మూడేళ్లయితేనే ఒప్పుకుంటాం: కేకే
హైదరాబాద్: మూడేళ్లపాటు మాత్రమే హైదరాబాద్‌ను ఉమ్మడిగా రాజధానిగా ఒప్పుకుంటామని టీఆర్ఎస్ నాయకుడు కె కేశవరావు అన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా శాసన మండలి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్షం పేరిట తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు. ఈ అంశాలతో విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎమ్‌కు తమ పార్టీ తరపున నివేదిక పంపించినట్టు కేశవరావు తెలిపారు. దేశంలో 28 రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు జరిగాయో, తెలంగాణ విషయంలోనూ అలాంటి విధానమే ఉండాలన్న అంశం నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం.