హీరోయిన్ ఓరియంటెడ్ జ్యోతిక | Jyothika to work with director Bramma of Kuttram Kadathil fame? | Sakshi
Sakshi News home page

హీరోయిన్ ఓరియంటెడ్ జ్యోతిక

Published Tue, Feb 16 2016 11:11 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

హీరోయిన్ ఓరియంటెడ్ జ్యోతిక - Sakshi

హీరోయిన్ ఓరియంటెడ్ జ్యోతిక

హీరో సూర్యను పెళ్ళి చేసుకున్నాక సినిమా రంగానికి దూరంగా కాలక్షేపం చేస్తున్న నటి జ్యోతిక. ఇంట్లో పిల్లల బాగోగుల మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతూ వచ్చిన ఆమె చాలా విరామం తరువాత గత ఏడాది ‘36 వయదునిలే’ (36 ఏళ్ళ వయసులో అని అర్థం) అనే తమిళ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకురావడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించి పెట్టింది. కానీ, ఎందుకనో ఆమె మళ్ళీ ఏ కొత్త ప్రాజెక్ట్‌కూ పచ్చజెండా ఊపలేదు. తాజాగా జ్యోతిక ఒక కొత్త సినిమా స్క్రిప్ట్‌కు ఓకే చెప్పారు.

తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం మొన్నటి ‘36 వయదునిలే’ లాగానే ఇదీ పూర్తిగా హీరోయిన్‌కు ప్రాధాన్య మున్న స్రిప్ట్. ‘కుట్రమ్ కడిదళ్’కి గాను జాతీయస్థాయిలో ఉత్తమ తమిళచలనచిత్ర అవార్డును అందుకున్న దర్శకుడు బ్రహ్మనాథన్ ఈ చిత్రాన్ని రూపొందించ నున్నారు. నిజానికి, రీ-ఎంట్రీ తరువాత మరో కొత్త ప్రాజెక్ట్‌ను వెంటనే చేపట్టేందుకు జ్యోతిక తొందరపడలేదు. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూశారు. ఈ పరిస్థితుల్లో బ్రహ్మ ఇటీవల కలసి, ఈ కొత్త సినిమా స్క్రిప్ట్‌ను చర్చిం చారు.

‘‘జ్యోతిక మేడమ్‌కు స్క్రిప్ట్ నచ్చింది. అందులోని బలమైన స్త్రీ పాత్ర నచ్చింది. అందుకే, ఈ సినిమాలో పనిచేయడానికి అంగీకరిం చారు’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కొత్త సినిమా పేరు, ఇతర వివరాలన్నీ తెలియడానికి మరికొంత కాలం ఆగాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement