సాక్షి, చెన్నై : హాలీవుడ్ నటుడు బ్రూస్‌లీ కీర్తి కిరీటాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రాలు, కరాటే కిక్ ఫైట్స్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన అంటే పిచ్చి అభిమానం కలిగిన అచ్చం ఆయన మాదిరిగానే ఉన్న బ్రూస్‌లీ షాన్ నటిస్తున్న చిత్రం పుదియ బ్రూస్‌లీ. ఎస్‌కే.అమ్మాళ్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై వందవాసి కే.అమ్మాళ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళైయూర్ ఏ.సోణై కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ బ్రూస్‌లీ అభిమానినైన తనకు ఆయన ఛాయలున్న బ్రూస్‌లీ షాన్ కంటపడడంతో ఈ చిత్రం చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. వెంటనే కథను తయారు చేశానని తెలిపారు. అతనూ కరాటేలో రెండు బ్లాక్‌బెల్ట్‌లు సాధించడంతో తనకు అదనపు శక్తి వచ్చిందని అన్నారు.
ఒక గ్రామంలో నివశించే హీరో ఒక దుర్ఘటనలో తన కుటుంబాన్ని కోల్పోతాడన్నారు. దీంతో నగరంలోని తన మామ వద్దకు వెళతాడన్నారు. అక్కడ తన మామ సమస్యల్లో చిక్కుకుంటే ఆయన్ని వాటి నుంచి కాపాడి సొంత గ్రామానికి చేరుకోవడమే పుదియ బ్రూస్‌లీ చిత్ర ప్రధాన అంశం అని చెప్పారు.తనకు బ్రూస్‌లీ గురించి తెలిసిన అన్ని అంశాలను ఈ చిత్ర హీరో బ్రూస్‌లీ షాన్ ద్వారా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశానన్నారు. చిత్రంలోని ఐదు ఫైట్స్‌ను స్టంట్ మాస్టర్ థ్రిల్ శేఖర్ అద్భుతంగా కంపోజ్ చేశారన్నారు. చిత్రంలో విలన్, ఫైట్స్ సన్నివేశాలవిషయంలో తగిన జాగ్రత్తలను తీసుకున్నానని తెలిపారు. ఇందులో సురేశ్‌నరగ్ అనే నటుడిని ఎంపిక చేశామని, క్లైమాక్స్ పోరాట సన్నివేశాల్లో జితేంద్ర హుడాను నటింపజేసినట్లు చెప్పారు. హీరోయిన్‌గా రజియాను పరిచయం చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment