Nama Nageshwara Rao
-
‘ఎన్టీఆర్కే ఒడిదుడుకులు తప్పలేదు.. మనమెంత?’
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. ఖమ్మం తరఫున నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత మరోసారి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ముఖ్యనేతల భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్ స్వయంగా ఈ పేర్లను ప్రకటించారు. ‘‘వచ్చే ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం. ప్రభుత్వానికి ప్రతిపక్షం రుచి చూపిస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు. కేడర్ కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పని చేయాలి.. ..దళితబంధు ఎన్నికల కోసం తేలేదు. ఒక విజన్ కోసం తెచ్చాను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. పార్టీని వీడి వెళ్ళే నేతలతో మనకు ఏం నష్టం లేదు. ఎన్టీఆర్కే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదు. మనమెంత!. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఒడిపోయింది. తిరిగి మళ్లీ పుంజుకుంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు వస్తాయి తట్టుకోవాలి. మనకు గ్రౌండ్ లో పరిస్థితి అనుకూలంగా ఉంది. నేతలు కలిసికట్టుగా పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావటం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది.. .. మనం ప్రజలకు చేయాల్సింది చేశాం. అయినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ప్రజలకు మన విలువ తెలుస్తుంది. రాబోయే రోజులు మనవే. ప్రభుత్వానికి పై వ్యతిరేకత అంశాలు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుంది. వచ్చే రోజుల్లో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. కరీంనగర్ సభ తర్వాత ఖమ్మం లో మరో బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం. ఒక్కో నియోజక వర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు నియమించుకుందాం’’ అని ఆ సమీక్షలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక.. ఖమ్మం,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జ్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలను నియమిస్తున్నట్లు తెలిపారాయన. మొత్తం నాలుగుసార్లు ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన నామా.. రెండుసార్లు నెగ్గారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మీద గెలిచారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) తరఫున పోటీ చేసిన నామా.. మళ్లీ రేణుకా చౌదరిపైనే నెగ్గడం విశేషం. ఇదిలా ఉంటే.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవచ్చని.. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో నామా పేరును స్వయంగా కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. అలాగే.. మహబూబాబాద్ నుంచి కూడా సిట్టింగ్ అభ్యర్థికే టికెట్ కేటాయించింది పార్టీ. మరోవైపు నిన్న కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థుల విషయంలోనూ కేసీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. కరీంనగర్ నుంచి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే.. అధికారికంగా వీళ్ల పేర్లను పార్టీ ప్రకటించాల్సి ఉంటుంది. -
నామాపై చీమలపాడు గ్రామస్తుల ఆగ్రహం
సాక్షి, ఖమ్మం: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ ఆర్భాటంలో.. గ్యాస్ సిలిండర్లు పేలి ముగ్గురు మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంపై చీమలపాడు గ్రామస్తుల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. తమ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ప్రమాదానికి కారకుడయ్యాడంటూ ఎంపీ నామా నాగేశ్వరరావుపై మండిపడుతున్నారు వాళ్లు. బాణాసంచా కాలుస్తూ ర్యాలీగా రావడమే కాకుండా.. ప్రమాదంతో తమకు సంబంధం లేదని ప్రకటించడంపై రగిలిపోతున్నారు. బాణాసంచా కాల్చింది బీఆర్ఎస్ శ్రేణులు, నామా వర్గీయులు కాదా అని చీమలపాడు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ‘‘భారీ పేలుడుతో శబ్దం రావడంతో ఒక్కసారిగా అంత ఉలిక్కిపడి భయాందోళలనకు గురయ్యాం. పేలుడు దాటికి ఆరుగురికి పైగా కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. నామా చెప్తున్నట్లు కాకుండా.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభకు 100 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న చీమలపాడు గ్రామస్తులు నిరసనలకు దిగారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చీమలపాడు బాధితులకు పరిహారం ప్రకటించింది. ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2లక్షల ఆర్థిక సాయంతో పాటు వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరించనున్నట్లు తెలిపారు. అయితే చీమలపాడు గ్రామస్తులు మాత్రం.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో తమ గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అంతకుముందు.. చీమలపాడు ఘటన దురదృష్టకరమన్నారు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఇలా జరగడం చాలా బాధగా ఉందని మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకి 200 మీటర్ల దూరంలో ఒక సిలిండర్ పేలింది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి వెళ్లడంతో గాయపడ్డారు. ఆ సమయంలో మేం స్టేజీ మీద ఉన్నాం. ఆరుగురు గాయపడ్డారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు వేరే ఆస్పత్రిలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురికి కాళ్లు తెగాయి. ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఆస్పత్రిలో చేర్పించినవారికి చికిత్స అందిస్తున్నట్టుగా డాక్టర్లు చెప్పారు. ఒకరికి మాత్రం సీరియస్‌గా ఉందన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలిన చెప్పాను. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరం. గుడిసెలో ఉండే గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులను తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటాం. సిలిండర్ పేలడానికి, మా మీటింగ్‌కు సంబంధం లేదు. 200 మీటర్ల దూరంలో ఘటన జరిగింది. అలా అని తాము పట్టించుకోమని కాదు అని నామా మీడియాతో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో సిలిండర్ పేలి ఘోర ప్రమాదం సంభవించింది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతలు చీమలపాడుకు విచ్చేశారు. పార్టీ నేతల రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలో మంటల చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు గుడిసె వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో.. గుడిసెలో ఉన్న సిలిండర్‌ను వాళ్లు గమనించలేదు. అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడినవారిని పోలీసు వాహనాల్లోనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడుతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక, ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాన్ని నిలిపివేశారు. మరో వైపు ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యమందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్య నేతలకు సూచించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చీమలపాడు ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందటం లేదని క్షతగాత్రుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో పట్టించుకునే వారు దిక్కులేరని. వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ముగ్గురు చనిపోయారని, ఆలస్యం చేస్తే మరో ముగ్గురు కూడా చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరోవైపు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్,బిజెపి నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు పోలీసులు. -
తెలంగాణకు గుడ్ న్యూస్.. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు.. కేంద్రమంత్రి సమాధానమిస్తూ దేశంలో 12వేలకుపైగా దేశంలో ఫార్మా సంస్థలున్నాయని వివరించారు. పీఎల్ఐ పథకంలో భాగంగా 2020–21 నుంచి 2024–25 మధ్య దేశంలో మూడు చోట్ల బల్క్ డ్రగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క పార్కుకు రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్కులకు ఆమోదం తెలిపామన్నారు. ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్‌కు రూ.584.04 కోట్లు దేశంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్‌కు 2021–22లో గత నవంబర్ 28 నాటికి రూ.584.04 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మిషన్‌కు రూ.4,176.84 కోట్లు కేటాయించినట్లు ఎంపీ నామా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.102.91 కోట్లు కేటాయించామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏపీలో 43137 మంది, తెలంగాణలో 32854 మంది ఆశా వర్కర్లు ఉన్నారని టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ఇదీ చదవండి: బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష -
మంత్రి, ఎమ్మెల్యేకే ఫ్లెక్సీలు కడతారా?
కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రకు అధికారులు ఆహ్వానం అందించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలుకావలసి ఉండగా, పదిన్నర సమయాన హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీ, ఎంపీలు రిజర్వాయర్ వద్దకు వచ్చారు. అప్పటికింకా ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి చేరుకోలేదు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధు.. ఎమ్మెల్యే ఎక్కడి వరకు వచ్చారంటూ ఆరాతీయగా మార్గమధ్యలో ఉన్నారని డీఎఫ్‌వో ఆంజనేయస్వామి బదులిచ్చారు. సమయపాలన లేకుంటే ఎలా? అంటూ ఎమ్మెల్సీ ఒకింత అసహనానికి గురవుతూనే, పక్కనే ఉన్న ఫ్లెక్సీలలో.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌతమ్ ఫొటోలతో మూడు ఫ్లెక్సీలను గమనించారు. దీంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా ఉండాలి.. పనికిమాలిన పనులు చేయొద్దు. మీరు గవర్నమెంట్ అధికారి కాబట్టి ఎవరికీ ఊడిగం చేయొద్దు.. అందరికీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు? ఎమ్మెల్యే, మంత్రికే ఫ్లెక్సీలే ఎందుకు పెట్టారు.. గవర్నమెంట్ మీకు చెప్పిందా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి నుండి ఎంపీలు, ఎమ్మెల్సీ ఖమ్మం వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రిజర్వాయర్‌లో చేపపిల్లలను విడుదల చేశారు. అంతకుముందు జరిగిన ఘటనపై అధికారులను మందలించడమే కాక ప్రొటోకాల్ పాటించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. కాగా, కార్యక్రమం ముగిశాక ఎంపీ, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు -
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామాకు చెందిన రూ.96 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధుకాన్ సంస్థల 105 స్థిర, చరాస్తులను జప్తు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ కేసులో ఆస్తులను జప్తు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగాల్లో కూడా రూ.88.85 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. చదవండి: (హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్యాబ్‌లు, ఆటోలు!) -
ఎన్టీఆర్ శతజయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రాజకీయ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, టాలీవుడ్ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్ఘాట్ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలుగు గడ్డ తరపున నందమూరి తారక రామారావు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో మే 28 -2022 నుంచి మే 28 -2023 వరకు ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెం పై ముద్రణ చేసే విధంగా అర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా.. నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరిస్తాం అని పేర్కొన్నారామె. ఆపై టీఆర్ఎస్ నాయకులు- మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నామా నాగేశ్వరరావులు నివాళులు అర్పించి.. భారతరత్న డిమాండ్ వినిపించారు. ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. ప్రధాని మంత్రి కావాల్సిన అర్హతలున్న వ్యక్తి. కానీ, కాస్తలో అది జరగలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ వినిపించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అదృష్టం. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనకు తారాస్థాయిలో అభిమానులు ఉన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని నామ నాగేశ్వరావు అన్నారు. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. మహా నాయకుడి స్ఫూర్తిని తీసుకోని సీఎం కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు అందులో భాగమే. నా వివాహానికి వచ్చారు.. నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు. -
ఈడీనే బురిడీ కొట్టిద్దామని..
సాక్షి, హైదరాబాద్: ఎన్‌హెచ్–33 పనుల కోసం తీసుకున్న రుణంలో కొంత భాగం పక్కదారి పట్టించిన కేసులో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావుకు చెందిన మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులనే బురిడీ కొట్టించాలని చూసింది. తమ కాంట్రాక్టును పూర్తి చేయడానికి సబ్ కాంట్రాక్టుల సాయం తీసుకొని వాళ్లకు డబ్బులు చెల్లించామని కొన్ని లేఖలు ఈడీకి అందించింది. అలా సబ్ కాంట్రాక్టులు ఇచ్చామని చెప్పిన సంస్థల్లో ఓ ఉత్తరప్రదేశ్ కంపెనీ యజమానిని ఈడీ అధికారులు పిలిచి లేఖలు చూపించగా అవన్నీ నకిలీవని తేలింది. దీనిపై ఆ సంస్థ యజమాని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మధుకాన్ కంపెనీస్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రూ.1,151 కోట్ల రుణం తీసుకొని.. జార్ఖండ్‌లో రాంచీ–రార్‌గావ్–జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి–33 పనులను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ) పద్ధతిలో దీన్ని వశం చేసుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు రుణంగా పొందింది. మధుకాన్ తీసుకున్న రుణం నుంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం జార్ఖండ్ హైకోర్టుకు చేరడంతో దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ కేంద్రంగా పని చేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)ను ఆదేశించింది. ఈ శాఖ దర్యాప్తులో రూ.264.01 కోట్లను మధుకాన్ సంస్థ పక్కదారి పట్టించినట్లు తేలింది. దీంతో బ్యాంకు కన్సార్టియం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న కె. శ్రీనివాసరావు, ఎన్. సీతయ్య, ఎన్. పృథ్వీతేజను నిందితులుగా పేర్కొంటూ 2019లో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఆ తర్వాతి ఏడాది న్యాయస్థానంలో అభియోగపత్రాలను దాఖలు చేసింది. మనీల్యాండరింగ్ జరిగినట్టు గుర్తించి.. సీబీఐ అభియోగపత్రాల ఆధారంగా ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. గతేడాది జూన్‌లో నామా నివాసం, కంపెనీల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్రావు ఇల్లు, రోడ్ నం.36లో ఉన్న మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లు కలిపి 6 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణకు హాజరైన పలువురు మధుకాన్, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే సంస్థల ప్రతినిధులు నిధుల చెల్లింపు విషయమై కొన్ని పత్రాలను ఈడీ అధికారులకు సమర్పించారు. రోడ్ కాంట్రాక్టు పూర్తి చేయడానికి చాలా సబ్ కాంట్రాక్టుల సాయం తీసుకున్నామని, వారికి చెల్లింపులు జరిపామని వాటిలో పేర్కొన్నారు. సబ్ కాంట్రాక్టర్లు చెల్లింపులు జరిగినట్లు ఇచ్చిన లేఖలను ఈడీ అధికారులకు అందించారు. ఆ లేఖల ఆధారంగా సబ్ కాంట్రాక్టర్లను ఈడీ అధికారులు పిలిచి విచారించారు. మధుకాన్ వద్ద రాంచీ–రార్‌గావ్–జంషెడ్పూర్ జాతీయ రహదారి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థల్లో ఉత్తరప్రదేశ్‌లోని మధుపూర్‌కు చెందిన డీఆర్ విజన్స్ ఒకటి. సదరు ఎక్స్‌ప్రెస్ వేలో 114 కిలోమీటర్ నుంచి 277 కిలోమీటర్ వరకు ఎర్త్‌వర్క్‌ను ఈ సంస్థ నిర్వర్తించింది. దీంతో ఈడీ ఇటీవల బీఆర్ విజన్స్ యజమాని రామ్‌సాయి సింగ్‌ను విచారణకు పిలిచింది. ఆ లేఖలను చూసి అవాక్కయిన ఆయన ఆ లేఖలతో తనకు కానీ, తమ ప్రతినిధులకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ రెండు లేఖల ద్వారా మధుకాన్ సంస్థ బ్యాంకులతో పాటు ఇతర సంస్థలకు రూ.18 కోట్లు నష్టం వాటిల్లేలా వ్యవహరించిందని చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. ప్రాథమిక పరిశీలన తర్వాత మధుకాన్ సంస్థపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కొన్ని ఆ«ధారాలు సేకరించాక మధుకాన్ సంస్థతో పాటు బాధ్యులకు నోటీసులు జారీ చేయనున్నారు. -
‘తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తాం’
న్యూఢిల్లీ: పార్లమెంట్లో జరిగే వర్షాకాల సమావేశంలో తెలంగాణ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతామని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎంపీ నాగేశ్వర్ రావు తెలిపారు. కాగా, ఆదివారం పార్లమెంట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. అదేవిధంగా, 48 గంటల ముందే బిల్లుల వివరాలను సభకు తెలపాలని కోరినట్టు నాగేశ్వర్రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తామని వివరించారు. -
నామా కేసులో ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: ఈడీ దాడుల నేపథ్యంలో రక్షణ కల్పించాలంటూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, సోదరుడు సీతయ్యలు దాఖలు చేసిన పిటిషన్లలో ఈడీ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నామా పిటిషన్‌ను బుధవారం జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాడుల నుంచి రక్షణ కల్పించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది పరమాత్మ సింగ్ కోరారు. ఇదే అంశానికి సంబంధించి నీలేశ్ పారేఖ్ కేసుతో ఈ పిటిషన్ జత చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. చదవండి: ఈడీ విచారణకు హాజరుకాని ఎంపీ నామా -
నేడు ఈ డీ విచారణకు హాజరుకానున్న ఎంపీ నామా
-
‘మధుకాన్’లో నేను డైరెక్టర్ కాదు: సోదాలపై ఎంపీ నామా వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా మా నాయకుడు కేసీఆర్, ప్రజల వెంట నడుస్తా. నేను నిజాయితీతో ఉంటా. ప్రజాసేవ కోసం రాజ్యాంగం చూపిన బాటలో ముందుకెళ్తున్నా’ అని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఇటీవల నామాపై ఈడీ విచారణ వార్తల నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నామా మీడియాతో మాట్లాడారు. తన బలం సీఎం కేసీఆర్ అని, బలగం ఖమ్మం ప్రజలని, రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న తాను మధుకాన్ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. 40 ఏళ్ల క్రితం తాను స్థాపించిన మధుకాన్ గ్రూప్ గోల్డెన్ క్వాడ్రిలేటర్ ట్రయాంగిల్ పనుల్లో 7 శాతం రోడ్లు, కొంకణ్ రైల్వేస్ పనుల్లో 6 శాతం పూర్తి చేసిందన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులు కలుపుకుని సుమారు 8 వేల కి.మీ. మేర నిర్మించిందన్నారు. ప్రజాజీవితంలోకి రావడంతో 2004-2009 మధ్య సంస్థలో అన్ని బాధ్యతల నుంచి తప్పుకుని సోదరులకు అప్పగించినట్లు చెప్పారు. ట్రిబ్యునల్ ముందు వివాదం... రాంచీ-జంషెడ్పూర్ మార్గంలో నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ కంపెనీని 2011లో ఏర్పాటు చేసినట్లు నామా చెప్పారు. బీఓటీ పద్ధతిలో 30% ఈక్విటీ, 70% రుణంతో ప్రాజెక్టు ప్రారంభమగా మధుకాన్ తన వంతు వాటా రూ. 463 కోట్లకు బదులు రూ.485 కోట్లను ఎస్క్రో ఖాతాకు చెల్లించిందన్నారు. రూ.1,190 కోట్ల వాటా చెల్లించిన బ్యాంకు 2011 నుంచి ఇప్పటివరకు రూ.778 కోట్లు వడ్డీగా తీసుకుందన్నారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలం అప్పగించకపోవడంతో పనులు సకాలంలో పూర్తి కాలేదని, ఆ తర్వాత నేషనల్ హైవే అథారిటీ నిధులు విడుదలకు ముందుకొచ్చినా తర్వాత వెనక్కి వెళ్లిందన్నారు. ప్రస్తుతం ఈ వివాదం ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ముందు నడుస్తోందన్నారు. -
ఎన్ని ఇబ్బందులు వచ్చిన కేసీఆర్ వెంటే ఉంటా : నామా నాగేశ్వర్ రావు
-
టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు
-
టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసుకు సంబంధించిన ఈడీ నామాకు సమన్లు జారీ చేసింది. మధుకాన్ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల ఈడీ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. సోదాల్లో హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు, రూ.లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. చదవండి: నామాకు బిగుస్తున్న ఉచ్చు.. త్వరలోనే భారీ షాక్ -
ఎంపీ నామా ఇంటిపై ఈడీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు నివాసం, కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్రావు ఇల్లు, రోడ్ నం.36లో ఉన్న మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లు కలిపి ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. జార్ఖండ్‌లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. ఈ అంశంపై 2019లోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా తనిఖీలు నిర్వహించింది. ఏమిటీ కేసు? 2011లో జార్ఖండ్‌లో రాంచీ– రార్‌గావ్– జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే–33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. మధుకాన్ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. తర్వాత మధుకాన్ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది. ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని, నిధులు పక్కదారి పట్టాయని పేర్కొంది. ఆ సమయంలో రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే డైరెక్టర్లుగా ఉన్న కె.శ్రీనివాసరావు, ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వితేజ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. -
Hyderabad: టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు
-
టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంటిపై ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు నివాసం, కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్రావు ఇల్లు, రోడ్ నం.36లో ఉన్న మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లు కలిపి ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. జార్ఖండ్‌లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. ఈ అంశంపై 2019లోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా తనిఖీలు నిర్వహించింది. ఏమిటీ కేసు? 2011లో జార్ఖండ్‌లో రాంచీ– రార్‌గావ్– జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే–33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. మధుకాన్ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. తర్వాత మధుకాన్ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది. ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని, నిధులు పక్కదారి పట్టాయని పేర్కొంది. ఆ సమయంలో రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే డైరెక్టర్లుగా ఉన్న కె.శ్రీనివాసరావు, ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వితేజ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. చదవండి: నేడు ఈటల రాజీనామా.. బీజేపీలోకి రాథోడ్ -
ఆధిపత్య పోరు.. కారు పార్టీలో కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలు షర వేగంగా మారుతున్నాయి. ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లా టీఆర్ఎస్లోనే కాకుండా రాష్ట వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. పార్టీ అధిష్టానం సైతం పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమచారం. తన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా ప్రతినిధులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థి వర్గాన్ని ఉద్దేశించి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదని, తాను ప్రజాప్రతినిధి నీ కాదని ఎవరి పర్మిషన్ తీసుకోని రావాల్సిన అవసరం నాకు లేదనీ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. (సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి) ఇలాంటి సమయంలో హడావుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపెట మండలం గండుగుల పల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామ నాగేశ్వర్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హుటాహుటిన భేటీ కావడం పార్టీలో మరో చర్చ కు తెరలేపింది. అసలు ఖమ్మం టీఆర్ఎస్లో ఏం జరుగుతుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. స్థానిక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు తుమ్మలతో భేటీ అయ్యారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు తొలి నుంచి వివాదంగా మారిన విషయం తెలిసిందే. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఆ మధ్య తుమ్మల చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. మరోవైపు పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మలపై పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డికి తాను అండగా ఉంటానంటూ మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. పదవులు ఎవరి సొత్తు కాదు.. ‘కొందరు మూడేళ్లు, కొందరు నాలుగేళ్లు.. మరికొందరు ఐదేళ్లు.. మంచిగా పరిపాలిస్తే తిరిగి పదవి దక్కుతుంది. అంతే తప్ప పదవులు ఎవడబ్బ సొత్తు కాదు’అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలే మన సొత్తు అని ప్రజల అభిమానమే నాకు పెద్ద పదవి అని ఆయన వివరించారు. ఆదివారం మండలంలోని జయలక్ష్మిపురం, చిన్నమల్లెల, కుంచపర్తి గ్రామాల్లో పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. పలు కార్యక్రమాల్లో ఒకే పార్టీలో ఉంటూ కక్ష సాధిస్తున్నారని అభిమానులు పొంగులేటి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలు చేయడం సంస్కారం కాదని, నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని.. కష్టపెట్టిన వాడు ఒక్కడే వడ్డీతో సహా ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చేటప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగవని, పోయేటప్పుడు ఎక్కడా ఉన్నా పోతాయని, ప్రజాభిమానమే శాశ్వతమని చెప్పారు. అధికారం ఉంది కదా అని పొంగులేటి, దయానంద్, మువ్వా.. కార్యక్రమాలకు వెళ్లొద్దని ఎన్ని ఆంక్షలు పెట్టినా.. అభిమానం ఉన్న దగ్గరికే వస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. -
కేంద్రంతో ఇక బిగ్‌ఫైట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు కావొస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు విమర్శించారు. నదీ జల వివాదాలు, జీఎస్టీ పరిష్కారం, విద్యుత్ సంస్కరణలు తదితర అంశాలపై తమతో కలిసి వచ్చే పార్టీలతో పార్లమెంట్ లోపల, బయట నిరసన తెలియ జేస్తామని వెల్లడించారు. జీఎస్టీ పరిహారా నికి సంబంధించి పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తామన్నారు. ముఖ్యమంత్రితో టీఆర్ఎస్ ఎంపీల భేటీ అనంతరం ఆ వివరాలను గురువారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు, పార్టీ ఎంపీలతో కలసి కేకే మీడియాకు వెల్లడించారు. కేంద్రానికి ఇన్నాళ్లూ సహకరిస్తూ వచ్చామని, ఈ సమావేశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ రాజ్యాంగ పదవులను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ఆ పదవికి పోటీ చేయమని తనను కాంగ్రెస్ పార్టీ సంప్రదించిందని తెలిపారు. తెలంగాణ బిడ్డలైతే మాట్లాడాలి... రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్లో టీఆర్ఎస్ జరిపే పోరాటానికి రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కలిసి వస్తారో లేదో తేల్చుకోవాలని నామా సవాల్ చేశారు. రాష్ట్ర సమస్యలపై ఏడేళ్లుగా సీఎం కేంద్రానికి ఎన్నో ఉత్తరాలు రాశారని, ఇకపై కేంద్రాన్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించాలనే కేంద్రం ఆలోచనను బీజేపీ ఎంపీలు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ముఖం చాటేస్తున్న కేంద్రం... కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారంలో కేంద్రం ముఖం చాటేస్తోందని, దేశంలో 70వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నా.. 40వేల టీఎంసీల నీటినే వినియోగించుకునే స్థితిలో ఉన్నామని కేకే, నామా వివరించారు. రాష్ట్రానికి 10.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 8.79 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే విడుదల చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణల పేరిట ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను కేంద్రం చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. జాతీయ రహదారులు, నవోదయ పాఠశాలలు, టెక్స్టైల్ పార్కు, ఎయిర్‌స్ట్రిప్‌లకు అనుమతి విషయంలో కేంద్రం వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ పరిహారం, ఐజీఎస్టీ, బీఆర్జీఎఫ్ తదితరాల రూపంలో రాష్ట్రానికి 8,850 కోట్లు రావాల్సి ఉందని వెల్లడించారు. సీఎం దిశానిర్ధేశం... అంతకుముందు టీఆర్ఎస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ నెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వివరించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. -
బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊహించిన దాని కంటే భిన్నంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం కేంద్ర బడ్జెట్ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకంతో తెలంగాణ రైతులకు సహాయం చేస్తోందని తాజా ఆర్థిక సర్వే తెలిపిందని, కానీ బడ్జెట్లో ఆ పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని, విభజన హామీలకు బడ్జెట్లో కేటాయింపులు లేవని అన్నారు. దేశంలోనే గొప్ప ప్రాజెక్టైన కాళేశ్వరానికి కూడా నిధులు కేటాయించలేదని, ఇండస్ట్రీయల్ కారిడర్ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణకు ట్రైబల్ మ్యూజియం కేటాయించాలని కోరామన్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లె విధంగా బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు. గతంలో 18 శాతం వృద్ధి రేటు ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కేంద్ర విధానాల వల్ల వృద్ధి రేటు 9శాతానికి పడిపోయిందని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా తెలంగాణ దేశంలోనే మెదటి స్థానంలో ఉందని అన్నారు. మెదక్ ఎంపీ, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్లో తాము కోరిన 22 అంశాలకు కేటాయింపులు ఉంటాయని అనుకున్నామన్నారు. బడ్జెట్లో హర్ ఘర్ జల్ అన్నారని, తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ ముందే అమలు చేశారని తెలిపారు. రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి రైతుల కోసం పనిచేస్తున్నామనడం చోద్యంగా ఉందని అన్నారు. జాతీయ రహదారులు, ప్రాజెక్టుల అంశాలు మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణ నదీ ప్రాజెక్టులు, నీటి నిల్వలపై చేపల పెంపకం చేపట్టామని..ఆ కార్యక్రమం మంచిగా కొనసాగుతోందని అన్నారు. సాగర మిత్ర అనేది కేసీఆర్ ఎప్పుడో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని, పర్యాటక రంగానికి సంబంధించి నిధులు కేటాయించలేదని అన్నారు. విభజన హామీల ప్రస్తావనే లేదని, పాత సీసాలో కొత్త సారా పోసినట్టు బడ్జెట్ ఉందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. రాజ్యసభ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని, రైతులను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో జీఎస్టీ బకాయిల అంశం లేదని ,తెలంగాణలోని అనేక సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరామని, విభజన హామీల ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుందన్నారు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా పోరాడాలని కోరారు. చెవెళ్ల ఎంపీ, రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికే తెలంగాణ సంపద సృష్టిస్తోందని కేంద్రం చెప్పిందని, అన్ని రంగాల వారిగా వృద్ధి రేటులో తెలంగాణ ముందుందని అన్నారు. ప్రభుత్వం ఆర్ధిక మందగమనం నుంచి ఏ విధంగా బయట పడాలో ఆలోచన చేయడం లేదని, పక్క దేశాలు అవలంభిస్తున్న విధానాలు అవలంభించాలని తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలంటే చాలా డబ్బులు కావాలని, కేంద్రం లెక్కల గారడి చేస్తోందని విమర్శించారు. పథకాల అమలులో తెలంగాణ ముందుందని తెలిపారు. అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా సాధ్యమని, బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని రంజిత్ రెడ్డి అన్నారు. -
దేశంలో సీఏఏ వ్యతిరేకోద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని, స్వాతంత్రోద్యమం తరహాలో దేశంలో సీఏఏ వ్యతిరేకోద్యమం జరుగుతోందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం వీరు మాట్లాడారు. కేశవరావు మాట్లాడుతూ.. ‘అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ గురించి మా వైఖరిని మా సీఎం ఇప్పటికే వెల్లడించారు. రాష్ట్రం తరఫున సీఏఏను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేయాలనుకున్నాం. కేంద్ర చట్టం కాబట్టి ఎలా తీర్మానం చేస్తారని కొందరు అంటున్నారు. రాష్ట్రానికి ఆ హక్కు ఉంది. అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే చెప్పాం. పార్లమెంటు తెచ్చిన ఈ బిల్లును కోట్లాది మంది ప్రజలతోపాటు రాష్ట్రాలు కూడా చట్టసభల ద్వారా వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని పలువురు ఇతర రాష్ట్రాల మంత్రులు ప్రశంసించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో సీఏఏ, దేశ ఆర్థిక స్థితిగతులు, ఏపీ పునర్ వ్యవస్థీకరణ అంశాలపై చర్చకు అవకాశం కల్పించాలి’అని పేర్కొన్నారు. సీఏఏను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘సీఏఏ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడే మా నేత కేసీఆర్ నన్నూ, కేశవరావును పిలిచి సమగ్రంగా చర్చించారు. స్పష్టమైన మార్గదర్శనం చేశారు. దానికి అనుగుణంగానే మేం ఈ బిల్లును వ్యతిరేకించాం. దేశంలో ప్రజలు, రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయంటే దీనిని పున: సమీక్షించుకోవాలి. స్వాత్రంత్య్రోద్యమం తరహాలో ఇప్పుడు సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది’అని వివరించారు. -
‘అలా ఎందుకు జరుగుతోందో ఆలోచించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘పార్లమెంట్లో ఆమోదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రజలకు రోడ్లపైకి వస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)లను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి’ అని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు(కేకే) అన్నారు. గురువారం ఆయన టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ లైబ్రరీ హాల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. (చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది) సమావేశాననంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ ఆందోళనపై సభలో చర్చ జరగాలని సూచించామన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై ఏ ముఖ్యమంత్రి చెప్పనట్టుగా తమ అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. అసెంబ్లీలో తీర్మాణం కూడా చేస్తామని పేర్కొన్నారు. సీఏఏ బిల్లును గతంలోనే తమ పార్టీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. సీఏఏ అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటిగా కేంద్ర తీసుకుంటుందని, ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్దమని కేకే మండిపడ్డారు. విభజన హామీలపై ఒక రోజు మెత్తం పార్లమెంట్లో చర్చించాలని ప్రధాని మోదదీని కోరామని కేకే పేర్కొన్నారు. సీఏం కేసీఆర్ ఆనాడే చెప్పారు సీఏఏ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే చెప్పారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. సీఏఏను దేశ ప్రజలతో పాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయి ఆరు ఏండ్లు అయినా విభజన హామీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై సభలో చర్చించాలని అఖిపక్ష సమావేశంలో చెప్పినట్లు నామా పేర్కొన్నారు. -
కేంద్ర బడ్జెట్.. టీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముఖ్యమైనవి కాబట్టి.. వాటిపై అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించామని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల విజయంపై తాము సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఓ కీలక తీర్మాణం కూడా తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ, నీతి ఆయోగ్ నిధులు విడుదలపై పోరాడాలని నిర్ణయించుకున్నట్టు కేశవరావు పేర్కొన్నారు.(ఢిల్లీ పార్టీలు.. సిల్లీ పనులు) విభజన హామీలు ఆరేళ్లుగా అమలు చేయకుండా కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని కేశవరావు విమర్శించారు. వాటి అమలు కోసం కచ్చితంగా పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏపై ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారని గుర్తుచేశారు. జాతీయ గణనలో ఓబీసీని కూడా చేర్చాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. దేశ ఎకానమీ తగ్గుదలపై, సీఏఏ లాంటి అంశాలను పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావిస్తామని వెల్లడించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటోందని ఆయన ఆరోపించారు. రేపు(బుధవారం) అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ అంశాలను చేర్చాలని కోరుతామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 95శాతం విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దొరకడం తెలంగాణకు అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఎన్నో పథకాలు మిగతా రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో చాలా పెండింగ్ పనులు ఉన్నాయని.. వాటిని కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని.. ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు. -
దేశం మెచ్చిన సీఎం.. కేసీఆర్
సాక్షి, దమ్మపేట: రాష్ట్రంలో చేపట్టిన ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో భారతదేశం మొత్తం సీఎం కేసీఆర్‌ను శభాష్ అంటోందని.. ఒక ముఖ్యమంత్రికి ఇంతకన్నా కీర్తీ ఏముంటుందని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆర్లపెంట, లచ్చాపురం గ్రామాల్లో రూ.28 లక్షలతో నిర్మాణం చేసిన ఆరోగ్య ఉపకేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. దేశం అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికల ద్వారా గ్రామాల అభివృద్ధికి రూపొందించిన 30 రోజుల ప్రణాళిక విజయవంతం అయిందని చెప్పారు. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీతారామ పేరుతో చేపట్టిన శాశ్వత ప్రాజెక్టు నిర్మాణం అయితే ఉమ్మడి జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుం దని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని మాటల్లో చూపారని, తెలంగాణలో సీఎం కేసీఆర్ చేతల్లో చూపిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ...దమ్మపేట పూర్తి గిరిజన ప్రాం తం కావడంతో గిరిజనులంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించా రు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఎంపీపీ సోయం ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శిరీష, ఎంపీడీఓ రవికుమార్, పట్వారీగూడెం, దమ్మపేట వైద్యులు డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ శ్రీహర్ష, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, మాజీ ఎంపీపీలు అల్లం వెంకమ్మ, పానుగంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఖమ్మం గాంధీ చౌక్‌లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎంపీ నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఖమ్మంలోని తెరాస నేత వద్దిరాజు రవిచంద్ర నివాసంలో తేనీటి విందులో మంత్రులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తనకు రెండు కళ్లలాంటివని, ఆయా జిల్లాల అభివృద్ధి కోసం అందరి సహకారంతో నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఉద్ఘాటించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఖమ్మం చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు గురువారం ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్దార్ పటేల్ స్టేడియంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితకాలం రుణపడి ఉంటానని, అలాగే జిల్లా, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నారు. పేదల గుండెల్లో గూడు కట్టుకునే విధంగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగానే మంత్రిగా తన పనితీరు ఉంటుందే తప్ప దర్పం ప్రదర్శించడానికి తన పదవిని ఏనాడూ వినియోగించనని అన్నారు. అన్ని వర్గాలకు ఆత్మీయుడిగా ఉండటానికి పార్టీలోని పెద్దల ఆశీస్సులు, సహకారం, సహచరు లు, చిన్నవారి తోడ్పాటుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేం దుకు ప్రయత్నిస్తానన్నారు. రెండు జిల్లాల ప్రజల అవసరాలు, సమస్యలు, భౌగోళిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉందని, ఆ యా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో తాను పర్యటిస్తున్న సమయంలో ఎక్కడా ట్రాఫిక్ నిలుపుదల చేయవద్దని కోరారు. తన కాన్వాయ్, వాహనాలు ప్రజలకు ఆటంకం కాకూడదన్నారు. గిరిజనుల్లో గిరిజనుడిలా.. దళితుల్లో దళితుడిలా.. బహుజనుల్లో బహుజనుడిలా, మైనార్టీల్లో మైనార్టీలా ప్రయాణం చేశానని, వారంతా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. తనకు మంత్రి పదవి లభించడం ఖమ్మం ప్రజల చలవేనని, వారిని తాను ఎన్నడూ మర్చిపోనన్నారు. పార్టీ నాయకులకు తలలో నాలుకలా ఉంటానన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రాములునాయక్, హరిప్రియనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, టీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర, తెల్లం వెంకట్రావు, ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణ, టీఆర్ఎస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి ఎంపీ నామా ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూ.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అండగా ఉంటామని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారిగా ఖమ్మం వచ్చిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుజ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఎంపీ నామా మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి పార్టీలకతీతంగా ఎంతోమంది మహానుభావులు కేంద్ర, రాష్ట్రస్థాయిలో పదవులను అలంకరించారని గుర్తు చేశారు. చరిత్రలో తొలిసారి ఖమ్మం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, మంత్రి పదవిని పొందిన అజయ్‌కుమార్ అభివృద్ధి ప్రదాతగా పేరు తెచ్చుకుని చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. పువ్వాడ నాగేశ్వరరావు రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్న అజయ్ ప్రజలకు అదే స్థాయిలో సేవలు అందించాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పెద్దలు, చిన్నలను కలుపుకుని ముందుకు పోవాలన్నారు. అజయ్‌కుమార్‌కు శత్రువులు ఉండకూడదని, అంతా మిత్రులు కావాలని ఆకాంక్షించారు. జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాతగా మంత్రి పదవి దక్కిందని, ఇదే స్ఫూర్తితో ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా.. యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్న అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడంతోపాటు ఉమ్మడి జిల్లాను సమగ్రాభివృద్ధి చేసే అవకాశం పువ్వాడకు దక్కిందన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ ఇది పండుగ వాతావరణం అని.. జిల్లాకు మంత్రి పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉందన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న యువ నేత అజయ్‌కుమార్ తమ నియోజకవర్గంపై దృష్టి సారించాలని కాంక్షించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ సామాన్యుడిగా ప్రజల్లో పేరున్న అజయ్‌కుమార్ అజేయుడిగా నిలిచారని, రాబోయే కాలంలో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టాలని కాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఇల్లెందులో బస్సు డిపో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. మేయర్ పాపాలాల్ మాట్లాడుతూ ఇదొక చరిత్ర అని, ఖమ్మం ఖిల్లాపై పువ్వాడ ముద్ర పడనున్నదన్నారు. అనంతరం పువ్వాడ అజయ్‌కుమార్‌ను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పూజారులు ఆశీర్వదించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు మంత్రికి నోట్‌బుక్స్, పెన్సిళ్లు అందించి అభినందనలు తెలిపారు. -
గడ్కరీని కలిసిన టీఆర్ఎస్ నేతలు
న్యూఢిల్లీ : రాష్ట్రంలోని ఐదు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి..వాటి నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు సహకరించాలని టీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విఙ్ఞప్తి చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జాజుల సురేందర్, హన్మంత్ షిండేల బృందం గడ్కరీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 3,155 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా నిర్మాణం చేయాలని.. ఇప్పటి వరకు కేవలం 1,388 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లను మాత్రమే జాతీయ రహదారులుగా గుర్తించారని మంత్రికి తెలిపారు. అదేవిధంగా మరో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేయాలని కోరారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేపట్టేందుకు భూ సేకరణలో 50 శాతం వ్యయం, అటవీ భూముల మళ్లింపును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం కేసీఆర్ పలుమార్లు(ఆగస్ట్ 29, 2018, ఆగస్ట్ 1, 2019) కేంద్రానికి లేఖలు రాశారని టీఆర్ఎస్ నేతలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా... ‘హైదరాబాద్‌లోని గౌరెళ్లి వద్ద ఔటర్ రింగ్‌రోడ్ జంక్షన్- వలిగొండ- తొర్రూర్- నెల్లికుదురు- మహబూబాబాద్- ఇల్లందు- కొత్తగూడెం (30వ నెంబర్ జాతీయ రహదారి జంక్షన్) 234 కిలో మీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలి. మెదక్- ఎల్లారెడ్డి- రుద్రూరు 92 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేపట్టాలి. బోధన్-బాసర-బైంస 76 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మించాలి. మెదక్- సిద్దిపేట్- ఎల్కతుర్తి 133 కిలో మీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలి. చౌటుప్పల్- షాద్ నగర్- కంది 186 కిలోమీటర్ల దక్షిణ భాగంలోని ప్రాంతీయ వలయ రహదారి హైదరాబాద్ వరకు.. సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-భువనగిరి-చౌటుప్పల్ ఉత్తర భాగంలోని ప్రాంతీయ వలయ రహదారిని కలపాలి. దీనిని ఇప్పటికే జాతీయ రహదారి 161ఎఎ గా గుర్తించారు. కానీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ మొదలుపెట్టాలి. ఈ నాలుగు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణలో 50 శాతం వ్యయం భరిస్తుందని, ఆటవి భూముల మళ్లింపు వంటి ఆంశాలను చేపడుతుంది’ అని టీఆర్ఎస్ నేతల బృందం లేఖలో పేర్కొన్నారు. ఈ ఐదు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేలా సహకరించాలని కేంద్రమంత్రికి విఙ్ఞప్తి చేశారు. -
తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీలేదు: నామా
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన లోక్‌సభ సభ్యులు మంగళవారం పదవీ స్వీకారం ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. తెలంగాణ ప్రజలు తమ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని టీఆర్ఎస్ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కలిసి కట్టుగా పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్, మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందేం లేదు. వీలైనన్ని ఎక్కువ నిధులు సాధించేందుకు కృషి చేస్తాం’ అని అన్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించలేదని, బీజేపీ నాయకులు కేవలం మాటలకు పరితమయ్యారని ఆపార్టీ డిప్యూటి ఫ్లోర్‌లీడర్ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమపై నమ్మకం ఉంచి 9 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల సాధనతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిందని గుర్తుచేశారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గడిచిన ఏళ్లలో అనేక సమస్యలపై పోరాటం చేశాం. హైకోర్టు, జాతీయ రహదారులు ఇలా ప్రతిదాన్నీ పోరాడే సాధించుకున్నాం. భవిష్యత్‌లో కూడా ఇలాంటి పంథానే అవలంభిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకు కృషి చేస్తాం. గత కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు. బీజేపీ నేతలు భ్రమలో ఉన్నారు’’ అని అన్నారు. -
‘నామా’స్తుతే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కారు జోరు కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికలకన్నా టీఆర్ఎస్ ఓటింగ్ శాతం పెరగడంతో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన నామా.. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా ఈసారి అత్యధికంగా రావడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 8 గంటలకు తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు రాగా..కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రధాన పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతుందనే రీతిలో కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి నెలకొని ఉండగా.. తొలిరౌండ్ ప్రారంభం నుంచి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి రౌండ్ పూర్తయ్యేటప్పటికి టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సుమారు రూ.11వేల ఆధిక్యంతో ఉన్నారు. అదే ఆధిక్యం చివరి వరకు కొనసాగుతూ ప్రతి రౌండ్‌కు పెరుగుతూ వచ్చింది. తొలి మూడు, నాలుగు రౌండ్ల వరకు నామా నాగేశ్వరరావుకు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి మధ్య సుమారు 20వేలలోపు ఓట్ల వ్యత్యాసం ఉండగా.. 6వ రౌండ్ నుంచి ఈ వ్యత్యాసం క్రమేణా పెరుగుతూ వచ్చింది. తొలి రౌండ్ ప్రారంభం కాగానే కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రెండు రౌండ్లు పూర్తయ్యే వరకు కౌంటింగ్ సరళిని పరిశీలించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్కు మెజార్టీ.. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రతి రౌండ్లో మెజార్టీ లభించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందనడానికి లోక్‌సభ ఎన్నికల మెజార్టీయే నిదర్శనమని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ పాలేరు నియోజకవర్గం నుంచి లభించగా.. స్వల్ప మెజార్టీ వైరా నియోజకవర్గం నుంచి లభించింది. పార్టీకి వివిధ వర్గాలు చేరువ కావడంతోపాటు ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకుని.. నామా విజయానికి చేసిన కృషి, నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడం వంటి కారణాలు సైతం పార్టీ మెజార్టీకి కారణంగా ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేసిన నామా నాగేశ్వరరావు రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఇప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి పైనే 2009, 2019లో విజయం సాధించడం విశేషం. రేణుకా చౌదరి, నామా ప్రధాన ప్రత్యర్థులుగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీపడడం ఇది మూడోసారి. 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావుపై రేణుకా చౌదరి విజయం సాధించగా.. 1999లో టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారిపై రేణుకా చౌదరి విజయం సాధించారు. నామా గెలుపుతో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపై టీఆర్ఎస్ తొలిసారిగా పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసి విజయ పతాకాన్ని ఎగుర వేసినట్లయింది. 2014 ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీలో ఉండి.. ఆ పార్టీ తరఫున కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నామా నాగేశ్వరరావు విజయంపై టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి సారించడం.. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాములునాయక్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతోపాటు ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం వంటి కారణాలు టీఆర్ఎస్కు భారీ మెజార్టీ తెచ్చి పెట్టాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కౌంటింగ్ ప్రారంభమై నాలుగు రౌండ్లు పూర్తయ్యాక కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన నామా నాగేశ్వరరావు కౌంటింగ్ సరళిని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాక నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల స్లిప్‌లను లెక్కించిన అనంతరం ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాన్ని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఆర్వీ.కర్ణన్ అధికారికంగా ప్రకటించారు. విజయం సాధించిన నామా నాగేశ్వరరావుకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అందజేశారు. -
టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఎవరు ఉంటారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. కీలకమైన నేతలు ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది. గత లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేతగా ఉన్న ఎ.పి.జితేందర్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. టీఆర్ఎస్ కీలకనేతగా గుర్తింపు ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్ సీనియర్ ఎంపీగానూ ఉండేవారు. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కల్వకుంట్ల కవిత సైతం పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరుపున గెలిచిన 9 మంది ఎంపీలలో ఉన్న బి.బి.పాటిల్, ప్రభాకర్‌రెడ్డి, దయాకర్, నామా నాగేశ్వర్‌రావులో ఒకరికి టీఆర్ఎస్ఎల్పీ నేతగా అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్యలు చెబుతున్నారు. వారంలోపే కొత్త ఎంపీలతో సమావేశం నిర్వహించి లోక్‌సభ పక్షనేత ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. -
ఆంధ్రా వలస వాదిని ఓడించాలి
పాల్వంచ: ఆంధ్రా వాసి రేణుకా చౌదరిని ఓడించాలని, తెలంగాణ వాడినైన తనను గెలిపించాలని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక బీసీఎం రోడ్‌లోని మెక్ వెంకటేశ్వర్లు గ్రౌండ్ నందు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ పక్క రాష్ట్రం వారు మనపై పెత్తనం చేసేందుకు చూస్తున్నారని అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్‌లో తాను డైలీవేజ్ కార్మికుడిగా పనిచేశానని, అదృష్టవశాత్తు రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగిందన్నారు. జిల్లా వాసిగా ఇక్కడి సమస్యలపై తనకు అవగాహన ఉందని, అందుబాలో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో తెలంగాణ కోసం పార్లమెంట్లో తొలి ఓటు వేసిన ఎంపీగా చరిత్రలో మిగిలానని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. జలగం వెంగళరావు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, వెంగళరావు తనయుడు జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యేగా గతం కంటే ఎక్కువ నిధులు సేకరించి అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. మైనింగ్ యూనివర్సిటీ, ఎన్ఎండీసీ విస్తరణకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనలో తాను భాగస్వామ్యం కావాలని, ఆయన బాటలో నడిచేందుకు వచ్చానని, తనను దీవించి గెలిపించాలని కోరారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రధాన మంత్రి మోదీ సైతం కాపీ కొట్టి అమలు చేస్తున్నారంటే ఇక్కడి సంక్షేమ పథకాలు ప్రజలు ఎంత దగ్గరయ్యాయో అర్థం అవుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక కోతలు లేని కరెంట్ అందిస్తున్నారని, రైతు బీమా, రైతు బంధు, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, మాజీ చైర్మన్ గడిపెల్లి కవిత, పెద్దమ్మగుడి చైర్మన్ కోడి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, భువన సుందర్‌రెడ్డి, సీతారామిరెడ్డి, అయితా గంగాధర్, కాల్వ భాస్కర్, చెన్నమల్లు, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, రవిచంద్ర, మిరియాల కమలాకర్, విజయ్, దొప్పలపుడి సురేష్, జనార్దన్‌రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
నామాను గెలిపించాలి : సినీహీరో వేణు
చింతకాని: ఖమ్మం పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ హీరో తొట్టెంపూడి వేణు కోరారు. నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో శనివారం వేణు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి నామా విజయానికి పాటుపడాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, సత్యనారాయణ, తోటకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నామాతోనే అభివృద్ధి సాధ్యం ముదిగొండ: ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే నామా నాగేశ్వరరావును గెలిపించాలని సినీహీరో తొట్టెంపూడి వేణు కోరారు. మండలంలోని బాణాపురంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు పచ్చా సీతారామయ్య, మండల నాయకులు దేవరపల్లి ఆదినారాయణరెడ్డి, మరికంటి సత్యనారాయణ, అనిత, శ్రీరాములు పాల్గొన్నారు. -
నాల్రోజులే ఇక ప్రచారానికి..
సాక్షి, ఖమ్మం : లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. గడువు నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారం ముమ్మరం చేస్తూనే.. అటు విద్యార్థి, ఉద్యోగ, సామాజిక సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ.. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే పోటీపడే రీతిలో ఆయా సంఘాల వారిని కలుస్తున్నాయి. ఇక ఎన్నికల్లో తమకు కలిసొచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకోవడంలో ముందంజలో ఉన్న టీఆర్ఎస్ గురువారం జరిగిన కేసీఆర్ సభ విజయవంతం కావడంతో సానుకూల ఫలితాలను ఆశిస్తోంది. పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయానికి ఐక్యంగా కృషి చేయాలని సీఎం పిలుపునివ్వడంతో దాని ప్రభావం పార్టీ శ్రేణులపై ఉంటుందనే భావన నామా వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. నామా విజయాన్ని కోరుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గాలవారీగా ప్రచార సరళిని ఏ రోజుకారోజు అంచనా వేస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ శ్రేణులను కలుపుకుపోవడానికి, పార్టీలో నెలకొన్న ఇబ్బందులను తొలగించడానికి తక్షణమే పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ నేతలు ఒకే వేదికపైకి వస్తున్నా.. మనసులు మాత్రం కలవని పరిస్థితి ఉందని.. దీంతో ఎదురయ్యే ఇబ్బందులను నామా విజయాన్ని కాంక్షిస్తున్న పార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నామా విజయం కోసం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌తోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న సమన్వయం, పార్టీ వ్యూహాలకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వరరెడ్డి, నూకల నరేష్‌రెడ్డి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు అభ్యర్థి నామా ఎన్నికల పర్యటన కార్యక్రమంలో ముఖ్యనేతలు పాల్గొనేలా చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. ఆయనకు పట్టున్న సత్తుపల్లి నియోజకవర్గంలో సైతం ఎన్నికల ప్రచారానికి హాజరుకాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాత్రం మాజీ మంత్రి జలగంను కలిసి.. తన విజయానికి తోడ్పాటు అందించాల్సిందిగా ఇప్పటికే అభ్యర్థించారు. అయితే గురువారం ఖమ్మంలో జరిగిన సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభకు జలగం ప్రసాదరావు హాజరుకాకపోవడంపై పార్టీ వర్గాల్లో ఎవరికి వారే తమదైన రీతిలో కారణాలను విశ్లేషించుకుంటున్నారు. వ్యతిరేకతే ఉపకరిస్తుంది.. ఇక అధికార టీఆర్ఎస్పై గల వ్యతిరేకతే తన విజయానికి ఉపకరిస్తుందని భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకాచౌదరి తన ఎన్నికల ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి మేలు జరగలేదని, పేదల బతుకుల్లో మార్పు లేదని విరుచుకుపడుతున్న ఆమె టీఆర్ఎస్లో జరిగిన అంతర్గత పరిణామాలు సైతం తనకు ఉపకరిస్తాయనే నమ్మకంతో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న తీరును సైతం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి రేణుకాచౌదరి వర్గీయులు ఇప్పటికే తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూనే.. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించడంతో ఆ పార్టీలో కొంత ఉత్తేజం నెలకొంది. కాంగ్రెస్‌కు సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో బహిరంగ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తారని, ప్రచారం ముగియడానికి ఒకటి, రెండు రోజుల ముందు ఏఐసీసీ అధ్యక్షు డు రాహుల్‌గాంధీ లేదా ప్రియాంకగాంధీ నియోజకవర్గ పరిధిలో పర్యటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక సీపీఐ మద్దతుతో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి వెంకట్ విజయాన్ని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తమ ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వివరిస్తూ.. ప్రజలను ఆలోచింపజేసే ప్రయత్నాలు చేస్తోంది. బడుగు, బలహీన వర్గాల బతుకులు మారాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి లోక్‌సభలో గళమెత్తే అవకాశం కల్పించాలని పార్టీ నేతలు బహిరంగ సభల్లో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసుదేవరావు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరించడం ద్వారా ఎన్నికల ప్రచారం గావిస్తున్నారు. -
‘అందుకే ఫెడరల్ ఫ్రంట్ తీసుకొచ్చాను’
సాక్షి, ఖమ్మం : ప్రజలు కష్టాలు తొలగాలని.. దారిద్ర్యం వదలాలనే ఉద్దేశంతో ఫెడరల్ ఫ్రంట్‌ను తీసుకువచ్చానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గురువారమిక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. ఈ రోజు అనుభవిస్తున్న దరిద్రానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న జాతీయపార్టీలకు దేనికి కూడా సొంతంగా గెలిచే శక్తి లేదని ఎద్దేవా చేశారు. మోదీ నల్లధనాన్ని తీసుకొచ్చి ఇస్తా అన్నాడు.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నేటికీ సగం దేశం చీకట్లోనే ఉందని విమర్శించారు. ఈ ఎన్నిక దేశగతిని మార్చుతుంది.. మార్చాలని కోరారు. ఇవి రోటిన్ ఎన్నికల కాదని స్పష్టం చేశారు. ఎలాంటి శషబిషలు లేకుండా ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరావును గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏమవుతారో తెలియదన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తన ఇంట్లో వ్యక్తిలాగా అని పేర్కొన్నారు. భవిష్యత్తులో పొంగులేటి, తుమ్మల సేవలను వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరిని ఖచ్చితంగా సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పేదలందరికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి తానే సూపర్వైజ్ చేస్తానని స్పష్టం చేశారు. -
‘నామాకు ఓటేస్తే పంగనామాలు పెడతారు’
సాక్షి, ఖమ్మం : టీఆర్ఎస్ అభ్యర్థి నామాకు ఓటేస్తే ఆయన జనాలకు పంగనామాలు పెడతారని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి దుయ్యబట్టారు. మంగళవారమిక్కడ ఏన్కూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేణుక ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌కు సుబాబుల్ రైతుల దగ్గర నుంచి పంట కొనుగులు చేయడం తెలీదు.. కానీ ఎమ్మెల్యేలను కొనడం మాత్రం బాగా తెలుసని మండి పడ్డారు. బొంతలకు కూడా పనికిరాని చీరలను తెలంగాణ ఆడవాళ్లకు పంచి వారిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే ప్రజలకు పంగ నామాలు పెడతారని హెచ్చరించారు. అదే కాంగ్రెస్‌కు ఓటేస్తే.. హస్తంతో టీఆర్ఎస్ పార్టీకి పంగనామం పెట్టవచ్చని తెలిపారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం
సాక్షి, వేంసూరు: కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ను గెలిపిస్తే జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచుతామని, సత్తుపల్లి నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మువ్వా విజయ్‌బాబు, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ శుక్రవారం వేంసూరులో ప్రచారం నిర్వహించారు. వేంసూరు నుంచి మర్లపాడు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మర్లపాడులో జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి నామాను గెలిపించాలని కోరారు. అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్లో పోరాడానని, తనను ఆశీర్వదించి గెలిపించి ఖమ్మం పార్లమెంట్ గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మర్లపాడు సర్పంచ్ మందపాటి వేణుగోపాల్‌రెడ్డి, వెల్ది జగన్మోహన్రావు, అట్లూరి సత్యనారాయణరెడ్డి, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, బండి శ్రీనివాసరెడ్డి, నాగళ్ల లక్ష్మీనారాయణ, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్‌రావు, గాయం రాంబాబు, దొడ్డ చెన్నకేశవరెడ్డి, సర్పంచ్‌లు ఎండీ ఫైజుద్దీన్, పొట్రు అనంతరామయ్య పాల్గొన్నారు. నామాను గెలిపించాలి సత్తుపల్లి: అందరూ కలిసికట్టుగా నామా నాగేశ్వరరావును గెలిపించి సీఎం కేసీఆర్‌కు ఖమ్మం ఎంపీ సీటును కానుకగా ఇద్దామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం రాత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి గంగారం నుంచి సత్తుపల్లి రింగ్ సెంటర్ వరకు మోటారు సైకిల్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు. అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందాయని.. అభివృద్ధి శరవేగంగా జరిగిందని.. రూ.18వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జిల్లాకు అదృష్టమని పేర్కొన్నారు. రైతు బిడ్డగా తనను పార్టీలకు అతీతంగా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిపరీక్షే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించుకోవడమే ముఖ్యనేతలకు అగ్నిపరీక్షలా మారింది. పార్టీ ఆదేశాల మేరకు అలుపెరగకుండా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సహా అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం చేస్తుండడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలో రాజకీయంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం మూడు నెలల కాలంలో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించాయి. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటుండగా.. అదే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఇప్పుడు అధికార పార్టీ నుంచి నామినేషన్ వేశారు. ఇటువంటి పరిణామాలతో ఇరు పార్టీల్లోని ఆయా ముఖ్య నేతలు ప్రచార పర్వాన్ని భుజాన వేసుకుని తమకు అధిష్టానం పెట్టిన పరీక్షలో నెగ్గేందుకు చెమటోడుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో కొంత బలం పుంజుకుందని భావిస్తున్న అధినాయకత్వం.. అందుకు అనుగుణంగా ఫలితాలు ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు బాధ్యతను ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసిన నేతలకు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ఇటీవల పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల భుజస్కందాలపై పెట్టింది. దీంతో ఇప్పటివరకు పార్టీలో ఉన్న వారు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలపై గెలుపు భారం పడడంతో పార్టీ అధినేత దృష్టిలో పనితీరు పడేలా ఆయా నేతలు తమవంతు ప్రయత్నాల్లో ఇప్పటికే నిమగ్నమయ్యారు. రంగంలోకి ‘పొంగులేటి’ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచార రంగంలోకి దిగనున్నారు. మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారని పార్టీ శ్రేణులకు సంకేతాలు అందడంతో అభ్యర్థి గెలుపుపై భరోసా వ్యక్తమవుతోంది. అలాగే వచ్చే నెల 4న జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ విజయవంతం చేయడం సైతం ఈ నేతలకు పరీక్షగానే మారింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామా విజయాన్ని కాంక్షిస్తూ పాలేరుతోపాటు పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటించారు. నామా విజయానికి కృషి చేయాలని కోరుతూనే.. నామా విజయంలో ఏమాత్రం తేడా వచ్చినా పార్టీ శ్రేణుల పరిస్థితి ఆశాజనకంగా ఉండదని.. అధినాయకత్వం వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదని బహిరంగ సభల్లోనే తుమ్మల హెచ్చరికలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం మినహా ఆరు శాసనసభ స్థానాల్లో పార్టీపరంగా సమన్వయం కోసం కసరత్తు ప్రారంభించింది. ఖమ్మం నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు నియోజకవర్గ బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగించగా.. మిగిలిన నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలను సమన్వయం చేసే బాధ్యతను పార్టీ నేతలకు, రాష్ట్ర పార్టీ బాధ్యులకు అప్పగించారు. లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్‌లు పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను, పార్టీ అభ్యర్థిని సమన్వయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక అనూహ్యంగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి విజయం విషయంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లాలోని ముఖ్య నేతలపైనే భారం వేసింది. పార్టీలో పరిస్థితులు కొంత చేజారినా.. నియోజకవర్గాల్లో కార్యకర్తల బలం ఉందని భావిస్తున్న ఆ పార్టీ రేణుక గెలుపు బాధ్యతను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి భుజస్కంధాలపై వేసింది. అయితే ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఇప్పటి వరకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే ఒకరిద్దరు జిల్లా నేతలు సైతం కొంత అంటీ ముట్టనట్లు ఉంటున్నారనే ప్రచారం సైతం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ అధిష్టానం రేణుక గెలుపును ముఖ్య నేతల భుజస్కంధాలపై వేయడంతో ఆ పార్టీ నేతలు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూనే.. రేణుకాచౌదరి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తున్నారు. -
నన్ను ఓడించి తప్పు చేశారు: తుమ్మల
గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన పాలేరు నియోజకవర్గ ప్రజలు తప్పు చేశామని భావిస్తున్నారని, వారు తమ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో వచ్చిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుమంచిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కూసుమంచి: గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన పాలేరు నియోజకవర్గ ప్రజలు తప్పుచేశామని భావిస్తున్నారని, వారు తమ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో వచ్చిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం లో భాగంగా కూసుమంచిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నామా నాగేశ్వరరావు తన మనిషిగా వచ్చారని, ఆయన్ను గెలిపిస్తే తనను గెలిపించినట్లేనని అన్నారు. తాను గతంలో పాలేరు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్ట్‌తో ఈప్రాంతంలోని 360 చెరువులు నింపి పచ్చని పంటలు పండించేలా కృషి చేశానని చెప్పారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకవచ్చినా..తనను ఓడించారని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా..అభివృద్ధి చేసినా తనను ఓడించటం బాధ కలిగించిందని అన్నారు. పాలేరు ప్రజలు ఏవేవో ఆశల పల్లకీలో ఉండి ఈ తప్పుచేశారని చెప్పుకొచ్చారు. అయినా తాను సీఎం సహకారంతో ఈప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధిని పూర్తిచేస్తానని చెప్పారు. ఎంపీగా నామా నాగేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తుమ్మల ఓడితే సీఎం బాధ పడ్డారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే సీఎం కేసీఆర్ ఎంతో బాధపడ్డారని, ఇప్పుడు ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపించుకోవడం ద్వారా ఆ బాధను తీర్చాలన్నారు. 16 మంది ఎంపీలు గెలిస్తే దేశ రాజకీయాల్లో సీఎం కేసీర్ ఎదురులేని శక్తిగా ఉంటారని, తద్వారా రా>ష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధిని సీఎం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లుకు కృషి చేశా: నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తాను తెలంగాణా ఉద్యమ సమయంలో అప్పుడు ఎంపీగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కృషి చేశానని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చూసి తాను టీఆర్ఎస్లో కొనసాగాలని పార్టీలో చేరినట్లు తెలిపారు. తనను గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి ఆధ్యక్షతన జరిగిన ఈ సభలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, నాయకులు స్వర్ణకుమారి, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వడ్త్యి రాంచంద్రునాయక్, సీడీసీ చైర్మన్ గోపాలరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి ఆసిఫ్‌పాషా తదితర నాయకులు పాల్గొన్నారు. -
నామా గెలుపు చారిత్రక అవసరం
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలుపు జిల్లాకు చారిత్రక అవసరమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు సందర్భంగా ఖమ్మంలో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గెలిపించుకొని సీఎం కేసీఆర్ దగ్గర జిల్లా గౌరవాన్ని నిలుపుకోవాలన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి బాటలో నిలిపేందుకు నామా గెలుపు అవసరమని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో టీఆర్ఎస్ గెలుపుకై శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ గెలుపుబావుట ఎగురవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో జిల్లా పెద్దలతో కలిసి నామ గెలుపుకు పని చేస్తానన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు వచ్చేలా ప్రచారాన్ని ముమ్మరం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పూజలు చేసి, అమరులకు నివాళులర్పించి.. టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన స్వగృహంలో ప్రత్యేక పూజలు చేసి, నామినేషన్ పత్రం నింపి ప్రదర్శనగా దాఖలుకు బయలుదేరారు. ముందుగా పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బైపాస్‌రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి సభాస్థలికి చేరుకొని నాయకులతో కలిసి ప్రసంగించారు. సభా స్థలి నుంచి ప్రదర్శనగా నామినేషన్ దాఖలు కేంద్రం వద్దకు చేరుకున్నారు. -
‘కాంగ్రెస్, బీజేపీని ఓడించడమే మా లక్ష్యం’
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల అభిష్టం మేరకు టీఆర్ఎస్లో చేరానని ఆ పార్టీ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వివరించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తనపాత్ర ఎంతో ఉందని, బిల్లుపై తొలిసంతకం తానే చేసినట్లు ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరాని చెప్పారు. ఆ పథకాలే తనను ఎంపీగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నబయ్యారం స్టీల్ ప్లాంట్, కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ మద్దతు కోరానని, తన తరఫున ప్రచారం చేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. రేపటి నుంచి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తల మద్దతు తనకు సంపూర్ణంగా లభిస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించడమే టీఆర్ఎస్ లక్ష్యమని నామా స్పష్టం చేశారు. -
రాజకీయాలను తేలిగ్గా తీసుకోవద్దు
సత్తుపల్లి: రాజకీయాలను తేలిగ్గా తీసుకోవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాత్రి నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాజకీయాలు మీ కళ్ల ముందే రంగులు మారుతున్నాయి.. మీ అందరి కష్టం వల్లే పదవులు వస్తున్నాయి..’అని పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ సీటు గెలవటం సీఎం కేసీఆర్‌కు అవసరం.. టీఆర్ఎస్ అవసరం.. తెలంగాణ రాష్ట్రానికి అవసరమని అన్నారు.రాజకీయ ప్రాధాన్యం దక్కుతుండడంతో ప్రత్యర్థులు తన మీద అసూయతోనే అందరు కలిసి ఓడించారని అన్నారు. టీఆర్ఎస్లో తాను చేరిన తర్వాత ఐదారువేల ఓట్లు ఉన్న నియోజకవర్గాల నుంచి 80 వేలకుపైగా ఓట్లు ఉన్న నియోజకవర్గాలుగా మారాయని, కేవలం వెయ్యి, రెండువేల ఓట్ల తేడాతో ఐదారు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తానెక్కడ ఉన్నా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆపలేదని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనేదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డికి అప్పీల్ చేస్తున్నా: ఎంపీ అభ్యర్థి నామా రాజకీయాలు పక్కనబెట్టి మద్దతు ఇవ్వాలని, కలిసిమెలిసి పనిచేద్దామని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పీల్ చేస్తున్నట్లు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లే తనకు ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేసినప్పుడు పార్లమెంట్లో అందరు సభ్యులను కదిలించేలా పని చేశానని, చిదంబరం ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను ఒక కారణమయ్యానని తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో సాంకేతికంగా చేరకపోయినా, సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు అందరి అభిప్రాయాలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరతామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. బూత్ లెవల్లో అందరిని కలుపుకొని పని చేసి సత్తుపల్లిలో నామాకు మంచి మెజార్టీ వచ్చేలా పని చేద్దామన్నారు. పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నట్లు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారని, అలాంటి సంఘటన జరిగినట్లు నిరూపిస్తే తాను గుండు కొట్టించుకుంటామని, ఈ సవాల్‌ను పవన్ కల్యాణ్ కూడా స్వీకరించాలని అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, డాక్టర్ మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, చల్లగుండ్ల కృష్ణయ్య, దొడ్డా శంకర్రావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, కూసంపూడి నర్సింహారావు, దాసరి శ్రీధర్‌రెడ్డి, మోరంపూడి ప్రభాకర్, మోరంపూడి ప్రసాద్, ఒగ్గు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో గులాబి జెండా ఎగరవేస్తాం: నామా
సాక్షి, ఖమ్మం: ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జిల్లా కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్ నూకల నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్నీ ఆలోచించే నామా నాగేశ్వరరావుకు ఎంపీ టీకెట్ ఇచ్చారని అన్నారు. నామాకు ఖమ్మం జిల్లాతో మంచి రాజకీయ అనుబంధం ఉందని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం కోట మీద గులాబి జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్‌సభ స్థానం టీఆర్ఎస్దేనని ఆయన ధీమ వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖమ్మం జిల్లాకు చారిత్రక అవసరమని తెలిపారు. అనంతరం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. 70 శాతం ప్రజలు టీఆర్ఎస్కే ఓటు వేస్తారని వివిధ సర్వేలా ద్వారా తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత భారీ మెజారిటీతో నామాను గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ అభివృద్దిలో భాగం కావాలనే నా కోరిక. నామా నాగేశ్వరరావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన విధానం నన్ను బాగా ఆకర్షించిందని చెప్పారు. గడచిన ఐదేళ్లలో తెలంగాణ అన్ని రంగాలలో నెంబర్ వన్ గా ఉన్నది దేశంలో కూడా నాయకత్వ మార్పు అవసరమన్నారు. తెలంగాణ విధానాలనే అనేక రాష్ట్రాలు ఆచరిస్తున్నాయి. రైతులకు 24 గంటలు కరెంటు, రైతుబంధు, సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నాయి. ఖమ్మం ప్రజలు నన్ను దీవిస్తే జిల్లా భివృద్దిలో పాలుపంచుకుంటానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 16/16 స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
‘నామా’నే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎట్టకేలకు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వం ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. నామా పేరును గురువారం అధికారికంగా ప్రకటించడంతోపాటు బీఫాం అందజేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రాజకీయ చతురతను ప్రదర్శించి టికెట్ దక్కించుకున్నారు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చివరి నిమిషంలోనైనా టికెట్ లభిస్తుందని ఆయన అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. పది రోజులుగా ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఎవరు దక్కించుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎంపీ పొంగులేటికి టికెట్ లభించని పక్షంలో టీఆర్ఎస్ ఏ ప్రాతిపదికన ఎవరివైపు మొగ్గు చూపుతుందనే అంశంపై చివరి నిమిషం వరకు స్పష్టత రాని పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పరాజయం పొందడాన్ని పరిగణనలోకి తీసుకుని ఈసారి ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వాన్ని మారుస్తారని కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) పేర్లు అధిష్టానం పరిశీలించినట్లు ప్రచారం జరిగింది. అయితే నాలుగు రోజులుగా అనూహ్యంగా టీఆర్ఎస్ రాజకీయ తెరపైకి నామా నాగేశ్వరరావు ప్రత్యక్షం కావడం.. ఆయన సీఎంను కలిసి పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో నామాకు లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉందని ప్రచారమైంది. దీనికి అనుగుణంగా నామా మంగళవారం టీడీపీకి, పదవులకు రాజీనామా చేయడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైందనే ప్రచారం ఊపందుకుంది. అధికారికంగా గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నామా.. కొద్దిగంటల్లోనే పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కావడం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నామా పేరును అధికారికంగా ప్రకటించడానికి కొద్దిసేపటికి ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి.. నామా అభ్యర్థిత్వం ఖరారైనట్లు సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2004లో టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నామా ఆ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు. ఇప్పటికి మూడుసార్లు లోక్‌సభకు, ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసిన నామా నాలుగోసారి ఖమ్మం ఎంపీగా పోటీ చేయనున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు పోటీ చేసిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. సన్నిహితులతో సంప్రదింపులు నామాకు టికెట్ ఖరారు కావడంతో ఎన్నికల్లో తన గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ నేతలు, సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ రాకపోవడంపై పార్టీలోని ఆయన అనుచరులు, అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పొంగులేటిపై ఆయన అభిమానులు, అనుచరుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారేది లేదని, టీఆర్ఎస్లోనే కొనసాగుతాననే సంకేతాలను పొంగులేటి ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక కొత్తగా టీఆర్ఎస్లో చేరిన ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఆ పార్టీలో సుదీర్ఘకాలంగా రాజకీయ మిత్రులు, రాజకీయ ప్రత్యర్థులు సైతం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థి గెలుపును టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందుకోసం అధినాయకత్వం ఎటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుంది? అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎటువంటి విధానాన్ని అవలంబిస్తుందనే అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలుపొంది టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి పార్టీలో కొనసాగుతున్న ఉద్యమకారులను సమన్వయం చేసుకుని తన విజయానికి తోడ్పడేలా కృషి చేయాల్సిన బాధ్యత పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుపై పడింది. దీంతో ఆయన ఇప్పటికే తన విజయానికి సహకరించాలని, పార్టీ అభివృద్ధి కోసం, కేసీఆర్ లక్ష్య సాధన కోసం ఏకతాటిపై నిలవాల్సిన అవసరంపై ఆయన వారిని వ్యక్తిగతంగా కలిసి సహకారం కోరినట్లు తెలుస్తోంది. నామా అభ్యర్థిత్వంపై టీఆర్ఎస్లోని పలువురు నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ పార్టీ అధినేత సూచన మేరకు పనిచేయక తప్పదనే భావన వ్యక్తమవుతోంది. పార్టీ అభ్యర్థిగా నామా ఈనెల 22న ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసి.. 25న అధికారికంగా మరోసారి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామా 22న ఖమ్మం చేరుకోలేకపోతే ఆయన తరఫున పార్టీ వర్గాలు నామినేషన్ వేసే అవకాశం ఉంది. జిల్లాలోని టీఆర్ఎస్ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి అభ్యర్థి విజయానికి కృషి చేసేలా సమన్వయపరిచే బాధ్యతను పార్టీ అధినేత కేసీఆర్.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై పెట్టినట్లు సమాచారం. నామా టీఆర్ఎస్లో చేరిక కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నామాతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, మహిళా ఆర్థిక సంస్థ మాజీ చైర్మన్ మద్దినేని బేబి స్వర్ణకుమారి, మాధవరావు, ఇతర జిల్లాలకు చెందిన నేతలున్నారు. నామా బయోడేటా పేరు : నామా నాగేశ్వరరావు తల్లిదండ్రులు : వరలక్ష్మి–ముత్తయ్య పుట్టిన తేదీ : 15–3–1958 పుట్టిన స్థలం : కొక్కిరేణి గ్రామం, తిరుమలాయపాలెం మండలం భార్య : చిన్నమ్మ సంతానం : ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె విద్యార్హతలు : ఇంటర్మీడియట్ వృత్తి : పారిశ్రామికవేత్త రాజకీయ రంగప్రవేశం : 2004లో టీడీపీలో చేరారు. ఆ సంవత్సరంలోనే ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2014లో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. టీడీపీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసిన నామా గురువారం టీఆర్ఎస్లో చేరారు. -
టీఆర్ఎస్లో చేరిన నామా
సాక్షి, హైదరాబాద్: టీడీపీకి రాజీనామా చేసి న మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు టీఆర్ ఎస్‌లో చేరారు. గురువారం తెలంగాణ భవ న్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్లో చేరారు. నామాకు గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ ‘రాష్ట్ర అభివృద్ధి జరగాలి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండా లంటే కేసీఆర్ నాయకత్వం తెలంగాణలో ఉండాలి. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ను బలోపేతం చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న తాగు, సాగునీరు, సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నా. పార్టీ అధినేత ఆదేశానుసారం నడుచుకుంటా’ అని అన్నారు. నామాతోపాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ కుమారి, అమర్నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్‌బాబు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తదితరులు పాల్గొన్నారు. నేతకాని వెంకటేశ్ సైతం.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నేతకాని వెంకటేశ్ సైతం గురువారం టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ ఆయన కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. నేడు టీఆర్ఎస్లోకి ప్రతాపరెడ్డి షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కూడా శుక్రవారం టీఆర్ఎస్లో చేరనున్నారు. -
ఎంపీ టికెట్ తేలేది నేడే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే.. జిల్లాలో మాత్రం ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనే ఆతృతే ఇంకా కొనసాగుతోంది. విభిన్న రాజకీయ పరిస్థితులున్న జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై గట్టి కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చినా.. ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక అంశం ఒక పట్టాన తేలడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలుకు ముహూర్తం ముంచుకొస్తున్నా.. జిల్లాలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆయా పార్టీల్లో ఉత్కంఠ కొద్దిరోజులుగా కొనసాగుతూనే ఉంది. నామినేషన్ వేసేందుకు రెండు రోజులే గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు గురువారం ఖమ్మం నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినా.. ఖమ్మం నుంచి ఎవరిని పోటీ చేయించాలనే అంశంపై ఇక్కడ నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే నేతలు ఎవరో దాదాపు తేటతెల్లమైనా.. ఖమ్మం విషయంలో మాత్రం పడిన చిక్కుముడి మాత్రం వీడని పరిస్థితి. ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు చివరి నిమిషంలోనైనా తమకు టికెట్ వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) వంటి పేర్లు ప్రచారంలో ఉండగా.. రెండు రోజులుగా టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారు.. ఈ స్థానం ఎవరిని వరిస్తుందనే అంశం పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఒకే తరహా గోప్యత.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి ఒకే తరహా గోప్యతను పాటిస్తుండడంతోపాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ప్రకటించాకే.. తమ అభ్యర్థిని ప్రకటించాలనే నియమం విధించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్రస్థాయిలో ఖమ్మం నియోజకవర్గం మరోసారి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయింది. ఇక రెండు రోజులే నామినేషన్ దాఖలుకు గడువు ఉండడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు తుది కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం వరకు ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరో అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ ఎవరికి లభిస్తుందనే అంశంపై రోజుకో రీతిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ముఖ్య నేతలు అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పారిశ్రామికవేత్త వద్దిరా>జు రవిచంద్ర, కాంగ్రెస్ నాయకుడు రాయల నాగేశ్వరరావు తదితరులు దరఖాస్తు చేసుకోగా.. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో తాజాగా రేణుకాచౌదరి, పోట్ల నాగేశ్వరరావు పేర్లు సామాజిక వర్గం నేపథ్యంలో అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మూడు రోజుల క్రితమే ప్రకటించిన కాంగ్రెస్.. వ్యూహాత్మకంగానే ఖమ్మం అభ్యర్థి ప్రకటన అంశాన్ని వాయిదా వేస్తోందని.. టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంటుందనే భావనలో ఉన్నట్లు ఆయా పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీదీ అదే వ్యూహం.. ఇక బీజేపీ సైతం ఇదే తరహా వ్యూహంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశస్థాయిలో బీజేపీకి సానుకూల పవనాలున్న దృష్ట్యా వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహంతో ఆ పార్టీ ఉన్నట్లు ప్రచారమవుతోంది. ఇప్పటికే సీపీఎం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు బి.వెంకట్‌ను పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. సీపీఎంకు సీపీఐతోపాటు జనసేన, బీఎస్పీ వంటి పార్టీలు మద్దతు ఇస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సీపీఐ తన వైఖరిని మాత్రం ఇంకా రాష్ట్రస్థాయిలో స్పష్టం చేయలేదని.. ఒకటి, రెండు రోజుల్లో సీపీఐ తమ పార్టీవిధానాన్ని వెల్లడించే అవకాశం ఉందని రాజ కీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా లో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే సాహ సం చేయలేని పరిస్థితి నెలకొందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రేణులు లోక్‌సభ ఎన్నికలపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నామా నాగేశ్వరరావు జిల్లాలోని టీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఇప్పటికే సమావేశమై.. తనకు సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. -
టీటీడీపీకి షాక్.. కారెక్కనున్న నామా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ నుంచి మరో సీనియర్ నేత కారెక్కనున్నట్లు సమాచారం. సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం నామా, కేసీఆర్‌ను కలవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అంతేకాక ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి నామాను బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం ఖమ్మం అభ్యర్థిగా నామా పేరును జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. అయితే అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన తరువాతే నామా పేరును అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ విషయం గురించి ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు సమాచారం అందించినట్లు ప్రచారం జరుగుతుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున పోటీచేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. -
ఇక టీడీపీకి రాజీ‘నామా’నే!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీని వీడేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్న మాజీ ఎంపీ, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు రాజకీయ గమ్యం ఎటువైపన్న అంశంపై మాత్రం ఇంకా అనిశ్చితే కొనసాగుతోంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున పోటీచేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఉభయ జిల్లాల్లో పోటీ చేసిన మూడు స్థానాల్లో రెండు గెలుపొందగా..నామా మాత్రమే ఆ ఎన్నికల్లో ఓడారు. ఇక కాంగ్రెస్ సైతం తాను పోటీచేసిన ఆరు స్థానాల్లో విజయం సాధించడంతో జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాకూటమి మెజారిటీ స్థానాలను గెలుపొందినట్లయింది. శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో సంభవిస్తున్నపెను మార్పులకు అనుగుణంగా తన రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశించుకోవాలని భావించిన నామా గత కొంతకాలంగా ప్రధాన రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తున్నారని, టీఆర్ఎస్లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు దృష్టి సారించారని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ఆయా పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే ఘడియ ముంచుకొస్తుండటంతో రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై నామా నాగేశ్వరరావు శుక్రవారం టీడీపీలోని ముఖ్య నేతలు, అనుచరులతో హైదరాబాద్‌లోని మధుకాన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి..సుదీర్ఘ సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ సమావేశానికి టీడీపీకి చెందిన ముఖ్యనేతలతోపాటు మరికొందరు నాయకులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే అశ్వారావుపేట టీడీపీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావును ఈ సమావేశానికి ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకునే ఉద్దేశం లేనప్పుడు పార్టీ మారే సమావేశాలకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్న భావనతో ఆయన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సమావేశంలో భిన్నాభిప్రాయాలు.. నామా కాంగ్రెస్‌లో చేరినా టీడీపీతో పొత్తు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా పార్టీ మారడం వల్ల ఉపయోగం ఏముంటుందన్న భావనతో మరికొందరు సీనియర్ నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) హాజరు కాలేదు. అలాగే మద్దినేని బేబి స్వర్ణకుమారి వంటి సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొనలేదు. హాజరైన వారి మధ్య మాత్రం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నామా ఏ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు.. ఇందులో పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరడానికి సానుకూల పరిస్థితులు లేవన్న అంశంపై సైతం సమావేశంలో చర్చ జరగ్గా.. అలాంటిదేమీ లేదని ఆ పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని, బయట జరుగుతున్న ప్రచారాలకు, అంతర్గత పరిస్థితికి అత్యంత వ్యత్యాసం ఉందని నామా సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ వైపు చూడటం వల్ల ప్రయోజనం ఏమిటని కొందరు నేతలు వాదించగా.. కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆదరించినా.. ఖమ్మం వంటి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గెలుపు సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరాలనుకున్న సమయంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీకి మూడు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉన్నారని, టీడీపీకి రెండు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉన్నారని, ఏడు నియోజకవర్గాల్లో.. ఐదు నియోజకవర్గాల్లో బలంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీచేయడం ఒక ఎత్తయితే.. రాష్ట్రంలో సంభవిస్తున్న రాజకీయ పరిణామాల దరిమిలా ఆ పార్టీ శాసనసభ్యులు ఇద్దరు, టీడీపీ శాసనసభ్యులు ఒకరు టీఆర్ఎస్లో చేరడానికి నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్సా..? కాంగ్రెస్సా..? టీఆర్ఎస్ టికెట్ ఖరారు చేసేలోపే రాజకీయంగా నిర్ణయం తీసుకోవడం మేలని, దీనిపై కార్యకర్తలకు, అనుచరులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి సమయం సైతం అవసరం ఉన్నందున త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం సముచితమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరే అంశంపై పలు కోణాల్లో చర్చ జరిగినా..ఒక కొలిక్కి రాలేదు. టీడీపీలో సీనియర్ నాయకులు పలువురు సమావేశానికి హాజరు కాలేకపోవడంతోపాటు మరికొంతమంది నేతలతో ఈ అంశంపై చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావించిన నామా శనివారం ఖమ్మం చేరుకుని మరికొందరు ముఖ్యనేతలతో తన రాజకీయ భవితవ్యంపై తీసుకోవాల్సిన నిర్ణయంపై చర్చించాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీలోని ముఖ్యనేతలకు నామా శనివారం ఖమ్మం వస్తున్నారన్న సమాచారాన్ని అందించారు. పార్టీ కార్యకర్తల నిర్ణయాన్ని అనుసరించి ఆయన రాజకీయ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
‘నామా’ కంపెనీలపై సీబీఐ కేసు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావుకు చెందిన మౌలిక రంగ కంపెనీ మధుకాన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకులకు మోసపూరితంగా రూ.1,000 కోట్లకుపైగా నష్టం కలిగించినందుకు ఈ కేసు నమోదైంది. జార్ఖండ్‌లో ఎన్హెచ్ఏఐ అప్పగించిన రోడ్డు విస్తరణ ప్రాజెక్టును పూర్తి చేయకపోగా.. ప్రాజెక్టు కోసం మంజూరైన కోట్లాది రూపాయల నిధులను ఉద్ధేశపూర్వకంగా దారి మళ్లించారు. రోడ్డు విస్తరణ పనులు ఎంతకీ పూర్తి కాకపోవడంతో జార్ఖండ్ హైకోర్టు జోక్యం చేసుకుంది. కేసును సుమోటోగా తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) రంగంలోకి దిగడంతో అసలు నిజాలు వెలుగు చూశాయి. రోడ్డు ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్ అయిన రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే సీఎండీ కె.శ్రీనివాస రావు, డైరెక్టర్లు ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వి తేజతోపాటు మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ టోల్ హైవే, ఆడిటింగ్ కంపెనీ కోటా అండ్ కంపెనీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కెనెరా బ్యాంకుతోపాటు కన్సార్షియంలోని బ్యాంకులకు చెందిన కొందరు అధికారులపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. ఇదీ రోడ్డు ప్రాజెక్టు.. జాతీయ రహదారి–33పై జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ–రార్‌గావ్–జంషెడ్పూర్ సెక్షన్లో 163 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మధుకాన్‌కు 2011 మార్చి 18న అప్పగించింది. ఈ ప్రాజెక్టు కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ పేరుతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను మధుకాన్ ఏర్పాటు చేసింది. కన్సెషన్ పీరియడ్ 15 సంవత్సరాలు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,655 కోట్లు. ఇందులో రూ.1,151.60 కోట్ల రుణం ఇచ్చేందుకు కెనరా బ్యాంకు నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్షియం ముందుకు వచ్చింది. ప్రమోటర్లు తమ వాటాగా రూ.503.60 కోట్లు సమకూర్చాలి. 2012 డిసెంబరులో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. అసలు ఏం జరిగిందంటే.. అయిదేళ్లలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో జార్ఖండ్ హైకోర్టు జోక్యం చేసుకుంది. కేసును సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టాల్సిందిగా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌ను (ఎస్ఎఫ్ఐవో) ఆదేశించింది. ఎస్ఎఫ్ఐవో రంగంలోకి దిగడంతో అసలు విషయాలు వెలుగుచూశాయి. రోడ్డు విస్తరణ పనుల ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందో విచారణ చేపట్టకుండానే కెనరా బ్యాంకు కన్సార్షియం రూ.1,029.39 కోట్లను మంజూరు చేసిందని ఎస్ఎఫ్ఐవో తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నిధుల్లో సుమారు రూ.264 కోట్లను కంపెనీ దారి మళ్లించిందని గుర్తించింది. ఈ నిధులను ప్రాజెక్టుకు వినియోగించలేదని ఎస్ఎఫ్ఐవో తన నివేదికలో వివరించింది. బ్యాంకుల నుంచి రూ.1,029.39 కోట్ల మొత్తం రుణం పొందేందుకు డైరెక్టర్లు మోసపూరితంగా వ్యవహరించారని గుర్తించింది. రుణం తీసుకున్నప్పటికీ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. దీంతో 2018లో ఈ రుణం కాస్తా నిరర్ధక ఆస్తిగా (ఎన్పీఏ) మారిందని ఎస్ఎఫ్ఐవో నిర్ధారించింది. ఎస్ఎఫ్ఐవో నివేదిక ఆధారంగా సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 31న ఎన్హెచ్ఏఐ ఈ కాంట్రాక్టును రద్దు చేసింది. కంపెనీ బ్యాంకు గ్యారంటీగా పెట్టిన రూ.73.95 కోట్ల డిపాజిట్‌ను ఎన్హెచ్ఏఐ స్వాధీనం చేసుకుంది. -
ఆ డబ్బు ఎవరు పంపారు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు కేసులో పోలీస్‌శాఖ విచారణను వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు పెంబర్తి చెక్‌పోస్టు వద్ద రూ.6 కోట్ల నగదును పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ బేగంబజార్‌కు చెందిన హవాలా వ్యాపారి అగర్వాల్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించారు. ముగ్గురు నేతలకు ఆ డబ్బును తీసుకెళ్తున్నట్టు అగర్వాల్ విచారణలో బయటపెట్టాడని వరంగల్ పోలీసులు తెలిపారు. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్ ఈస్ట్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్రకు ఈ నగదును తరలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పట్టుబడ్డ డబ్బు అగర్వాల్‌కు ఎక్కడి నుంచి వచ్చింది.. హవాలా ద్వారా అభ్యర్థులకు డబ్బు పంపించింది ఎవరన్న దానిపై వరంగల్ పోలీసులు దృష్టి సారించారు. మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు వరంగల్ యంత్రాంగాన్ని ఆదేశించినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో నోటీసులు: హవాలా డబ్బులు తెప్పించిన వ్యవహారంలో ముగ్గురు నేతలు నామా నాగేశ్వర్రావు, కొండా మురళి, రవిచంద్రకు ఫిబ్రవరి మొదటి వారంలో నోటీసులు జారీ చేయనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. డబ్బు కోసం ఎవరిని సంప్రదించారు.. ఎక్కడ్నుంచి ఆ డబ్బు వచ్చింది.. తదితర అంశాలపై విచారించేందుకు వరంగల్ పోలీసులు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఇంత మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం వెనుక వ్యూహకర్త ఎవరన్న దాని పైనా వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించనున్నట్టు తెలుస్తోంది. విశాఖ నుంచే వచ్చిందా? హవాలా ద్వారా హైదరాబాద్ వచ్చిన సొమ్మును కారు వెనుక సీట్లో కింద ప్రత్యేక అమరికలో తరలించిన విధానం చూస్తుంటే లింకు పెద్దదిగా ఉన్నట్టు వరంగల్ పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన నగదు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి అగర్వాల్ ద్వారా డబ్బులు పంపించారు.. ఎవరెవరికి ఎంత అందింది.. అన్న లెక్కలు కూడా బయటపడే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అయితే ఆ డబ్బు వచ్చింది ఏపీలోని విశాఖపట్నం నుంచే అని విచారణలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో విశాఖపట్నంలోనూ విచారణ జరిపేందుకు రెండు బృందాలను పంపనున్నట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ ముగ్గురు నేతలతో పాటు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వారి అనుచరుల ఫోన్ కాల్‌డేటాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఇటు అగర్వాల్‌తో పాటు అతడి సోదరులు, వారి అసిస్టెంట్ల కాల్‌డేటాలను సైతం అనాలసిస్ చేస్తున్నట్టు తెలిసింది. దీని ద్వారా విశాఖలో ఎవరి నుంచి డబ్బు వచ్చిందన్న వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఆ డబ్బు పచ్చపార్టీదేనా? తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తుల నుంచే ఈ రూ.6 కోట్లు హవాలా ద్వారా వచ్చి ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేసిన స్థానాలతో పాటు పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు సైతం పచ్చ పార్టీ నుంచే కోట్ల రూపాయలు రవాణా అయినట్టు ఆరోపణలున్నాయి. పట్టుబడ్డ డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో టీడీపీ నేత నామా నాగేశ్వర్రావు పేరుండటం సంచలనంగా మారింది. అయితే వరంగల్ పోలీసులు కేసు విచారణలో వేగం పెంచడంతో పక్క రాష్ట్రంలోని పచ్చపార్టీ నేతలు వణికిపోతున్నారని తెలిసింది. -
సైకిల్ తొక్కిన హీరో వేణు
సాక్షి, ఖమ్మంఅర్బన్: నగరంలోని 8వ డివిజన్లోని గొల్లగూడెం, గోపాలపురం, ఎల్బీనగర్ పరిసరాల్లో సోమవారం సినీ హీరో టి.వేణు ఖమ్మం మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం సాగించారు. ప్రచారంలో సైకిల్ తొక్కుతూ, చిన్న పిల్లలను ఎత్తుకొని లాలిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి హరికృష్ణ, కాంగ్రెస్ నాయకులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
నామా కోసం వేణు..
సాక్షి, ఖమ్మం అర్బన్: సినీనటుడు తొట్టెంపూడి వేణు సోమవారం ఎన్నికల ప్రచారానికి వచ్చారు. తన బంధువు ఖమ్మం కూటమి(టీడీపీ) అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం నగరంలోని 27, 49వ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. స్థానికులు, కూటమి కార్యకర్తలు ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. -
‘ఆ సభ కోసం దేశం ఎదురుచూస్తోంది’
సాక్షి, ఖమ్మం : దేశ చరిత్రలో నిలిచిపోయే సభకు ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా వేదిక కాబోతుందని ప్రజా కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 28న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్న విషయం తెలిసిందే. సభ జరిగే ప్రాంతాన్ని సోమవారం మల్లు భట్టి విక్రమార్క, నామా నాగేశ్వరరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం సభ రాష్ట్రానికే కాదు దేశానికి దిశానిర్ధేశం చేయనుందని అన్నారు. మతతత్వ బీజేపీని తరిమికొట్టేందుకు ఖమ్మం నుంచి శంఖారావం పూరిస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ఖమ్మం గుమ్మం కానుందని, ఈ సభలో కోదండరాంతో సహా, సీపీఐ జాతీయ నేతలంతా పాల్గొంటారని భట్టి వెల్లడించారు. ఇద్దరు జాతీయ నేతల సందేశం కోసం దేశం ఎదురుచూస్తొందని ఖమ్మం మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. దేశంలో సెక్యూలరిజంను కాపాడేందుకు మహాకూటమి ప్రయత్నిస్తుందని తెలిపారు. నాలుగు పార్టీలకు చెందిన నేతలంతా సభలో పాల్గొంటారని, వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమాని నామా ధీమా వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో రాహుల్ పర్యటన నిమిత్తం కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొడంగల్, వికారాబాద్‌తో సహా పలు సభల్లో రాహుల్ పాల్గొననున్నారు. -
టీఆర్ఎస్కు భారీ షాక్
సాక్షి, ఖమ్మం : అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఛైర్మన్ (ఐడీసీ), ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. గత కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్న బేగ్ తాజా నిర్ణయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న బేగ్‌తో మహాకూటమి నేతలు ఇదివరకే మంతనాలు జరిపినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బేగ్ ప్రస్తుతం ఐడీసీ ఛైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆయనతో మహాకూటమి అభ్యర్థి టీడీపీ నేత నామా నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కీలకంగా భావించే ఖమ్మంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడు రాజీనామాతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. బుడాన్ రాజీనామా వార్తలతో కంగుతిన్న గులాబీ అధిష్టానం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా వుండగా బేగ్ టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య పోరు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌పై మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును మహాకూటమి బరిలో నిలిపింది. నామాకు మద్దతుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ప్రచారంలోకి దిగడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మైనార్టీల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు రేణుక, నామా నాగేశ్వరరావులు చక్రం తిప్పినట్టు తెలిసింది. రాజీనామాపై బెగ్ ఈరోజు సాయంత్ర మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగా ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, రాజీనామాలు మరువక ముందే మరో సీనియర్ నేత పార్టీని వీడడంతో గులాబీ శ్రేణులకు మింగుడుపడడంలేదు. కాగా గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. -
‘కారు పార్టీ బేకారు పార్టీ’
సాక్షి, ఖమ్మం : నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటిలోనూ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలనే కూటమిగా ఏర్పడినట్లు ఆమె తెలిపారు. శనివారం ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలను సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కారు పార్టీ బేకారు పార్టీ అని ఆమె ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఘోరంగా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు. గ్రామాల్లో విద్యార్థులు డబుల్ పీజీలు చేసి నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆమె అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో నరే్ంద్ర మోదీలు వట్టి మాటాలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. మహాకూటమి కేవలం రాష్ట్రంలోనే కాక.. కేంద్రలోనూ కూడా ప్రభుత్వాలు ఏర్పడే వరకే కొనసాగుతుందని వెల్లడించారు. మహాకూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖమ్మంలో పర్యటిస్తారని రేణుకా ప్రకటించారు. ఈ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని ఆమె తెలిపారు. తమ విజయాన్ని కాంక్షిస్తూ తమకు పూర్తిగా సహకరిస్తున్న రేణుకా చౌదరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసింది శూన్యమని .. రానున్న ఎన్నికల్లో ప్రజాకూటమిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం ఇక్కడిదో ఆగదని.. ఢిల్లీ గడ్డ మీద కూడా కూటమిదే విజయం అని పేర్కొన్నారు. కాగా ఖమ్మంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ నుంచి తాజీ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పోటీలో ఉండగా.. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మహాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయంగా ఇద్దరూ హేమాహేమీలు కావడంతో పోటీ ఉత్కంఠంగా మారింది. గతంలో శత్రువులుగా మెలిగిన నామా, రేణుక ఇప్పుడు కలిసి ప్రచారంలో చేయడంతో పోటీ ఆసక్తిగా మారింది. -
‘తెలంగాణా బిల్లుకు మొదటి ఓటు నాదే’
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహా కూటమి పది సీట్లు గెలుస్తుందని మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. ఖమ్మంలో నామా విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణా బిల్లుకు మొదట ఓటేసింది తానేనని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కేసీఆర్ విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వేసిన విత్తనాలే ఇప్పుడు పండ్లుగా మారాయని చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణా అని వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. అసమ్మతులు టీ కప్పులో తుపాను లాంటివని అన్నారు. పెద్దన్న లాంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవి సర్దుకుంటాయని పేర్కొన్నారు. -
మధుకాన్ ప్రాజెక్ట్స్‌కు ఎన్సీఎల్టీ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ గట్టి షాక్‌నిచ్చింది. పూర్తిచేసిన పనులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఎగవేసినందుకు మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాళా పరిష్కార ప్రక్రియ (ఐఆర్పీ)కు ఎన్సీఎల్టీ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ సభ్యులు రాతకొండ మురళి ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) కోసం సొరంగ తవ్వకాల పనుల్లో భాగంగా అనిక్ పంజర్పోల్ లింక్ రోడ్ పనులను చేపట్టేందుకు మధుకాన్ ప్రాజెక్ట్స్‌తో శ్రీకృష్ణ రైల్ ఇంజనీర్స్ కంపెనీ 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ 2014 నాటికి రూ.4.02 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది. అయితే మధుకాన్ ఈ పనులకు కేవలం రూ.96 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన బకాయిల కోసం మధుకాన్‌కు శ్రీకృష్ణ రైల్ ఇంజనీర్స్ పలుమార్లు నోటీసులు పంపింది. అయినా ప్రయోజనం లేకపోవటంతో మధుకాన్ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఆ కంపెనీ హైద రాబాద్లోని ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. మధుకాన్ తమకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయి ందని ఆ కంపెనీ తరఫు న్యాయవాది వివరించారు. చేసిన పనులకు ఎంఎంఆర్డీఏ డబ్బు చెల్లించినా మధుకాన్ మాత్రం తమకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బెంచ్ ముందుంచారు. వీటిని పరిశీలించిన సభ్యులు చెల్లించాల్సిన బకాయిలను మధుకాన్ ప్రాజెక్ట్స్ చెల్లించలేదని నిర్ధారించుకున్నారు. మధుకాన్ దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతినిచ్చారు. తాత్కాలిక దివాళా పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) రాకేష్ రాఠీని నియమించారు. మధుకాన్ ప్రాజెక్ట్స్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించారు. -
టీడీపీ మాజీ ఎంపీపై క్రిమినల్ కేసు
-
టీడీపీ మాజీ ఎంపీపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా వేధిస్తున్నారని నగరాని కి చెందిన రామకృష్ణన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో నివసించే సి.కె.రామకృష్ణన్ 1992 నుంచి అమెరికా లో ఉంటున్నారు. ఆయన భార్య సుజాత రామకృష్ణన్ అక్కడే ఉండేవారు. 2014లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మాజీ ఎంపీ నామా తరచూ వారి ఇంటికి వస్తుండేవారు. 2017లో తరచూ తన భార్య సుజాతతో ఫోన్లో మాట్లాడేవాడని రామకృష్ణన్ తెలిపారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే భార్య గత అక్టోబర్‌లో ఫోన్ చేసి నామా, ఆయన తమ్ముడు నామా సీతయ్య తనను బెదిరిస్తున్నారని, భయంగా ఉందంటూ ఫోన్ చేయడంతో ధైర్యం చెప్పానన్నారు. అప్పుడే సుజాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు పెట్టిందన్నారు. ఇటీవల వేధింపులు తీవ్రతరం 2 రోజుల క్రితం తాను హైదరాబాద్‌కు వచ్చానని, మానసిక వేదనతో బాధపడుతున్న భార్య సుజాతను ప్రశ్నించగా.. కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు నామాతో 2013 నుంచి వివాహేతర సంబంధం ఉందంటూ విషయాన్ని బయట పెట్టిందన్నారు. భర్తకు విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా ఒత్తిడి తెస్తున్నాడని, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన తమ్ముడు సీతయ్య కూడా గత కొంత కాలంగా తనను బెదిరిస్తున్నాడని ఆమె వెల్లడించారన్నారు. ఈ మేరకు రామకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నామా నాగేశ్వర్రావు, సీతయ్యపై ఐపీసీ సెక్షన్లు 497, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నామా.. చూపు ఎటువైపు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఆయన మదిలో ఏముంది? రాజకీయంగా అడుగులు ఎటువైపు వేయనున్నారు.. టీడీపీలోనే కొనసాగుతారా.. మరో పార్టీలోకి వెళతారా.. ఏ పార్టీ అక్కున చేర్చుకుంటుంది.. ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న రాజకీయ పక్షాలకు చేరువవుతారా.. ఇవన్నీ ప్రచారాలేనని కొట్టిపారేస్తారా.. ఇటువంటి అంశాలన్నీ జిల్లాలో రాజకీయ వేడిని రేపుతున్నాయి. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై కొద్ది నెలలుగా అనేక ఊహాగానాలు షికార్లు చేస్తున్నా.. ఆయన రాజకీయ పయనంపై స్పష్టత కొరవడింది. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా టీడీపీలోనే కొనసాగుతున్నా.. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుని మరోసారి ఎంపీ బరిలో దిగుతారన్న ప్రచారం కొద్ది నెలలుగా హోరెత్తుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలుపొందడంతో అప్పటి నుంచి టీడీపీలో రాష్ట్ర రాజకీయాలకు పరిమితమవుతూ జిల్లా రాజకీయాలపై అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి గూడుకట్టుకుంది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు జిల్లా ప్రజల నాడిని పరిగణనలోకి తీసుకుని తనకు అనుకూలంగా రాజకీయాలను మలచుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని అనేక నెలల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌లో చేరడమా..! లేదా కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ నుంచి పోటీ చేయడమా.. అన్న అంశంపై ఆయన ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాను తీసుకునే నిర్ణయానికి టీడీపీ శ్రేణులతోపాటు తటస్థుల మద్దతు కోసం నామా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తనకు సాన్నిహిత్యం ఉన్న పలు పార్టీల నేతలు, తటస్థులతో తరచూ టచ్‌లో ఉంటూ రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్ణయం ఎలా ఉంటుందో..? వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పలు రాజకీయ పక్షాలు కూటమిగా ఏర్పడి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్రస్థాయిలో యోచిస్తున్నట్లు ప్రచారం జరగడం.. దీనికి టీడీపీ నుంచి సైతం అనుకూలమైన సంకేతాలు ఉన్నాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్న నేపథ్యంలో నామా నాగేశ్వరరావు నిర్ణయం ఎలా ఉంటుందన్న అంశం ఎవరికీ ఒక పట్టాన అంతుపట్టడం లేదు. రాష్ట్రస్థాయిలో అనేక రాజకీయ పక్షాలు కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ సైతం కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రిని కొనసాగించే అవకాశం ఉందని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నామా కాంగ్రెస్‌లో చేరి.. ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించే అవకాశం ఉన్నా జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక నేతగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని, అదే కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఖరారైతే 2009లో టీడీపీ గెలుపొందిన ఖమ్మం సీటునే మళ్లీ టీడీపీ కోరుకునే అవకాశం ఉందని, అప్పుడు నామా కాంగ్రెస్‌తోపాటు టీడీపీని బలపరిచే రాజకీయ పక్షాల కూటమితో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం ద్వారా జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని.. ఒకవేళ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినా మిత్రపక్ష ఎంపీగా ఆయనకు మంత్రి పదవి అవకాశం ఉంటుందన్న ముందుచూపుతో ఆచితూచి అడుగులు వేస్తున్నారని, అందుకే ఎన్నికల పొత్తు.. పలు రాజకీయ పక్షాల వైఖరిపై వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు టీడీపీలోని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎదురు ప్రశ్నలే.. కాంగ్రెస్‌లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన అంశాలను సైతం నామా తన సన్నిహితులతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అంశం పార్టీ శ్రేణుల్లో.. అలాగే అభిమానుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2004 ఎన్నికల్లో ఖమ్మం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నామా.. ఆ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై ఓడిపోయారు. జిల్లా టీడీపీలో నామా, తుమ్మల వర్గాలు కొనసాగగా.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మం అభ్యర్థిగా పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓటమి చెందడం.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరడం, తొలుత మంత్రిగా.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొద్ది కాలానికే పాలేరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ద్వారా జిల్లా రాజకీయాలపై తుమ్మల మళ్లీ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇక అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న నామా తెలంగాణలో టీడీపీకి వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలను పరిశీలిస్తూ.. రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ఒక పట్టాన నిర్ణయానికి రాలేకపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో..? ఎవరికి స్నేహ హస్తం అందిస్తుందో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఎన్నికల పొత్తు వరకు రాజకీయ నిర్ణయం తీసుకోకుండా వేచి చూడటం రాజకీయంగా సరైంది కాదని నామా అనుచరులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా తాను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాననే అంశంపై సన్నిహితులకు సైతం స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆయన మనసులో ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా..? వాటి గురించి అన్వేషణ చేస్తున్నారా..? అన్న అనుమానం టీడీపీ వర్గాల్లోనూ.. ఆయన అనుచర గణంలోనూ వ్యక్తమవుతోంది. అయితే జిల్లా రాజకీయాలపై అవగాహన ఉన్న నామా తన రాజకీయ భవితవ్యంపై ఎవరు ప్రశ్నించినా.. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఎదురు ప్రశ్న వేసి రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆయా రాజకీయ పక్షాల బలాబలాలు, ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిపై దృష్టి సారించారని తెలుస్తోంది. -
మధుకాన్‌కు వరల్డ్ బ్యాంక్ షాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన నిర్మాణ రంగ కంపెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్ కు వరల్డ్ బ్యాంక్ షాకిచ్చింది. మోసపూరిత విధానాలు అవలంభించిన కారణంగా కంపెనీపై రెండేళ్లపాటు నిషేధం విధించింది. దీంతో వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం చేసే ఏ కాంట్రాక్టునూ మధుకాన్ చేపట్టే వీలు ఉండదు. లక్నో–ముజఫర్‌పూర్ నేషనల్ హైవే ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు పాల్పడినట్టు రుజువు కావడంతో వరల్డ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ పనులు మధుకాన్ దక్కించుకుంది. వరల్డ్ బ్యాంకుకు చెందిన ఇంటెగ్రిటీ వైస్ ప్రెసిడెన్సీ ఈ కేసు విచారణ చేపట్టింది. తప్పుడు పత్రాలు సృష్టించి తాత్కాలిక పేమెంట్ సర్టిఫికేట్స్‌లో ఖర్చులను పెంచి చూపించినట్టు ఈ విచారణలో రుజువయింది. అయితే వరల్డ్ బ్యాంకు నిర్ణయం ఏమాత్రం ప్రభావం చూపదని, వచ్చే మూడేళ్ల కాలానికి సరిపడా సామర్థ్యానికి మించి ఆర్డరు బుక్ ఉందని కంపెనీ వెల్లడించింది. అసలు వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టులపై తమ సంస్థ ఆధారపడి లేదని మధుకాన్ చెప్పడం గమనార్హం. 513 కిలోమీటర్ల లక్నో–ముజఫర్‌పూర్ నేషనల్ హైవే ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు సుమారు రూ.3,040 కోట్లు ఆర్థిక సాయం చేసింది. -
కోర్టు కేసా? పోలీసు కేసా?
సాక్షి, హైదరాబాద్: మహిళను దుర్భాషలాడుతూ వేధింపులకు గురిచేసిన టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు వ్యవహారంలో కొత్త ట్విస్ట్ ఎదురైంది. తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆగస్టులో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు నెలలు గడుస్తున్నా కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. దీంతో నాలుగు రోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఒకే వ్యవహారంపై అటు కోర్టులో ఇటు పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు ఉండటం వల్ల చట్టపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నామాపై కోర్టులో తేల్చుకుంటారా? లేక పోలీసు కేసుతో తేల్చుకుంటారా? అన్న దానిపై బాధితురాలికి ఆప్షన్ ఇచ్చినట్టు పోలీసు అధికారులు తెలిపారు. మా పని మేము చేస్తాం: పోలీసులు తమకు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నామని జూబ్లీహిల్స్ పోలీసులు స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన బాధితురాలి వాంగ్మూలం సేకరించే పనిలో ఉన్నామని, నామా వేధింపులు, దాడికి పాల్పడ్డ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో ఫుటేజీలు బాధితురాలి నుంచి సేకరిస్తామని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి ఇష్ట్రపకారం కోర్టులో పోరాడే హక్కు ఉందని, అలా కాక పోలీసు కేసు ద్వారా వెళ్లేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు. ఎలా అన్నది బాధితురాలి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టంచేశారు. కేసు నమోదైన తర్వాత చట్టప్రకారం తమ విచారణ సాగుతుందని, నామాకు త్వరలోనే నోటీసులిచ్చి వాంగ్మూలం సేకరిస్తామని చెప్పారు. -
మౌనం వీడిన నామా!
-
మౌనం వీడిన నామా!
సాక్షి, అమరావతి: ఓ మహిళను వేధించి.. బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు.. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మౌనం వీడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తన గురించి అందరికీ తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎవరినీ బ్లాక్మెయిల్ చేయలేదని అన్నారు. 'ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరో చెబితే విన్నాను. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తాను' అని ఆయన అన్నారు. మీపై కేసు పెట్టిన సుజాతా రామకృష్ణన్ మీకు తెలుసా? అని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండానే నామా వెళ్లిపోయారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సుజాతా రామకృష్ణన్ అనే మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన నగ్న చిత్రాలు బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ నామా బెదిరించారని, తనను ఆయన వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను ఒంటరిగా నివసిస్తున్నానని, నామా నాగేశ్వర్రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. 2013 నుంచి నామా నాగేశ్వర్రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని తెలిపారు. అయితే గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే..! బాధిత మహిళ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 'సాక్షి'కి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తనను అందరూ చూస్తారనే భయం లేదని, తన మొహాన్ని బ్లర్ చేయొద్దని కూడా కోరారు. నామా నాగేశ్వర్రావు ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే ఉన్నారని చెప్పారు. మీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా తనను వేధిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు తాను నామాతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కూడా వాట్సాప్ చేశానని, వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామా, సీతయ్యలపై కేసు నమోదు మహిళను బెదిరించిన వ్యవహారంలో మాజీ ఎంపీ నామా, సీతయ్యలపై కేసు నమోదు చేశామని, నామా బెదిరించిన ఆడియో, వీడియో టేపులు తమ వద్ద ఉన్నాయని బంజరాహిల్స్ ఏసీపీ మురళి తెలిపారు. నామా, సుజాతా రామకృష్ణన్ మధ్య విభేదాలు ఏంటనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ కేసు వెనుక పొలిటికల్ మోటివ్ ఉందా? లేదా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
నామా బూతుపురాణంపై చంద్రబాబు దాటవేత..!
-
నామా బూతుపురాణంపై చంద్రబాబు దాటవేత..!
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు బూతుపురాణంపై పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమాధానం దాటవేశారు. నామాది పర్సనల్ విషయమంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఇంకా ఆయనతో మాట్లాడలేదని అన్నారు. మరోసారి నామా భేటీ అయి చర్చిస్తానని చెప్పారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన నగ్న చిత్రాలు బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ నామా తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను ఒంటరిగా నివసిస్తున్నానని, నామా నాగేశ్వర్రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. 2013 నుంచి నామా నాగేశ్వర్రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని తెలిపారు. అయితే గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే..! బాధిత మహిళ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 'సాక్షి'కి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తనను అందరూ చూస్తారనే భయం లేదని, తన మొహాన్ని బ్లర్ చేయొద్దని కూడా కోరారు. నామా నాగేశ్వర్రావు ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే ఉన్నారని చెప్పారు. మీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా తనను వేధిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు తాను నామాతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కూడా వాట్సాప్ చేశానని, వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామా, సీతయ్యలపై కేసు నమోదు మహిళను బెదిరించిన వ్యవహారంలో మాజీ ఎంపీ నామా, సీతయ్యలపై కేసు నమోదు చేశామని, నామా బెదిరించిన ఆడియో, వీడియో టేపులు తమ వద్ద ఉన్నాయని బంజరాహిల్స్ ఏసీపీ మురళి తెలిపారు. నామా, సుజాతా రామకృష్ణన్ మధ్య విభేదాలు ఏంటనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ కేసు వెనుక పొలిటికల్ మోటివ్ ఉందా? లేదా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
అది 'నామా'కు అలవాటు..
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టిన మహిళ మీడియా ముందుకు స్వయంగా వచ్చారు. 'సాక్షి'కి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. తనను అందరూ చూస్తారనే భయం లేదని, తన మొహాన్ని బ్లర్ చేయొద్దని కూడా కోరారు. నామా నాగేశ్వర్రావు ఫేస్బుక్ ప్రొఫైల్ నిండా వేశ్యలే ఉన్నారని చెప్పారు. మీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నన్ను వేధిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు తాను నామాతో మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కూడా వాట్సాప్ చేశానని, వారు పట్టించుకోలేదని చెప్పారు. 'సాక్షి'తో బాధిత మహిళ చెప్పిన సంచలన విషయాలు -
పైసా వసూల్ ఆడియో రిలీజ్
-
పార్టీలకు.. అభిమానులకు అతీతమైనది సినిమా
– నందమూరి బాలకృష్ణ సినిమా అనేది పార్టీలకు, ఫ్యాన్స్‌కు అతీతం. మనకున్న మంచి సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ ఒకరు. మంచి పాటలిచ్చారు. నేనెప్పుడూ నా ప్రేక్షకులను, నా అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తాను’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన హీరోగా పూరి జగన్నాథ్ దర్వకత్వంలో వి.ఆనందప్రసాద్ నిర్మించిన చిత్రం ‘పైసా వసూల్’. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో వేడుక ఖమ్మంలో జరిగింది. ఆడియో సీడీని దర్శకుడు బోయపాటి శ్రీను ఆవిష్కరించి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు అందజేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘నువ్వు ఎవరు? అని అడిగితే భారతీయుణ్ణి అంటాను. ఇంకోసారి ఎవరు? అనడిగితే ‘తెలుగువాణ్ణి’ అని, మళ్లీ నువ్వు ఎవరు? అని అడిగితే నందమూరి తారకరామారావుగారి కొడుకుని అని చెబుతాను. మళ్లీ మళ్లీ నువ్వు ఎవరు? అనడిగితే అన్న (నందమూరి తారకరామారావు) అభిమానిని అని చెబుతాను. ఆయన బిడ్డగా, కళాతమతల్లి బిడ్డగా రావడం ఆనందంగా ఉంది. నటీనటుల నుంచి మంచి హావభావాలు రాబట్టుకోగల సమర్థుడు పూరి. ఈ 101వ సినిమా నాకు ఒకటో సినిమాతో సమానం. ఈ సినిమా ‘రీ–లాంచింగ్ ఆఫ్ బాలకృష్ణ’ అవుతుంది. నటుడు నిత్యావసర సరుకులాంటి వాడు. ఎప్పుడూ విజ్ఞానాన్ని, వినోదాన్ని ఇస్తుండాలి. సెట్లో నిర్మాత మంచి వాతావరణాన్ని సృష్టించారు’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘అందరూ బాలయ్యకు కోపం అంటుంటారు. అవును.. కోపమే. దానికి కారణం ఉంటుంది. ఆయన మాటిస్తే హరిశ్చంద్రుడు. ఎదుటివారు మాట తప్పితే విశ్వామిత్రుడు. ఆ నిజం తెలిసినవారు ఆయనతో పని చేస్తే అద్భుతాలు చూడగలరు’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ఇన్నేళ్లుగా బాలయ్యతో ఎందుకు పని చేయలేదని బాధపడ్డాను. అంత మంచి మనిషి. కోపం వచ్చినా ముఖం మీదే. ప్రేమ వచ్చినా ముఖం మీదే. ముక్కుసూటి మనిషి. ఇది ఆయనకు 101వ సినిమా. కానీ, దూకుడు చూస్తుంటే ఫస్ట్ సినిమా అనిపించింది. వేరే హీరోలు బయటకు వెళితే బౌన్సర్లు కావాలేమో! బాలయ్యకు అవసరం లేదు. ఫ్యాన్స్‌ను ఆయనే కంట్రోల్ చేసుకోగలరు. మీద పడుతుంటే కొడుతుంటారు. కామన్సెన్స్ ఏరియాలో తేడా వచ్చినప్పుడు మాత్రమే కొడతారు. ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బాలయ్యకు, ఫ్యాన్స్‌కు ఉన్న రిలేషన్ అది. భవిష్యత్‌లో బాలయ్య ఎవరినన్నా కొడితే అది లవ్‌స్టోరి. సీరియస్‌గా తీసుకోవద్దు. కోకోకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ. సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.