జనరల్‌ పర్పసెస్‌ కమిటీ సభ్యుడిగా కేకే  | KK As Member Of General Purpose Committee | Sakshi
Sakshi News home page

జనరల్‌ పర్పసెస్‌ కమిటీ సభ్యుడిగా కేకే 

Published Fri, Aug 28 2020 12:52 AM | Last Updated on Fri, Aug 28 2020 3:37 AM

KK As Member Of General Purpose Committee - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సభా వ్యవహారాలకు సంబంధించిన సలహాలు, సూచనలు చేసేందుకు వీలుగా పనిచేసే జనరల్‌ పర్పసెస్‌ కమిటీని రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఆమోదం మేరకు సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు. వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌ సభ్యులు ఐదుగురు, స్టాండింగ్‌ కమిటీల చైర్మన్లు ఆరుగురు, ఒక గుర్తింపు పొందిన పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. స్టాండింగ్‌ కమిటీల చైర్మన్‌ కోటాలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ కె.కేశవరావు ఈ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement