కరోనా నేపథ్యంలో రక్షిత్‌ కొత్త సినిమా | Hero Rakshit Upcoming Movie Is In The Backdrop Of Coronavirus | Sakshi
Sakshi News home page

‘పలాస’ హీరో రక్షిత్‌ కొత్త సినిమా

Published Thu, Jun 18 2020 5:40 PM | Last Updated on Thu, Jun 18 2020 6:18 PM

Hero Rakshit Upcoming Movie Is In The Backdrop Of Coronavirus - Sakshi

సింపుల్‌ స్టార్‌ రక్షిత్ ఇటీవల నటించిన చిత్రం ‘పలాస 1978’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రక్షిత్‌ మరో ఆసక్తికర‌‌ ప్రాజెక్ట్‌కు రెడీ అయిపోయాడు. కరోనా నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘‘డబ్ల్యూహెచ్‌ఓ’’(వరల్డ్‌ హజార్డ్‌ ఆర్డినెన్స్‌) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. కరోనా సంక్షోభం సమయంలో ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. హ్యాకింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాను సుధాస్‌ మీడియా సమర్ఫణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతోంది. (రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్‌)

రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కు విశేష స్పందన లభిస్తుంది. ‘‘ఐయామ్‌ గోనా టెల్‌ గాడ్‌ ఎవ్రీథింగ్‌’’ వంటి వైవిధ్యమైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో విమర్శకుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్‌లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధిచిన మిగతా వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement