K Keshava Rao
-
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కే.కేశవరావు(కే.కే) తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ అఫైర్స్)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో జారీచేసింది. కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, కేసీఆర్‌కు సన్నిహితుడైన కె. కేశవరావు బుధవారం ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన తన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే తాను కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కాగా.. అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్‌లో బుధవారం చేరారు. కేకే.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పార్టీ మారిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది: కేకే ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాతిరోజు సీనియర్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ నా సొంత ఇల్లు. నేను కాంగ్రెస్ మనిషిని. తిరిగి పార్టీలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా కూడా ఉంది. నైతిక విలువలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇదే విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ కూడా అదే చెప్పాను అని అన్నారాయన. అలాగే.. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపైనా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కాంగ్రెస్ ఎంపీల పోరాటం వల్లే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక పాలన ప్రజాస్వామ్య బద్దంగా ఉంది. ఆరు నెలల్లో ఎవరిని కూడా అంచనా వెయలేం. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవాళ్లు. కానీ, ఈ ఆరు నెలల్లో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలనే చూశా అని అన్నారు. కేకేకు ప్రత్యేక సలహాదారు పదవి?రెండేళ్ల పదవీకాలం ఉండగానే కేకే రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో ఆ సీటు మరొకరికి దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే త్వరలో కేకేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవి దక్కవచ్చనే ప్రచారం ఒకటి మొదలైంది. -
మోకాలి గాయం వేధిస్తున్న.. ఓటేసిన కేకే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మోకాలి గాయం వేధిస్తున్న ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకున్నారు రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు. కొద్దిరోజుల క్రితమే ఆయనకు మోకాలి ఆపరేషన్ జరిగింది. ఎన్నికల నాటికి ఆయన బయటికి వచ్చి ఓటు వేస్తారో వేయరు తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ఆయన వీల్ చైర్ లో బంజారాహిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటింగ్ రోజున ఇచ్చే సెలవుని ఓటు హక్కు కోసం మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ సొంత ఇల్లులాంటిది..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్లో చేరా ‘బీఆర్ఎస్లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరా. కానీ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యస భకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్ఎస్కు ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు. నేను బీఆర్ఎస్లో ఉండి చేసేదేమీ లేదు ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు. కేసీఆర్‌కు కూడా ఇదే చెప్పా. బీఆర్ఎస్కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు. నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్‌కుమార్ పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే. కేకే నివాసానికి ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్‌తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్ విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్‌తో జరిగిన భేటీలో బీఆర్ఎస్లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్‌ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్ పదవి ఇచ్చా. మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కారు దిగనున్న కడియం, కేకే, అల్లోల
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ.. భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు ప్రకటించారు. ఎప్పుడు చేరేది అతిత్వరలో వెల్లడిస్తానని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని కేశవరావు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వరంగల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించాక కూడా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. కాగా కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతుండటం, చివరకు టికెట్ దక్కించుకున్న వారు సైతం వేరే పార్టీలోకి వెళుతుండటం బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తోంది. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడం ఇప్పటికే ఖాయం కాగా.. ఇలా ఇద్దరు నేతలు దాదాపుగా ఒకే సమయంలో తమ కుమార్తెలతో సహా బీఆర్ఎస్ను వీడనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్లో చేరా ‘బీఆర్ఎస్లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరా. కానీ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్ఎస్కు ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు. నేను బీఆర్ఎస్లో ఉండి చేసేదేమీ లేదు ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు. కేసీఆర్‌కు కూడా ఇదే చెప్పా. బీఆర్ఎస్కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు. నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్‌కుమార్ పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే. కేకే నివాసానికి ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్‌తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్ విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్‌తో జరిగిన భేటీలో బీఆర్ఎస్లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్‌ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్ పదవి ఇచ్చా. మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం. -
రాజ్యసభ స్టాండింగ్ కమిటీల ఏర్పాటు.. తెలుగు ఎంపీలకు చోటు
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. కమిటీల ఏర్పాటుపై నవంబర్ 2వ తేదీన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ కమిటీలకు సంబంధించిన వివరాలను బులిటెన్‌లో విడుదల చేసింది. కాగా, పలు కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ ధన్కర్ చోటు కల్పించారు. - ఇక, తొమ్మిది కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజ్యసభ సభ్యులకు చోటుదక్కింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఎథిక్స్ కమిటీల్లో విజయ సాయి రెడ్డి(వైఎస్సార్సీపీ), కే. కేశవరావు (టీఆర్ఎస్)లకు చోటు కల్పించారు. - కమిటీ ఆన్ రూల్స్‌లో డాక్టర్ కె. లక్ష్మణ్(బీజేపీ), కమిటీ ఆన్ ప్రివిలైజెస్‌లో జీవీఎల్ నర్సింహారావు(బీజేపీ), కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్లో కేఆర్ సురేశ్ రెడ్డి (టీఆర్ఎస్)లకు అవకాశం దక్కింది. - హౌజ్ కమిటీకి చైర్మన్‌గా సీఎం రమేశ్(బీజేపీ)నియామకం, సభ్యుడిగా బి. లింగయ్య టీఆర్ఎస్)లు చోటు దక్కించుకున్నారు. ఇక.. కమిటీ రూల్స్, కమిటీ ప్రివిలేజెస్, బిజినెస్ అడ్వైజరీ కమిటీలకు చైర్మన్‌గా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కొనసాగనున్నారు. -
తెలంగాణపై కేంద్రానికి ఎందుకు వివక్ష?
సాక్షి, న్యూఢిల్లీ: ‘తెలంగాణ పట్ల కేంద్రానికి ఎం దుకు వివక్ష? రాష్ట్రాన్ని ఎందుకు శత్రువులా చూస్తున్నారు, ఎందుకు విరోధం పెంచుకుంటున్నారు’ అని టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్యలను పరిష్కరించడంలో ఎనిమిదేళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. సోమవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను వీరిద్దరూ లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్కప్రాజెక్టులో కూడా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. దేశంలో అనేక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ' ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులా? పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, ఐజీఎస్టీ నిధులను రాష్ట్రాలకు ఎందుకు విడుదల చేయట్లేదో తెలపాలని ఎంపీలు డిమాండ్ చేశారు. వరి ధాన్యం సేకరణలో జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని తీసుకురావాలని కోరారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నాయన్నారు. ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ రూపంలో పార్లమెంట్‌ను కూడా వాడుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర విచారణ సంస్థలను కేంద్రం తన అవసరాలకు వీటిని ఉపయోగించవద్దని పేర్కొన్నారు. ( చదవండి: India Budget 2022-23 Highlights ) పెగసస్‌పై చర్చ జరగాలి పెగసస్ స్పైవేర్ సమస్య వంటి జాతీయ భద్రత అంశంతోపాటు ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని కేకే తెలిపారు. దేశంలో ఉపాధి కల్పనకు కేంద్రం చర్యలు తీసుకోవట్లేదని నామా విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభవృద్ధి కోసం కేం ద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్లు చెల్లించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందనలేదన్నారు. కాగా సోమవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభ య సభలను ఉద్దేశించి జరిగిన రాష్ట్రపతి ప్రసంగానికి టీఆర్ఎస్ ఎంపీలు హాజరు కాలేదు. -
పీవీ నరసింహారావు స్థితప్రజ్ఞుడు: కేకే
హిమాయత్‌నగర్: సంఘ సంస్కరణకర్తగా, సామాజికవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ దురంధరుడిగా దివంగత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు అందించిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు, పి.వి.శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. అందుకే ఆయన్ని ప్రతిఒక్కరూ ‘స్థిత ప్రజ్ఞడు’గా కొనియాడుతున్నారని, ఈ పదం పి.వి.కి నూటికి నూరుశాతం సరిపోతుందని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి రచించిన ‘జాతిరత్న పి.వి.నరసింహారావు’గ్రంథాన్ని సోమవారం ఇక్కడి తెలుగు అకాడమీలో ఆయన ఆవిష్కరించారు. కేశవరావు మాట్లాడుతూ ‘పి.వి.పై ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంతో పుస్తకాన్ని, గ్రంథాన్ని రచిస్తున్నారు. ఒక్కో పుస్తకంలో ఒక్కో కోణాన్ని మనం గమనించి దానిని అనుసరించాలి’అని అన్నారు. కేవలం 560 పేజీలతో పి.వి.జీవితాన్ని లెక్కించలేమని పేర్కొన్నారు. ‘మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణం తర్వాత దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో పి.వి. ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఆయన అధిగమించారు. ప్రత్యేక పంజాబ్ కావాలని వేర్పాటువాదులు పోరాడుతున్న సమయంలో అక్కడ ఎన్నికలు జరిపించి శాంతి సామరస్యాలను సాధించిన ధైర్యసాహసిగా పీవీ నిలిచారు’అని కొనియాడారు. పీవీ గొప్ప పాలనాదక్షుడని పేర్కొన్నారు. తన తండ్రి పీవీ సంస్కరణాభిలాషి అని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవలి తెలుగు అకాడమీ కుంభకోణం వార్తలు ఎంతో బాధించాయన్నారు. పీవీ గురించి ఓ గ్రంథాన్ని రాయడం నిజంగా వరంలాగా భావిస్తున్నానని ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అన్నారు. కార్యక్రమంలో అకాడమీ పూర్వ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అవ్వం పాండయ్య తదితరులు పాల్గొన్నారు. -
దళితబంధు మరో సామాజిక ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: దళితబంధు మరో సామాజిక ఉద్యమమని, ఈ కార్యక్రమం అమలు కోసం సీఎం కేసీఆర్ సంకల్పాన్ని బలపరిచి మనమంతా ముందుకు సాగాలని టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు (కేకే) పిలుపునిచ్చారు. తెలంగాణలో దళితబంధు అనే కొత్త ఉద్యమం తీసుకొచ్చారని, దీని అమలు కోసం ఎన్నో అవరోధాలు, కష్టాలు వస్తాయని చెప్పారు. కేసీఆర్ ఉక్కు సంకల్పంతో దళితబంధు అమలవుతుందని, ఆయన నాయకత్వంలో చేసినంత అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేశవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం 200 ఏళ్లు బ్రిటిష్ వారిపై పోరాడామని అనేక మంది ప్రాణత్యాగం ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘బల్దియా’ రాణులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్‌గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీలో ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం లేకపోవడంతో టీఆర్ఎస్, బీజేపీలు బరిలో నిలవగా రెండు పదవులు కూడా గులాబీనే వరించాయి. బుధవారం ఎంఐఎం కూడా విప్‌ను నియమించడంతో పోటీలో ఉంటుందని భావించినా.. ఎంఐఎం నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు. మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులకూ ఎంఐఎం సభ్యులు టీఆర్ఎస్కే ఓట్లు వేశారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలైనందున ఎంఐఎం వైఖరి ఎలా ఉంటుందోనని పలువురు భావించినా.. ఎంఐఎం సైతం టీఆర్ఎస్కు మద్దతు పలకడంతో గత పాలకమండళ్ల తరహాలోనే ఈసారి కూడా టీఆర్ఎస్, ఎంఐఎం సఖ్యతతోనే పనిచేయగలవని భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనే వరిస్తుందనుకున్నా.. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తనయ అయిన విజయలక్ష్మిని గత ఎన్నికల్లోనే మేయర్ పదవి వరిస్తుందని భావించినా.. అప్పట్లో ఆమెకు టికెట్ లభించలేదు. విజయలక్ష్మి ఉన్నత విద్యావంతురాలు, విదేశాల్లో ఉండి వచ్చారు. కాగా, టీఆర్ఎస్ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న మోతె శోభన్‌రెడ్డి సతీమణి మోతె శ్రీలతను మేయర్ పదవి వరించనుందని ప్రచారం జరిగినా.. ఆమెకు డిప్యూటీ మేయర్ అవకాశం కల్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ మహిళలే కావడం విశేషం. డిప్యూటీ మేయర్‌గా మైనార్టీ వర్గాలకు టీఆర్ఎస్ అవకాశం కల్పిస్తుందని తొలుత భావించినా అలా జరగలేదు. ఐదో మహిళా మేయర్.. గద్వాల విజయలక్ష్మి బల్దియాకు 26వ మేయర్ కాగా, ఐదో మహిళా మేయర్. చివరి వరకు పలు ఊహగానాలు, ఉత్కంఠ నెలకొన్నా.. ఎన్నికల ప్రక్రియ మొత్తం 20 నిమిషాల్లోనే ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియా పరిశీలకులుగా వ్యవహరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ముందు ఉదయం 11 గంటలకు కొత్తగా కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల వారీగా గ్రూపులుగా విడదీసి అందరినీ ఒకేసారి ప్రమాణం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రక్రియ ఇలా సాగింది.. ఎన్నిక ప్రారంభం కాగానే ఎంఐఎం ఓటు వేస్తుందా లేదా తటస్థంగా ఉంటుందా అన్న ఉత్కంఠ సభలో నెలకొంది. అయితే ఎంఐఎం సభ్యులంతా టీఆర్ఎస్ సభ్యులతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేశారు. దీంతో బీజేపీ సభ్యులు సభలో కొద్దిసేపు గొడవ చేశారు. టీఆర్ఎస్ సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులు సహ మొత్తం బలం 88 మంది ఉన్నా.. ఎన్నికయ్యేందుకు వారంతా అవసరం లేకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలందరూ హాజరు కాలేదు. వారి ఎక్స్అఫీషియో ఓట్లను ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున వాటిని ఇక్కడ వినియోగించుకోలేదని టీఆర్ఎస్ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మాత్రమే ఉండటంతో, వారు ఎవరికీ ఓట్లు వేయొద్దని నిర్ణయించుకుని ఎన్నిక ప్రక్రియలో పాలు పంచుకోలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్లిపోయారు. -
సర్వత్రా ఉత్కంఠ.. సీల్డ్ కవర్లో సీక్రెట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ ఎంపికపై అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్స్ అఫీషియో సభ్యుల సాయంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పార్టీ ఖాతాలో చేరనుండటంతో మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై టీఆర్ఎస్ నేతల్లో ఆసక్తి నెలకొంది. మేయర్ అభ్యర్థి పేరును సీల్డ్ కవర్లో పంపిస్తామని స్వయంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. సుమారు అరడజను కార్పొరేటర్ల పేర్లు మేయర్ పదవికి తెరమీదకు వస్తున్నా గ్రేటర్ పరిధిలోని మంత్రులకు కూడా ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని వారి సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. తెరమీదకు వస్తున్న పేర్లు ఇవే.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్), మోతె శ్రీలత (తార్నాక), సింధు ఆదర్శ్‌రెడ్డి (భారతీనగర్) పేర్లు ప్రధానంగా తెరమీదకు వస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. వీరితో పాటు చింతల విజయశాంతికి ఓ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ మేయర్ అభ్యర్థిని బుధవారం రాత్రి ఖరారు చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే డిప్యూటీ మేయర్ పదవిని మైనారిటీ మహిళలకు ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి అల్లాపూర్ డివిజన్ నుంచి ఎన్నికైన రెహనా బేగంకు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారానికి గురువారం ఉదయం తెలంగాణ భవన్లో అల్పా హారం తర్వాత కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని మంత్రులు కూడా జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో తరలి వెళ్తారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాతే పార్టీ అధినేత కేసీఆర్ సీల్డ్ కవర్లో సూచించిన మేయర్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశ ముందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతు కీలకం కావడంతో మేయర్ అభ్యర్థి ఎంపికలో ఎలాంటి అసంతృప్తి బయట పడకుండా ఉండేందుకు నాయ కత్వం చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఆశావహుల ఇళ్ల వద్ద హడావుడి సీల్డ్ కవర్ ద్వారా మేయర్ అభ్యర్థి పేరును ప్రకటిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా ఔత్సాహిక అభ్యర్థుల ఇళ్ల వద్ద బుధవారం సాయంత్రం నుంచే హడావుడి నెలకొంది. మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి, విజయారెడ్డి, మన్నె కవిత అనుచరులు కూడా తమ కార్పొరేటర్లకు అవకాశముందంటూ హడావుడి చేస్తుండ టంతో ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే పార్టీ తరఫున గెలుపొందిన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను గురువారం ఉదయం 8.30కు పార్టీ రాష్ట్ర కార్యా లయం తెలంగాణ భవన్‌కు చేరుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆదేశించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఉదయం 9 గంట లకు జరిగే ప్రత్యేక భేటీలో పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావుతో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటారు. చదవండి: (గోదారితో కాళ్లు కడుగుతా: సీఎం కేసీఆర్) -
వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని, సాగు అనేది రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశమని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వ్యాఖ్యానించారు. అయితే ఈ చట్టాలను మొత్తానికే రద్దు చేయాలని రైతులు తీసుకున్న దృఢ వైఖరిని తాను అంగీకరించడం లేదన్నారు. రైతులు కోరుతున్న సవరణలు సమ్మతించదగినవని పార్లమెంటు భావించినప్పుడు ఆ మేరకు సవరణలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ మన దేశంలో మొదటి విడత ప్రారంభమైంది. వ్యాక్సిన్ తెచ్చిన రెండు సంస్థలకు, సైంటిస్టులకు అభినందనలు. మనం చక్కటి బడ్జెట్ చూశాం. ఆరోగ్య రంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. అయితే మందుల సరఫరా, వైద్య సిబ్బంది తగినంతగా లేరు. దీనిపై దృష్టిపెట్టాలి. ఈరోజు దేశంలో రగులుతున్న సమస్యపై నాకు కూడా ఆందోళన ఉంది. రైతుల ఉద్యమం గురించి నేను మాట్లాడుతున్నాను. మనం మరికొంత ప్రజాస్వామికంగా, ఇంకాస్త సర్దుబాటు, ఔదార్యంతో వ్యవహరించే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. బిల్లులు గందరగోళం మధ్య ఆమోదం పొందాయి. సభ్యుల ఆందోళనల నడుమ సవరణలు ప్రతిపాదించే అవకాశం కూడా లేకుండాపోయింది. చర్చలకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ ప్రభుత్వం మద్దతు ధరకు (ఎమ్మెస్పీకి) సిద్ధంగా ఉన్నామని చెబితే.. దానిని చట్టంలో పెట్టడంలో ఉన్న అభ్యంతరమేంటి? పలు అంశాల పట్ల తాము సానుకూలమని ప్రభుత్వం సమాధానం ఇస్తోంది. అయితే అనేక అంశాలకు ఇంకా పరిష్కారం దొరకలేదని రైతు నాయకులు చెబుతున్నారు. అపరిష్కృత అంశాలేమిటో మనకు తెలియడం లేదు. అందువల్ల వీటిని పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉంది. చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు తీసుకున్న దృఢమైన వైఖరిని నేను అంగీకరించడం లేదు. ఒకవేళ రైతులు కోరుకున్న మార్పులు హేతుబద్ధంగా ఉంటే, అవి వాస్తవమేనని సభ అంగీకరిస్తే, ఆ మేరకు సవరణలు చేయాలి. ఆనాడు సెలెక్ట్ కమిటీకి పంపి ఉంటే సమస్య పరిష్కారమై ఉండేదని భావిస్తున్నా. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వడం కంటే... మనమే ఒక పరిష్కారం చూపడం మంచిదని భావిస్తున్నా’అని కేశవరావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో... మార్కెట్ కమిటీలు కొనసాగుతాయని, కనీస మద్ధతు ధర కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఒకవేళ అవసరమైతే మేం దానికి చట్టం తెస్తాం’అని కేకే పేర్కొన్నారు. -
కేవలం వ్యాక్సిన్‌తోనే సమస్య తీరదు: కేకే
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు, వ్యాధి సోకిన వారి వైద్య చికిత్సకు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు అన్నారు. కరోనా ఓ జాతీయ విపత్తు అని, దీన్ని దేశమంతా కలిసి ఎదుర్కోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాలను, అన్ని రాజకీయ పక్షాలను సంప్రదించి ముందుకుపోవాలనే ప్రధానమంత్రి మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకులతో మాట్లాడారు. టీఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, లోకసభ నాయకుడు నామా నాగేశ్వర్ రావు హైదరాబాద్ నుంచి పాల్గొన్నారు. చదవండి: బెస్ట్ ఠాణాగా జమ్మికుంట ‘‘కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ వస్తుంది. దీన్ని ప్రాధాన్యతా క్రమంలో అందరికీ వేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం మన ముందున్న సవాల్. ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా, ఓ ప్రణాళిక ప్రకారం చేయాలి. దీని కోసం ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేవలం వ్యాక్సిన్‌తోనే సమస్య సమసిపోదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. రాబోయే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. సెకండ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు కొనసాగాల్సి ఉంది’’ అని కేశవరావు వివరించారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ అందించడం కోసం అవసరమైన ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం చేశారు. ముందుగా వైద్య సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ చైన్ సిద్ధం చేశారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు అమలు అవుతున్నాయి. పరీక్షల సంఖ్య బాగా పెరిగింది. పరీక్షలు చేసిన వారిలో సగటున 1.1 శాతం మంది మాత్రమే పాజిటివ్‌గా తేలుతున్నారు. రికవరీ దాదాపు 96 శాతం ఉంది. చనిపోతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది’’ అని కేకే పేర్కొన్నారు. -
అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశాం
-
బిడ్డా.. నువ్వు గెలవాలి: కేకే
సాక్షి, బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ డివిజన్ నుంచి మరోసారి తన కూతురు విజయదుందుభి మోగించాలని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు కూతురు గద్వాల్ విజయలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందించి ఆశీర్వదించారు. గురువారం ఉదయం ఆమె నామినేషన్ వేసేకంటే ముందు తన తండ్రిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. 2016 ఎన్నికల్లో కూడా ఆమె నామినేషన్ వేసే ముందు తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సెంటిమెంట్‌గా ఈ సారి కూడా తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. తన తండ్రే తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా విజయలక్ష్మి పేర్కొన్నారు. చదవండి: గ్రేటర్ ఎన్నికలు: నేను.. నా నేర చరిత! డమ్మీ నామినేషన్.. చాన్స్మిస్ కూకట్పల్లి: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మమ్మీ అనూహ్యంగా టికెట్ దక్కించుకొని విజయం సాధించింది. ఈసారి కూడా డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలనుకున్న ఆమెకు.. కూతురుకు కూడా నిరాశే ఎదురైంది. వివేకానందనగర్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీబాయి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పడు అనుకున్న అభ్యర్థి ఆమె కూతురు మాధవరం స్వాతితో కలిసి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్దకు చేరుకుంది. స్వాతి పేరు ఓటర్ లిస్టులో లేకపోవటంతో టిక్కెట్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆమెతో పాటే వచ్చిన స్వాతి తల్లి మొలుగు లక్ష్మీబాయి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. ప్రత్యర్థి మాధవరం రంగారావు సతీమణి రోజాపై గెలుపొందింది. ఈసారి స్వాతి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకొని టికెట్ కోసం ఎదురుచూస్తోంది. మళ్లీ లక్ష్మీబాయి డమ్మీ నామినేషన్ వేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఈసారి స్వాతికి టికెట్ దక్కలేదు. చదవండి: ఒంటరి పోరుకు సిద్ధమైన మజ్లిస్.. అక్కా.. నీ ఆశీస్సులు కావాలి వెంకటేశ్వరకాలనీ: అక్కా... నీ అండ కావాలంటూ వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె కవిత గురువారం టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ కార్పొరేటర్ భారతి నాయక్‌ను కోరారు. బుజ్జగింపు పర్వంలో భాగంగా ఆమె ఉదయమే భారతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సమావేశమై తన గెలుపునకు సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు భారతి ఆనందం వ్యక్తం చేస్తూ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కవిత గెలుపును తన గెలుపుగా తీసుకుంటానన్నారు. యంగ్.. తరంగ్... బంజారాహిల్స్: ఎన్నికల్లో యువత పోటీ చేసినప్పుడే అభివృద్ధి జరుగుతుందని నేటి యువకులు భావిస్తున్నారు. రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా అవినీతిని అంతమొందించవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో తామే పోటీ చేసి గెలిచి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ డివిజన్ బీజేపీ టికెట్ ఆశిస్తూ ప్రేమ్‌నగర్‌కు చెందిన ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి మోరంగంటి సాయికృష్ణారెడ్డి(24) నామినేషన్ వేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో తాను బరిలోకి దిగుతున్నానని ఆయన వెల్లడించారు. సోమాజిగూడ డివిజన్ నుంచి టీడీపీని టికెట్‌ను ఆశిస్తూ బిలావర్ హరిత(25) అనే ఎంబీఏ విద్యార్థిని నామినేషన్ దాఖలు చేశారు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షతో బరిలోకి దిగినట్లు ఆమె స్పష్టం చేశారు. కన్నీటి పర్యంతమైన మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వరకాలనీ: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం లభిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూసిన మాజీ కార్పొరేటర్ బి.భారతికి నిరాశే ఎదురైంది. పనితీరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మన్ననలు అందుకున్న సిట్టింగ్ కార్పొరేటర్ మన్నె కవిత అభ్యర్థిత్వంవైపే అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో భారతికి టిక్కెట్ దక్కలేదు. బుజ్జగింపు పర్వంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే దానం నాగేందర్, అభ్యర్థి మన్నె కవిత, ఇన్చార్జి ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లు భారతి ఇంటికి చేరుకొని ఆమెను బుజ్జగించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తమ నేత దానం నాగేందర్ ఎలా చెబితే అలా నడుచుకుంటామని, కవితకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా భారతి స్పష్టం చేశారు. -
రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న వ్యవసాయ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలిపారు. లోక్‌సభలోనూ ఈ బిల్లును తాము వ్యతిరేకించామని, కానీ బీజేపీకున్న సంఖ్యా బలం వల్ల అక్కడ ఆమోదం పొందిందని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీ కె.కేశవరావు ఆధ్వర్యంలో రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదం పొందకుండా తమ పార్టీ అడ్డుకుంటుందని ఆయన వెల్లడించారు. శనివారం ఢిల్లీలో విజయ చౌక్ వద్ద విలేకరులతో ఎంపీలు కేశవరావు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్ కుమార్, ఆర్.రాములు, బడుగుల లింగయ్య యాదవ్, సురేశ్‌రెడ్డి, పి.దయాకర్, మాలోత్ కవిత మాట్లాడారు. దేశ రైతాంగాన్ని దెబ్బతీసేలా ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వారిని బిచ్చగాళ్లను, కూలీలను చేయాలనుకుంటోందా అని నామా ప్రశ్నించారు. ఈ బిల్లుల వల్ల దేశంలో చిన్న రైతులు దెబ్బతింటారని పేర్కొన్నారు. గతంలో జమీందారీ వ్యవస్థ ఉండేది.. ఇప్పుడు కంపెనీ వ్యవస్థ తెస్తున్నారు అని మండిపడ్డారు. దిగుమతి సుంకాన్ని 50 శాతం నుంచి 35 శాతానికి తగ్గించి 50 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుమతికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో కాటాలు పెట్టి రైతుల దగ్గరకు వెళ్లి 9 లక్షల టన్నుల మొక్కజొన్నను రూ.1,750 కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిందన్నారు. మరోవైపు తమ రాష్ట్రంలో రూ.700 కూడా మొక్కజొన్నను కొనే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ దిగుమతి వల్ల బిహార్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, యూపీ మొత్తం పది రాష్ట్రాల్లోని రైతులకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని రైతుల కంటే విదేశీ రైతులపై అంత ప్రేమ ఎందుకని నామా ప్రశ్నించారు. కరోనా, జీడీపీ తగ్గుదలతో అతలాకుతలమవుతోన్న దేశంలో రైతు వ్యతిరేక బిల్లులు ఎందుకు తెస్తున్నారని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా వ్యవహరిస్తుంటే, మోదీ ప్రభుత్వం కాంట్రాక్టు ఫార్మింగ్, ట్రేడ్ అగ్రిమెంట్లంటూ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. కార్పొరేట్లను పోషించేందుకే.. రైతుల నడ్డి విరగ్గొట్టే వ్యవసాయ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తామని లింగయ్య యాదవ్ తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణ యంతో దేశంలో ఉన్న 70 శాతం రైతులకు నష్టం వాటిల్లుతుంన్నారు. కార్పొరేట్ సంస్థలను పోషించేందుకే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చర్యలు చేపట్టిన ఏ ప్రభుత్వం బాగుపడలేదన్నారు. ఇంతకాలంగా బీజేపీతో కలసి ఉన్న అకాలీదళ్ మంత్రి వ్యవసాయ బిల్లుపై రాజీనామా చేశారంటే సమస్య తీవ్రత ప్రభుత్వానికి అర్థం కావడం లేదా అని పి.రాములు అన్నారు. పెద్ద కంపెనీలకు అనుకూలంగా.. ప్రతి విషయంపైనా చీటికీమాటికీ ఆర్డినెన్స్‌లు తెస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆర్డినెన్స్‌ల రాజ్యంగా ఆ పార్టీ మారిందని కేశవరావు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పెద్ద కంపెనీలకు అనుకూలంగా మారుస్తోందని ఆరోపించారు. మొక్కజొన్న రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా దిగుమతి సుంకాన్ని తగ్గించి 50 లక్షల టన్నుల మొక్కజొన్నను దిగుమతికి అనుమతించిందన్నారు. -
కేంద్రంతో ఇక బిగ్‌ఫైట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు కావొస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు విమర్శించారు. నదీ జల వివాదాలు, జీఎస్టీ పరిష్కారం, విద్యుత్ సంస్కరణలు తదితర అంశాలపై తమతో కలిసి వచ్చే పార్టీలతో పార్లమెంట్ లోపల, బయట నిరసన తెలియ జేస్తామని వెల్లడించారు. జీఎస్టీ పరిహారా నికి సంబంధించి పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తామన్నారు. ముఖ్యమంత్రితో టీఆర్ఎస్ ఎంపీల భేటీ అనంతరం ఆ వివరాలను గురువారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు, పార్టీ ఎంపీలతో కలసి కేకే మీడియాకు వెల్లడించారు. కేంద్రానికి ఇన్నాళ్లూ సహకరిస్తూ వచ్చామని, ఈ సమావేశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ రాజ్యాంగ పదవులను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ఆ పదవికి పోటీ చేయమని తనను కాంగ్రెస్ పార్టీ సంప్రదించిందని తెలిపారు. తెలంగాణ బిడ్డలైతే మాట్లాడాలి... రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్లో టీఆర్ఎస్ జరిపే పోరాటానికి రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కలిసి వస్తారో లేదో తేల్చుకోవాలని నామా సవాల్ చేశారు. రాష్ట్ర సమస్యలపై ఏడేళ్లుగా సీఎం కేంద్రానికి ఎన్నో ఉత్తరాలు రాశారని, ఇకపై కేంద్రాన్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించాలనే కేంద్రం ఆలోచనను బీజేపీ ఎంపీలు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ముఖం చాటేస్తున్న కేంద్రం... కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారంలో కేంద్రం ముఖం చాటేస్తోందని, దేశంలో 70వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నా.. 40వేల టీఎంసీల నీటినే వినియోగించుకునే స్థితిలో ఉన్నామని కేకే, నామా వివరించారు. రాష్ట్రానికి 10.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 8.79 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే విడుదల చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణల పేరిట ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను కేంద్రం చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. జాతీయ రహదారులు, నవోదయ పాఠశాలలు, టెక్స్టైల్ పార్కు, ఎయిర్‌స్ట్రిప్‌లకు అనుమతి విషయంలో కేంద్రం వైఖరిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ పరిహారం, ఐజీఎస్టీ, బీఆర్జీఎఫ్ తదితరాల రూపంలో రాష్ట్రానికి 8,850 కోట్లు రావాల్సి ఉందని వెల్లడించారు. సీఎం దిశానిర్ధేశం... అంతకుముందు టీఆర్ఎస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ నెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వివరించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. -
కొలంబస్లో పీవీ శతజయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. అమెరికాలోని ఓహియో రాష్ట్రం కొలంబస్లో టీఆర్ఎస్ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ మహేశ్ తన్నీరు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేకే ప్రసంగించారు. దివంగత మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలనే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, మారిషస్‌లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ప్రకటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలనే ఆన్లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీవీ కుమార్తెలు వాణీదేవి, సరస్వతితో పాటు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ రీజినల్ కోఆర్డినేటర్ కానుగంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
జనరల్ పర్పసెస్ కమిటీ సభ్యుడిగా కేకే
సాక్షి, న్యూఢిల్లీ: సభా వ్యవహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేసే జనరల్ పర్పసెస్ కమిటీని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యులు ఐదుగురు, స్టాండింగ్ కమిటీల చైర్మన్లు ఆరుగురు, ఒక గుర్తింపు పొందిన పార్టీ ఫ్లోర్ లీడర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. స్టాండింగ్ కమిటీల చైర్మన్ కోటాలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ కె.కేశవరావు ఈ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట సమీపంలో స్వామి రామానందతీర్థ ఔషధ కేంద్రంలో స్వామి రామానందతీర్థ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ సురభి వాణిదేవి, పరిశోధనా సంస్థ అధ్యక్షుడు పీవీ ప్రభాకర్‌రావు ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహావిష్కరణ, శత జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరయ్యారు. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె.కేశవరావు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాలను ఆరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. పీవీకి భారతరత్న కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్లో ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. పీవీ పేరుతో తెలంగాణలో త్వరలో ఆడిటోరియం నిర్మించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు వివరించారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ.. పీవీ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహించేం దుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మన ప్రాంత మహనీయుల సేవలను భావి తరాలకు తెలియజేసే అవకాశం తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యమైందన్నారు. -
లాక్డౌన్ కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్డౌన్ మినహా మరో మార్గం లేదని టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. పరిస్థితి కుదుట పడేంత వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కేంద్రానికి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పార్లమెంటరీ పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ పక్షాన ప్రగతి భవన్ నుంచి పార్టీ పార్లమెంటరీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వైఖరిని కె.కేశవరావు ప్రధాని మోదీకి తెలియజేశారు. ‘కేంద్ర, రాష్ట్రాలు కలసికట్టుగా పనిచేస్తూ కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి. సీఎం కేసీఆర్ దీని కోసం నిర్విరామంగా కష్టపడుతున్నారు. లాక్డౌన్ చేయాలా వద్దా అనే అంశంపై అందరిలోనూ ఏదో ఒక ఆలోచన ఉంది. లాక్డౌన్ వల్ల కష్టనష్టాలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే ఉత్తమ మార్గం. వైద్య సదుపాయాల్లేని గ్రామీణ ప్రాంతాలకు ఇది విస్తరిస్తే పరిస్థితి చేయిదాటే అవకాశముంది. మన ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నా మానవ మనుగడను పణంగా పెట్టి ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వొద్దు’అని కేకే స్పష్టం చేశారు. సంక్షోభాన్ని అధిగమించే శక్తి ఉంది ‘రాష్ట్రంలో లాక్డౌన్ ద్వారా తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు కష్టపడుతున్నాం. వలస కూలీలతో సహా అందరి బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశంలో 60 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 440 బిలియన్ డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వలున్నాయి. అయితే వీటిని అవసరమైన వారికి అందజేయడంలో మనం వెనుకబడుతున్నాం. సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి ఉందని గతంలో అనేకమార్లు రుజువైంది. అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో సపోర్ట్ ప్యాకేజీ 10 శాతముంటే, మనకు కేవలం 1 శాతమే ఉంది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వడ్డీరేట్లను కూడా తగ్గించాలి. రిజర్వు బ్యాంకు మంచి నిర్ణయాలే తీసుకుంది. మార్కెట్లో డబ్బు ఎక్కువ అందుబాటులో ఉండేట్లు చూడాలి. మనం ద్రవ్య లోటు, ఎఫ్ఆర్ బీఎం లాంటి ఆర్థిక లక్ష్యాల గురించి చింతించాల్సిన పని లేదు. రాష్ట్రాలకు కావాల్సిన నిధులు అందించాలి. పాత బకాయిలు కూడా చెల్లించాలి..’అని కేకే రాష్ట్రం తరఫున కేంద్రాన్ని కోరారు. మా మద్దతు ఉంటుంది ‘కరోనా వ్యాప్తి నివారణకు, మీరు తీసుకున్న నిర్ణయాలకు మా మద్దతు ఉంటుంది. ప్రధాని కార్యాలయం ద్వారా నిర్ణయాలు తీసుకోకుండా వికేంద్రీకరణతో మంచి ఫలితాలుంటాయి. వేతనాల్లో కోత, ఎంపీ ల్యాడ్స్ విషయంలో కేంద్రం నిర్ణయా న్ని మేము ఇప్పటికే అంగీకరించాం. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక నిర్వహణ విధానాలు ఏకీకృత నిధుల వినియోగానికి ప్రతిబంధకం ఉన్న ఇబ్బందులను తొలగించాలి. సీఎంలు వారి బాధ్యతలు నిర్వర్తించే స్వేచ్ఛను ఇవ్వాలి. రాష్ట్రంలో రాబడి పడిపోయి, రోజుకు రూ.400 కోట్లకు బదులు గా అతి కష్టంగా రూ.కోటి మాత్రమే సమకూరుతోంది. రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇ వ్వాలి’అని టీఆర్ఎస్ పక్షాన కేకే కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో రబీ పంట కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం మంత్రి వర్గ సంఘాన్ని ఏర్పాటు చేసిందని, రైతులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రధానికి కేకే వివరించారు. -
రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యులుగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పక్షాన కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. శ్రమజీవి పార్టీ తరఫున నామి నేషన్లు వేసిన జాజుల భాస్కర్, భోజరాజ్ కోయల్కర్ నామినేషన్లను ఈ నెల 16న జరిగిన పరిశీలనలో ఎన్నికల అధికారి తిరస్కరించారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేసిన కేకే, సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. రాజ్యసభలో రాష్ట్ర కోటా నుంచి ఏడుగురు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రస్తుత ఎన్నికతో అన్ని స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. అయితే టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన డి.శ్రీనివాస్ ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం... తనను వరుసగా రెండోసారి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధినేత కేసీఆర్‌కు కేకే కృతజ్ఞతలు తెలిపారు. సురేశ్‌రెడ్డితో కలసి బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, వివిధ అంశాలకు సంబంధించి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని కేశవరావు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలు గర్వపడేలా తన పనితీరు ఉంటుందని కేఆర్ సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజ్యసభ సభ్యు డిగా పనిచేయడం తనకు అత్యంత సవాల్‌గా భావిస్తున్నట్లు సురేశ్‌రెడ్డి ప్రకటించారు. -
రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో ఈ నెల 26న జరిగే రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు గురువారం ఖరారు చేశారు. సుమారు పక్షం రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావుతో పాటు అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం తుది గడువు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థులు మధ్యాహ్నం 12.41 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్న కేశవరావు, సురేశ్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు నేతలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వారిని పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తూ పత్రాలు అందజేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణకు చేరుకున్న కేశవరావు, సురేశ్ రెడ్డి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీకి వచ్చిన పార్టీ రాజ్యసభ అభ్యర్థులకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నరేందర్ తదితరులు కేకే, సురేశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సురేశ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందు కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో పోచారంతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసిన సురేశ్‌రెడ్డి, కె. కేశవరావు ఎమ్మెల్సీ అభ్యర్థిపై కసరత్తు.. శాసన మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నిక నోటిఫికేషన్ గురువారం వెలువడగా, ఈ నెల 19 నామినేషన్ల దాఖలకు తుది గడువు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పలువురు నేతలు గురువారం అసెంబ్లీలో కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, లోయపల్లి నర్సింగరావు, ముజీబ్ శాసన మండలి అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్నారు. గతంలో స్థానిక సంస్థలో కోటాలో టీడీపీ నుంచి ఎన్నికైన అరికెల నర్సారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆరంభం నుంచి పార్టీలో ఉంటూ వరుసగా మూడు పర్యాయాలు ఎంపీపీగా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా నర్సింగరావు కోరుతున్నారు. మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ముజీబ్ కోరుతుండటంతో జిల్లాకు చెందిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. కేఆర్ సురేశ్‌రెడ్డి... భార్య: పద్మజారెడ్డి జననం: 1959, మే 25 స్థలం: చౌట్పల్లి, కమ్మరపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా రాజకీయ ప్రస్థానం.. 1984లో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన సురేశ్‌రెడ్డి తండ్రి గోవిందరెడ్డి రాజకీయ వారసత్వాన్ని స్వీకరించారు. 1989, 1994, 1999, 2004లో వరుసగా నాలుగు పర్యాయాలు నిజామాబాద్ బాల్కొండ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1990లో లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా, 1997లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2004లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2009, 2014లో అర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018, సెప్టెంబర్‌లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కంచర్ల కేశవరావు భార్య: వసంతకుమారి జననం: 1939, జూన్ 4 స్థలం: మహబూబాబాద్ రాజకీయ ప్రస్థానం.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కేశవరావు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవులు నిర్వర్తించారు. 2005లో ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఏఐసీసీ సభ్యుడిగా పనిచేశారు. పట్టభద్రుల కోటాలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో విద్య, పరిశ్రమలు వంటి కీలక శాఖలతో పాటు కాంగ్రెస్ హయాంలో కొంతకాలం శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. 2006లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తూ 2014లో రెండో పర్యాయం రాజ్యసభకు ఎన్నికై పార్టీ పార్లమెంటరీ పక్షం నేతగా వ్యవహరిస్తున్నారు. చదవండి: కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే! సంక్షేమం ఆగదు.. -
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీనియర్ నాయకులు కే కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డిలను రాజ్యసభకు నామినేట్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేకేకు కేసీఆర్ మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డిని కూడా టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న సురేష్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఎవరనే దానిపై తీవ్ర చర్చ సాగింది. ఒక స్థానానికి కేశవరావు పేరును ఖరారు చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే మరో స్థానానికి సీఎం కేసీఆర్ ఎవరిని నామినేట్ చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ ఆభ్యర్థిత్వాన్ని ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. వారితోపాటు దామోదర్‌రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి పేర్లను కూడా సీఎం పరిశీలించినట్లు తెలిసింది. అయితే చివరకు వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్.. కేకే, సురేష్‌రెడ్డి పేర్లను రాజ్యసభకు నామినేట్ చేశారు. -
టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు కేకే, పొంగులేటి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె. కేశవరావు మరోమారు రాజ్యసభకు వెళ్లనున్నారు. రెండో స్థానానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. పార్టీ తరఫున పలువురు నేతలు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించినా చివరకు ఈ ఇద్దరు నేతల వైపే కేసీఆర్ మొగ్గుచూపినట్లు తెలిసింది. నిజామాబాద్ మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ ఆభ్యర్థిత్వాన్ని ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. వారితోపాటు దామోదర్‌రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి పేర్లను కూడా సీఎం పరిశీలించినట్లు తెలిసింది. చివరకు వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కేకే, పొంగులేటి అభ్యర్థిత్వం వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే అభ్యర్థిత్వం ఖరారైనట్లుగా ప్రచారంలో ఉన్న నేతలు మాత్రం తమకు పార్టీ నుంచి సమాచారం అందలేదని మంగళవారం రాత్రి ధ్రువీకరించారు. ఈ నెల 13న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నామినేషన్‌కు తుది గడువు ఉండటంతో రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, గవర్నర్ కోటా అభ్యర్థిగా సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లను సైతం సీఎం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 12న మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. -
రాజ్యసభ బరిలో మాజీ ఎంపీ కవిత..!
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంటు ఎగువ సభగా పేర్కొనే రాజ్యసభలో 245 మంది సభ్యులకు గాను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య 73 మంది సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని రిటైర్ అవుతున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీన ముగియనుంది. రాష్ట్రం నుంచి రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యుల జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవీపీ రామచంద్రరావు, టీడీపీ నుంచి ఎన్నికై ప్రస్తుతం బీజేపీలో ఉన్న గరికపాటి మోహన్‌రావు ఉన్నారు. రాష్ట్ర పునర్వి భజన సందర్భంగా ఏపీ కోటాకు కేటాయించిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు కూడా ఏప్రిల్ 2న రాజ్యసభ సభ్యత్వం నుంచి రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో గరికపాటి మోహన్‌రావు, కేవీపీ రామచంద్రరావు స్థానంలో... తెలంగాణ శాసనసభ్యులు ఇద్దరిని రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఇద్దరు సభ్యుల ఎన్నిక కోసం ఈ నెల చివరన లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. నిబంధనల ప్రకారం సభ్యుల పదవీ కాలం ముగియడానికి 50 రోజుల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఆరుగురు సభ్యులున్నారు. వీరిలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే రిటైర్ అవుతున్నారు. రాష్ట్ర శాసనసభ్యులు పరోక్ష ఓటింగ్ ద్వారా రాజ్యసభ సభ్యులను ఎన్నుకోనుండగా, అసెంబ్లీలో టీఆర్ఎస్కు ఉన్న సంఖ్యా బలం పరంగా చూస్తే 2 స్థానాలు ఆ పార్టీకే దక్కే సూచనలున్నాయి. 119 మంది శాసనభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూస్తే ప్రస్తుతం టీఆర్ఎస్కు 104, ఎఐఎంఐఎంకు 7, కాంగ్రెస్‌కు 6, టీడీపీ, బీజేపీకి ఒక్కో సభ్యుడు చొప్పున ఉన్నారు. 2018 మార్చిలో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ సీట్ల కోసం జరిగిన ద్వైవార్షిక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పి.బలరాంనాయక్‌ను బరిలోకి దించినా, ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ మూడు స్థానాల్లోనూ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరిస్తుండటంతో ద్వైవార్షిక ఎన్నికలు జరిగే రెండు రాజ్యసభ స్థానాలు టీఆర్ఎస్కే దక్కే అవకాశముంది. దీంతో ద్వైవార్షిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని 7 రాజ్యసభ స్థానాలు టీఆర్ఎస్ పరమయ్యే అవకాశం ఉంది. ఆశావహుల జాబితాలో పలువురు నేతలు త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అవకాశం కోసం పలువురు టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రిటైరవుతున్న పార్టీ పార్లమెంటరీ నేత కేకే మరోమారు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి చెందిన మాజీ ఎంపీ కవిత పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. వీరితో పాటు గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ అవకాశం దక్కని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మందా జగన్నాథం, ప్రొఫెసర్ సీతారాంనాయక్‌తో పాటు ఇతరులు కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం పార్టీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్నా అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు లేకపోవడంతో తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. మరోవైపు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన వారి పేర్లను పరిశీలనకు తీసుకోకపోవచ్చనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. -
కేకే ఓటు హక్కుపై ఎన్నికల ట్రిబ్యునల్‌కెళ్లండి
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును ఎన్నికల అధికారి అనుమతించిన వ్యవహారాన్ని ఎన్నికల ట్రిబ్యునల్‌లోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత వాటికి సంబంధించి ఏ అభ్యంతరాలున్నా, వాటిపై ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని రాజ్యాంగం, తెలంగాణ మునిసిపాలిటీల చట్ట నిబంధనలు చె బుతున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేశవరావును ఓటు హ క్కు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ తరఫున ఎన్నికైన మోనిరాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మరోసారి విచారణ జరిపారు. రాష్ట్ర ఎన్ని కల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపించారు. ఎన్నికలు ముగిశాక వచ్చిన అభ్యంతరాల విచారణకే ట్రి బ్యునళ్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. జిల్లా జడ్జి స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారన్నారు. తరువాత పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదిస్తూ, ఈ వివాదం ఎన్నికల పి టిషన్ పరిధిలోకి రాదని, అందువల్ల ట్రిబ్యునల్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా అధికరణ 226 కింద హైకోర్టు విచారణ జరపవచ్చునని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వివాదంపై ఎన్నికల ట్రిబ్యున ల్ను ఆశ్రయించాలంటూ ఉత్తర్వులిచ్చారు. -
‘తుక్కుగూడలో ఎంపీ కేశవరావు ఓటు చెల్లదు’
సాక్షి,న్యూఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు టీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు నడుచుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నిబంధనలకు విరుద్ధంగా తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేశారని చెప్పారు. సాంకేతికంగా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని పేర్కొన్నారు. తుక్కుగూడలో ఎంపీ కేశవరావు ఓటు చెల్లదని లక్ష్మణ్ అన్నారు. ఈమేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోవాలని కోరినట్టు లక్ష్మణ్ తెలిపారు. ఉప రాష్ట్రపతిని కలిసినవారిలో ఎంపీలు బండి సంజయ్, అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు,ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. -
‘అలా ఎందుకు జరుగుతోందో ఆలోచించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘పార్లమెంట్లో ఆమోదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రజలకు రోడ్లపైకి వస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)లను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి’ అని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు(కేకే) అన్నారు. గురువారం ఆయన టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ లైబ్రరీ హాల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. (చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది) సమావేశాననంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ ఆందోళనపై సభలో చర్చ జరగాలని సూచించామన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై ఏ ముఖ్యమంత్రి చెప్పనట్టుగా తమ అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. అసెంబ్లీలో తీర్మాణం కూడా చేస్తామని పేర్కొన్నారు. సీఏఏ బిల్లును గతంలోనే తమ పార్టీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. సీఏఏ అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటిగా కేంద్ర తీసుకుంటుందని, ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్దమని కేకే మండిపడ్డారు. విభజన హామీలపై ఒక రోజు మెత్తం పార్లమెంట్లో చర్చించాలని ప్రధాని మోదదీని కోరామని కేకే పేర్కొన్నారు. సీఏం కేసీఆర్ ఆనాడే చెప్పారు సీఏఏ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే చెప్పారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. సీఏఏను దేశ ప్రజలతో పాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయి ఆరు ఏండ్లు అయినా విభజన హామీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై సభలో చర్చించాలని అఖిపక్ష సమావేశంలో చెప్పినట్లు నామా పేర్కొన్నారు. -
కేంద్ర బడ్జెట్.. టీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముఖ్యమైనవి కాబట్టి.. వాటిపై అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించామని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే కేశవరావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల విజయంపై తాము సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఓ కీలక తీర్మాణం కూడా తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ, నీతి ఆయోగ్ నిధులు విడుదలపై పోరాడాలని నిర్ణయించుకున్నట్టు కేశవరావు పేర్కొన్నారు.(ఢిల్లీ పార్టీలు.. సిల్లీ పనులు) విభజన హామీలు ఆరేళ్లుగా అమలు చేయకుండా కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని కేశవరావు విమర్శించారు. వాటి అమలు కోసం కచ్చితంగా పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏపై ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారని గుర్తుచేశారు. జాతీయ గణనలో ఓబీసీని కూడా చేర్చాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. దేశ ఎకానమీ తగ్గుదలపై, సీఏఏ లాంటి అంశాలను పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావిస్తామని వెల్లడించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటోందని ఆయన ఆరోపించారు. రేపు(బుధవారం) అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ అంశాలను చేర్చాలని కోరుతామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 95శాతం విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దొరకడం తెలంగాణకు అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఎన్నో పథకాలు మిగతా రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో చాలా పెండింగ్ పనులు ఉన్నాయని.. వాటిని కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని.. ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు. -
అఖిలపక్ష భేటీలో గళమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోకసభ పక్ష నేత మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు తదితరులు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశముంది. చొరబాటుదారులు ఏరివేత లక్ష్యంగా దేశమంతా ఎన్నార్సీ అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ భేటీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుకోసం గళమత్తారు. అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలివే.. విభజన చట్టంలో ప్రతిపాదించినట్టుగా ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన నిధుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి వెంటనే ఆమోదం తెలపాలి. రూ. 18,969 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ ఆ మేరకు ఏపీకి నిధులు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 700 కోట్ల గ్రాంట్‌ను తక్షణమే విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలి. రామాయపట్నంలో మేజర్ పోర్టును నిర్మించాలి. గిరిజన ప్రాంతమైన విజయనగరం జిల్లా సాలూరులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అనుమతించాలి. గోదావరి - కృష్ణా నదుల అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి కేంద్రమే చేపట్టాలి -
హామీలను వారి దృష్టికి తీసుకెళ్లండి
-
హామీలను గుర్తు చేయండి : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని గతంలో కేంద్ర మం త్రులు హామీ ఇచ్చారని, కానీ చాలా కాలంగా పెం డింగ్‌లో ఉన్న వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఎంపీలకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న వినతులకు పరిష్కారం దక్కేలా చొరవ తీసుకుని కేంద్ర మంత్రులకు గుర్తు చేయాలని కోరారు. తెలంగాణ భవన్లో శుక్ర వారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి కేటీఆర్ అధ్యక్షత వహిం చారు. హైదరాబాద్‌లో రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల విస్తరణ కోసం రక్షణ భూముల బదలాయింపు, ఫార్మాసిటీకి సూత్రప్రాయంగా నిమ్జ్ హోదా దక్కినందున నిధుల సాధన వంటి తక్షణ అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఐఐఎం వంటి విద్యా సంస్థలతో పాటు బయ్యా రం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తదితరాలను ఫాలో అప్ చేయాలన్నారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి విజ్ఞప్తులను సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులు, నిధుల తో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే పనిచేయాలన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు..ఆయా శాఖల పరిధిలో ఉన్న పథకా లు, ప్రయోజనాలు తెలంగాణకు తీసుకురావడానికి ప్రయ త్నం చేయాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, దేశ రాజ ధాని ఢిల్లీలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు. పార్టీ పార్లమెంటరీ పక్ష నేత డాక్టర్ కే. కేశవరావు తెలంగాణ భవన్‌కు రాగానే కేటీఆర్ స్వాగతం పలికారు. పార్టీ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బడుగుల లింగయ్య యాదవ్, ప్రకాశ్ ముదిరాజ్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్, పసునూరు దయాకర్, మాలోత్ కవిత, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు, రంజిత్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన 30 అంశాలకు సంబంధించిన వాటి పురోగతిపై సమావేశంలో సమీక్షించారు. కాగా, రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె హాట్ టాపిక్ కావడం, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన మీద పోలీసు దాడి గురించి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడంతో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తేందుకు వ్యూహరచన చేస్తున్నందున ఎలా తిప్పి కొట్టాలనే దానిపైనా కేటీఆర్ సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిందే అక్కడ కూడా వినిపించాలని సూచించారు. చర్చించిన ప్రధాన అంశాలు ఇవే... హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఏర్పాటు రాష్ట్ర పునర్విభన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన బీఆర్జీఎఫ్ డిస్ట్రిక్ట్ గ్రాంటు కింద తదుపరి వాయిదా డబ్బుల విడుదల హైదరాబాద్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) ఏర్పాటు రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు తెలంగాణ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కోల్ బ్లాక్‌ల కేటాయింపు హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రూ.వెయ్యి కోట్ల గ్రాంటు ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ పునరుద్ధరణ -
ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌తో ఎంపీ కేకే కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎంపీ కే కేశవరావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ అయ్యారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల అంశాన్ని కేకే.. కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమ్మతమైతే.. ఆర్టీసీ జేఏసీతో చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని కేకే కేసీఆర్‌తో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు హైకోర్టు విధించిన డెడ్‌లైన్ శుక్రవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో కేకే భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 18వ తేదీ కల్లా చర్చలు ముగించి.. శుభవార్తతో రావాలని అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్టీసీ జేఏసీకి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఇక, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని కేకే సంచలన ప్రకటన చేశారు. సమ్మె వెంటనే విరమించి.. చర్చలకు సిద్ధపడితే.. తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒకింత సుముఖత వ్యక్తం చేశాయి. కేకే మధ్యవర్తిత్వంలో చర్చలకు సిద్దమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల దిశగా కేసీఆర్-కేకే భేటీలో కీలక ముందడుగు ఏమైనా పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరికాసేపట్లో కేసీఆర్ హుజూర్నగర్ ఎన్నికల సభలో పాల్గొనేందుకు వెళుతున్నారు. అజయ్ సమీక్ష ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరంలోని రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ గురువారం సమీక్ష నిర్వహించారు. రవాణా, ఆర్టీసీ అధికారులతో ఆయన చర్చించారు. సమ్మె నేపథ్యంలో తీసుకుంటున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మాట్లాడారు. ఇక, ఆర్టీసీ ఎండీ నియామకంపై ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
ఆర్టీసీ సమ్మె: చర్చలు జరిపేందుకు నేనెవరిని?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కేసీఆర్ చర్చల ప్రసక్తే లేదంటూ ప్రకటిస్తే.. ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు చర్చలకు సిద్ధంకండంటూ పత్రికా ప్రకటన విడుదల చేసి సంచలనం సృష్టించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తాజాగా కేకే మాట మార్చారు. కార్మికులతో చర్చలు జరపడానికి తనకు ఎలాంటి అధికారం లేదన్నారు. ఇది ప్రభుత్వ సమస్య అని... పార్టీ సమస్య కాదని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితులు చేజారుతున్నాయని.. ప్రభుత్వం, కార్మికులు పరస్పరం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మాత్రమే తాను సూచించానన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అయితే మంచి జరుగుతుందనుకుంటే.. మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమే అన్నారు. కార్మికులు తనతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉండటం మంచి పరిణామంగా పేర్కొన్నారు కేశవరావు. (చదవండి: ‘ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధం’) అయితే ప్రభుత్వం తరఫున చర్చలు జరిపేందుకు తనకు ఎలాంటి అనుమతి రాలేదని కేకే స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అయితే సీఎం ఇంకా తనకు అందుబాటులోకి రాలేదన్నారు. తాను సోషలిస్టునని.. రాజ్యం వైపు కాక కార్మికుల వైపే ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలసికట్టుగా ఉండాలని కేకే సూచించారు. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే తనకేమి అభ్యంతరం లేదన్నారు. అయితే ఆర్టీసీ విలీనం సాధ్యపడకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని కేకే స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటనేది తనకు తెలియదని.. ఒకవేళ తెలిస్తే.. సమస్య పరిష్కారం అయ్యేదన్నారు కేశవరావు. -
‘కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానించాలి’
-
‘ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర పరిస్థితిపై సోమవారం గవర్నర్ తమిళిసైకు వినతి పత్రం అందించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ...మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో దహనకాండపై గవర్నర్‌కు వివరించామని, తమ వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. టీఎన్జీయూ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వనం పలకాలని సూచించారు. ‘ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్‌ను కలవడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఉద్యోగ సంఘాలతో నిన్న భేటీ కావాలని అనుకున్నాం. అయితే డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మరణంతో కలవడం కుదరలేదు’ అని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం ఆర్టీసీ అని, తమకు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజీ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కార్మికులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అంతేగాక కేకే రాసిన లేఖపై తాము ఓపెన్‌గా ఉన్నామని అన్నారు. -
సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు
-
కేసీఆర్‌ను అభినందిస్తున్నా: కేశవరావు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని... ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపజాలదని టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు అన్నారు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని కోరారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందని.. 44 శాతం ఫిట్మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని పేర్కొన్నారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని వ్యాఖ్యానించారు. అదే విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేశవరావు విఙ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నానని.. ఇందుకు ఆయనను అభినందిసస్తున్నాని ఆయన పేర్కొన్నారు. ఇక అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజీ క్యారేజీల విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కేశవరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందంటూ ఆవేదన చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
‘నేడు తెలంగాణకు పండగ రోజు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిగొప్ప ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్ర సృష్టించిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టులున్న అమెరికా, ఈజిప్ట్ సరసన కాళేశ్వరం ప్రాజెక్టుతో భారత్ నిలిచిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ అంకితం చేసిన సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సంబురాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రాజెక్టుగా తాము భావిస్తున్నామని, రీడిజైన్‌తో దీన్ని ప్రపంచ స్థాయిలో నిలిపిన ఘనత ఆయనదేనని కొనియాడారు. తెలంగాణకు, దేశానికి నేడు పండగ రోజని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ నీటి కష్టాలు తీరతాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తే బాగుండేదని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలో పూర్తికావడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. సముద్రమట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని పైకితీసుకెళ్ళడం మామూలు విషయం కాదన్నారు. మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావడం సంతోషకరమన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి అందనున్నాయని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా కాళేశ్వరం ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేకపోయామన్నారు. -
తెలంగాణ ప్రయోజనాలే పరమావధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్బోధించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంపీలు పని చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రఫ్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేరే వరకు కేంద్రంతో సంప్రదింపులు కొనసాగించాలని, అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వంతో వ్యహరించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో గురువారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో సామరస్య ధోరణితో వ్యవహరించాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఎంపీలకు సూచించారు. నిరంతర సంప్రదింపుల ప్రక్రియతో రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వపరంగా రాష్ట్రానికి వచ్చే నిధులు, నిర్ణయాల విషయంలో ఆయా మంత్రిత్వశాఖలతో నిత్యం సంప్రదింపులు జరపాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నిక... లోక్‌సభ కొత్తగా కొలువుదీరుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్లమెంటరీపక్ష ఎన్నికల ప్రక్రియను ఈ సమావేశంలో పూర్తి చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కె. కేశవరావును తిరిగి ఎన్నుకున్నారు. రాజ్యసభలోనూ టీఆర్‌ఎస్‌పక్ష నేతగా కేశవరావు వ్యవహరిస్తారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు ఎన్నికయ్యారు. అలాగే లోక్‌సభలో టీఆర్ఎస్ ఉప నేతగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, విప్‌గా జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్‌ను ఎన్నుకున్నారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌పక్ష ఉప నేతగా బండ ప్రకాశ్, విప్‌గా జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుల ఎన్నిక సమాచారంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి లేఖ రాశారు. -
తెల్ల రేషన్‌కార్డుదారులకు ఓ పథకం
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తించేలా ఓ కొత్త పథకాన్ని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చబోతున్నామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు (కేకే) వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు కేకే సమక్షంలో తెలంగాణభవన్‌లో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకప్పుడు ఇందిరాగాంధీని అమ్మ అని పిలిచేవారని ఇప్పుడు కేసీఆర్ అందరికీ పెద్దకొడుకయ్యారని చెప్పారు. శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి మనిషి మరణించేదాకా అందరికీ సంక్షేమ పథకాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. పేదల డబ్బు పేదలకే పథకాల రూపంలో చేరాలన్నది సీఎం కేసీఆర్ తపనని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని భరోసా ఇచ్చారు. కొన్ని కారణాలతో జనగామలో చేరిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రిలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు టీఆర్ఎస్ అభ్యర్థి గొంగడి సునీత మాట్లాడుతూ... యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి గుండాల మండలాన్ని వేరు చేసి జనగామలో కలపడం బాధగానే ఉందన్నారు. గుండాల మండలాన్ని. -
ప్రజలు ఆమోదించేలా టీఆర్ఎస్ మేనిఫెస్టో
-
చేసింది చెబుదాం.. చేసేది చెబుదాం!
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సంపూర్ణ సాకారం.. అభివృద్ధి కొనసాగింపు ప్రధాన అంశాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో రూపొందనుంది. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్న టీఆర్ఎస్.. తమ మేనిఫెస్టో రూపకల్పనలోనూ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించనుంది. నాలుగేళ్ల మూడు నెలల పాలనను వివరిస్తూనే, మళ్లీ అధికారంలోకి వస్తే ఏ వర్గాలకు ఏం చేయనున్నామో వివరించేలా మేనిఫెస్టో సిద్ధమవుతోంది. కొత్తవి తక్కువే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించడమే మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ఉండనుంది. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి పథకాలపై వివరించే అవకాశం ఉంది. ఆసరా పింఛన్ల మొత్తం పెంపు, నిరుద్యోగ భృతి అంశాలను కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. నిరుద్యోగ భృతి చెల్లించే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చే విషయంపై పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మేనిఫెస్టో రూపకల్పన కోసం టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నేతృత్వంలో 15 మంది పార్టీ నేతలతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తొలి భేటీ శనివారం జరగనుంది. ఒకే భేటీలో ముసాయిదా మేనిఫెస్టోను పూర్తి చేసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది. -
‘చంద్రబాబు.. టీజీని అదుపులో పెట్టుకో’
సాక్షి, హైదరాబాద్ : ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావుపై టీజీ వెంకటేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కర్నె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ లాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కే నష్టం అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీజీని అదుపులో ఉంచాలని సూచించారు. టీజీ వెంకటేష్ అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితి రాకుండా ఉండేలా చూడాలంటూ చంద్రబాబును కోరారు. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను కించపరచొద్దంటూ హితవు పలికారు. ప్రజలను రెచ్చగొట్టడమే టీజీ పరమావధిగా పెట్టుకున్నారని కర్నె మండిపడ్డారు. -
కేకేని నానా దుర్భాషలాడిన ఏపీ ఎంపీ
-
రాత్రైతే కాళ్లు పట్టడమే పని.. ఒంటినిండా అదే!
సాక్షి, ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు(కేకే)ను తీవ్ర పదజాలంతో దూషించారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ నాయకత్వంలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రైతే మీరు చేసేపనేంది?: ‘‘ఉద్యమం పేరుతో వేలమంది పిల్లల్ని బలి చేశారు. ఇప్పుడు అధికారం అనుభవిస్తోన్న కేకే లాంటి చాలా మంది నాయకులు అసలు ఉద్యమంలోనే పాల్గొనలేదు. కనీసం కాలిగోటికైనా బుల్లెట్ తగిలి ఉండదు. వీళ్లందరికీ ఒకటే పని.. రాత్రైతే కేసీఆర్ కాళ్లు పిసకడం, మందుతాగడం తప్ప ఇంకోటి చేయరు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్. టీఆర్ఎస్ నాయకులు తనపై చేసిన విమర్శలకు ప్రతిగా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌కు కేసీఆర్ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణలోని సెటిలర్లు టీఆర్ఎస్కు ఓట్లు వేయరంటూ టీజీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కేకే, నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు ఫైరైన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ దగ్గరికిరా: ‘‘కేకే ముఖానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి అవసరమా? ఆయనకు మెదడు మోకాళ్లలో ఉంటుంది కాబట్టే నా మాటలు పిచ్చివిగా అనిపించాయి. అసలు నేనన్నదాంట్లో తప్పేముంది? విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కోసం తెలంగాణ కూడా మాట్లాడాల్సిందే. ఎందుకంటే 60 ఏళ్ల ఉమ్మడిగా ఉన్నాం. ఎవరు అవునన్నా, కాదన్నా హైదరాబాద్ నిర్మాణంలో ఆంధ్రులు, రాయలసీమ వాసుల కష్టం కూడా ఉంది. గతంలో కేటీఆర్, కవితలు కూడా ఏపీ హక్కుల కోసం మాట్లాడటం మనం చూశాం. ఇప్పుడీ కేకే నన్ను తిట్టడంలో ఏమైనా అర్థం ఉందా? కేకే.. నీకు వ్యవహారం తెలియకుంటే హరీశ్, కవిత, కేటీఆర్‌ల్ని చూసి నేర్చుకో, లేదా, మా మంత్రి నారా లోకేశ్ దగ్గరికి రా’’ అని టీజీ వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోకుండా తన ఒంట్లో ప్రవహించేది పౌరుషంతో కూడిన సీమనెత్తురైతే, కేకే ఒంటినిండా సారాయి నిండి ఉంటుందని అన్నారు. కేసీఆర్ ఏం మెసేజ్ ఇస్తున్నారు?: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఒకవైపు పొగుడుతూనే చురకలు అంటించారు ఎంపీ టీజీ వెంకటేశ్. ‘‘మొన్న ఢిల్లీలో విపక్ష ముఖ్యమంత్రులంతా ఒకచోట ఉంటే, కేసీఆర్ మాత్రం ప్రధాని మోదీని కలుస్తారు. అంటే, ఆయన ఏం మెసేజ్ ఇవ్వదల్చుకున్నారు? ప్రపంచమంతా పర్యటిస్తోన్న మోదీ నిజాయితీ పరుడే కావచ్చు. కానీ పరిపాలనాదక్షత ఏది? ముందు ఇంటగెలిచి ఆ తర్వాతకదా రచ్చగెలవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఓ భస్మాసుర హస్తంలా మారిది. ఇది గుర్తించి తెలంగాణ నాయకులంతా ఆంధప్రప్రదేశ్ గురించి పోరాడాలి. అలా చేస్తేనే ఇరు రాష్ట్రాలకు మంచిది’’ అని టీజీ అన్నారు. టీజీ కావరం: టీడీపీలో నోటుకు సీటు వ్యవహారంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎంపీ టీజీ అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘టీజీ డబ్బులిచ్చి ఎంపీ సీటు కొనుక్కున్నారని మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఏమంటార’న్న ప్రశకు... ‘‘ఏ వెధవ లం..కొడుకు అన్నాడామాట?’’ అని విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వెంటనే గొంతు సవరించుకుని ‘‘నా మాటలు మోత్కుపల్లిని ఉద్దేశించికాదు, ఆయనకు సమాచారం ఇచ్చినవారిని అంటున్నా..’’ అని వివరించారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కేకే?
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా తమ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె.కేశవరావు ఎన్నికయ్యే విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పావులు కదుపుతున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న కురియన్ స్థానంలో కేకేను ఎన్నుకునే అంశంపై ప్రధాని మోదీతో కేసీఆర్ చర్చించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్‌గా బీజేపీయేతర పార్టీకి అవకాశం ఇస్తే టీఆర్ఎస్కు చాన్స్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానితో కేసీఆర్ భేటీ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. సభాపతిగా ఆ పార్టీకి చెందిన వెంకయ్యనాయుడు పదవిలో ఉన్నారు. ఇక డిప్యూటీ చైర్మన్‌గా బీజేపీయేతర పార్టీకి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించామన్న సంకేతాలు పంపినట్టు అవుతుందని బీజేపీ భావిస్తోంది. అటు లోక్‌సభలోనూ స్పీకర్‌గా బీజేపీకి చెందిన సుమిత్రా మహాజన్ ఉండగా, డిప్యూటీ స్పీకర్‌గా అన్నా డీఎంకేకు చెందిన తంబిదురైని ఎన్నుకున్నారు. ఇదే సంప్రదాయాన్ని రాజ్యసభలోనూ అనుసరించాలనే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్కు రాజ్యసభ అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. సభలో బలాబలాలు ఇలా.. ప్రస్తుతం రాజ్యసభలో (ఖాళీలు పోను) 241 మంది సభ్యులున్నారు. తన అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్‌గా నెగ్గించుకోవాలంటే బీజేపీ కూటమికి 122 మంది కావాలి. ప్రస్తుతం సభలో ఆ కూటమికి 87 మంది సభ్యులున్నారు. అంటే 35 మంది తక్కువగా ఉంటారు. ఇక యూపీఏకు 58 మంది సభ్యులున్నారు. ఈ కూటమి కూడా సొంతంగా అభ్యర్థిని నెగ్గించుకోలేని పరిస్థితి. ఈ లెక్కలను బేరీజు వేసుకున్న సీఎం కేసీఆర్.. మిత్రపక్షాల సాయంతో ఆ పదవిని పొందేందుకు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లోనూ టీఆర్ఎస్ కంటే ఎక్కువ రాజ్యసభ సభ్యులున్న పార్టీలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు 13 మంది, సమాజ్‌వాదీ పార్టీకి 13 మంది రాజ్యసభ సభ్యులున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ప్రతిపక్షాల నుంచే ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఈ రెండు పార్టీలూ పోటీపడే అవకాశమున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నా డీఎంకేకు సైతం 13 మంది సభ్యులు ఉన్నా.. లోక్‌సభ డిప్యూటీ స్పీకరుగా అవకాశాన్ని తీసుకున్న ఆ పార్టీకి మరోసారి జాతీయస్థాయి పదవిని ఇవ్వకపోవచ్చునని భావిస్తున్నారు. బిజూ జనతాదళ్(బీజేడీ)కు కూడా 9 మంది సభ్యులున్నా.. డిప్యూటీ చైర్మన్ పదవిపై ఆ పార్టీ పెద్దగా ఆసక్తిని ప్రదర్శించడం లేదని సమాచారం. ఆ తర్వాతి స్థానంలో ఉన్న టీఆర్ఎస్కు ఆరుగురు సభ్యులున్నారు. ఆరుగురు రాజ్యసభ సభ్యులతోనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోగలిగితే జాతీయస్థాయిలో టీఆర్ఎస్ పేరు చర్చకు వస్తుందని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తృణమూల్ పోటీ పడుతుందా? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ప్రతిపక్షాలకే ఇవ్వాలని నిర్ణయిస్తే తమకు తృణమూల్ నుంచి అంతర్గతంగా పోటీ ఉండే అవకాశముందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీతో టీఆర్ఎస్కు చెందిన కేకేకు రాజకీయంగా మంచి సంబంధాలున్నాయి. దీంతో ఆ పార్టీతోపాటు మిగత పార్టీల మద్దతు కూడగట్టడంపై కేసీఆర్ దృష్టి సారించినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. గుణాత్మక మార్పు కోసం జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదిస్తున్న కేసీఆర్.. వివిధ పక్షాల మద్దతు కూడగట్టి బీజేపీ సాయంతో డిప్యూటీ చైర్మన్ పదవిని సాధిస్తారని పేర్కొంటున్నారు. కేకేనే ఎందుకు? ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, డి.శ్రీనివాస్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, జె.సంతోష్‌రావు, బి.లింగయ్యయాదవ్, బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. రాజకీయాల్లో సీనియర్ అయిన కేకే ఎంపిక సరైనదేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మూడున్నర దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిగా కేకే పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కొంతకాలం తెరమరుగైనట్టుగా కనిపించినా.. అనూహ్యంగా పీసీసీ అధ్యక్ష పదవిని పొందారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే పీసీసీకి చీఫ్‌గా వ్యవహరించారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం పొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా టీఆర్ఎస్లో చేరి మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. -
‘ట్రిపుల్’పై కేకేతో ముస్లిం లా బోర్డు ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఎంపీ కె.కేశవరావును ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ తదితరులు మంగళవారం కలిశారు. ఈ మేరకు కేకే నివాసంలో బిల్లుపై కాసేపు చర్చించారు. ఇప్పటికే లోక్‌సభలో నెగ్గిన ట్రిపుల్ తలాక్ బిల్లులోని పలు అంశాలపై తమకు వ్యతిరేకత ఉందని లా బోర్డు సభ్యులు వెల్లడించారు. తమ అభ్యంతరాలను కేకేకు వివరించారు. రాజ్యసభలో బిల్లు చర్చకు వచ్చినప్పుడు వీటిపై మాట్లాడాలని కోరారు. అయితే దీనిపై కేకే ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ సమావేశంపై కేకే ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే లోక్‌సభలో అనుసరించినట్టుగానే ట్రిపుల్ తలాక్ బిల్లు చర్చకు వచ్చినప్పుడు వాకౌట్ చేయాలనే యోచనతో ఉన్నట్టుగా తెలిసింది. -
‘అక్కడ అంగుళం భూమి కూడా లేదు’
హైదరాబాద్: శంషాబాద్‌లో భూమి కొన్నాననే వార్తలు అవాస్తవమని రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. తనకు శంషాబాద్‌లో అంగుళం భూమి కూడా లేదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. 2013 కాంగ్రెస్ పార్టీ హయాంలోనే భూములు తీసుకున్నాం.. కొత్తగా భూమి కొనుగోలు చేయలేదని చెప్పారు. అన్నీ పరిశీలించిన తర్వాతే భూమి కొన్నామని, రైట్ రాయల్ వేలోనే కొనుగోలు చేశామని వివరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కుమార్తె కలిసి శంషాబాద్‌లో దిగిన ఫోటో చూసి భూమి కొన్నట్లు ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. శంషాబాద్‌లో ఒక్క ఇంచ్ భూమి కూడా లేదని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఇబ్రహీంపట్నంలో తన పిల్లల పేరున భూమి కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. అన్ని వెరిఫై చేసుకున్నాకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. తనకు వేరే భూములు లేవని తెలిపారు. ప్రభుత్వ అధికారాలు ఉపయోగించుకుని స్థలాలు కొనలేదని కేశవరావు చెప్పారు. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. -
వరంగల్ జనసంద్రాన్ని తలపిస్తోంది!
వరంగల్: ఆకాశాన్ని బద్దలుకొట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని, ఇప్పుడు సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచేందుకు ఆయన కష్టపడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కే కేశవరావు అన్నారు. వరంగల్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేకే ప్రసంగించారు. గత మూడేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని పేర్కొన్నారు. అశేష జనావళి తరలివచ్చిన వరంగల్ జనసంద్రాన్ని తలపిస్తున్నదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో ఏం సాధించిందో తెలియజేయడానికే వరంగల్‌లో ఈ సభను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. -
వరంగల్ జనసంద్రాన్ని తలపిస్తోంది!
-
పది కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు
మైనారిటీలకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ నియామక ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు నామినేటేడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. పది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మ న్లను నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో మైనారిటీలకు పెద్దపీట వేశారు. ప్రకటించిన పది కార్పొరేషన్లలో ఐదింటిని మైనారిటీలకే కట్టబెట్టారు. ఇవన్నీ రాష్ట్ర స్థాయి పదవులు కావడం, కీలక పదవులు దక్కడంతో అధికార టీఆర్ఎస్లోని మైనారిటీ నేతల్లో ఆనందం వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వారితో పాటు ముఖ్య నేతల అనుచరులకు కూడా పదవులు దక్కాయి. రాజ్యసభ ఎంపీ కేశవరావు కుమారుడు విప్లవ్కుమార్కూ పదవి దక్కడం గమనార్హం. కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పది కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో సగం మైనారిటీలకు కేటాయించడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందంటూ.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, ఫారూక్ హుస్సేన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు సరైన లబ్ధి కలిగిందని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. -
'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్ : కొత్త జిల్లాలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును గురువారం ఆయన కలిశారు. వెంటనే జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై న్యాయపరమైన చిక్కులు రాకుండా జ్యుడిషియరీ కమిటీ ఏర్పాటు చేయాలని పొన్నాల సూచించారు. -
బంగారు తెలంగాణకు సహకరించాలి
– ఎంపీ కే. కేశవరావు ఆత్మకూర్ : రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, అందరి సహకారం కావాలని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. శనివారం మండలంలోని గోపన్‌పేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని, ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తుందన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రూ.4కోట్ల నిధులు, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.కోటి కేటాయించి పాఠశాల అభివద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కేశవరావుతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, మా తండ్రి నర్సిరెడ్డితో కలిసి ఆయన పనిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా మాజీ డీన్ సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ మక్తల్ ఇన్చార్జ్ దేవరిమల్లప్ప, డీసీసీబీ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, జెడ్పీటీసీ బాలకిష్టన్న, సర్పంచ్ వెంకటేష్, టీఆర్ఎస్ మండల అద్యక్షుడు గోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేకేకు అస్వస్థత : నిమ్స్‌కి తరలింపు
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు నిమ్స్‌కి తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో కేశవరావు బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. కె. కేశవరావు గతంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోసారి ఆయన రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడ్డుకుంది. ఆ క్రమంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి... సెక్రటరీ జనరల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
నీ దారే నా దారి ...
ఇద్దరూ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు. హస్తినలో పార్టీ అధిష్టానం పెద్దల వద్ద మంచి పలుకుబడితోపాటు అత్యంత నమ్మకస్తులుగా పేరు సంపాదించారు. అంతే కాకుండా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో ఆ ఇద్దరు నేతలు... అధిష్టానం తలలో నాలుకగా వ్యవహారించారు. దీంతో వారిద్దరికి కొంచెం అటు ఇటుగా పీసీసీ అధ్యక్ష పదవులు కట్టబెట్టింది. పార్టీ అధిష్టానం వారి సేవలను గుర్తించి... పెద్ద పదవుల్లో కూర్చొబెట్టినా.. వారు వన్ మోర్ ఛాన్స్ అనటంతో... ఒక్క ఛాన్స్ ఇచ్చాం కదా అంటూ అధిష్టానం ససేమిరా అంది. దాంతో వారిద్దరూ హస్తానికి రాం రాం అని.... ఒకరు తర్వాత ఒకరు కొన్నేళ్ల తేడాతో అధిష్టానం పెద్దలకు 'చెయ్యి' చూపించి మరీ 'కారు' ఎక్కేశారు. వారిలో ఒకరు కారు ఎక్కిన మరుక్షణమే పెద్దల సభలో సీటు కొట్టేశారు. మరొకరు ఎమ్మెల్సీ లేదా పెద్దల సభలో సీటు ఏదైనా ఫర్వాలేదు మీరు ఇక్కడంటే ఇక్కడ... అక్కడంటే అక్కడ.. ఎక్కడైనా సరే అంటూ కర్చీఫ్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. వారిలో ఒకరు కె. కేశవరావు కాగా మరొకరు డీ శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లిన కేశవరావు పదవి కాలం ముగియడంతో మరోసారి పదవి దక్కలేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ పార్టీ తరపున పెద్దల సభలో సీటు సంపాదించేశారు. డీఎస్ కూడా అదే రీతిలో ఎమ్మెల్సీ పదవి అనుభవించి... మరో సారి ఆ పదవి ఇవ్వమని అధిష్టానం పెద్దలను కోరారు. అందుకు వారు 'నో' అనకుండా ఆయన శిష్యురాలు అకుల లలితకు ఆ పదవిని కట్టబెట్టారు. దాంతో ఆయన హస్తం వీడి కారు ఎక్కేశారు. ఒకరు తర్వాత ఒకరు పీసీసీ మాజీ చీఫ్‌లు ఎంచెక్కా గులాబీ కారు ఎక్కేశారు. చూడబోతే నీ దారే నా దారంటూ ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రస్తుత టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావును మరో సీనియర్ నేత డీఎస్ ఫోలో అయినట్లు లేదు. -
ఆరెకటికల సమస్యలపై స్పందిస్తాం: ఎంపీ కేశవరావు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరెకటిక కులస్తుల సమస్యలు పరిష్కరించడానికి టీఆర్ఎస్ తరఫున స్పందిస్తామని ఎంపీ కేశవరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ సమావేశ మందిరంలో టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఆరె కటిక సామాజిక వర్గానికి చెందిన వివిధ రాష్ట్రాల ఎంపీలను తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఎంపీలు నీలం సోన్కర్, బోలే సింగ్జీ హాజరయ్యారు. ఆర్థికంగా వెనకబడిన ఆరెకటిక లను బీసీ జాబితా నుంచి ఎస్సీల్లో చేర్చాలని ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేశవరావు స్పందిస్తూ.. ఎస్సీల్లో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకోవాలో అవి తీసుకునేలా టీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందని కేశవరావు హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆరెకటి కలను ఎస్సీల్లో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఈ సమస్యపై దృష్టిపెట్టాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ప్రమోద్బాబు, అడ్వైజర్ శివశంకర్, బాలాజీ, అశోక్, శశి, బాబురావు, మధుసూదన్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత కెకే
-
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సా ?.. పెద్ద జోక్!
-
టి.కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి:కేకే
హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు(కేకే) మండిపడ్డారు. 'తెలంగాణకు అప్పుడు నై అన్నవారు..ఇప్పుడు సై అంటున్నారు.టి.కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి' అని హెచ్చరించారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన కేకే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. టి.కాంగ్రెస్ నేతలకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని కేకే విమర్శించారు. తెలంగాణకు కృషి చేసిన ఒక్క కాంగ్రెస్ నేత పేరు చెప్పపని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణకు టి.కాంగ్రెస్ నేతలు న్యాయం చేయలేరని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు న్యాయం చేయలేవని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే అది టీఆర్ఎస్ తో నే సాధ్యమన్నారు. -
మూడేళ్లయితేనే ఒప్పుకుంటాం: కేకే
హైదరాబాద్: మూడేళ్లపాటు మాత్రమే హైదరాబాద్‌ను ఉమ్మడిగా రాజధానిగా ఒప్పుకుంటామని టీఆర్ఎస్ నాయకుడు కె కేశవరావు అన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా శాసన మండలి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్షం పేరిట తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు. ఈ అంశాలతో విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎమ్కు తమ పార్టీ తరపున నివేదిక పంపించినట్టు కేశవరావు తెలిపారు. దేశంలో 28 రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు జరిగాయో, తెలంగాణ విషయంలోనూ అలాంటి విధానమే ఉండాలన్న అంశం నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం. -
తెలంగాణను అడ్డుకునే శక్తి ఎవరికి లేదు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ప్రస్థానం విజయ తీరాలకు చేరబోతున్నదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు అన్నారు. అయితే లక్ష్యాన్ని ముద్దాడేంత వరకు ఉద్యమాన్ని వీడేది లేదు ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకుడు కే కేశవరావు నివాసంలో ఢిల్లీ పరిమాణాలపై జేఏసీ, టీఆర్ఎస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. కేకే నివాసంలో సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని.. దానిని ఆపే శక్తి ఎవరికి లేదని ఆయన అన్నారు. కాని తెలంగాణ ఉద్యమ సంస్థలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు. ఏపీఎన్జీఓల సభ అంత గొప్పదేమి కాదని ఆయన వ్యాఖ్యాలు చేశారు. 10 జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలకు తాను వివరించానని కేసీఆర్ తెలిపారు. ఏప్రాంతమైతే ఆంధ్రతో కలిసిందో.. ఆ ప్రాంతమే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడాలని, ఇతర ప్రత్యామ్నాయాలను అంగీకరించబోమని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో సదస్సు నిర్వహించడానికి ప్రయత్నాలు చేపట్టామని.. వేదికపై పలు సూచనలు వచ్చాయని.. అయితే సెప్టెంబర్ 12వ తేదిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో వేదికపై స్పష్టమైన సమాచారం తేలుతుందన్నారు. హైదరాబాద్ లో సదస్సు నిర్వహిస్తాం.. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించాలని వచ్చిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు అనేక అవమానాలకు తాను గురైనానని.. అయితే తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి అవమానాలకైనా సిద్ధమని, 10 జిల్లాలతో కూడిన, ఆంక్షలు లేని తెలంగాణ కావాలని మరోమారు స్పష్టం చేశారు. -
కేసీఆర్ నుంచి మాకు ప్రాణహాని ఉంది
-
క్రాస్ రోడ్డులో కారు...