Niharika Konidela Announces New Project Started Shares Pics - Sakshi
Sakshi News home page

Niharika Konidela: నిహారిక కొత్త మూవీ షురూ.. డైరెక్టర్‌ ఎవరంటే?

May 14 2023 5:37 PM | Updated on May 14 2023 6:11 PM

Niharika Konidela Announces New Project Started Shares Pics - Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెరకెక్కించిన డెడ్ పిక్సెల్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 19న హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 

(ఇది చదవండి: విడాకులపై ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇస్తున్న నిహారిక?.. పోస్ట్‌ వైరల్‌)

అయితే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది నిహారిక. పింక్ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిహారిక తెలిపింది. 

(ఇది చదవండి: ఈ విశ్వం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: నిహారిక పోస్ట్ వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement