Venu (actor)
-
వేణు దగ్గర రూ.450 కోట్లు కొట్టేశాడు.. సీఎం రమేష్ పై చీటింగ్ కేసు
-
ఈ సినిమా వల్ల నా భార్య పడ్డ కష్టం...
-
బలగం సినిమాపై దిల్ రాజు పోలీస్ కంప్లైంట్..
-
ఓటీటీకి బలగం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించిన సినిమా 'బలగం'. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 3న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబట్టింది. (ఇది చదవండి: బలగం తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అలా పిలవట్లేదు: వేణు) చిత్రబృందం ఊహించిన దానికంటే ఎక్కవ గానే ప్రేక్షకాదరణ లభించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు మేకర్స్. ఈనెల 24 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై వీక్షించవచ్చని చిత్రబృందం ప్రకటించింది. -
అతనిలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడు: దిల్ రాజు
‘‘కథ విన్నప్పుడే ‘బలగం’ మంచి సినిమా అవుతుందని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలతో పాటు మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్‌పై హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను గ్రహించి వేణు కథ చెప్పినప్పుడు అతనిలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడని గ్రహించాను. అనుకున్న దానికంటే బడ్జెట్ కాస్త ఎక్కువే అయినా ‘బలగం’ మాకు ప్రాఫిటబుల్ వెంచర్. ఇదే బ్యానర్లో వేణుతో మరో సినిమా చేయనున్నాం. ఓ డ్యాన్స్ మాస్టర్‌ను హీరోగా, ఓ సింగర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ శశి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా ప్లాన్ చేశాం’’ అన్నారు దిల్ రాజు. -
అందుకే ఇంతకాలం నటనకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
నటుడు వేణు తొట్టెంపూడి గుర్తున్నాడు కదా.. ‘స్వయంవరం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత చిరు నవ్వుతో, గోపి గోపిక.. గోదావరి వంటి చిత్రాల్లో లీడ్ రోల్ పోషించిన ఆయన.. తనదైన శైలిలో ఫిలాసఫి డైలాగ్‌లు చెబుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా వంటి సినిమాల్లో సహానటుడిగా కామెడీ పండిస్తూ ప్రేక్షకలును ఆకట్టుకున్నాడు. అలా హీరోగా, కమెడియన్‌గా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు. చదవండి: ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్ అప్పారావు చివరిగా దమ్ము, రామాచారి చిత్రాల్లో కనిపించిన ఆయన ఆకస్మాత్తుగా తెరపై కనుమరుగయ్యాడు. దాదాపు పదేళ్ల తర్వాత వేణు రవితేజ రామారావు ఆన్‌డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. నిన్న(జులై 6న) ఈ మూవీలోని వేణు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అతడు సీఐ మురళిగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో వేణు సోషల్ మీడియా వేదికగా ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రామారావు ఆన్‌డ్యూటీ మేకర్స్ ఎస్ఎల్వీ సినిమాస్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘చాలా కాలం తర్వాత మళ్లీ నటించడం ఎలా ఉందిని అనే ప్రశ్నకు.. తానేప్పుడు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నాడు. ‘చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నా. మళ్లీ ఇంతకాలానికి రామారావు ఆన్‌డ్యూటీతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను సీఐ మురళిగా కనిపిస్తాను. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైన విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం రామారావు ఆన్‌డ్యూటీతో పాటు పారా హుషార్ అనే మరో సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్ ‘అయితే మొదట ఈ మూవీలో నటించమని దర్శకుడు శరత్ మండవ చాలాసార్లు ఫోన్ చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. అసలు నటించనని చెప్పాను. మీరు ఈ సినిమాలో నటించకపోయిన పర్వాలేదు. కానీ ఓసారి కలుద్దాం’ అని శరత్ మెసేజ్ చేశారు. దీంతో ఓసారి మీట్ అయ్యాం. ఆ ముచ్చట్లలో భాగంగా ఈ చిత్రంలోని మీ పాత్రను ఇలా అనుకుంటున్నా. మీకు నమ్మకం ఉంటే చేయండి అన్నారు. నాకూ ఆ పాత్ర నచ్చింది. రెండు మూడుసార్లు శరత్‌తో నా పాత్రపై చర్చించి ఒకే చేశాను. అంతకుముందు కూడా పలు కథలు విన్నాను. కానీ, అనుకోకుండా ఇది ఫైనల్ అయ్యింది’ అని వేణు తెలిపాడు. View this post on Instagram A post shared by SLV Cinemas (@slv_cinemas) -
కోమాలో బుల్లితెర నటుడు
Venu Arvind: ప్రముఖ బుల్లితెర నటుడు వేణు అరవింద్ ఆస్పత్రిలో కోమా స్థితిలో వున్నట్లు వైద్యులు తెలిపారు. టీవీ సీరియల్ నటుడు వేణు అరవింద్. కొన్ని సినిమాల్లో నటించిన ఈయన శభాష్ సరియాన పోటీ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే వేణు అరవింద్ సినిమాలకంటే బుల్లితెరలోనే పాపులర్ అయ్యారు. కాగా ఆయన ఇటీవల కరోనా బారిన పడి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే కరోనా నుంచి బయటపడ్డ ఆయనకు మెదడులో గడ్డ ఉండడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం వేణు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. -
పేదల ఆకలి తీరుద్దాం: వేణు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ నేపథ్యంలో సినీ హీరో వేణు, కాకతీయ ఇన్ ఫ్రా ఎండీ సీబీఐ వాసు తమ మిత్రబృందంతో కలిసి ప్రతీ రోజు 500 మంది పేదల ఆకలి తీరుస్తున్నారు. కాకతీయ ఇన్ ఫ్రా, వాసు గ్రూప్ ఆధ్యర్యంలో ఏర్పడిన మిత్ర బృందం నగరంలోని మాదాపూర్, గచ్చిబౌళి, కొండాపూర్ ప్రాంతాల్లో ప్రతిరోజు ఆహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాంబార్ రైస్, పెరుగన్నం, కోడిగుడ్డు, వాటర్ బాటిల్‌తో కూడిన పొట్లాలను స్వయంగా అందిస్తున్నారు. కేవలం పేదలకే కాకుండా పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవలు అందిస్తున్న వారికి కూడా ఆహార పొట్లాలు, మంచినీళ్లు, మజ్జిగ ఉచితంగా సరఫరా చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కూడా చేరుకోలేని చోటుకి సహాయం అందాల్సిన అవసరం ఉందని వేణు అభిప్రాయపడ్డారు. అలాగే దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, హమాలీలు, షాపులు, హోటల్లో పనిచేసే వారు, తోపుడుబండ్లు నిర్వహించే వారు ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన సామాజిక బాధ్యత అందరిపై ఉందని కాకతీయ ఇన్ఫ్రా ఎండీ వాసు అన్నారు. బంజారాహిల్స్ పోలీసులకు శానిటైజర్లు అందిస్తున్న సినీ హీరో శ్రీకాంత్ పోలీసుల సేవలు విలువైనవి ఇంతటి కఠిన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు ఎంతో విలువైనవని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఆయన శానిటైజర్లు, మాస్క్‌లు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పోలీసుల సేవలకు తన వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఏసీపీ కే.ఎస్.రావు, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు పాల్గొన్నారు. -
సైకిల్ తొక్కిన హీరో వేణు
సాక్షి, ఖమ్మంఅర్బన్: నగరంలోని 8వ డివిజన్లోని గొల్లగూడెం, గోపాలపురం, ఎల్బీనగర్ పరిసరాల్లో సోమవారం సినీ హీరో టి.వేణు ఖమ్మం మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం సాగించారు. ప్రచారంలో సైకిల్ తొక్కుతూ, చిన్న పిల్లలను ఎత్తుకొని లాలిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి హరికృష్ణ, కాంగ్రెస్ నాయకులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
నామా కోసం వేణు..
సాక్షి, ఖమ్మం అర్బన్: సినీనటుడు తొట్టెంపూడి వేణు సోమవారం ఎన్నికల ప్రచారానికి వచ్చారు. తన బంధువు ఖమ్మం కూటమి(టీడీపీ) అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం నగరంలోని 27, 49వ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. స్థానికులు, కూటమి కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. -
జూన్ 4న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: వేణు(నటుడు), ప్రియమణి (నటి) ఈ రోజు పుట్టినవారి సంఖ్య 9 అవుతుంది. ఇప్పటికే స్థాపించిన సంస్థలు, ఉన్న ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పురోభివృద్ధి సాధిస్తారు. రియల్ ఎస్టేట్, గనులు, వ్యవసాయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. లేదా ఉన్నవాటినే అభివృద్ధి చేస్తారు. యూనిఫామ్ వేసుకునేవారు తమ ఉద్యోగాలలో ప్రతిభ చూపడం వలన మంచి గుర్తింపు వస్తుంది. మంచి ఆరోగ్యంగా ఉంటారు. పాత రుగ్మతలు తొలగిపోతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. పోలీసు, కోర్టు కేసులు, తోటివారితో వైరాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆచితూచి వ్యవహరించడం మంచిది. లక్కీ నెం: 1, 3, 4, 6, 9 లక్కీ డే: ఆది, గురు, మంగళ వారాలు. లక్కీ కలర్స్: ఊదా, ఎరుపు, నారింజ, నీలం, వంకాయ రంగులు. సూచన: రక్తదానం చేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుదర్శన హోమం చేయించుకోవడం లేదా దగ్గరలోని ప్రసిద్ధ దేవాలయాలను, దర్గాలను, చర్చిలను దర్శించడం, అన్నదానం చేయడం, సోదరులతో సామరస్యంగా ఉండటం శ్రేష్టం. - డాక్టర్ మహమ్మద్ దావూద్ సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు