
అక్షయ్ కుమార్ సినిమా ప్యాడ్‌మ్యాన్ జనవరి 26న విడుదల అవుతోంది. అందులో అక్షయ్ తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్ తయారు చేసి పల్లెల్లోని నిరుపేద మహిళలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఒక నిజ జీవిత వ్యక్తి (అరుణాచల మురుగనాథం) పాత్రను పోషిస్తున్నారు. అంతేకాదు, ‘మెన్‌స్ట్రువల్ హైజీన్’పై సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం తీసిన ఈ సినిమా నుంచి అక్షయ్ ఏ మాత్రం లాభాలను ఆశించడం లేదట! అంత ధైర్యంగా అక్షయ్ ఆ మాట చెప్పడానికి అతడికి ఉన్న సామాజిక స్పృహ ఒక కారణం అయితే, రెండోది ఆ సినిమాకు డబ్బులు పెట్టింది అతడి భార్య ట్వింకిల్ ఖన్నా కావడం. భార్యాభర్తలిద్దరూ ఒకే ఎయిమ్‌తో పనిచేస్తున్నారు కాబట్టి డబ్బు లెక్క చూసుకోవడం లేదు.
అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పల్లెపల్లెకు ప్యాడ్‌మ్యాన్ రీచ్ అయ్యేలా అక్షయ్, ట్వింకిల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ సహకారం కోరబోతున్నారు. గతంలోనూ అక్షయ్ నటించిన ‘టాయ్‌లెట్ : ఏక్ ప్రేమ్ కథ’ సినిమాకు ప్రభుత్వం ఈ విధమైన సహకారం అందించింది. ఆ సినిమాను పెన్‌డ్రైవ్‌లకు ఎక్కించి, పల్లెలకు పంపించింది. ఉద్దేశం మంచిదైనప్పుడు సహకారం అందకుండా ఉంటుందా?
Comments
Please login to add a commentAdd a comment