జూన్ 4న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: వేణు(నటుడు), ప్రియమణి (నటి)
ఈ రోజు పుట్టినవారి సంఖ్య 9 అవుతుంది. ఇప్పటికే స్థాపించిన సంస్థలు, ఉన్న ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పురోభివృద్ధి సాధిస్తారు. రియల్ ఎస్టేట్, గనులు, వ్యవసాయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. లేదా ఉన్నవాటినే అభివృద్ధి చేస్తారు.
యూనిఫామ్ వేసుకునేవారు తమ ఉద్యోగాలలో ప్రతిభ చూపడం వలన మంచి గుర్తింపు వస్తుంది. మంచి ఆరోగ్యంగా ఉంటారు. పాత రుగ్మతలు తొలగిపోతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. పోలీసు, కోర్టు కేసులు, తోటివారితో వైరాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆచితూచి వ్యవహరించడం మంచిది. లక్కీ నెం: 1, 3, 4, 6, 9 లక్కీ డే: ఆది, గురు, మంగళ వారాలు.
లక్కీ కలర్స్: ఊదా, ఎరుపు, నారింజ, నీలం, వంకాయ రంగులు. సూచన: రక్తదానం చేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుదర్శన హోమం చేయించుకోవడం లేదా దగ్గరలోని ప్రసిద్ధ దేవాలయాలను, దర్గాలను, చర్చిలను దర్శించడం, అన్నదానం చేయడం, సోదరులతో సామరస్యంగా ఉండటం శ్రేష్టం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్ సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు