టీ ప్రాజెక్టుల్ని మేమెందుకు అడ్డుకుంటాం? | deveneni uma fire on harish rao | Sakshi
Sakshi News home page

టీ ప్రాజెక్టుల్ని మేమెందుకు అడ్డుకుంటాం?

Published Wed, Jul 30 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

టీ ప్రాజెక్టుల్ని మేమెందుకు అడ్డుకుంటాం?

టీ ప్రాజెక్టుల్ని మేమెందుకు అడ్డుకుంటాం?

హరీశ్‌రావుపై దేవినేని ధ్వజం

విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన విధంగానే గోదావరి, కృష్ణా నదులపై నూతన ప్రాజెక్టులకు ఆమోదం, నిర్మాణ పనులు నదీ నిర్వహణ మండళ్లు, కేంద్ర జల సంఘం సిఫార్సుల మేరకే జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రూపంలో కుట్రలు పన్నుతున్నారని హరీశ్‌రావు ఆరోపించడం బాధ్యతా రాహిత్యమేనని దేవినేని ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement