సల్మాన్‌ అవుట్‌.. హిస్టారికల్‌ ప్రాజెక్ట్‌ కన్ఫర్మ్‌ | Akshay Confirmed Salman not part in Kesari | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 23 2017 2:31 PM | Last Updated on Sat, Dec 23 2017 2:31 PM

Akshay Confirmed Salman not part in Kesari - Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టత వచ్చింది. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో కేసరి అనే చిత్రం రాబోతుందని కొంత కాలం అఫీషియల్ ప్రకటన వెలువడింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా.. సల్మాన్‌-కరణ్‌ జోహర్‌-అక్షయ్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌  చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. 

అయితే ఆ ప్రాజెక్టు నుంచి సల్మాన్ ఇప్పుడు తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్‌ కుమార్ ప్రకటించాడు. పాడ్‌మన్‌ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్న అక్షయ్‌ ఈ విషయంపై మాట్లాడుతూ... ‘‘ఈ ప్రాజెక్టులో సల్మాన్ లేడు. నేను, కరణ్ మాత్రమే నిర్మాతలుగా తీయబోతున్నాం అని తేల్చేశాడు.

సారఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కబోతోంది. పాడ్‌మన్ రిలీజ్ అయ్యాక ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు అక్కీ ప్రకటించాడు. చిత్ర తారాగణం పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారంట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement