ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన ప్యాడ్ మ్యాన్ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆడవారు ఎదుర్కొనే రుతుక్రమం ఒక రహస్యం కాదని, చర్చించాల్సిన అంశమన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రత్యేక ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ చిత్రంతో ప్రభుత్వాల్లో కూడా కదలిక వచ్చింది.
పాఠశాలలోని విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్‌లను ఉచితంగా అందించేందుకు ఢిల్లీ సర్కార్ సిద్ధమైపోయింది. ఇందులో భాగంగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిధులను కూడా విడుదల చేసింది. ‘ఇది దాచుకోవాల్సిన అంశం ఏం కాదు. ఉపాధ్యాయులు కూడా ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించారు. ఆ సమయంలో విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరు అవుతుంటారు. అందుకే వారికి ఉచితంగా ప్యాడ్‌లను అందించేందుకు సిద్ధమయ్యాం’ అని స్థానిక నేత శిఖా రాయ్ వెల్లడించారు.
2018-19 బడ్జెట్‌కి గానూ ఈ నిధులను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేక సమావేశంలో ఇందుకు సంబంధించిన బిల్లును మేయర్ కమల్‌జీత్ షెరావత్ ఆమోదించగా.. మునిసిపల్ కమిషనర్ ఆమోదించాల్సి ఉంది. మరోవైపు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఆర్.బాల్కీ డైరెక్షన్‌లో అక్షయ్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment