పణజి : టీవీ చానల్స్‌లో రోజూ ప్రసారం అవుతోన్న చర్చా కార్యక్రమాలపై సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదుటివారిని ఓడించడమే లక్ష్యంగా.. చాలా సార్లు అడ్డదిడ్డంగా, కొన్నిసార్లు జుగుప్సాకరంగా, అంతూపొంతూ లేకుండా సాగుతోన్న టీవీ చర్చా కార్యక్రమాలు దేశంలో భాషా ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు.
నిజమైన ప్రజాస్వామిక భావనలకు ఇలాంటి చర్చలు అవరోధాలని ప్రసూన్ జోషి అభిప్రాయపడ్డారు. ఆదివారం పణజి(గోవా)లో ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహిస్తోన్న ‘ఇండియా ఐడియాస్ కంక్లేవ్-2017’ లో ఆయన మాట్లాడారు.
‘టీవీ చర్చల్లో.. ఆయా పక్షాలకు చెందిన కొందరు సుశిక్షితులు గెలుపు కోసమే వాదించడం చూస్తూంటాం. వారి ముందు.. విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు సైతం డీలా పడిపోతుంటారు. ఎదుటివారు వాదనను మొదలుపెట్టేలోపే ఇటు నుంచి దాడి పూర్తవుతుంది. ఇది సరైన విధానం కాదు. నిజంగా ప్రజాస్వామ్యంగా ఉండాలనుకున్నప్పుడు.. వాదనలు వినే, వాదనలు గెలవడంలో కొత్త మార్గాన్ని కనుగొనవలసి ఉంది’’ అని ప్రసూన్ జోషి అన్నారు.
ప్రసూన్ జోషి (ఫైల్ ఫొటో)
Comments
Please login to add a commentAdd a comment