అయితే ఈ ఏడాదిలో నిరుపేదలకు కొత్త ఇళ్ల మం జూరు లేనట్లే. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ప్రకటించిన హమీలకు ప్రస్తుత బడ్జెట్‌కు పొంతన లేదు. ఈ బడ్జెట్ ప్రజామోదయోగ్యమైనది కాదు. - కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్ఆర్సీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి జిల్లాకు ద్రోహం చేశారు బడ్జెట్లో జిల్లాకు దారుణంగా ద్రోహం చేశారు. ఇరిగేషన్‌తో పాటు జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. బడ్జెట్లో మాత్రం ఆ ప్రస్తావన లేకపోవడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమే. బడ్జెట్లో ప్రస్తావించిన అంకెలు అబద్ధం. అవి ఆచరణకు సాధ్యం కాదు. - ఎం.కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రజలను విస్మరించారు ప్రజాసంక్షేమం అనేపదాన్ని బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. అపార అనుభవం ఉందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తమ అనుభవాన్ని ప్రజలను మోసం చేసేందుకు ఉపయోగించారు. ఆచరణకు సాధ్యంకాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మిగలు బడ్జెట్ ఎంత, లోటు బడ్జెట్ ఎంత అన్నది ప్రస్తావించలేదు. వ్యవసాయ రంగానికి రూ. 15వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. అది ఎక్కడ నుంచి తీసుకొస్తారో చెప్పలేదు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీపై ప్రస్తావనలేకపోవడం అత్యంత దారుణం. విద్య, వైద్యం, సంక్షేమరంగాలపై చిన్నచూపు చూశారు. - పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
టీ ప్రాజెక్టుల్ని మేమెందుకు అడ్డుకుంటాం?
హరీశ్‌రావుపై దేవినేని ధ్వజం విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన విధంగానే గోదావరి, కృష్ణా నదులపై నూతన ప్రాజెక్టులకు ఆమోదం, నిర్మాణ పనులు నదీ నిర్వహణ మండళ్లు, కేంద్ర జల సంఘం సిఫార్సుల మేరకే జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రూపంలో కుట్రలు పన్నుతున్నారని హరీశ్‌రావు ఆరోపించడం బాధ్యతా రాహిత్యమేనని దేవినేని ధ్వజమెత్తారు. -
ప్రణాళికలు పక్కకు !
విభజన ఎఫెక్ట్ =కొత్త ఫ్లైఓవర్లకు మంగళం =అటకెక్కిన అభివృద్ధి ప్రాజెక్టులు =ఆచి తూచి అడుగులేస్తున్న హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో : ‘మహా’ నగర రూపురేఖల్ని పూర్తిగా మార్చేయాలనుకొన్న హెచ్ఎండీఏ పక్కా ప్రణాళిక ఒక్కసారిగా తలకిందులైంది. రాష్ట్ర విభజన వ్యవహారం తేలేవరకు అభివృద్ధి పథకాల ఊసే ఎత్తవద్దని ఉన్నతాధికారులు అంతర్గతంగా నిర్ణయించుకొన్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి సిద్ధం చేసిన డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఎల్)లను సైతం ప్రభుత్వానికి పంపకుండా అధికారులు పక్కకు పెట్టేశారు. రాజకీయ అనిశ్చితి వల్ల కొత్త ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో హెచ్ఎండీఏలో ఇంజనీరింగ్ విభాగానికి చేతినిండా పనిలేకుండా పోయింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు నగరం (కోర్ ఏరియా)లోని 10 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని గతంలో హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ మేరకు దశలవారీ చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్టులను చేపట్టేందుకు సాహసించలేకపోతోంది. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే 10 ఏళ్లపాటు కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కోర్ ఏరియా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన పది ఫ్లైఓవర్ల నిర్మాణానికి నీలి నీడలు కమ్ముకోవడం ఖాయంగా కన్పిస్తోంది. కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టులకు సొంతం గా నిధులు వెచ్చించే ఆర్థిక బలం హెచ్ఎండీఏకు లేదు. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాజెక్టులకు మంగళం పాడటమే ఉత్తమంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మెట్రో రైల్ బూచిగా... మెట్రో రైల్ వస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు దాదాపు పరిష్కారమవుతాయని అధికారులు దాన్ని బూచిగా చూపుతున్నారు. ప్రస్తుతం అభివృద్ధి అంతా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్, అమీర్‌పేట, బేగంపేట ప్రాంతాలకే పరిమితమైంది. అందుకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా ఫ్లైఓవర్లు, రోడ్ బ్రిడ్జిల నిర్మాణాలు జరగడంతో అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యల వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో కూడా ఫ్లైఓవర్లు, రోడ్ బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టాలని హెచ్ఎండీఏ గతంలో కోర్ ఏరియా మాస్టర్ ప్లాన్‌లో సూచించింది. నగరంలోని 29 ప్రాంతాల్లో ట్రాఫిక్ సమ్యను అధిగమించేందుకు లింకురోడ్ల నిర్మాణం తప్పని సరి అని తేల్చింది. అలాగే 70 ప్రధాన రహదారులను వాణిజ్య రహదారులుగా గుర్తించాలని, మొత్తం 10 ఫ్లైఓవర్లతో పాటు 13 రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి బృహత్ ప్రణాళిక ప్రతిపాదించింది. అలాగే హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 9 మీటర్ల మేర పూర్తిగా గ్రీనరీ ఏర్పాటు చేయాలని, ఇక్కడ ఇతర నిర్మాణాలకు ఆస్కారంలేకుండా చూడాలని సూచించింది. ఆ ప్రతిపాదనలకు రూపకల్పన జరుగుతున్న సమయంలో విభజన సెగ తాకడంతో అధికారులు ఎక్కడి ప్రణాళికలను అక్కడే అటకెక్కించారు. కొత్త వంతెనలు ఇక్కడే... కోర్ ఏరియా మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేకంగా 22 ప్రాంతాలను మల్టీ పర్పస్ జోన్ (బహుళ ప్రయోజనాల)గా గుర్తించారు. ఇందులో ఐఎస్ సదన్, ఇంజన్‌బౌలి, బహదూర్‌పురా, దేవీభాగ్, గౌలిగూడ బస్టాప్, చాంద్రాయణగుట్ట, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కాచీగూడ రైల్వే స్టేషన్ ప్రాంతం, మిథాని, ఫలక్‌నుమా బస్‌డిపో ప్రాంతం, మెహిదీపట్నం, గడ్డిఅన్నారం, టోలీచౌకీ, పంజాగుట్ట, అమీర్‌పేట, కేబీఆర్‌పార్కు, ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయ ప్రాంతం, బొగ్గులకుంట, గౌలిగూడ, నాంపల్లి ప్రాంతాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్య నియంత్రణకు 10 ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో చిన్నచిన్న లింక్ రోడ్లను నిర్మించి ప్రధాన రహదారులతో కలపాలని ప్రణాళికలు రూపొందిం చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హెచ్ఎండీఏ ఈ కొత్త ఫ్లైఓవర్ల ప్రణాళికకు పాతర వేసింది. ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులేవీ ప్రారంభించే యోచనేలేదని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.