Extremism
-
USA: ‘అతివాదం’తో తలనొప్పులు.. హక్కుల కార్యకర్త అరెస్టు
కాలిఫోర్నియా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చిధ్రమవుతున్న గాజా పరిస్థితి మానవతావాదుల హృదయాలను ద్రవింపజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హక్కుల కార్యకర్తలు పాలస్తీనాకు మద్దతుగా తమ గళం విప్పుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా బేకర్స్ఫీల్డ్ నగర కౌన్సిల్లో హక్కుల కార్యకర్త రిద్ది పటేల్ పాలస్తీనాకు మద్దతుగా గొంతు వినపించారు. అయితే గీత దాటి అతివాదం వైపు వెళ్లి కష్టాలు కొనితెచ్చుకున్నారు. గాజాలో కాల్పుల విరమణ తీర్మానంపై హియరింగ్ సందర్భంగా ఓపిక నశించిన రిద్ది ఏకంగా మేయర్, కౌన్సిల్ సభ్యులనే బెదిరించారు. ‘ఏదో ఒక రోజు మీ ఇంట్లోనే మిమ్మల్ని చంపే పరిస్థితి వస్తుంది’ అని వారిని హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ తీర్మానానికి ఎవరూ మద్దతు పలకకపోవడం..తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగుతుండడంతో నిరాశ నిస్పృహలకు లోనైన రిద్ది పటేల్ తనలోని అతివాది బయటికి తీశారు. కౌన్సిల్ సభ్యులను బెదిరించినందుకుగాను రిద్దిపై 16 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పటేల్ తీరును హిందూ అమెరికన్ ఫౌండేషన్లు ఖండించాయి. బెదిరింపుల సందర్భంగా మహాత్మాగాంధీ పేరతో పాటు చైత్ర నవరాత్రిలను రిద్ది ప్రస్తావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎంతటి తీవ్రత కలిగిన అంశంపై పోరాడాల్సిన సందర్భంలోనైనా హక్కుల కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాల్సిందేనని రిద్ది పటేల్ ఎదుర్కొంటున్న పరిణామాలే తెలియజేస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి.. సౌదీ జైలులో భారతీయుడు -
మోదీవి ‘పర్ఫార్మెన్స్ పాలిటిక్స్’: అమిత్ షా
భోపాల్: కులం, అవినీతి, బుజ్జగింపు, వారసత్వ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారని, పనితీరు ఆధారిత రాజకీయాలతో భారత దేశ ప్రతిష్టను పెంచారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేళ్లూనుకుపోయిన మావోయిజం, ఉగ్రవాదం, తీవ్రవాదం ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పారు. గత ప్రభుత్వాలతో మోదీ పాలనను పోల్చి విశ్లేíÙంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. గ్వాలియర్, ఖజురహోల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ‘‘పాండవులు, కౌరవుల మధ్య పోరు జరుగుతోంది. మోదీ సారథ్యంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని భావించే దేశభక్తుల గ్రూపు ఒకటి కాగా, వారసత్వ రాజకీయాలను పెంచిపోíÙస్తున్న గ్రూపు మరోటి’’ అన్నారు. -
ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై సదస్సు: సీఎం జగన్ ఏమన్నారంటే..
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. సదస్సులో సీఎం జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోంది. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం-సానుకూల ఫలితాలను అందించింది. ►కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోంది. ►మా ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా... మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50 కి తగ్గింది. ►ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన సరిహద్దులను ఒడిశా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లతో పంచుకుంటుంది. పొరుగు రాష్ట్రాలతో పటిష్టమైన సమన్వయం ఉంది. నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్‌ఫోర్స్‌లు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మాకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్కఫోర్స్ ద్వారా పరస్పరం పంచుకుంటూ... సమిష్టిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. ►స్ధిరమైన అభివృద్ధి మరియు సామాజిక, ఆర్ధిక పురోగతి మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కీలక పరిష్కారాలు అని నేను ధృఢంగా విశ్వసిస్తున్నాను. పేదరికం, అవిద్య, అందుబాటులో లేని వైద్యం మరియు సమాజాన్ని పీడిస్తున్న పరిమితమైన ఉపాధి అవకాశాలే తీవ్రవాదానికి అత్యంత అనుకూల అంశాలు. సమర్ధవంతమైన విధానాలను రూపొందించి, వాటిని అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని రూపుమాపగలం. ►ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 2020–21 నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి సాగను ధ్వంసం చేశారు. 224 కేసులు నమోదు చేసి, 141 మంది నిందితులను అరెస్టు చేశారు. దాదాపు 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని తగులబెట్టారు. నిరంతరాయంగా చేస్తున్న ఈ ఆపరేషన్ వల్ల.. 2022లో గంజాయి సాగు 1500 ఎకరాలకు తగ్గిందని, ప్రస్తుత సంవత్సరం అంటే 2023లో అది కేవలం 45 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ►గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం, పోలీసులు గంజాయి సాగు చేపడుతున్న గిరిజనులతో సంప్రదించి.. వారికి ప్రత్యామ్నాయ పంటలైన కాఫీ, నిమ్మ, జీడి మామిడి, నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్ ఓక్తో పాటు రాజ్మా, కందిపప్పు, వేసుశెనగ వంటి పంటలసాగును ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తోంది. తద్వారా వారిని గంజాయి సాగు నుంచి మరల్చే ప్రయత్నం చేస్తోంది. ►ఆర్ఓఎఫ్ఆర్.. అటవీ ప్రాంతంలో అర్హులైన 1.54 లక్షల మంది గిరిజన రైతులకు 3.22 లక్షల ఎకరాల మేరకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీచేశాం. వారి భూములను సాగు చేసుకునేందుకు మద్ధతుగా, పెట్టుబడి ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు భరోసాగా రూ.13,500 ఆర్ధిక సహాయం అందజేస్తోంది. ►మావో ప్రభావిత ప్రాంతాల్లో రహదారులతో అనుసంధానం అన్నది అత్యంత కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో మేము వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజమ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ స్కీం కింద ఇప్పటికే 1087 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసాం. ►ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా, పారదర్శకంగా త్వరితగతిన అందజేయడం కోసం మేము 897 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కూడా ఉన్నారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో భాగంగా మొబైల్ కనెక్టివిటీ పెంచడం కోసం 944 కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేశాం. ►వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో విద్య ప్రధానమైనది. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్‌లో 28 ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. వాటిలో 24 పాఠశాలలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా మా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోంది. దీనితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం 1953 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు, 81 గురుకుల పాఠశాలలు, 378 ఆశ్రమ పాఠశాలలతో పాటు 179 ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తోంది. ►వీటిని మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల కల్పిస్తూ... డిజిటలైజేషన్ పరంగా తరగతిగదులన్నింటినీ అప్‌గ్రేడ్ చేస్తున్నాం. మరోవైపు పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు, వారికి ఆర్ధిక సహాయం అందించేందుకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి రూ.15,000 అందిస్తున్నాం. ►మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంవలను బలోపేతం చేయడానికి, మా ప్రభుత్వం కొత్తగా 879 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు గిరిజన ప్రాంతాల్లో 75-108 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయి. 89 మొబైల్ మెడికల్ యూనిట్ల(104) ద్వారా గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలను కూడా ప్రవేశపెట్టాం. ►సికిల్ సెల్ అనీమియా, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు ఆరోగ్య పించను కింద నెలకు రూ.10వేలు అందజేస్తున్నాం. వృద్ధ్యాప్య ఫించను కింద గిరిజన ప్రాంతాల్లో 50 ఏళ్లనుంచే నెలకు రూ.2750 ఇస్తున్నాం. ►మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. గిరిజన ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలను పెంచాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. దీని కోసం ఈ మావో ప్రభావిత జిల్లాల్లో కనీసం 15 కొత్త బ్యాంకు శాఖలు మంజూరు కావాల్సి ఉంది. ►గతంలో సదరన్ జోనల్ కౌన్సిల్లో సిఫార్సు మేరకు వైజాగ్‌లో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని సైతం కేటాయించి దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. దీనిని వీలైనంత త్వరగా మంజూరు చేయగలరు. ►వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, శాంతిని సాధించడం, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించకుండా నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్రాల నడుమ నిరంతరం పరస్పర సహాయ సహకారాలు అవసరం. ►ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ... వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు.. అక్కడ పోలీసు బలగాల ఆధునీకరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్ధిక మరియు వ్యూహాత్మక మద్ధతును కేంద్రం అందించడం అన్నది చాలా కీలకం. ►హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ధృడమైన మార్గదర్శకత్వం, మద్దతుతో మేము మా రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను విజయవంతంగా రూపుమాపుతామని, మా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని నేను విశ్వసిస్తున్నాను. చదవండి: నందమూరి బాలయ్య మేకపోతు గాంభీర్యం -
ఉగ్రవాదంపై ‘క్వాడ్’ కార్యాచరణ బృందం
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుంటున్న ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని కఠినంగా అణచివేయడానికి చేపట్టాల్సిన చర్యల కోసం ‘వర్కింగ్ గ్రూప్ ఆఫ్ కౌంటర్–టెర్రరిజం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ‘క్వాడ్’ కూటమిలో భాగమైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్, యోషిమస హయషీ, పెన్నీ వాంగ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రపంచమంతటా ఉగ్రవాద భూతం విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్ర మూకల ఆటకట్టించడానికి నాలుగు దేశాల కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. చట్టబద్ధ పాలన, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. జీ7 కూటమికి జపాన్, జీ20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతోపాటు ఈ ఏడాది ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కో–ఆపరేషన్(ఏపీఈసీ)కి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ‘క్వాడ్’ అజెండా అమలు కోసం సన్నిహితంగా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అనంతరం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’లో పాల్గొన్నారు. -
ఉగ్రవాదం, తీవ్రవాదం 80% తగ్గాయి: అమిత్ షా
నాగపూర్: నరేంద్ర మోదీ హయాంలో కశ్మీర్లో ఉగ్రవాదం, ఈశాన్యంలో∙వామపక్ష తీవ్రవాదం 80 శాతం దాకా తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. శనివారం ఇక్కడ మరాఠా వార్తా లోక్మత్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీకి ముందు దాకా దేశం పలు అంతర్గత భద్రతా సవాళ్లతో సతమతమవుతూ ఉండేదన్నారు. అలాంటిది గతేడాది కశ్మీర్ లోయను ఏకంగా 1.8 కోట్ల మంది పర్యాటకులు సందర్శించడం గొప్ప ఘనత అని అభిప్రాయపడ్డారు. ‘‘అంతేగాక గత 70 ఏళ్లలో మొత్తం కలిపి కశ్మీర్‌కు రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వస్తే గత మూడేళ్లలోనే మరో రూ.12 వేల కోట్ల పెట్టుబడులను మోదీ ప్రభుత్వం సాధించింది. పైగా కశ్మీర్లో ప్రతి ఇంటికీ నల్లా నీరు, కరెంటు అందించాం. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అదుపులోకి వచ్చింది. 60 శాతం ప్రాంతాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేశాం కూడా. రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధంగా మారుతోంది. ఉపగ్రహ ప్రయోగాల్లో మనమెంతగా దూసుకెళ్తున్నదీ ప్రపంచమంతా చూస్తోంది. మన స్టార్టప్‌లు దుమ్ము రేపుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్‌లో ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో చూడాలన్న ప్రధాని మోదీ ఆశయం నెరవేరేందుకు ఇంకెంతో దూరం లేదు’’ అన్నారు. అందుకు తగ్గట్టుగా వచ్చే పాతికేళ్ల అమృత కాలంలో పలు లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్తున్నట్టు వివరించారు. -
టీవీ చానల్స్ చర్చలతో భాషా తీవ్రవాదం
పణజి : టీవీ చానల్స్‌లో రోజూ ప్రసారం అవుతోన్న చర్చా కార్యక్రమాలపై సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదుటివారిని ఓడించడమే లక్ష్యంగా.. చాలా సార్లు అడ్డదిడ్డంగా, కొన్నిసార్లు జుగుప్సాకరంగా, అంతూపొంతూ లేకుండా సాగుతోన్న టీవీ చర్చా కార్యక్రమాలు దేశంలో భాషా ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. నిజమైన ప్రజాస్వామిక భావనలకు ఇలాంటి చర్చలు అవరోధాలని ప్రసూన్ జోషి అభిప్రాయపడ్డారు. ఆదివారం పణజి(గోవా)లో ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహిస్తోన్న ‘ఇండియా ఐడియాస్ కంక్లేవ్-2017’ లో ఆయన మాట్లాడారు. ‘టీవీ చర్చల్లో.. ఆయా పక్షాలకు చెందిన కొందరు సుశిక్షితులు గెలుపు కోసమే వాదించడం చూస్తూంటాం. వారి ముందు.. విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు సైతం డీలా పడిపోతుంటారు. ఎదుటివారు వాదనను మొదలుపెట్టేలోపే ఇటు నుంచి దాడి పూర్తవుతుంది. ఇది సరైన విధానం కాదు. నిజంగా ప్రజాస్వామ్యంగా ఉండాలనుకున్నప్పుడు.. వాదనలు వినే, వాదనలు గెలవడంలో కొత్త మార్గాన్ని కనుగొనవలసి ఉంది’’ అని ప్రసూన్ జోషి అన్నారు. ప్రసూన్ జోషి (ఫైల్ ఫొటో) -
డ్రాగన్ దూకుడు అతిపెద్ద సవాల్..
వాషింగ్టన్: ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి డ్రాగన్ దూకుడు దీర్ఘకాలంలో అతిపెద్ద సవాల్ అని, ప్రస్తుతం ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. ఇక అమెరికా సహా ఆసియా ఫసిఫిక్ దేశాలన్నింటినీ చైనా, ఉత్తర కొరియాల తర్వాత ఐసిస్, ఇతర ఉగ్ర సంస్థల కార్యాకలాపాలు కలవరపరుస్తాయని అమెరికన్ కమాండర్ అడ్మిరల్ హ్యారీ హారిస్ అన్నారు. ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి ఆందోళనకరమని, ఆసియాలో ఐసిస్ ఉనికి పెంచుకోవడం కలవరపరిచే అంశమని హ్యారీ వ్యాఖ్యానించారు. మరోవైపు చైనా తూర్పు, దక్షిణ సముద్ర ప్రాంతంలో చేపడుతున్న చర్యలు ఆక్షేపణీయమని అన్నారు. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యూఎస్ కమాండర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
వాళ్లు కనిపిస్తే తల నరికేయండి!
హిజ్రాలపై వివాదాస్పద పోస్టర్లు కరాచీ: హిజ్రాలు కనిపిస్తే తల నరికేయాలంటూ పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో వెలిసిన వివాదాస్పద పోస్టర్లు పెద్ద దుమారం రేపుతున్నాయి. కరాచీలో నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో ఈ పోస్టర్లు పెద్దసంఖ్యలో అంటించి ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగి అలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్‌లో ఇటీవలికాలంలో అసహనం, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా షాపింగ్ మాల్స్ లోపల ఈ తరహా పోస్టర్లు వెలువడం హిజ్రాలను కలవరానికి గురిచేస్తున్నది. పొట్టపోసుకునేందుకు హిజ్రాలు నిత్యం ఈ ప్రాంతంలో తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హిజ్రాలపై ఎలాంటి దాడులు జరగకుండా అలర్ట్ ప్రకటించామని, ఎవరైనా తమ ప్రాణాలకు ముప్పు ఉంచి ఉందని భావిస్తే పోలీసుల రక్షణ కోరవచ్చునని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ పోస్టర్లు వెలిసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో హిజ్రాలు ఎవరూ కనిపించడం లేదని, వారి సంచారం తగ్గిందని స్థానిక షాపింగ్ మాల్ వద్ద పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు చెప్పారు. హిజ్రాలు తమ వ్యాపారాలకు అడ్డు తగులుతూ చికాకు కలిగిస్తున్నారనే ఉద్దేశంతో స్థానిక దుకాణాల యజమానులే ఈ పోస్టర్లు అంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు పోస్టర్లను సమర్థిస్తున్న వ్యాపారులు.. పురుషులే హిజ్రాల వేషం వేసుకొని మహిళలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారి వద్ద అడుక్కుంటూ చికాకు కల్పిస్తున్నారని, ఇలాంటివి సాగనివ్వమని అంటున్నారు. -
సోషల్ మీడియాలో ఆ వీడియోలకు బ్రేక్!
సోషల్ మీడియా ద్వారా తమ సంస్థ వ్యాప్తిని విసృతం చేసుకుంటున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన వీడియోలకు త్వరలో బ్రేక్ పడనుంది. ఉగ్రవాద వీడియోలను సోషల్ మీడియా నుంచి ఆటోమేటిక్‌గా తొలగించే సరికొత్త సాఫ్ట్ వేర్ ను ఆయా వెబ్సైట్లు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తాజాగా సిరియా, బెల్జియం, అమెరికా తదితర దేశాల్లో ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బుక్, యూట్యూబ్ లు ప్రస్తుతం ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోలను తొలగించేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే, ఏ పద్ధతి ప్రకారం ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని గుర్తిస్తారో మాత్రం తెలుపలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా ఒత్తిడితో ఆన్ లైన్ లో ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకునేందుకు ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, క్లోడ్ ఫ్లేర్ తదితర కంపెనీలు ఒప్పుకున్నాయి. దాంతో ఆన్ లైన్ లో ఎక్కడైనా ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోల సమాచారం కనిపిస్తే సంస్థలు తొలగించనున్నాయి. ఆటోమేషన్ ప్రత్యేకంగా తయారుచేసిన సాఫ్ట్ వేర్ ను ఇందుకు ఉపయోగించనున్నారు. ఏ అంశాలను ఉగ్రవాద సమాచారంగా భావిస్తారనే విషయం మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సివుంది.