ముక్కు వద్దు.. కాళ్లు తీసుకోండి | Deepika Padukone reveals an incident from her teenage days | Sakshi
Sakshi News home page

ముక్కు వద్దు.. కాళ్లు తీసుకోండి

Published Sat, Feb 3 2018 1:06 AM | Last Updated on Sat, Feb 3 2018 4:10 AM

Deepika Padukone reveals an incident from her teenage days - Sakshi

దీపికా పదుకోన్

...ఇలాంటి ఆఫర్‌ ఎవరైనా ఇస్తారా? కోట్లు ఇస్తామన్నా ఇవ్వరు. కానీ దీపికా పదుకోన్‌ మాత్రం చాలా ధైర్యంగా ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌. అసలు సంగతి ఏంటంటే.. దీపికా పదుకోన్‌ లీడ్‌ రోల్‌లో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పద్మావత్‌’. ఈ సినిమా పట్టాలెక్కినప్పుడు మొదలైన వివాదాలు సినిమా విడుదలైనా ఆగడం లేదు. భన్సాలీని చంపేస్తామని, దీపిక తల.. ముక్కు నరికిన వారికి లక్షల్లో నజరానా ఇస్తామని ‘పద్మావత్‌’ సినిమాని వ్యతిరేకిస్తున్న వారు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ బెదిరింపుల గురించి దీపిక స్పందించారు. ‘‘పద్మావత్‌’లో నటించినందుకు నా తల, ముక్కు నరికేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. నాకు నా ముక్కు అంటే చాలా ఇష్టం కాబట్టి దాన్ని కత్తిరించొద్దు. కావాలంటే పొడవైన నా కాళ్లు కత్తరించుకోండి. ఇలా బెదిరించే వాళ్లను లైట్‌గా తీసుకోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవడానికి నేను భయపడను’’ అంటూ చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారీ బ్యూటీ. ‘‘నాకు 14ఏళ్ల వయసులో అమ్మానాన్నలతో కలిసి బయటికెళ్లాను. అప్పుడో వ్యక్తి కావాలనే నన్ను రాసుకుంటూ వెళ్లాడు. అతని చెంప ఛెళ్లుమనిపించా ’’ అన్నారు దీపికా పదుకోన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement