సైకిల్ తొక్కుతూ ప్రచారం చేస్తున్న వేణు
సాక్షి, ఖమ్మంఅర్బన్: నగరంలోని 8వ డివిజన్‌లోని గొల్లగూడెం, గోపాలపురం, ఎల్‌బీనగర్ పరిసరాల్లో సోమవారం సినీ హీరో టి.వేణు ఖమ్మం మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం సాగించారు. ప్రచారంలో సైకిల్ తొక్కుతూ, చిన్న పిల్లలను ఎత్తుకొని లాలిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి హరికృష్ణ, కాంగ్రెస్ నాయకులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment