ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో! | Film director Ram Gopal Varma in TV channel debates | Sakshi
Sakshi News home page

ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో!

Published Mon, Dec 2 2024 3:38 AM | Last Updated on Mon, Dec 2 2024 3:38 AM

Film director Ram Gopal Varma in TV channel debates

ఫిర్యాదులు, కేసుల వెనుక లోగుట్టు తెలుస్తూనే ఉంది  

టీవీ చానళ్ల డిబేట్లలో సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ  

సాక్షి, అమరావతి: ‘నేను ఏడాది కిందట సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులపై ఇప్పుడు కొందరి మనోభావాలు హఠాత్తుగా దెబ్బతినడం ఏమిటో అర్థం కావడం లేదు. పత్రికల్లో ప్రచురించే కార్టూన్ల మాది­రిగానే నేను కూడా కొన్ని పోస్టులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశా. పత్రికలకు ఉన్నట్టే వ్యక్తులకు కూడా కాస్త భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించవచ్చు. ఆ పోస్టులు పెట్టినప్పుడు.. అంటే ఏడాది కిందట ఎవరూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయనూ లేదు. ఆ పోస్టుల్లో నేను పేర్కొన్నవారు కూడా కనీసం అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయనేలేదు.

కానీ హఠాత్తుగా ఏడాది తరువాత.. అదీ ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతా­ల్లోని వ్యక్తులకు ఒకేసారి మనోభావాలు దెబ్బతినడం ఏమిటో..! వాళ్లు ఒకేసారి వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయడం ఏమిటో..! పోలీసులు వెంటనే కేసులు పెట్ట­డం ఏమిటో..! దీన్నిబట్టి ఈ ఫిర్యాదులు, కేసుల వెనుక ఏం జరిగిందన్నదీ.. ఎంత పక్కా స్క్రిప్ట్‌ ఉందన్నదీ స్పష్టం అవుతునే ఉంది..’ అని సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నా­రు. ఆయన ఆదివారం వివిధ టీవీ చానళ్ల డిబేట్లలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement