డ్రాగన్ దూకుడు అతిపెద్ద సవాల్..
వాషింగ్టన్: ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి డ్రాగన్ దూకుడు దీర్ఘకాలంలో అతిపెద్ద సవాల్ అని, ప్రస్తుతం ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. ఇక అమెరికా సహా ఆసియా ఫసిఫిక్ దేశాలన్నింటినీ చైనా, ఉత్తర కొరియాల తర్వాత ఐసిస్, ఇతర ఉగ్ర సంస్థల కార్యాకలాపాలు కలవరపరుస్తాయని అమెరికన్ కమాండర్ అడ్మిరల్ హ్యారీ హారిస్ అన్నారు.
ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి ఆందోళనకరమని, ఆసియాలో ఐసిస్ ఉనికి పెంచుకోవడం కలవరపరిచే అంశమని హ్యారీ వ్యాఖ్యానించారు. మరోవైపు చైనా తూర్పు, దక్షిణ సముద్ర ప్రాంతంలో చేపడుతున్న చర్యలు ఆక్షేపణీయమని అన్నారు. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యూఎస్ కమాండర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.