Reorganization of the state law
-
మా వాళ్లని పనిచెయ్యనివ్వట్లేదు
గవర్నర్‌కు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు లేఖ వెళ్లిపోవాలంటూ ఆంధ్రా ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి ఏ ప్రాంతంలోని సంస్థలు ఆ ప్రాంతానివేననటం అన్యాయం, అక్రమం ఏపీ ఫుడ్స్ పేరును తెలంగాణ ఫుడ్స్‌గా మార్చే హక్కెక్కడుంది? షెడ్యూల్స్‌లో లేని 38 సంస్థలనూ విభజించండి ఇది రాష్ట్రాల సమస్య... కానీ ఉద్యోగ సంఘాల జోక్యం పెరిగింది తక్షణం జోక్యం చేసుకోవాలంటూ అభ్యర్థన హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులను పనిచేయనివ్వటం లేదని, వెళ్లిపోవాలంటూ ఆంధ్రా ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు తెలియజేశారు. ఈ సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులపై వివక్ష కనబరుస్తున్నారని, అందుకని వీటిని విభజించాలని, లేనిపక్షంలో తక్షణం ఉమ్మడి యాజమాన్యాలను ఏర్పాటు చేయాలని గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు గవర్నరుకు ఆయనొక లేఖ రాశారు. ‘‘అయితే విభజించటమో లేకుంటే ఉమ్మడి యాజమాన్యాలను ఏర్పాటు చేయటమో రెండు ప్రభుత్వాలూ కలసి చేయాలి. కానీ అలాకాక వీటిలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాయి. ఏపీ ఫుడ్స్ పేరును తెలంగాణ ఫుడ్స్‌గా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేసింది. ఇలా మార్చే అధికారం ఆ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే షెడ్యూలు 10లోని సంస్థలు గత ఐదు దశాబ్దాల కాలంలో ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి. రెండు రాష్ట్రాల ఉద్యోగులూ వాటిలో పనిచేస్తున్నారు. ఏడాదిలోగా ఈ సంస్థల విషయంలో రెండు ప్రభుత్వాలూ ఒక అవగాహనకు రావాల్సి ఉంది’’ అని సీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఏ ప్రాంతంలో ఉంటే వారికే చెందుతాయనేది ధర్మం కాదు. అది అన్యాయం... అక్రమం. కొన్నిటిని విభజించటం సాధ్యం కాదు కాబట్టి ఇరు రాష్ట్రాలూ ఆ సేవల్ని సంయుక్త నిర్వహణ ద్వారా వినియోగించుకోవాల్సి ఉంటుంది. దురదృష్షవశాత్తు ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులపై వెళ్లిపోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో ఆంధ్రా ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తున్నారు. మూడు నెలలుగా వారిని పనిచేయనివ్వటమే లేదు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో... ఏ షెడ్యూల్లో లేని 38 సంస్థలను కూడా పదవ షెడ్యూల్లోని సంస్థల్లానే ఇరు రాష్ట్రాలూ పరస్పర అంగీకారంతో విభజించుకోవటం లేదా ఉమ్మడిగా వాడుకోవటం చేయాలి. న్యాక్ డీజీని రానివ్వకుండా అక్కడి తెలంగాణ ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. ఇలాగైతే ప్రభుత్వం పనిచేయడం సాధ్యం కాదు కనక తక్షణం జోక్యం చేసుకోవాలి’’ అని ఆ లేఖలో గవర్నరును కోరారు. లేఖ ప్రతులను తెలంగాణ సీఎస్‌తో పాటు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపించారు. -
పునర్విభజన కసరత్తు షురూ
రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు ఏపీలో 50కి.. తెలంగాణలో 38కి పెరుగుదల ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఇకపై 9 అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను 119 నుంచి 153 కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2015 జనవరి నుంచి రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయమై పలు అంశాలపై కేంద్రం నుంచి వివరాలను కోరింది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో కూడా ఈసీ ఇటీవల సమీక్షించింది. ప్రాథమికంగా తెలంగాణ, ఏపీలో 2011 జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాల్లో ఎస్సీ నియోజకవర్గాలు పెరుగుతాయో నిర్ధారించడంతో పాటు ఎన్ని ఎస్టీ స్థానాలు పెరుగుతాయో అంచనా వేశారు. జిల్లా యూనిట్‌గా ఎస్సీ నియోజకవర్గాలను, రాష్ట్ర యూనిట్‌గా ఎస్టీ నియోజకవర్గాలను ఖరారు చేయనున్నారు. ఏపీలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 29 ఉండగా పునర్విభజన అనంతరం 38 స్థానాలకు, ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఏడు నుంచి 12కు పెరుగుతాయి. తెలంగాణలో ఎస్సీ స్థానాలు 19 నుంచి 24కు, ఎస్టీ స్థానాలు 12నుంచి 14కు పెరుగుతాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా పునర్విభజన అనంతరం రెండేసి చొప్పున పెరుగుతాయి. అంటే ఒక్కో ఎంపీ స్థానంలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలుంటాయి. లోక్‌సభ స్థానాల సంఖ్యలో మార్పూ ఉండదు. పునర్విభజన కోసం ఎస్సీ, ఎస్టీల జనాభాను గ్రామాల వారీగా ఇవ్వాలని రిజస్ట్రార్ ఆఫ్ జనరల్ జనాభా గణాంకాలను ఈసీ కోరింది. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అసోసియేషన్ సభ్యులు ఐదుగురు మాత్రమే అని పేర్కొంది. -
హస్తిన పర్యటనకు చంద్రబాబు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన హస్తినలో ఉండనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రధానిని కోరనున్నారు. అధికారవర్గాల కథనం ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.11 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు సంబంధించి నిధుల కోసం ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి ఉన్న రూ.15,691 కోట్ల లోటును భర్తీ చేసేందుకు కేంద్రంలోని గత ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర విద్యాసంస్థలకు కేటాయించిన భూములపై కేంద్రానికి ఇచ్చిన నివేదికను వివరించి, ఆ సంస్థలను త్వరగా ఏర్పాటు చేయాలని కోరనున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలు గవర్నర్‌కు అప్పగించే అంశంపై ఇంతకుముందు ప్రధానికి రాసిన లేఖ విషయాన్ని గుర్తుచేయనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. -
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
-
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరనున్నారు. అధికారవర్గాల కథనం ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.11 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు సంబంధించి నిధుల కోసం ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి ఉన్న రూ.15,691 కోట్ల లోటును భర్తీ చేసేందుకు కేంద్రంలోని గత ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర విద్యాసంస్థలకు కేటాయించిన భూములపై కేంద్రానికి ఇచ్చిన నివేదికను వివరించి, ఆ సంస్థలను త్వరగా ఏర్పాటు చేయాలని కోరనున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలు గవర్నర్‌కు అప్పగించే అంశంపై ఇంతకుముందు ప్రధానికి రాసిన లేఖ విషయాన్ని గుర్తుచేయనున్నారు. తెలంగాణ సీఎంతో జరిగిన చర్చల వివరాలను కూడా ప్రధానికి వివరించే అవకాశాలున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
9 వేల పోలీసు పోస్టులు మాయం
విభజన నేపథ్యంలో కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ లోటు పూడ్చటంపై అధికారుల మల్లగుల్లాలు హైదరాబాద్: రాష్ట్ర విభజన పంపకాల అంశంలో నిబంధనలు పట్టించుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి భారీ నష్టం ఏర్పడింది. ఇప్పటికే వాహనాల పంపకంలో ఏపీ 1,060 కోల్పోయినట్లు వెలుగులోకి రాగా.. ఇప్పుడు మరో అన్యాయం బయటపడింది. రాష్ట్రానికి రావాల్సిన పోలీసు పోస్టుల్లో తొమ్మిది వేలకు పైగా నష్టపోయినట్లు వెల్లడైంది. రాష్ట్ర పోలీసు విభాగంపై తీవ్ర ప్రభావం చూపే ఈ లోటును ఎలా పూడ్చాలనే అంశంపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆస్తులతో పాటు పోస్టులు తదితరాలను సైతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 58.32 : 41.68 నిష్పత్తిలో పంచాల్సి ఉంది. పోలీసు విభాగానికి సంబంధించి వాహనాలు, పోస్టుల పంపకంలో ఈ విషయాన్ని విభజన కమిటీ పట్టించుకోలేదు. 2012 డిసెంబర్ నాటికి మంజూరైన పోస్టుల లెక్క ప్రకారం రాష్ట్ర పోలీస్‌లోని 17 విభాగాల్లో మొత్తం 1,38,823 పోస్టులు ఉన్నాయి. వీటిని విభజన చట్టం ప్రకారం పంచితే ఏపీకి 80,962 పోస్టులు, తెలంగాణకు 57,861 పోస్టులు రావాలి. అయితే వాటికన్నా తెలంగాణకు ఎక్కువ రాగా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం దాదాపు తొమ్మిది వేలకు పైగా పోస్టుల్ని కోల్పోయింది. కేవలం సాధారణ పోలీసు పోస్టుల విషయంలోనే కాదు.. చివరకు ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ల్లోనూ ఇదే రీతిలో పంపకాలు జరిగాయి. సాధారణంగా పోలీసు విభాగంలో రాష్ట్ర, జోనల్ వంటి క్యాడర్ పోస్టులు ఉంటాయి. విభజన చట్టం రాష్ట్ర స్థాయి పోస్టుల పంపకానికి మాత్రమే వర్తిస్తుంది. 1975 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది. దీని ప్రకారం ఏపీఎస్పీలో మినిస్టీరియల్ సిబ్బంది మినహా ప్రతీ పోస్టూ రాష్ట్ర స్థాయికి చెందినదే. అయితే ఏపీఎస్పీని విభజిస్తున్న సందర్భంలో కమిటీ ఎక్కడి యూనిట్లు అక్కడే అన్న నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 58.32 శాతం వాటా రావాల్సిన ఏపీకి ఎనిమిది బెటాలియన్లు.. 41.68 శాతం రావాల్సిన తెలంగాణకు తొమ్మిది బెటాలియన్లు వచ్చాయి. -
ఆ 37 సంస్థలను రక్షించుకుందాం: ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 9, 10 షెడ్యూళ్లలో చేర్చని 37 సంస్థలను న్యాయ పోరాటం ద్వారానైనా రక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ షెడ్యూల్లో చేర్చని ఈ సంస్థలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ సోమవారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత తెలంగాణ ప్రభుత్వంతో చర్చల ద్వారా ఆ సంస్థలు కొంతకాలం పాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి సేవలందించేలా చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇది సాధ్యం కాకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడా పరిష్కారం లభించకపోతే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సంస్థలను పదో షెడ్యూల్లో చేర్చాలని గవర్నర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పదో షెడ్యూల్లో చేర్చాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేయాల్సి ఉంది. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం జంట నగరాల్లోని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్చడ, నాక్కు డెరైక్టర్ జనరల్‌ను నియమించడం వంటి చర్యలను చేపట్టింది. ఈ 37 సంస్థల్లో కొన్ని భౌగోళికంగా తెలంగాణలో, కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. అయితే తెలంగాణలో ఉన్న సంస్థలన్నీ తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. -
ఆ 37 సంస్థలపై పోటాపోటీ
విభజన చట్టంలో ఏ షెడ్యూల్లో చేర్చని సంస్థలపై పంచాయితీ మావంటే మావే అంటున్న తెలంగాణ, ఆంధ్రా సర్కార్లు గవర్నర్‌కు, కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ సర్కారు నిర్ణయం హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ షెడ్యూల్లోనూ చేర్చని 37 సంస్థలపై తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. చట్టంలో ఏ షెడ్యూల్లో చేర్చని సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాది స్తుండగా... భౌగోళికంగా తెలంగాణలో ఉన్న సంస్థలు తమకే చెందుతాయని తెలంగాణ సర్కారుకు పట్టు పడుతోంది. దీంతో ఈ సంస్థలపై ఇరు రాష్ట్రప్రభుత్వాల మధ్య పంచాయతీలు రోజు రోజుకూ పెరగనున్నాయి. ఈ 37 సంస్థల్లో భౌగోళికంగా కొన్ని తెలంగాణలోను, కొన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నాయి. వీటిలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ తదితర సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడంపట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ 37 సంస్థల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఒక అవగాహనకు రావాల్సి ఉందని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కేంద్రానికి, గవర్నర్‌కు లేఖ రాయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్లో చేర్చని సంస్థలుంటే అవి ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని, లేదంటే వెంటనే పదవ షెడ్యూల్లో చేర్చి ఇరు రాష్ట్రాలకు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని కోరనుంది. పదో షెడ్యూల్లో చేర్చితే ప్రత్యామ్నాయ సంస్థలను మరో రాష్ట్రం ఏర్పాటు చేసుకునే వరకు ఉమ్మడి సేవలను అందించాల్సి ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎస్ మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశమ య్యారు. తెలంగాణ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను నిలువరించాలని గవర్నర్, కేంద్రానికి లేఖలు రాయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్న సంస్థలు ఇవే.. ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శిక్షణ సంస్థ, ఏపీ సెరికల్చర్ రీసెర్చ్ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ-మార్కెటింగ్ శిక్షణ సంస్థ, రాష్ట్ర ఏజీఎంఏఆర్కే లేబరేటరీ, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, క్రాప్ వూనిటరింగ్ లేబొరేటరీ, బయో పెస్టిసైడ్ టెస్టింగ్, వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ సంస్థ, ఏపీ యోగాధ్యాన పరిషత్, ఎంఎన్‌జే అంకాలజీ రీజనల్ కేన్సర్ సెంటర్, ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్, ప్రవేశ ఫీజు నియంత్రణ కమిటీ, ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్, ఏపీ వెటర్నరీ మండలి, రాష్ట్ర ఆస్తిపన్ను మండలి, ఏపీ ఫుడ్స్, రాష్ట్ర ఆర్ట్స్ గ్యాలరీ, ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్శిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, దామోదర సంజీవయ్య న్యాయ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ, భూమి ఆక్రమణ ప్రత్యేక కోర్టు, ఏపీ దేవాదాయ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, రాష్ట్ర మైనారిటీ కమిషన్, ఏపీ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్, రాష్ట్ర అధికార భాషా కమిషన్, ఏపీ విజిలెన్స్ కమిషన్, లోకాయుక్త, రాష్ట్ర ఎన్నికల సంఘం, సమాచార హక్కు కమిషన్, ఏపీ మానవ హక్కుల కమిషన్, ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్. -
టీ ప్రాజెక్టుల్ని మేమెందుకు అడ్డుకుంటాం?
హరీశ్‌రావుపై దేవినేని ధ్వజం విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన విధంగానే గోదావరి, కృష్ణా నదులపై నూతన ప్రాజెక్టులకు ఆమోదం, నిర్మాణ పనులు నదీ నిర్వహణ మండళ్లు, కేంద్ర జల సంఘం సిఫార్సుల మేరకే జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రూపంలో కుట్రలు పన్నుతున్నారని హరీశ్‌రావు ఆరోపించడం బాధ్యతా రాహిత్యమేనని దేవినేని ధ్వజమెత్తారు.