‘‘కథ విన్నప్పుడే ‘బలగం’ మంచి సినిమా అవుతుందని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలతో పాటు మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్‌పై హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను గ్రహించి వేణు కథ చెప్పినప్పుడు అతనిలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడని గ్రహించాను. అనుకున్న దానికంటే బడ్జెట్ కాస్త ఎక్కువే అయినా ‘బలగం’ మాకు ప్రాఫిటబుల్ వెంచర్. ఇదే బ్యానర్‌లో వేణుతో మరో సినిమా చేయనున్నాం. ఓ డ్యాన్స్ మాస్టర్‌ను హీరోగా, ఓ సింగర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ శశి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా ప్లాన్ చేశాం’’ అన్నారు దిల్ రాజు.
Comments
Please login to add a commentAdd a comment