భోపాల్: కులం, అవినీతి, బుజ్జగింపు, వారసత్వ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారని, పనితీరు ఆధారిత రాజకీయాలతో భారత దేశ ప్రతిష్టను పెంచారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేళ్లూనుకుపోయిన మావోయిజం, ఉగ్రవాదం, తీవ్రవాదం ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పారు.
గత ప్రభుత్వాలతో మోదీ పాలనను పోల్చి విశ్లేíÙంచుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. గ్వాలియర్, ఖజురహోల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ‘‘పాండవులు, కౌరవుల మధ్య పోరు జరుగుతోంది. మోదీ సారథ్యంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని భావించే దేశభక్తుల గ్రూపు ఒకటి కాగా, వారసత్వ రాజకీయాలను పెంచిపోíÙస్తున్న గ్రూపు మరోటి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment