సాక్షి, న్యూఢిల్లీ : ‘పార్లమెంట్‌లో ఆమోదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రజలకు రోడ్లపైకి వస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్‌పీఆర్)లను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి’ అని టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు(కేకే) అన్నారు. గురువారం ఆయన టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.
(చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది)
సమావేశాననంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ ఆందోళనపై సభలో చర్చ జరగాలని సూచించామన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై ఏ ముఖ్యమంత్రి చెప్పనట్టుగా తమ అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. అసెంబ్లీలో తీర్మాణం కూడా చేస్తామని పేర్కొన్నారు. సీఏఏ బిల్లును గతంలోనే తమ పార్టీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. సీఏఏ అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటిగా కేంద్ర తీసుకుంటుందని, ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్దమని కేకే మండిపడ్డారు. విభజన హామీలపై ఒక రోజు మెత్తం పార్లమెంట్‌లో చర్చించాలని ప్రధాని మోదదీని కోరామని కేకే పేర్కొన్నారు.
సీఏం కేసీఆర్ ఆనాడే చెప్పారు
సీఏఏ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే చెప్పారని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. సీఏఏను దేశ ప్రజలతో పాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయి ఆరు ఏండ్లు అయినా విభజన హామీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై సభలో చర్చించాలని అఖిపక్ష సమావేశంలో చెప్పినట్లు నామా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment