‘నేనేం సిగ్గు పడట్లేదు’ | Aamir khan says Pad in my hand, there is nothing to be ashamed about | Sakshi
Sakshi News home page

నేనేం సిగ్గు పడట్లేదు- ఆమిర్‌ ఖాన్‌

Published Fri, Feb 2 2018 4:25 PM | Last Updated on Fri, Feb 2 2018 6:54 PM

 Aamir khan says Pad in my hand, there is nothing to be ashamed about - Sakshi

ప్యాడ్‌తో ఆమీర్‌ ఖాన్‌

సాక్షి, హైదరాబాద్‌ : మహిళల రుతుస్రావంపై అవగాహన కలిగించేందుకు బాలీవుడ్‌ నటుడు  ఆమిర్‌ ఖాన్‌ సైతం నడుం బిగించాడు. ప్యాడ్‌ మన్‌ చాలెంజ్‌లో భాగంగా శానిటరీ నాప్‌కిన్‌ చేతిలో పట్టుకున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాకుండా దీనికి నేను సిగ్గుపడటం లేదని, ఈ చాలెంజ్‌ స్వీకరించి మరొకరికి సవాల్‌ విసరండని అభిమానులను కోరారు. తాను బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లను చాలెంజ్‌ చేస్తున్నానని ట్వీటర్‌లో పేర్కొన్నాడు.

ఆ ఫొటోకు క్యాఫ్షన్‌గా ‘నా చేతిలో​ ప్యాడ్‌ ఉంది. దీనికి నేనేం సిగ్గుపడట్లేదు. పీరియడ్‌ అనేది సహజం. ఇలా ప్యాడ్‌తో ఫొటో దిగి మీ ‍స్నేహితులకు చాలెంజ్‌ విసరండి. నేను ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లను చాలెంజ్‌ చేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశాడు.

దేశవ్యాప్తంగా రుతస్రావం, నాప్‌కీన్స్‌ వాడకంపై  అవగాహన కలిగించేందుకు ఎన్జీవోలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక సామాజిక కార్యకర్త అరుణాచలం మురుగనాథమ్‌ స్టోరీ ఆధారంగా అక్షయ్‌ కుమార్‌ లీడ్‌రోల్‌లో రాధిక ఆప్టే కథానాయికగా ప్యాడ్‌మన్‌ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement