common capital
-
కర్నూలు నుంచి ‘ఏపీఈఆర్సీ’ కార్యకలాపాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు శనివారం నుంచి కర్నూలులో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉంటుందనే గడువు ఆదివారంతో ముగుస్తుండడంతో ఒకరోజు ముందుగానే ఏపీఈ ఆర్సీ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించింది. ఈఆర్సీ భవనంతోపాటు ఓ అతిథి గృహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.23 కోట్ల నిధులు అందించింది. ఈ నిధులతో 15 వేల చదరపు అడుగుల భవన నిర్మాణం జరిగింది. మరో 5 వేల చదరపు అడుగుల్లో గెస్ట్‌హౌస్ నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన భవనాన్ని ఈనెల 23న ప్రారంభించారు. శనివారం నుంచి అందులో అధికారికంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు. పాతికేళ్ల క్రితం పుట్టిన ‘మండలి’1999 మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, మండలి మాత్రం ఇన్నాళ్లూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం.. అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఏపీఈఆర్సీకి ఒక చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు.వీరి తరువాత ఒక డైరెక్టర్ హోదాలో కమిషన్ సెక్రటరీ, ఆ తరువాత జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఒక లీగల్ కన్సల్టెంట్, ఒక ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. వీరంతా తమ ఆ«దీనంలోని ఫైళ్లను తరలించేందుకు సిద్ధంచేసి భద్రపరచాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కమిషన్ ఆదేశించింది. అలాగే, ఉద్యోగులు తమ నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లుచేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయ సహకారాలను తీసుకోవాల్సిందిగా సూచించింది. అన్ని పనులు పూర్తవడంతో సిబ్బందితో పాటు ఫైళ్లు, సామగ్రి కర్నూలుకు తరలివెళ్లాయి.ఏపీఈఆర్సీ ఏం చేస్తుందంటే..విద్యుత్ చట్టంలోని సెక్షన్–86 ద్వారా కమిషన్‌కు పలు విధులను నిర్దేశించారు. అవి ఏమిటంటే.. ⇒ విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం మండలి లక్ష్యం. ⇒ ఇంట్రా–స్టేట్ ట్రాన్స్‌మిషన్‌లో ఓపెన్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, ఇంట్రా–స్టేట్ ట్రేడింగ్, పవర్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, విద్యుత్ అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తీసుకురావడం వంటివి చేయాలి. ⇒ రాష్ట్రంలో పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది. ⇒ రాష్ట్రంలో కార్యకలాపాలకు సంబంధించి ట్రాన్స్మిషన్ లైసెన్సులు, డి్రస్టిబ్యూషన్ లైసెన్సులు, విద్యుత్ వ్యాపారులుగా వ్యవహరించాలనుకునే వారికి లైసెన్స్‌లను జారీచేస్తుంది. ⇒ పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో దాని శాతాన్ని నిర్ణయిస్తుంది. ⇒ డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్యనున్న వివాదాలపై విచారణ జరిపి తీర్పుల ద్వారా పరిష్కరిస్తుంది. ⇒ వినియోగదారుల ప్రయోజనాలను పెంపొందించడంపై ప్రభుత్వానికి సలహాలివ్వడం వంటివి కమిషన్ చేస్తుంది. ⇒ అలాగే, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం గతేడాది ఆగస్టు 18న ప్రారంభమైంది. -
వివాదాలన్నీ కేంద్రానికి నివేదిద్దాం!
గవర్నర్ అధికారాలపై కేంద్రమిచ్చిన స్పష్టతతో ఏపీ సర్కారు హర్షం ఇతర వివాదాలనూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం ఆయా అంశాలపై గవర్నర్ స్పందించాలని కోరుతున్న మంత్రులు సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతిభద్రతల విషయంలో గవర్నర్ అధికారాలపై కేంద్రం స్పష్టత ఇవ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధాని విషయంలో గవర్నర్‌కు అధికారాలు ఉండాల్సిందేనని ఏపీ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో ఇక పలు వివాదాస్పద అంశాలను గవర్నర్ దృష్టికి, ఆ తర్వాత కేంద్రం దృష్టికి తేవాలని నిర్ణయించింది. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా గవర్నర్ అధికారాలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం.. అదే చట్టంలో పొందుపరిచిన విద్య, నీటి సమస్యలను కూడా పరిష్కరించాలని కోరనుంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అంశంపై కేంద్ర హోంశాఖ పంపించిన సమాచారాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు విశాఖపట్నం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు. కేంద్ర నిర్ణయంపై ఈ సందర్భంగా సీఎం హర్షం ప్రకటించినట్టు అధికారులు చెప్పారు. ఇదే వరుసలో మిగతా వివాదాస్పద అంశాలపైన కూడా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరాలని నిర్ణయించారు. ఇంతకాలం గవర్నర్‌కు వినతిపత్రాలు అందజేస్తున్నప్పటికీ అధికారాలపై స్పష్టత లేక ఆయన కూడా సరిగా స్పందించే పరిస్థితి లేదని, అయితే ఇప్పుడు గవర్నర్ సైతం స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ను కలిసేందుకు మంత్రుల సన్నద్ధం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పేరు మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన ఘటనపై ఏపీ మంత్రులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఇవి రెచ్చగొట్టే చర్యలని, ఇలాంటి పనులకు ఉపక్రమించినందుకు గవర్నర్ జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంటుందని, త్వరలోనే గవర్నర్‌ను కలిసి పలు అంశాలు వివరించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. తాజాగా ఎంసెట్ కౌన్సెలింగ్, స్థానికత, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విషయాల్లో ఇప్పటికైనా గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం కోరుతోంది. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి రక్షణ, స్వేచ్ఛ, ఆస్తులను కాపాడటంలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి నష్టం కలిగించే ఎలాంటి నిర్ణయాలనైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పక్షంలో గవర్నర్ తన విచక్షణ మేరకు సొంత నిర్ణయం తీసుకోవచ్చని కూడా చట్టంలో పేర్కొన్నారని.. అలాంటప్పుడు ఇప్పటివరకు జరిగిన అనేక వివాదాలపై తక్షణం జోక్యం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. టీ నిర్ణయాలపై మంత్రిమండలిలో చర్చ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న పలు నిర్ణయాలపై అవసరమైతే సోమవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి కేంద్రంతో మరోసారి సంప్రదింపులు జరపాలన్న భావనకొచ్చారు. శాంతి భద్రతల విషయంలో స్పష్టత ఇచ్చినట్టే మిగతావాటిపైనా వివరణ ఇవ్వాలని కోరే అవకాశం ఉందని సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఏపీ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధింపు, ఎంసెట్ కౌన్సెలింగ్, ఫీజు రీయింబర్స్మెంట్, స్థానికత, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) డెరైక్టర్ జనరల్ నియామకం, డెల్టాకు నీటి విడుదల, నదీ జలాల పంపిణీపై అపెక్స్ కమిటీ వంటి విషయాలన్నింటిపైనా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
‘గవర్నర్‌కు శాంతిభద్రతల’పై ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌పై గవర్నర్‌కు పెత్తనమిచ్చే నిబంధనలను పాటించాలంటూ.. మీ అనుమతి లేకుండానే కేంద్ర హోంశాఖ తెలంగాణ సర్కారుకు లేఖ రాసిందని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని గవర్నర్ ద్వారా పాలనను చేతుల్లోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.. ఇది ఎంతో బాధ కలిగిస్తోంది.. ఈ విషయంలో మీరు తక్షణం జోక్యం చేసుకోవాలి..’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ హైదరాబాద్ విషయంలో తెలంగాణ మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ పనిచేయాలని ఉందని, రాజ్యాంగం ప్రకారమూ ఇదే సరైన విధానమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వెంటనే కలగజేసుకుని సమస్య పరిష్కారానికి చర్య తీసుకోవాలంటూ కేసీఆర్ శనివారం రాత్రి ప్రధానికి లేఖ రాశారు. కేసీఆర్ లేఖ పూర్తి పాఠమిదీ... ప్రధాని నరేంద్రమోడీ గారికి, ‘సమాఖ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత ముఖ్యమైన రాజ్యాంగపరమైన అంశం గురించి ఎంతో బాధతో ఈ లేఖ రాస్తున్నాను. కేంద్ర హోంశాఖ నుంచి అందిన లేఖ మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద గవర్నర్ అధికారాలు, విధులను గురించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలంటూ కొన్ని అనవసర నిబంధనలను ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసుస్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను, ఏసీపీ/డీసీపీలను నియమించే విషయంలో కూడా ప్రభుత్వం నిర్దిష్ట విధానాన్ని పాటించాలని సూచించే వరకు ఆ నిబంధనలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ విధుల నిర్వహణ గురించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 8(3)లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి మండలితో సంప్రదింపుల తర్వాతే గవర్నర్ తన నిర్ణయాధికారాన్ని వినియోగించాలి. మంత్రి మండలి మినహా మరే ఇతర పరిపాలనాపరమైన వ్యవస్థ గవర్నర్‌కు సలహాలు ఇవ్వడానికి పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగం ఎలాంటి అవకాశం కల్పించలేదు. ఈ విషయాల్లో గవర్నర్ మంత్రి మండలి నుంచి తప్ప మరెవరి నుంచీ సలహాలు లేదా సూచనలు తీసుకోలేరు. తెలంగాణ మంత్రి మండలిని కాదని గవర్నర్ ద్వారా పరిపాలనా వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవాలని అనుకోవడం మన దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే అవుతుంది. కేంద్ర హోంశాఖ ద్వారా మా ప్రభుత్వానికి అందిన లేఖను దీనితో పాటు జతచేస్తున్నాను. మీ అనుమతి తీసుకోకుండానే హోం శాఖ మాకు ఈ లేఖను పంపించిందని విశ్వసిస్తున్నాను. ఈ విషయంలో మీరు వెంటనే జోక్యం చేసుకుని సమాఖ్య సంప్రదాయాలు, ప్రజాస్వామిక విధానాలకు అనుగుణంగా హోం శాఖ తమ లేఖను ఉపసంహరించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వగలరు..’ - కె.చంద్రశేఖరరావు -
దేనికైనా రెఢీ..!
గవర్నర్‌కు విశేషాధికారాలను సమ్మతించం అమలు చేయబోమంటూ కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం లేఖ విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలుకు మాత్రమే పరిమితం ఆ పరిధి దాటి అదనపు అధికారాలు కట్టబెట్టలేం అది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ వైఖరి వివరించిన ప్రధాన కార్యదర్శి రాష్ర్ట అధికారాల్లో కేంద్రం జోక్యాన్ని సహించబోమన్న సీఎం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలకు ఆదేశం సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు విశేషాధికారాలపై కేంద్రం కోరుతున్నట్లుగా వ్యవహరించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడింది. కేంద్రం సూచనలను అమలు చేయలేమంటూ తేల్చి చెప్పింది. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్ర హోం శాఖ తాజాగా లేఖ రాయడంపై రాష్ర్ట ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్రానికి తిరుగు లేఖ రాశారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంటూ రాష్ర్ట ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 8వ సెక్షన్లో పొందుపరిచిన పరిమితులకు, మరీ ప్రత్యేకంగా 8(3)లో పేర్కొన్న అంశాలకు లోబడి మాత్రమే గవర్నర్ అధికారాలను ఆమోదిస్తామని, ఆ పరిధి దాటి కేంద్రం కోరుతున్న చర్యలకు అంగీకరించబోమని లేఖలో స్పష్టం చేశారు. కేంద్రం సూచించిన కొన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్ నరసింహన్‌ను కూడా కలసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సీఎస్ వివరించారు. కేంద్రం స్పందనేమిటో చూద్దాం! ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై పలువురు ప్రభుత్వ ముఖ్యులు, ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. కేంద్రం సూచనలను అమలు చేయలేమని తేల్చి చెప్పినందున.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దామని, ఈ విషయంలో దేనికైనా సిద్ధమేనని కేసీఆర్ అన్నట్లు సమాచారం. పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడతానని, ఈ అంశంలో తనతో కలసిరావాలని మద్దతు కోరుతానని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. కేంద్రం సూచనలు దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించడమంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కబళించడమేనన్న వాదనతో సోమవారం పార్లమెంటు ఉభయసభల్లో గట్టిగా ప్రస్తావించాల్సిందిగా పార్టీ ఎంపీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. కోర్టుకూ వెళ్లే ఆలోచన! రాజ్యాంగం ప్రకారం ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో గవర్నర్ రూపంలో గానీ, మరేరకంగా గానీ కేంద్రం జోక్యం చేసుకోలేదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఈ అంశంలో కేంద్రం ఇలాగే పట్టుదలగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయించాలని కూడా సర్కారు భావిస్తోంది. గవర్నర్ చేతికి కీలకాధికారాలను అప్పగించడానికి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాదని వాదించనుంది. ‘రాష్ట్ర మంత్రిమండలిని సంప్రదిస్తూనే గవర్నర్ నిర్ణయాలు తీసుకోవాలని’ రాష్ర్ట విభజన చట్టంలోనే పేర్కొన్నందున.. అందుకు విరుద్ధంగా గవర్నర్‌కు విశేషాధికారాలను ఎందుకు కల్పించాలని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. చట్టంలో పేర్కొన్న పరిమితుల ప్రకారమే వ్యవహరిస్తామని, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారం ఉండే అంశాల్లోనే కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నామని కోర్టులో వాదించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రంపై రుసరుస! నిజానికి గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించేందుకు కేంద్రం గతంలోనే తెలంగాణ సర్కారుకు లేఖ రాసింది. అయితే అది ఏమాత్రం సమ్మతం కాదని, వాటిని అమలు చేయబోమని రాష్ర్ట ప్రభుత్వం కూడా అప్పట్లోనే సమాధానం కూడా పంపించింది. ఇటీవలి మంత్రిమండలి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విలేకరులు ఈ విశేషాధికారాలపై ప్రశ్నించినప్పుడు... కేంద్రం అలాగే పట్టుబడితే పోరాటం తప్పదని పేర్కొన్నారు. అయితే కొంత కాలంగా ఈ విషయంపై ఎలాంటి కదలిక లేకపోవడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గిందని ప్రభుత్వ ముఖ్యులు భావించారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని కూడా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం నుంచి మళ్లీ లేఖ రావడంతో కేంద్రం పట్టుదలగానే ఉన్నట్లు రాష్ర్టప్రభుత్వానికి అర్థమైంది. రాజకీయంగానూ ఎదుర్కొందాం! దేశంలో ఎన్నో సమస్యలుండగా.. పోలవరం బిల్లుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి కేంద్రం హడావుడిగా పార్లమెంటులో ప్రవేశపెట్టిందని రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే గుర్రుగా ఉంది. కొన్ని అంశాలపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని భావించినా కేంద్రం నుంచి ఏమాత్రం సానుకూల స్పందన కనిపించలేదు. దీనికితోడు గవర్నర్ విశేషాధికారాల పేరుతో రాజధాని ప్రాంతంపై గవర్నర్ పాలనను, తద్వారా పరోక్షంగా తమ నిర్ణయాధికారాన్ని రుద్దే ఆలోచనతోనే టీడీపీ-బీజేపీలు కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వ ముఖ్యుల విశ్లేషణగా తెలుస్తోంది. అందుకే దీనిపై రాజకీయ కోణంలోనూ స్పందించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై పలువురు ముఖ్యమంత్రులతో, ఢిల్లీలో ఇతర పార్టీల జాతీయ నేతలతో చర్చించి.. కేంద్రం వైఖరిని వివరించే బాధ్యతను కొందరు టీఆర్ఎస్ ముఖ్య నాయకులకు ఆయన అప్పగించారు. మరోవైపు పార్టీ ముఖ్యులు కూడా కేంద్రం వైఖరిపై విమర్శలకు దిగారు. కడియం, కేటీఆర్, కవిత, హరీష్‌రావు, రాజయ్య, జోగురామన్న తదితరులు మీడియా ముందు కేంద్రంపై మండిపడ్డారు. పలుచోట్ల టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ శ్రేణులు నిరసన ప్రదర్శనలకూ దిగాయి. విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఏముందంటే.. 8. (1) ఉమ్మడి రాజధానిలో నివసించేవారి రక్షణ, స్వేచ్ఛ, ఆస్తుల భద్రత కోసం గవర్నర్ విశేషాధికారాలను కలిగి ఉంటారు. (2) మరీ ప్రత్యేకంగా.. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన సంస్థల రక్షణ, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపులకు గవర్నర్ విశేషాధికారాలు వర్తిస్తాయి. (3) ఈ దిశలో గవర్నర్ తన విధుల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిని సంప్రదిస్తూనే.. అంతిమంగా తన సొంత నిర్ణయాలను వెలువరించవచ్చు. ఈ విషయంలో గవర్నర్ సొంత విచక్షణతో తీసుకునే నిర్ణయాలే అంతిమం. వీటిని ఏ కారణాలతోనూ ప్రశ్నించటానికి అవకాశం లేదు. (4) గవర్నర్‌కు సహకరించడానికి కేంద్రం ద్వారా ఇద్దరు సలహాదారులు ఉంటారు. కేంద్రం పంపిన తాజా లేఖ సారాంశం హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్‌తో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు ఆస్తుల రక్షణ, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాధికారులకు గవర్నర్ ఆదేశాలు జారీచేసే అధికారం అవసరాన్ని బట్టి ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిలో పునర్నియమించే అధికారం అత్యవసర పరిస్థితిలో బలగాల మోహరింపుపై అంతిమ నిర్ణయాధికారం తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పోలీస్ సర్వీస్ బోర్డు ఏర్పాటు ఇన్స్పెక్టర్ల నుంచి డీఎస్పీల దాకా బదిలీ లు, పోస్టింగులు బోర్డు ద్వారానే అమలు బోర్డు చేసే ప్రతిపాదనల్లో మార్పులుచేర్పులకు గవర్నర్‌కు అధికారం అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల రక్షణకు జంట కమిషనరేట్లతో ప్రత్యేక సెల్ రక్షణ బలోపేతం దిశలో గవర్నర్ సూచనలను తెలంగాణ ప్రభుత్వం విధిగా అమలు చే యాలి శాంతిభద్రతల కోణంలో చట్టానికి అనుగుణంగా ఎలాంటి ఆదేశాలైనా జారీ చేసే అధికారం మంత్రిమండలి, ఏదేని సంస్థ తీసుకునే నిర్ణయాల రికార్డులు, సమాచారం తెప్పించుకునే అధికారం -
'గవర్నర్ పెత్తనం' చంద్రబాబు కుట్రే!
మెదక్: హైదరాబాద్ నగర బాధ్యతలను గవర్నర్ నరసింహన్ కు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్ పై గవర్నర్ పెత్తనం అంశం మాత్రం కచ్చితంగా చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల కుట్ర పూరిత రాజకీయాల్లో భాగమేనని మండిపడ్డారు. ఈ రోజు జిల్లాలోని సంగారెడ్డిలో కుటుంబ సమగ్ర సర్వే సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందంటూ యూపీఏపై భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పడు అదే పనిని ఎందుకు చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో గవర్నర్ పాలనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. పునర్విభజన చట్టానికి లోబడే మంత్రివర్గ నిర్ణయాల మేరకే గవర్నర్ కార్యాలయం పని చేస్తుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ అధికారాలు అమలు చేయటం సాధ్యం కాదని రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. రాష్ట్రం విషయంలో కేంద్రం జోక్యం తగదని, పూర్తిస్థాయిలో గవర్నర్‌కు అధికారాలు అప్పగించలేమని ఆయన లేఖలో తెలిపారు. ఇదే విషయంపై రాజీవ్ శర్మ ఈరోజు ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. -
కేంద్ర హోంశాఖకు సీఎస్ రాజీవ్ శర్మ లేఖ
-
కేంద్ర హోంశాఖకు సీఎస్ రాజీవ్ శర్మ లేఖ
హైదరాబాద్ : హైదరాబాద్‌లో గవర్నర్ పాలనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. పునర్విభజన చట్టానికి లోబడే మంత్రివర్గ నిర్ణయాల మేరకే గవర్నర్ కార్యాలయం పని చేస్తుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ అధికారాలు అమలు చేయటం సాధ్యం కాదని రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. రాష్ట్రం విషయంలో కేంద్రం జోక్యం తగదని, పూర్తిస్థాయిలో గవర్నర్‌కు అధికారాలు అప్పగించలేమని ఆయన లేఖలో తెలిపారు. ఇదే విషయంపై రాజీవ్ శర్మ ఈరోజు ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. -
'హైదరాబాద్‌పై అధికారాన్ని వదిలేది లేదు'
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలపై చర్చ జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కేంద్రం జోక్యంపై రాజీవ్ శర్మ ఈ భేటీలో అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌పై అధికారాన్ని వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఈ సందర్భంగా సీఎస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం ...తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ ఆదేశాలను అమలు చేయబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
విశేషాధి’కారం’
-
పెత్తనం కుదరదు
* కేంద్రంపై కేసీఆర్ ఫైర్ * మోడీ ఫాసిస్టు చర్యలను ఖండిస్తున్నట్లు వ్యాఖ్యలు * ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం తాజాగా పంపిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ ఆదేశాలను అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కబళించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫాసిస్టు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కూడా లేఖ రాయాలని ప్రధాన కార్యదర్శికి సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపించాలని, త్వరలోనే సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వివరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు ధోరణిని ప్రతిఘటించేందుకు ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్రం పంపిన లేఖలోని అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను అమలు చేయమని ప్రకటించారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కల్పించాలని, అందుకు అవసరమైన విధంగా తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేసుకోవాలని గత నెలలోనే కేంద్ర హోం శాఖ నుంచి లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో ఉమ్మడి పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని, ఇరు రాష్ట్రాల డీజీపీలతో కమిటీ వేయడంతోపాటు, నగరంలో పోలీసు అధికారుల నియామకానికి సంబంధించి ఇరు రాష్ట్రాల వారిని పరిగణించాలని అందులో సూచించింది. దీనికి రాష్ర్ట ప్రభుత్వం కూడా ఘాటుగానే బదులిచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉన్న ప్రకారం నడచుకుంటామే తప్ప.. గవర్నర్‌కు అధికారాలు కల్పించేలా బిజినెస్ రూల్స్‌ను మార్చబోమని తేల్చి చెప్పింది. ఇదంతా జరిగిన నెల రోజుల తర్వాత కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ పేరిట శుక్రవారం రాత్రి మరో లేఖ రాష్ర్ట ప్రభుత్వానికి అందింది. అయితే ఇందులో ఇరు రాష్ట్రాల పోలీసుల అధికారులను నియమించాలన్న నిబంధనను తొలగించారు. -
పవర్ గవర్నర్దే..
* విశేషాధికారాలపై కేంద్రం మళ్లీ లేఖ * ఇద్దరు పోలీస్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు * సర్కారు నుంచి రికార్డులు తెప్పించుకునే అధికారం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని పరిధిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్యమైన కేంద్ర సంస్థల రక్షణ బాధ్యతలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛా పరిరక్షణ బాధ్యతలు గవర్నర్ చేతుల్లోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. హైదరాబాద్‌లో గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టాలంటూ తాజాగా తెలంగాణ సర్కారుకు మరో లేఖ రాసింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ నుంచి వచ్చిన ఈ లేఖ శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందింది. విభజన చట్టంలోని సెక్షన్ 8, దాని సబ్సెక్షన్లకు సంబంధించి గవర్నర్‌కు ఉండే ప్రత్యేక బాధ్యతలను పేర్కొనడంతో పాటు, గవర్నర్ నిర్వర్తించే బాధ్యతలను కూడా ఈ లేఖలో వివరించారు. వీటి అమలుకు సంబంధించి పరిపాలన సజావుగా సాగడానికి మార్గదర్శకాలను కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఇవీ మార్గదర్శకాలు * మంత్రి మండలి, ఏదైనా సంస్థ తీసుకునే నిర్ణయాల రికార్డులను, సమాచారాన్ని తెప్పించుకునే అధికారం గవర్నర్‌కు ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు, భారీ నేరాల ప్రత్యేక నివేదికలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ ఎప్పటికప్పుడు గవర్నర్‌కు సమర్పించాలి. * శాంతిభద్రతల నియంత్రణ చట్టానికి అనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారులకు గవర్నర్ ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వవచ్చు. శాంతిభద్రతలు, పరిపాలన అంశాల్లో గవర్నర్‌కు ఆయన సలహాదారులు సహకారం అందిస్తారు. వీరికి అవసరాన్ని బట్టి గవర్నర్ బాధ్యతలు అప్పగిస్తారు. * శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల భద్రత, ప్రత్యేక పరిస్థితులపై నివేదికలను రెండు కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ, తెలంగాణ హోం శాఖ కార్యదర్శి కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలి. దీనిపై గవర్నర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తారు. ఈ అంశాల్లో గవర్నర్ ఆదేశాలే అంతిమంగా అమలవుతాయి. * ఆ రెండు కమిషనరేట్లలో ఐజీ ర్యాంకుకు తగ్గని సీనియర్ అధికారులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. వీరితోపాటు రంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలోనూ ఏర్పాటు చేయాలి. * బలవంతపు వసూళ్లు, విద్వేషాలు రెచ్చగొట్టే నేరాలపై సత్వర విచారణ నిర్వహించాలి. కోర్టుల్లో వేగంగా విచారణ జరిగేలా చర్య తీసుకోవాలి. ఈ సెల్‌లోని అధికారుల సెల్‌ఫోన్ నంబర్లతోపాటు, చిరునామాలకు విస్తృత ప్రచారం కల్పించాలి. * అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల రక్షణకు జంట కమిషనరేట్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి వీరందరిపై సీనియర్ అధికారిని నియమించాలి. ఈ సెల్ సున్నితమైన సంస్థలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు నివేదించాలి. ప్రస్తుతం ఈ సంస్థలకు ఎస్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ ద్వారా కల్పిస్తున్న సెక్యూరిటీని సమీక్షించి, పటిష్ట భద్రతను కల్పించాలి. రక్షణ బలోపేతానికి గవర్నర్ చేసే సూచనలను విధిగా అమలు చేయాలి. ఇందుకోసం సీనియర్ అధికారిని నియమించి భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు గవర్నర్‌కు నివేదించాలి. * తెలంగాణ డీజీపీ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పోలీసు సర్వీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు ద్వారానే డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓల వరకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఈ బోర్డు చేసిన ప్రతిపాదనలపై గవర్నర్ సలహాలు, సూచనలతో మార్పులు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. * అత్యవసర పరిస్థితుల్లో బలగాల మోహరింపుపై గవర్నర్ చేసే సూచనలను టీ సర్కారు పరిశీలించి మళ్లీ గవర్నర్‌కు పంపించాలి. దీనిపై గవర్నర్దే తుది నిర్ణయం. ఉమ్మడి రాజధాని పరిధిలో చట్టాల ఏర్పాటు, కమిషన్ల నియామకం, చట్టాల్లో సెక్షన్ల తొలగింపునకు సంబంధించిన నివేదికను చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. చట్టాల రూపకల్పన, కమిషన్ల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై నివేదిక కోరే అధికారం ఉంటుంది. * అవసరాన్ని బట్టి ఉద్యోగుల తాత్కాలిక పద్ధతిలో పునర్నియామకానికి ప్రభుత్వాన్ని గవర్నర్ కోరవచ్చు. ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపునకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సలహాలతో గవర్నర్ నిర్వహణ సాగిస్తారు. * ఉమ్మడి రాజధానిలో నివసిస్తున్న ప్రజల ఆస్తుల రక్షణకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫిర్యాదుల విభాగం ఏర్పాటుచేయాలి. ఫిర్యాదుదారుల ఆస్తుల రక్షణ, హక్కులపై ప్రభుత్వ అధికారులకు గవర్నర్ అవసరమైన ఆదేశాలు జారీచేస్తారు. వాటిని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రతిని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికీ పంపారు. -
త్వరలో 2000 నిఘా నేత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో త్వరలో 2000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏఏ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే విషయంపై కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ నిఘావర్గాలతో సర్వే చేయిస్తున్నారు. పాతబస్తీలో ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిసింది. గత రెండు దశాబ్దాల కాలంలో నగరంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుం టుందని నిఘా వర్గాలు కమిషనర్లకు సూచించాయి. శివార్లలో కాలనీలు, బస్తీలు విస్తరించడంతో రెండు కమిషనరేట్ల పరిధిలో గతంలో కంటే సమస్యాత్మక ప్రాంతాలు పెరిగాయి. మత ఘర్షణలు, అల్లర్లు, రౌడీమూకల దాడులు జరిగిన ప్రాంతాలు కూడా వీటిలో ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా.. ఎందుకు జరిగింది? కారకులు ఎవరు అనేది సులభంగా తెలిసిపోతుంది. సీసీ కెమెరాల్లోని ఫుటేజీ నిందితుడికి శిక్షపడేందుకు కూడా దోహదపడుతుంది. గతంలో ఏదైనా గొడవ జరిగితే స్థానిక యువకులను అనుమానితులుగా స్టేషన్‌కు పిలిచి విచారణ పేరుతో వేధించేవారు. సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తే నిందితుడి గుర్తింపు వెంటనే జరిగిపోవడంతో పాటు అమాయకులను వే ధించడం ఆగిపోతుంది. సీసీ కెమెరాల్లో ప్రతి చిన్న విషయం రికార్డు అయిపోతుంటుంది కాబట్టి ఎవ్వరూ నేరం చేయడానికి సాహసించరని, దీంతో నేరాలు అదుపులోకి వస్తాయని పోలీసులంటున్నారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారా వచ్చే ఫుటేజీల పర్యవేక్షణకు జోన్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలో ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుంచి నిత్యం ఆయా కూడళ్లలో వాహనాల రద్దీని పరిశీలించి, ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సహకరిస్తుంటారు. అలాగే, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న కెమెరాల ద్వారా ఎక్కడైన గొడవలు జరుగుతుంటే గుర్తించి వెంటనే అదుపులోకి తెచ్చేయవచ్చు. వచ్చే రెండు మూడు నెలల్లో నగరంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఉపయోగంలోకి తీసుకొస్తామని అధికారులంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ సీసీ కెమెరాలతో పాటు హోటళ్లు, దుకాణాలు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లు, ఆసుపత్రుల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసేలా యజమానులుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వం తరఫున సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయితే నగర జీవి అనుక్షణం మూడో కన్ను నీడలో పయనించకతప్పదు. -
'ఉమ్మడి రాజధానిలో పోలీసులదే కీలకపాత్ర'
ఉమ్మడి రాజధాని నిర్వహణలో పోలీసులదే కీలకపాత్ర అని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అపాయింటెడ్ డేట్‌కు ముందే పోలీస్ శాఖలో స్పష్టత రావాలని ఆయన తెలిపారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు కేంద్రం ఆధీనంలోనే పని చేస్తాయని వెల్లడించారు. వాటి నిర్వహణ బాధ్యత కూడా కేంద్రమే చూసుకుంటుందని అనిల్ గోస్వామి పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతత్వంలోని బృందం మంగళవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. విభజన నేపథ్యంలో జరుగుతున్న నివేదికలను ఆ బృందం పరిశీలిస్తుంది. అందులోభాగంగా ఇప్పటికే అనిల్ గోస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ తదితరులను కలసి సంగతి తెలిసిందే. -
జీహెచ్ఎంసీకి డబుల్ ధమాకా!!
రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో భాగంగా హైదరాబాద్ నగరాన్ని దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కూడా నిర్ణయించారు. ఈ నిర్ణయం ఎవరికి ఎలా ఉన్నా.. జీహెచ్ఎంసీకి మాత్రం భలే కలిసొస్తోంది. ఎందుకంటే, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి జీహెచ్ఎంసీకి నిధులు రానున్నాయి. నగరంలోని సదుపాయాలను రెండు ప్రభుత్వాలూ ఉపయోగించుకుంటాయి కాబట్టి, తాము అదనపు బాధ్యతలను మోయాల్సి వస్తుందని, అందువల్ల రెండు ప్రభుత్వాల నుంచి నిధులు, గ్రాంటులు కోరుతామని మేయర్ మాజిద్ హుస్సేన్ చెబుతున్నారు.మొత్తం నగరంలోని 150 వార్డులనూ తాము అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకోసం కోర్ ఏరియా (ప్రధాన నగరం)లో ఒక్కో వార్డుకు కోటిన్నర రూపాయలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు. దీనికోసం తప్పనిసరిగా నిధుల అవసరం ఉంటుందని, వాటిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి తీసుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఇక గ్రేటర్ ‘ఉమ్మడి’ రాజధాని
రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఇక గ్రేటర్ హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. సిటీజనుల్లో ఇదే విషయమై సర్వత్రా విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో సుమారు 625 చదరపు కిలోమీటర్లు, 78 లక్షల మంది జనాభాతో ‘గ్రేటర్’ ఉంది. ఇక శాంతిభద్రతలను పరిరక్షించే అంశం గవర్నర్‌కు కట్టబెట్టడంతో భద్రత, ఉపాధి, ఉద్యోగావకాశాలు, ఉన్నత విద్య, వృత్తి విద్య తదితర అంశాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఉమ్మడి రాజధానిపై పడింది. జీహెచ్ఎంసీ పరిధి వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. విభజన జీహెచ్ఎంసీ, జలమండలి వంటి స్థానిక సంస్థల విభాగాల్లో రోజువారీ పరిపాలనా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపదన్నది నిపుణుల మాట. ఇక నగరంలో కొలువైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయం, ఆయా విభాగాల డెరైక్టరేట్లు, క మిషనరేట్లు సహా సుమారు 105 సర్కారు కార్యాలయాల్లో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకే ప్రాంగణంలో ఉన్న కార్యాలయాలను వీలును బట్టి బ్లాకుల వారీగా రెండుగా విభజించి ఉభయరాష్ట్రాల్లో పాలన సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. అలా వీలుకాని పక్షంలో నగరంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో సీమాంధ్ర రాష్ట్ర కార్యాలయాలను పదేళ్లపాటు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాగా విభ జన అంశం తెరమీదకు వచ్చినప్పటి నుంచి గ్రేటర్ నగరం భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు వ్యక్తమయిన విషయం విదితమే. నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారా.. లేక గవర్నర్ పాలకమండలి చేతిలో పెడతారా.. చండీగఢ్ తరహా పాలన అమలు చేస్తారా.. అన్న అంశంపై చర్చోపచర్చలు సాగాయి. ఒక దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలతో ప్రత్యేక శాసనసభ ను ఏర్పాటు చేస్తారన్న పుకార్లూ షికారు చేశాయి. అనేక తర్జనభర్జనల అనంతరం కేంద్రం ఈ సస్పెన్స్‌కు మంగళవారం లోక్‌సభలో తెర దించింది. మొదట్లో అనుకున్నట్లుగానే గ్రేటర్ పరిధిని ఉమ్మడిగా ప్రకటించింది. ఉమ్మడి రాజధానిగా గ్రేటర్‌ను ప్రకటించిన నేపథ్యంలో మహానగర విశేషాలపై ప్రత్యేక కథనం.. మెట్రోల్లో ఆరు.. జనాభాలో నాలుగు.. దేశంలోనే అతిపెద్ద మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. అతిపెద్ద మెట్రో ముంబై కాగా.. తర్వాతి స్ధానాల్లో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలు నిలిచాయి. జనాభాలో మాత్రం నాలుగో స్థానం ఉంది. అత్యధిక జనాభా ఉన్న నగరంగా ముంబై నిలవగా.. తర్వాతి స్ధానాల్లో ఢిల్లీ, బెంగళూరు ఉన్నాయి. 78,00,000 జనాభాతో హైదరాబాద్ నాలుగో స్థానం దక్కించుంకుంది. అత్యధిక జన సాంద్రత గల నగరాల సరసన చేరింది. పారిశ్రామికీకరణ.. నగరానికి ఆనుకొని ఉన్న శివార్లలో సుమారు 20 వేల వరకు బల్క్‌డ్రగ్, ఫార్మా, తయారీరంగ ం, నిర్మాణ రంగ, మెటల్ పరిశ్రమలు విస్తరించడంతో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. వీటితోపాటే సేవలు, వాణిజ్యరంగాలు విస్తరించడంతో ఉపాధి కోసం ప్రధాన నగరం నుంచి శివార్లకు తరలివెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు, పొరుగు జిల్లాల నుంచి నిత్యం వలస వస్తున్న కార్మికులు, దినసరి కూలీలు, సాఫ్ట్వేర్, బీపీఓ ఉద్యోగులతో నగర శివార్లు కిటకిటలాడుతున్నాయి. ఉన్నత విద్యకు చిరునామా మేడ్చల్, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వందలాదిగా ఇంజనీరింగ్, ఫార్మా, మేనేజ్మెంట్ వృత్తి విద్యా కళాశాలలున్నాయి. ఫలితంగా ఇక్కడ ఉన్నత విద్యావకాశాలు బాగా పెరిగాయి. కళాశాలల్లో కూడా ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. ఫలితంగా శివార్లు కిటకిటలాడుతున్నాయి. జీహెచ్ఎంసీ స్వరూపమిదీ... జీహెచ్ఎంసీ.. గతంలో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)గా ఉండేది. శివార్లలోని 12 మునిసిపాలిటీల విలీనంతో 2007 ఏప్రిల్ 16న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అవతరించింది. రంగారెడ్డి జిల్లాలోని 10 మునిసిపాలిటీలు, మెదక్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీలను కలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ స్వరూప స్వభావాలిలా ఉన్నాయి. జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ అసెంబ్లీ స్థానాలు: 24 (పటాన్చెరు (పార్ట్), మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ (పార్ట్), కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం (పార్ట్), రాజేంద్రనగర్ (పార్ట్), శేరిలింగంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్ట్ ). పార్లమెంట్ స్థానాలు: హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలు మాత్రమే పూర్తిగా దీని పరిధిలోకి రాగా, మల్కాజిగిరి, చేవేళ్ల, మెదక్ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. పరిపాలన: జీహెచ్ఎంసీ స్థానిక పాలనలో మేయర్, డిప్యూటీ మేయర్లున్నారు. 150 మంది కార్పొరేటర్లు వీరిని ఎన్నుకున్నారు. గడువులోగానే మెట్రో ప్రాజెక్టు నగరంలోని ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్టుపై రాష్ట్ర విభజన అంశం ఎలాంటి ప్రభావం చూపదని ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గడువులోగానే మెట్రో పనులను పూర్తిచేస్తామని తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి 22న మొదటి దశ పూర్తవుతుందన్నారు. మెట్రో నగర పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
రేపు తెలంగాణ బంద్
ఉస్మానియా విద్యార్థి సంఘాల పిలుపు సాక్షి, హైదరాబాద్: సంపూర్ణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 11వ తేదీ మంగళవారం తెలంగాణ బంద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అన్ని అధికారాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఆదివారం ఉస్మానియా వర్సిటీలో 20 విద్యార్థి సంఘాల నేతలు సమావేశమై, తెలంగాణ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు కోట శ్రీనివాస్‌గౌడ్, ఆజాద్, సయ్య ద్ సలీంపాషా తదితరులు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’లో ఎన్నో చిల్లులున్నాయని వ్యాఖ్యానించారు. గవర్నర్ చేతికి శాంతిభద్రతలను అప్పగిస్తే.. బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఉమ్మడి ప్రవేశ పరీక్షలను కూడా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. పోల వరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో చేర్చడం కాదని, అసలు ఈ ప్రాజెక్టునే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏమైనా తేడాలు వస్తే.. తెలంగాణలో ఈ ప్రాంత ఎంపీలను అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, ఆంక్షల్లేని తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు కూడా 11న బంద్‌కు పిలుపునిచ్చారు. ఫ్రంట్ రాష్ట్ర నేతలు జయ, నర్సింగరావు, రాజా నర్సింహ, సంధ్యలు బంద్ విషయాన్ని వెల్లడించారు. టీ బిల్లులో యూపీఏ ప్రభుత్వం పూట కో షరతు పెడుతోందని, హైదరాబాద్ ఆదాయాన్ని సీమాం ధ్రకు పంచుతామంటే సహించేది లేదని అన్నారు. -
తాత్కాలిక రాజధానిగా రెండేళ్లు చాలు: ఎంఐఎం
విభజన బిల్లుకు ఎంఐఎం 15 సవరణలు రాష్ట్ర విభజన అనంతరం మిగిలిపోయే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే అంశాన్ని రాష్ట్ర విభజన బిల్లులోనే పొందుపరచాలంటూ ఎంఐఎం శాసనసభ్యులు బిల్లుకు సవరణ ప్రతిపాదించారు కోరారు. ఖైరతాబాద్ రెవెన్యూ మండల పరిధినే తాత్కాలిక రాజధానిగా పేర్కొనాలని సూచించారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఆధ్వర్యంలోని ఏడుగురు ఎమ్మెల్యేలు మొత్తం 15 సవరణలను ప్రతిపాదిస్తూ శాసనసభ స్పీకర్‌కు లేఖను సమర్పించారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు ఈ ఏడాది రానున్న నేపథ్యంలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014’గా మార్చాలని సూచించారు. విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే తెలంగాణకు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని, హైదరాబాద్ శాంతిభద్రతల అంశంతో పాటు 8వ క్లాజులోని 1, 2, 3, 4 అంశాలను రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న హైకోర్టు న్యాయమూర్తులను స్థానికత ఆధారంగా తెలంగాణ, మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నియమించాలనే అంశాలను చేర్చాలని కూడా సవరణలను పొందుపర్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బార్కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న వారంతా రాష్ట్ర విభజన అనంతరం ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్లో కొనసాగాలనే విషయంలో వారికే అవకాశం ఇవ్వాలని సూచించారు. -
విభజన చిచ్చుతో కేంద్రానికి సవాలక్ష చిక్కులు
రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపేసిన కేంద్ర ప్రభుత్వానికి అసలు చిక్కుముడులు ముందున్నాయి. హైదరాబాద్ నగరాన్ని పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించారు. అప్పటివరకు ఇక్కడి శాంతి భద్రతల బాధ్యత తెలంగాణ గవర్నర్ చూసుకుంటారని కూడా చెప్పారు. వాస్తవానికి హైదరాబాద్ నగరాన్ని కొంతకాలం పాటైనా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్న సీమాంధ్ర ప్రాంత నాయకుల ప్రతిపాదనలకు జీవోఎం నిర్ద్వంద్వంగా నో చెప్పడంతో కేంద్రానికి చిక్కులు మరింత ఎక్కువ కానున్నాయి. ఇప్పడు ఢిల్లీ తరహాలోనో లేదా అరుణాచల్ ప్రదేశ్ తరహాలోనో ఇక్కడి పాలన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. శాంతిభద్రతలను గవర్నర్ చేతుల్లో పెట్టాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కొన్ని మార్పుచేర్పులు చేయడం తప్పనిసరి అవుతుంది. మన రాష్ట్రానికి ఈ బిల్లు ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే, ఢిల్లీ అయితే జాతీయ రాజధాని ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చైనా లాంటి ప్రమాదకర దేశంతో సరిహద్దు ఉంది. అందువల్ల ఆ రెండింటికీ శాంతి భద్రతలను కేంద్రం చూసుకుంటుందంటే పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ మామూలుగా అయితే శాంతి భద్రతలు, పోలీసింగ్ అనేవి పూర్తిగా రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలు. కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పోలీసింగ్, శాంతిభద్రతలను వదులుకోడానికి ఎంతవరకు అంగీకరిస్తుందన్న విషయం అనుమానమే. తమ పరిపాలనలో ఉన్న రాష్ట్రంలో కొంత భాగంలో మాత్రం (జీహెచ్ఎంసీ పరిధి) శాంతి భద్రతలు, పోలీసింగును గవర్నర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారంటే పాలకులు ఎంతమాత్రం సహిస్తారన్నది అనుమానమే. పైపెచ్చు, రాబోయే ఎన్నికలలో దాదాపు రెండు రాష్ట్రాల ప్రజలు (అప్పటికి విభజన ప్రక్రియ ముగిస్తే) కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడం దాదాపు ఖాయం. అప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను అమలు చేయడం, చేయకపోవడం అనేది కూడా అనుమానమే. శాంతి భద్రతల విషయంలో ఉమ్మడి రాజధాని సరిహద్దులు ఎంత ఉండాలన్నది మరో అతిపెద్ద సమస్య. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధినే చూసుకుంటారా లేదా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిని కూడా చేరుస్తారా అన్నది స్పష్టం కావాలి. రెండు కమిషనరేట్లనూ ఉమ్మడి రాజధాని పరిధిలోకి తేవాలని, జీహెచ్ఎంసీ పరిధిని పాలనాపరమైన అంశాల కోసం ఉమ్మడిగా నిర్ణయించాలని జీవోఎం తలపెట్టింది. కానీ తెలంగాణవాదులు దీన్ని అంగీకరించడంలేదు. జీహెచ్ఎంసీ పరిధి 625 చదరపు కిలోమీటర్లు కాగా, జనాభా 67 లక్షలు. అదే జంట కమిషనరేట్ల పరిధి 3,818 చదరపు కిలోమీటర్లు అవుతుంది, జనాభా 1.12 కోట్లు అవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జీహెచ్ఎంసీ పరిధి వ్యాపించి ఉంది. జంట కమిషనరేట్లు మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. మరి రెండు అంశాలకు రెండు వేర్వేరు పరిధులను ఎలా నిర్ణయిస్తారో పెద్దలే తేల్చాలి. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ దేశంలోనే పురాతనమైనది. దీన్ని 1847లో నిజాం కాలంలో ఏర్పాటుచేశారు. తర్వాత దీన్ని 1938లో హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం కింద పునర్వ్యవస్థీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 217 చదరపు కిలోమీటర్లు, దాంట్లో జనాభా 42 లక్షలు. ఐదుజోన్లు, 23 డివిజన్లు, 89 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 13,113 మంది సిబ్బంది అవసరం కాగా ప్రస్తుతం కేవలం 8,541 మంది మాత్రమే ఉన్నారు. 2012లో నగరంలో 15,073 నేరాలు జరిగాయి. ఇక సైబరాబాద్ కమిషనరేట్li 2003 ఫిబ్రవరిలో 3,601 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. జనాభా 70 లక్షలుంది. ఇందులో ఐదు జోన్లు, 14 డివిజన్లు, 60 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 6,877 మంది సిబ్బంది అవసరం కాగా 5,088 మందే ఉన్నారు. ఇక్కడ 2012లో 16,864 నేరాలు జరిగాయి. ఉమ్మడి రాజధానిలో పోలీసు పరిధి జీహెచ్ఎంసీ పరిధి కంటే దాదాపు ఐదురెట్లు ఉంటుంది. దేశంలో మరెక్కడా ఇలా లేదు. శాంతిభద్రతలను కేంద్రం నియంత్రణలోకి తెస్తే, పోలీసు కమిషనర్లు ఇద్దరికీ గవర్నర్ సూపర్ బాస్ అవుతారు. అంతేకాదు వీరు ముగ్గురూ కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ అధికారాలు చలాయించగలరు. కమిషనర్లిద్దరూ కేవలం గవర్నర్ గారికి మాత్రమే బాధ్యులుగా ఉంటే ముఖ్యమంత్రి ఏం చేయాలన్నదీ ప్రశ్నార్థకమే అవుతుంది మరి!! -
రాజధాని ఉమ్మడైతే.. శాంతిభద్రతల మాటేంటి?
ఎంతమంది వద్దంటున్నా వినిపించుకోకుండా.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ, రాష్ట్రాన్ని విభజించేందుకు కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఓ తలనొప్పి ఎదురైంది. ఉమ్మడి రాజధాని నగరంలో శాంతి భద్రతలను ఎవరు పరిరక్షిస్తారన్న విషయం పెద్ద ప్రశ్నగా మారింది. హైదరాబాద్ నగరాన్ని కొంతకాలం పాటైనా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్న సీమాంధ్ర ప్రాంత నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. అలాగే జీవోఎం కూడా ఈ ప్రతిపాదలనను తిరస్కరించింది. దీంతో ఇప్పడు ఢిల్లీ తరహాలోనో లేదా అరుణాచల్ ప్రదేశ్ తరహాలోనో ఇక్కడి పాలన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఆ రెండు చోట్లా సాధారణ పాలనా వ్యవహారాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటుండగా శాంతిభద్రతలు, పోలీసింగును మాత్రం కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కానీ అలా శాంతిభద్రతలను గవర్నర్ చేతుల్లో పెట్టాలంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో కొన్ని మార్పుచేర్పులు చేయడం తప్పనిసరి అవుతుంది. అయితే, మన రాష్ట్రానికి ఈ బిల్లు ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే, ఢిల్లీ అయితే జాతీయ రాజధాని ప్రాంతం, అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చైనా లాంటి దేశంతో సరిహద్దు ఉంది. అందువల్ల ఆ రెండింటికీ శాంతి భద్రతలను కేంద్రం చూసుకుంటుందంటే పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ మామూలుగా అయితే శాంతి భద్రతలు, పోలీసింగ్ అనేవి పూర్తిగా రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలు. కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పోలీసింగ్, శాంతిభద్రతలను వదులుకోడానికి ఎంతవరకు అంగీకరిస్తుందన్న విషయం మాత్రం అనుమానమే. శాంతి భద్రతల విషయంలో ఉమ్మడి రాజధాని సరిహద్దులు కూడా సమస్యే. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధినే చూసుకుంటారా లేదా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిని కూడా చేరుస్తారా అన్నది స్పష్టం కావాలి. రెండు కమిషనరేట్లనూ ఉమ్మడి రాజధాని పరిధిలోకి తేవాలని, జీహెచ్ఎంసీ పరిధిని పాలనాపరమైన అంశాల కోసం ఉమ్మడిగా నిర్ణయించాలని జీవోఎం తలపెట్టింది. కానీ ఒకే ఉమ్మడి రాజధానికి రెండు పరిధులేంటని ఇప్పుడు కొత్త అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. -
రాజ్యాంగానికి లోబడే ‘ఉమ్మడి’: దిగ్విజయ్
‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగ, న్యాయ పరిధికి లోబడే ఉంటుంది... కొంత కాలం ఉమ్మడి రాజధాని చేయవచ్చనే వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. విభజనకు సంబంధించిన అన్ని అంశాలపై జీవోఎం కసరత్తు బుధవారం పూర్తవుతుందని.. త్వరలోనే అసెంబ్లీకి విభజన బిల్లును పంపటంతో పాటు శీతాకాల సమావేశాల్లోనే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని ఆయన ఢిల్లీలో మీడియాతో చెప్పారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెకమాండ్‌ను ధిక్కరిస్తున్నారనే వాదనను దిగ్విజయ్ నవ్వుతూ కొట్టిపారేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పార్టీకి విబేధాల్లేవు. ఆయన కాంగ్రెస్‌కు విధేయుడు. విభజన విషయంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తున్నారు. ఈ విషయంలో తన అభిప్రాయం చెప్తున్నారే తప్ప అధిష్టానాన్ని ధిక్కరించటం లేదు’’ అని పేర్కొన్నారు. విభజనపై ఆంటోనీ కమిటీ నివేదిక గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఆ కమిటీ సోనియాగాంధీ ఏర్పాటు చేసినదే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. -
పరిమిత ఆంక్షలు!
-
పరిమిత ఆంక్షలు.. పదేళ్లు ఉమ్మడి
-
పరిమిత ఆంక్షలు.. పదేళ్లు ఉమ్మడి
హైదరాబాద్ చుట్టూ తుది కసరత్తు.. కొలిక్కి వచ్చిన జీవోఎం నివేదిక హైదరాబాద్‌పై పరిమిత ఆంక్షలతో తెలంగాణ ఏర్పాటుకు సూచన సీమాంధ్ర కేంద్రమంత్రుల యూటీ ప్రతిపాదనకు తిరస్కారం శాంతిభద్రతలు, రెవెన్యూ, భూపరిపాలన అధికారాలు కేంద్రానికి ఆర్టికల్ 258(ఎ) కింద గవర్నర్ లేదా కమిటీకి ప్రత్యేకాధికారాలు ఆర్టికల్ 371(డి), భద్రాచలం జోలికి వెళ్లకుండానే విభజన? ఢిల్లీలో వేగంగా పరిణామాలు.. రోజంతా జీవోఎం కీలక భేటీలు నేడు మళ్లీ భేటీ.. ఇదే ఆఖరి సమావేశమన్న జైరాంరమేశ్ ఇదే తుది సమావేశమని చెప్పలేమని వ్యాఖ్యానించిన షిండే రాష్ట్రపతి ప్రణబ్‌తో సోనియా భేటీ.. న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం) నివేదిక ఒక కొలిక్కి వచ్చింది. మంగళవారం హస్తినలో సాగిన జీవోఎం భేటీలు మొత్తం హైదరాబాద్ కేంద్ర బిందువుగా సాగాయి. ఢిల్లీలో చకచకా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా వెనక్కి వెళ్లింది. విభజన ప్రక్రియలో రాజ్యాంగాన్ని సవరించాలన్న సంకట స్థితిని తప్పించుకోవడానికి అంతిమంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనవసరం లేకుండానే కొన్ని షరతులతో ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలలో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తీసుకున్న మౌలిక నిర్ణయానికే కట్టుబడాలన్నది కేంద్ర ప్రభుత్వ తాజా యోచనగా తెలుస్తోంది. హైదరాబాద్‌ను యూటీ చేయకపోయినా మెజారిటీ సీమాంధ్రులు కోరుతున్నట్టుగా కొంత కాలం పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకే సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి రాజధానిని నిర్ణీత కాలం వరకే అనే భరోసా తెలంగాణ వారికీ, ఆ సమయంలో శాంతి భద్రతలకు పూచీ ఇచ్చే నమ్మకాన్ని సీమాంధ్రులకు కలిగించే ఏర్పాట్ల కోసం కసరత్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తదితరులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనల పట్ల సీమాంధ్రులు తరచూ ఆందోళన, అభద్రత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా శాంతిభద్రతలు, రెవెన్యూ, భూపరిపాలన అంశాల పర్యవేక్షణ బాధ్యతను గవర్నర్ లేదా కేంద్ర అథారిటీ పరిధిలో ఉంచేందుకు కేంద్రం సిద్ధమైంది. అందుకోసం రాజ్యాంగంలోని 258 (ఎ) అధికరణను అనుసరించి ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా ఆయా అంశాలకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలను కేంద్రం పర్యవేక్షించేలా ఏర్పాటు చేయాలని జీవోఎం బిల్లు ముసాయిదాలో ప్రతిపాదించింది. విభజన అనంతరం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతో పాటు కేంద్ర ప్రతినిధితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ఇరు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కూడా అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో తెలంగాణ వాదుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలను నివత్తి చేసేందుకు నిర్దిష్ట కాల పరిమితి (సన్‌సెట్) అంశాన్ని తెలంగాణ బిల్లులో పొందుపరచారని సమాచారం. వివాదాస్పదమైన 371 (డి) అధికరణకు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రాష్ట్రాన్ని విభజించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించే సంకట స్థితే కాకుండా నియోజకవర్గ పునర్విభజన వంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తకుండా చూసే క్రమంలో భద్రాచలం వంటి వివాదాస్పద అంశాల జోలికి జీవోఎం వెళ్లలేదు. నీరు, వనరుల పంపిణీ, విద్య, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై జీవోఎం ఇప్పటికే తుదినిర్ణయానికి రాగా మంగళవారం వేగంగా సాగిన సమావేశాలు, సమాలోచనలన్నీ హైదరాబాద్ అంశం చుట్టే తిరిగాయి. అంతా మేడం కనుసన్నల్లోనే... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలకు అనుగుణంగానే జీవోఎం సభ్యులు నివేదికలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జీవోఎం సారథి, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, జీవోఎం సభ్యుడు, మరో కేంద్రమంత్రి జైరాంరమేశ్‌లు నివేదిక రూపకల్పనపై కసరత్తు చేశారు. హైదరాబాద్ అంశంపైనే రోజంతా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం జీవోఎం మరో సభ్యుడు, రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని నివాసంలోనూ జీవోఎం సభ్యులు సమావేశమై దీనిపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు బుధవారం ఉదయం సీమాంధ్ర కేంద్ర మంత్రులు జైరాంరమేశ్‌ను కలిసి హైదరాబాద్ అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. తరువాత జీవోఎం సభ్యులు నార్త్‌బ్లాక్‌లో సమావేశమై నివేదికను ఖరారు చేయనున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం జరగబోయే జీవోఎం సమావేశమే చివరిదని, నివేదికను ఖరారు చేస్తామని జైరాంరమేశ్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు జీవోఎం సమావేశం ఉంటుందని చెప్పారు. ఎవరినీ బాధపెట్టని పరిష్కారం వెదుకుతున్నాం: షిండే అయితే.. జీవోఎం సారథి షిండే అందుకు విరుద్ధంగా పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణపై జీవోఎం సమావేశం కొనసాగుతుంది. రేపు (బుధవారం) కూడా జరుగుతుంది. రేపటి సమావేశమే చివరిదని చెప్పలేం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటపుడు ఏ ప్రాంతం వారినీ బాధపెట్టకుండే ఉండే పరిష్కార మార్గాలను వెదుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా జీవోఎం నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పిస్తామని చెప్పారు. అయితే.. షిండే వ్యాఖ్యల నేపథ్యంలో జీవోఎం నివేదిక ఈ నెల 28వ తేదీ (గురువారం) సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందా? లేదా? అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. దీనిపై జైరాం సహా జీవోఎం సభ్యులెవరూ స్పష్టత ఇవ్వటం లేదు. ఇప్పటివరకైతే అలాంటి సంకేతాలు మాత్రం రాలేదని, కేబినెట్ ముందుకు ఎప్పడు నివేదికను పంపాలన్నది పూర్తిగా సోనియాగాంధీ ఆదేశాలపైనే ఆధారపడి ఉందని, నివేదిక మాత్రం దాదాపుగా ఖరారైందని కాంగ్రెస్ అధిష్టానం వర్గాలు చెప్తున్నాయి. షిండే, జైరాంలతో సిబల్ భేటీ... మరోవైపు మంగళవారం పలువురు కేంద్ర మంత్రులు జీవోఎం సభ్యులు షిండే, జైరాంరమేశ్‌లను కలిసి రాష్ట్ర విభజన విషయంలో తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. తొలుత న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబల్.. షిండేతో కొద్దిసేపు సమావేశమై వెళ్లారు. ఆర్టికల్ 371డీ, హైదరాబాద్ యూటీ, సీమాంధ్రలో భద్రాచలం విలీనం వంటి అంశాలపై న్యాయపరంగా తలెత్తిన అంశాలపై పలువురు న్యాయనిపుణుల అభిప్రాయాలతో క్రోడీకరించిన నోట్‌ను జీవోఎం సభ్యులకు సిబల్ అందజేసినట్లు తెలిసింది. ఆ తరువాత కొద్దిసేపటికి జాతీయ విపత్తు నివారణా సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం షిండేను కలిసింది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేసింది. ‘కర్నూలు రాజధాని’ కోరిన కోట్ల... అనంతరం రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అక్కడికి వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కర్నూలును సీమాంధ్ర రాజధానిగా చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. అది సాధ్యం కాని పక్షంలో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరారు. ఈ రెండు జిల్లాల్ల గల సుమారు 2,300 గ్రామాలకు గాను దాదాపు 1700 గ్రామ పంచాయతీలు రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం చేశాయని పేర్కొంటూ వాటి వివరాలను జీవోఎం సభ్యులకు కోట్ల అందజేసినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. జీవోఎం సభ్యులు తమను అడుగడుగునా అవమానిస్తున్నందున ఇకపై తాను వారిని కలిసే ప్రసక్తే లేదని ప్రకటించిన కోట్ల రెండు రోజుల్లోనే మనసు మార్చుకుని అక్కడికి రావడం చర్చనీయాంశమైంది. పరిమిత ఆంక్షలకు జైపాల్ ఓకే! ఆ తరువాత కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి జీవోఎం సభ్యులు షిండే, జైరాంరమేశ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌పైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్‌ను యూటీ చేయకుండా సీమాంధ్రులకు రక్షణ కల్పించే విషయంపై జీవోఎం సభ్యులతో మాట్లాడాలంటూ సోనియాగాంధీ చేసిన సూచనల మేరకే జైపాల్‌రెడ్డి వారితో సమావేశమైనట్లు చెప్తున్నారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో హోంశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరై ఆయన అభిప్రాయాలను నోట్ చేసుకున్నట్లు తెలిసింది. ఆ తరువాత జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లిన జైరాంరమేశ్ ఆయనతో కొద్దిసేపు సమావేశమై వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆంటోని నివాసంలో జీవోఎం సభ్యులు వీరప్పమొయిలీ, నారాయణస్వామి కొద్దిసేపు సమావేశమై హైదరాబాద్ అంశంపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ అంశంపై మాట్లాడినట్లు చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో సీమాంధ్రుల కోసం పరిమిత కాలానికి రక్షణలను ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ, న్యాయపరంగా ఉన్న చిక్కులపై చర్చించాం. తెలంగాణ వాదిగా వాటిపై నా అభిప్రాయాలను వివరించాను. నా వివరణ తరువాత జీవోఎం ఏ నిర్ణయం తీసుకుంటుందో అవగాహన లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్న హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణ కోసం ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ తీర్మానంలో ఉందన్నారు. అలాంటిదేమీ అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వమే ఈ విషయంలో రాజ్యాంగపరమైన విధులను నిర్వర్తిస్తుందనే నమ్మకం ఉందన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీమాంధ్రులకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవటానికి తనకేమీ అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయడానికి తనతో సహా తెలంగాణ ప్రజలు, పార్టీలు, నాయకులెవరూ ఒప్పుకోరని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని 258 (ఎ) విషయాల పై తానిప్పుడు మాట్లాడబోనన్నారు. అయితే యూటీ లేకుండా, రాజ్యాంగ సవరణ లేకుండానే హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకోవచ్చని జీవోఎం సభ్యులకు చెప్పానని.. వాటిని మీడియాకు వెల్లడించలేనని తెలిపారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి ఎప్పుడు వెళుతుందో చెప్పలేనన్నారు. అయితే డిసెంబర్ 20 లోపు మాత్రం మొత్తం తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణ నాయకులను సంప్రదించిన తరువాతే రాయల తెలంగాణ అంశంపై తాను మాట్లాడతానని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. యూటీ చేస్తే చాలు..: ప్రధానికి శీలం వినతి సీమాంధ్ర రాష్ట్రంలో కొత్త రాజధానిని నిర్మించుకునేంత వరకు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే చాలని కేంద్రమంత్రి జె.డిశీలం మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కోరారు. ఈ విషయంలో తెలంగాణ నేతలను ఒప్పించే బాధ్యతను తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ప్రధానిని కలిసిన ఆయన ఈ మేరకు ఓ వినతి పత్రం అందజేశారు. ఆ తరువాత ఆర్థికమంత్రి చిదంబరంతో శీలం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని తాము ఒప్పుకుంటున్నామన్నారు. అయితే సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు మాత్రమే హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నామని, ఈ విషయంలో తెలంగాణ నేతలు భీష్మించుకోకుండా ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించాలే తప్ప నిర్దయగా ఉండొద్దని సూచించారు. తెలంగాణ వాళ్లు అడిగిందల్లా ఇవ్వాలని తాము కోరుతున్నామని, తమకు మాత్రం కొద్ది కాలం హైదరాబాద్‌ను యూటీ చేస్తే చాలని అన్నారు. తద్వారా 90 శాతం మంది ప్రజలను సంతోషపడతారని చెప్పారు. కాదూ కూడదని తెలంగాణ నేతలు భీష్మించుకుంటే జరగబోయే పర్యవసానాలకు తాము బాధ్యులం కాదని వ్యాఖ్యానించారు. సోనియాతో కృపారాణి భేటీ మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి సమావేశమైనట్లు తెలిసింది. కోస్తాలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సోనియాను కోరిన కృపారాణి.. రాష్ట్ర విభజన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ హైదరాబాద్‌ను యూటీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. అయితే సోనియాగాంధీ మాత్రం ఆ ప్రతిపాదన సాధ్యం కాదని, సీడబ్ల్యూసీ తీర్మానం పరిధిలోనే రాష్ట్ర విభజన జరుగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను ఈ విషయంలో ఒప్పించాల్సి బాధ్యత ఆ ప్రాంత కేంద్ర మంత్రులదేననని సూచించినట్లు తెలిసింది. రాష్ట్రపతితో సోనియా భేటీ ఇదిలవుంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలుసుకున్నారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో సోనియా రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ తర్వాత తుది రూపం సంతరించుకునే విభజన బిల్లు ముసాయిదా అంశాన్ని ఆమె రాష్ట్రపతి దృష్టికి తెచ్చినట్టు సమాచారం. -
హైదరాబాద్ ఉమ్మడి రాజధానితో ఒరిగేదేమి లేదు: జేసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని జేసీ దివాకర్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో తెలిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే విభజన జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ విషయంలో నిర్ణయం తీసుకునేది సోనియా మాత్రమే అని ఆయన స్ఫష్టం చేశారు. విభజన జరిగితే హైదరాబాద్ నుంచి సీమాంధ్రలో పాలన సాగించలేమని జోస్యం చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే సీమాంధ్రకు ఒరిగేదేమి లేదని అభిప్రాయపడ్డారు. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వధికారులు తెలంగాణ ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందేనని తెలిపారు. రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై సోనియాతో చర్చించేందుకు, ఆమె అపాయింట్ కోరినట్లు జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. -
ఉమ్మడి ఎలా? పై చర్చ
-
ఉమ్మడి ఎలా?
-
హైదరాబాద్‌పై కాంగ్రెస్ కోర్ కమిటీలో సుదీర్ఘ చర్చ
హైదరాబాద్‌పై కాంగ్రెస్ కోర్ కమిటీలో సుదీర్ఘ చర్చ రాజ్యాంగంలో ‘ఉమ్మడి రాజధాని’ అనేది లేనందున ఇబ్బందులు వస్తాయన్న కపిల్ సిబల్ రాజ్యాంగ సవరణ తప్పకపోవచ్చని వెల్లడి దానికన్నా.. శాంతిభద్రతలను తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకే అప్పగించవచ్చని సూచన న్యాయనిపుణులతో చర్చించి పరిష్కారాలు చూపాలని సిబల్‌కు కోర్ కమిటీ నిర్దేశం 371డి అధికరణ, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అంశాలపైనా కోర్ కమిటీ భేటీలో చర్చ ఆయా అంశాలపై ఈ నెల 25-28 తేదీల మధ్య మంత్రుల బృందం మళ్లీ భేటీ అయ్యే అవకాశం వచ్చే నెల 15 నాటికి రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ ద్వారా రాష్ట్రపతికి చేరేలా ప్రణాళిక న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానానికి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయటమెలా అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఇందుకు రాజ్యాంగ, న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు చెప్పటంతో.. దీనిని అధిగమించేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పకపోవచ్చని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ శుక్రవారం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో పేర్కొన్నట్లు తెలిసింది. అలా చేయటంకన్నా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి రాజధానిలో శాంతిభద్రతల బాధ్యతలు ఆ కమిటీకి అప్పగించవచ్చని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో ఈ అంశాలపై న్యాయనిపుణులను సంప్రదించి పరిష్కార మార్గాలు చూపాలని కాంగ్రెస్ కోర్ కమిటీ సిబల్‌కే బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాజ్యాంగంలో పొందుపరచిన 371డి అధికరణను కొనసాగించటం లేదా రద్దు చేయటం విషయంలోనూ న్యాయనిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో దాని పరిష్కారంపైనా దృష్టి సారించింది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఆర్థికమంత్రి పి.చిదంబరం, హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీలు పాల్గొన్న ఈ సమావేశానికి.. కోర్ కమిటీ సభ్యుడు కానప్పటికీ న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబల్‌ను ఈ సమావేశానికి ప్రత్యేకంగా పిలిపించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఆర్టికల్ 371డి, సీమాంధ్రకు ప్యాకేజీ అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో ‘ఉమ్మడి రాజధాని’ లేదు... కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్ పోలింగ్ సరళితో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై భేటీలో తొలుత చర్చించారు. అనంతరం ఆంధప్రదేశ్ విభజన, కేంద్ర మంత్రుల బృందం నివేదిక అంశాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయటమా? లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చటమా? అనే అంశంపై చర్చ కేంద్రీకృతమైంది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందున దీనిని అమలు చేయాలంటే ఉత్పన్నమయ్యే సమస్యలపై కపిల్‌సిబల్‌ను అడిగి తెలుసుకున్నారు. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేనందున పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆశించిన ప్రయోజనం దక్కే అవకాశం లేదని భేటీలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలంటూ సీమాంధ్ర కేంద్రమంత్రులు ఒత్తిడి తెస్తున్న అంశాన్ని షిండే ప్రస్తావించగా.. పార్టీ ప్రయోజనాల రీత్యా ఇది ఏమాత్రం సమ్మతం కాదని సోనియాగాంధీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని చేయటమే మేలనే భావనకు వచ్చారు. రాజ్యాంగ సవరణ తప్పకపోవచ్చు... ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తే ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులపై కోర్ కమిటీ సభ్యులు ఆరా తీశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీ జాతీయ రాజధానిగా ఉన్న దృష్ట్యా రాజ్యాంగ సవరణ ద్వారా ఆయా అంశాలను బదలాయించారని.. హైదరాబాద్‌ను ఆ విధంగా చేయాలనుకుం టే అందుకోసం రాజ్యాంగ సవరణ తప్పకపోవచ్చని సిబల్ అభిప్రాయపడ్డట్లు తెలిసింది. అయితే.. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసి శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తే మేలని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి రాజధానిలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకునే బాధ్యత అప్పగించాలని కోరేలా నోట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఉమ్మడి రాజధాని విషయంలో న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుని భవిష్యత్తులో రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన ప్రతిపాదనను రూపొందించాలని కమిటీ భావించింది. ఆ బాధ్యతను కపిల్‌సిబల్‌కు అప్పగించినట్లు సమాచారం. శీతాకాల సమావేశాల్లో బిల్లుకు ప్రణాళిక... మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని షిండేకు సోనియా సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నెలాఖరు లోగా తెలంగాణ బిల్లుకు కేబినెట్ ఆమోదం పొందేలా చేసి ఆ వెంటనే రాష్ట్రపతి ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపాలని నిర్దేశించినట్లు సమాచారం. డిసెంబర్ 15 నాటికి అసెంబ్లీ అభిప్రాయాలు రాష్ట్రపతికి చేరేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే శీతాకాల సమావేశాలను పొడిగించి విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయాన్ని ఆలోచిద్దామని ప్రతిపాదించినట్లు చెప్తున్నారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి మంచి ప్యాకేజీ ప్రకటించేలా ప్రతిపాదనలు రూపొం దించటం ద్వారా ఆ ప్రాంత నేతలకు ఊరట కలిగించాలని సోనియా సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం వచ్చే వారం (నవంబర్ 25 - 28 మధ్య) రెండు రోజుల పాటు సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాబోయే కేంద్ర కేబినెట్ సమావేశానికి నివేదికను సమర్పించేలా జీవోఎం సభ్యులు సన్నద్ధమవుతున్నారు. -
ఉమ్మడి రాజధానిగా జీహెచ్ఎంసీ?
-
ఉమ్మడి రాజధానిగా జీహెచ్ఎంసీ?
శాంతిభద్రతలు గవర్నర్ చేతికి.. జీవోఎం నివేదికలో సిఫారసులు ఆంటోనీ నివాసంలో అర్ధరాత్రి భేటీలో కాంగ్రెస్ పెద్దల ఖరారు రెండు రాష్ట్రాల్లోనూ ‘371డీ’ కొనసాగింపు జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపిణీ సీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి ప్యాకేజీలు సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి కేంద్ర సంస్థల ఏర్పాటు.. ‘భద్రాచలం, రాయల తెలంగాణల’పై అసెంబ్లీ అభిప్రాయం ప్రకారం ముందుకు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన జీవోఎం.. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్‌కు అప్పగించాలని కూడా జీవోఎం తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేంద్ర మంత్రుల బృందం నివేదికకు, విభజన బిల్లు ముసాయిదాను కూడా బుధవారం రాత్రి రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నివాసంలో జరిగిన సమావేశంలో తుది రూపమిచ్చారు. జీవోఎం సభ్యుడు ఆంటోనీతో మరో సభ్యుడు జైరాం రమేశ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌లు సమావేశమై అర్ధరాత్రి దాటేవరకూ నివేదికపై చర్చించారు. పది పేజీలతో రూపొందించిన నివేదికలో పలు అంశాలను చేర్చారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అందులో కీలకమైన అంశాలపై పలు సిఫారసులను చేర్చారు. గురువారం సోనియాగాంధీని కలిసి ఆమె సూచనల మేరకు ముసాయిదా బిల్లు, జీవోఎం నివేదికను కేబినెట్‌కు సమర్పిస్తారు. ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించిన మేరకు జీవోఎం నివేదికలో పొందు పరిచిన ముఖ్యాంశాలివీ... - హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర నేతల డిమాండ్‌ను తిరస్కరించారు. - జీహెచ్ఎంసీ పరిధిలో ఉమ్మడి రాజధాని చేస్తూ, శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతను గవర్నర్‌కు అప్పగిస్తారు. - విభజన బిల్లుతో పాటే ఆర్టికల్ 371డీని కూడా పార్లమెంటులో సాధారణ మెజారిటీతో సవరించవచ్చని, దానిని రెండు రాష్ట్రాల్లో కొనసాగించవచ్చని జీవోఎం పేర్కొంది. ‘ఈ 371డీ ఆర్టికల్ తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది’ అని నివేదికలో చేర్చారు. - తెలంగాణ విడిపోతే ఆ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఎదురవుతుందన్న వాదనలను జీవోఎం కొట్టివేసింది. అలాంటిదేమీ ఉండదని, రాబోయే 25 నుంచి 35 ఏళ్ల వరకూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నాయని, అందులో తెలంగాణకు 56 శాతం, సీమాంధ్రకు 44 శాతం విద్యుత్ సరఫరా అయ్యేట్లు జెన్కో సహా ప్రయివేటు విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణకు విద్యుత్ కొరత ఉండదని పేర్కొంది. - జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాలని జీవోఎం సిఫారసు చేసింది. - వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు సముచిత ప్యాకేజీలు ప్రకటించాలని చెప్పింది. - సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత నేతలు చేస్తున్న ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. - సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి కేంద్రీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. - భద్రాచలం, రాయల తెలంగాణ అంశాలపై సస్పెన్స్‌ను జీవోఎం కొనసాగించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. -
యూటీ చేయకుండా ఉమ్మడి రాజధాని సాధ్యమే: జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రపాలిత ప్రాంతంగా మార్చకుండానే హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయడం సాధ్యమేనని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి చెప్పారు. కేంద్రం కూడా ఇదే నమ్మకంతో ఉందన్నారు. ఒకవేళ అలాంటి వెసులుబాటు లేకపోతే పార్లమెంటులో కొత్త చట్టం తెస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, జాతీయస్థాయిలో విభజనకు అపూర్వ మద్దతు ఉందని అన్నారు. రాష్ట్ర విభజన విషయమై కేంద్రం ప్రస్తావించిన 11 అంశాలపై సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ నేతల తరఫున తమ అభిప్రాయాలను జీవోఎంకు వివరిస్తామని తెలిపారు. ఈ మేరకు అందరి అభిప్రాయాలతో దాదాపు ఉమ్మడిగా నివేదిక రూపొందించామన్నారు. ఆదివారం కేంద్ర సహాయమంత్రి సర్వే సత్యనారాయణ నివాసంలో అందుబాటులో ఉన్న తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విభజన నేపథ్యంలో ఏది సాధ్యం? ఏది అసాధ్యం? ఏది న్యాయం? ఏది అన్యాయమనే అంశాలపై చర్చించి నివేదిక తయారు చేసినట్లు తెలిపారు. ఇందులో కేంద్రానికి నిర్మాణాత్మక సూచనలు చేశామన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ నివేదికలోని అంశాలకు, తామిచ్చే నివేదికకు పెద్దగా వ్యత్యాసమేమీ లేదన్నారు. జీవోఎం అభిప్రాయాల సేకరణ అనంతరం విభజన బంతి ప్రభుత్వ పరిధిలోకి వెళుతుందని, విభజన నిర్ణయం పార్లమెంటు పరిధిలోనిదే తప్ప ప్రభుత్వానిది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కొరత తీవ్ర మయ్యే అవకాశమున్న మాట నిజమేనని, అలాంటి అంశాలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపైనే జీవోఎం అందరి అభిప్రాయాలను సేకరిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ 371(డీ) అధికరణను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విభజన బిల్లు ఆమోదం పొందేవరకు ఇలాగే వ్యవహరిస్తారని, ఆ తరువాత తమతో స్నేహపూర్వకంగానే ఉంటారని చెప్పారు. బాబుది పలాయనవాదం తొమ్మిదేళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు సమన్యాయం అంటే ఏమిటని తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తిరిగి తననే ప్రశ్నించడం పలాయనవాదమే అవుతుందన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం ఎలా చేస్తారనేది కేంద్ర డాక్యుమెంట్లో ఉంటుందని తెలిపారు. సీమాంధ్ర నేతలు ఏయే వేషాలు వేస్తున్నారో అక్కడి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. రాష్ట్రాల విభజన విషయంలో ఆర్టికల్ (3) దుర్వినియోగాన్ని అడ్డుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పార్టీలకు చేసిన విజ్ఞప్తిని మీడియా ప్రస్తావించగా.. ‘రాజ్యాంగాన్నే తిరిగి రూపొందించాలనే గొప్ప మేధావులు వీళ్లు. అందరూ అభినవ అంబేద్కర్లు అయితే కష్టం. ఒక్క అంబేద్కర్‌తోనే ఇలా ప్రభావం ఉంది. ఇంతమంది అంబేద్కర్లు అయితే ఎలా పోతాం మనం?’’అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంబేద్కర్‌ను కించపర్చినట్లుగా ఉన్నాయనే భావన కలుగుతోందని పొంగులేటి చెప్పడంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒక్కరే ఉన్నారని, ఆయన అసాధారణ మేధావి అని, రాజ్యాంగాన్ని మార్చాలంటూ అందరూ అంబేద్కర్‌లా మారితే గందరగోళంగా మారుతుందన్నదే తమ ఉద్దేశమని జైపాల్‌రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జీవోఎంకు ఎంఐఎం ఇచ్చిన నివేదికతో స్థూలంగా అంగీకరిస్తున్నామని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానంలో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అనే పదం లేనప్పటికీ కేబినెట్ నోట్లో మాత్రం ఈ ప్రస్తావన ఉందన్నారు. తాము రాయల తెలంగాణ కోరుకోవడం లేదని తెలిపారు. సీఎం పదవి కోసం తాము పోటీపడుతున్నామని జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదమని జానారెడ్డి పేర్కొన్నారు. మా అందరి లక్ష్యం తెలంగాణ ఏర్పాటేనని, సీఎం ఎవరో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. -
ఉమ్మడి రాజధానిగా హెచ్ఎండీఏ
-
ఉమ్మడి రాజధానిగా హెచ్ఎండీఏ
* సెమీ యూటీగా హైదరాబాద్ * కేంద్ర ప్రభుత్వం చేతికి శాంతి భద్రతలు, భూమి, విద్య * తెలంగాణవాసులకు కోపం రాకూడదనే పై మూడు అంశాలతో సరి * శాంతి భద్రతలకు ప్రత్యేక ప్రాధికార సంస్థ * విద్య, భూ పరిపాలనకు అధీకృత అధికారి * హైదరాబాద్‌పై కేంద్రం యోచన * బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్‌కు జీవోఎం ప్రతిపాదన * ‘సమ న్యాయం’గా చూపేందుకు అధికార కాంగ్రెస్ యత్నం * జైపాల్ సహా టీ కాంగ్రెస్ ప్రముఖులందరికీ ముందే సమాచారం సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను పాక్షికంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు భావిస్తోందా? అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించనుందా? శాంతిభద్రతలు, భూ పరిపాలన, విద్యా విభాగాలకు సంబంధించి హెచ్ఎండీఏకు కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించనుందా? అంటే, అవుననే అత్యున్నత వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. విద్య, ఉద్యోగావకాశాల విషయంలో హెచ్ఎండీఏను యూటీ చేయాలని కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సమావేశంలో మంత్రి వట్టి వసంతకుమార్ డిమాండ్ చేయడం ఈ వ్యూహంలో భాగమేనని సదరు వర్గాలు వివరించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్రకు న్యాయం చేయాలన్న బీజేపీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జీవోఎం ఈ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే, హైదరాబాద్‌ను యూటీగా చేస్తామంటే తెలంగాణ ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు భగ్గుమనే ఆస్కారమున్నందున కేంద్ర పాలనను మూడు అంశాలకు మాత్రమే పరిమితం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం! అంతేగాక కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో సహా ఇతర తెలంగాణ కాంగ్రెస్ ప్రముఖులందరికీ ఈ విషయమై ఇప్పటికే సమాచారం ఉందని తెలుస్తోంది. విభజన సాఫీగా సాగాలంటే కొన్ని అంశాల్లో పట్టువిడుపులు ఉండాలని, హెచ్ఎండీఏను ఉమ్మడి రాజధానిగా ప్రకటించేందుకు సహకరించాలని వారితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. బీజేపీ సమన్యాయం కోసమేనా తెలంగాణను విడదీసే క్రమంలో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవోఎం ఇలా ‘సెమీ యూటీ’ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. హెచ్ఎండీఏకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు తమ ప్రతిపాదనను బీజేపీ అగ్ర నేత, లోక్‌సభలో విపక్ష నేత అయిన సుష్మాస్వరాజ్‌కు జీవోఎం ఇప్పటికే అందజేసింది! దానిపై పార్టీలో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆమె వెల్లడించినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై నవంబర్ 20 లోగానే నిర్ణయం వెలువడుతుందని ఉన్నతాధికార వర్గాలు ధ్రువీకరించాయి. పోలీసు ‘ప్రాధికార’ సంస్థ ‘సెమీ యూటీ’ ఎత్తుగడ నేపథ్యంలోనే హెచ్ఎండీఏ సరిహద్దులు, జనాభా, విస్తీర్ణం, పోలీస్ స్టేషన్లు, విద్యా సంస్థలు, రెవెన్యూ వంటి పూర్తి సమాచారాన్ని కేంద్రం ఇప్పటికే సేకరించింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లను విలీనం చేసి ఆ మొత్తం ప్రాంత శాంతిభద్రతలను ప్రత్యేక ప్రాధికార సంస్థకు అప్పగిస్తారు. డీజీపీ స్థాయి అధికారి దానికి నేతృత్వం వహిస్తారు. పూర్తిగా గవర్నర్ అధీనంలో పనిచేసే ఈ సంస్థలో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. పోలీసు సిబ్బంది నియామకం, పోస్టింగులు, బదిలీల అధికారమూ ఈ సంస్థకే ఉంటుంది. దీనికిగాను ప్రాధికార సంస్థ అధికారితోపాటు రెండు రాష్ట్రాల ప్రతినిధులతో పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ ఏర్పాటవుతుంది. ఈ బోర్డు సిఫారసుల మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ చేతిలోనే భూ పరిపాలన హెచ్ఎండీఏ పరిధిలో భూ పరిపాలనను కూడా గవర్నర్ ఆధ్వర్యంలో పని చేసే అధీకృత అధికారి నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఉండే సదరు అధికారి నేతృత్వంలోని కమిటీ భూ కేటాయింపులకు సంబంధించిన అన్ని నిర్ణయాలూ తీసుకుంటుంది. ఈ కమిటీలో కూడా రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్థానం కల్పిస్తారు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన విధి విధానాలను కూడా ఈ కమిటీయే పర్యవేక్షిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికిగాను ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. కేంద్ర పాలనలో ఉండే అంశాలను పర్యవేక్షించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పరిమిత కాలానికి కేంద్ర ప్రభుత్వ కేడర్ అధికారులుగానే పరిగణిస్తారు. -
హైదరాబాద్ తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఓకే: టీ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్‌ను తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా చేయడానికి తమకు అభ్యంతరం లేదు గానీ, శాశ్వతంగా మాత్రం ఉమ్మడి రాజధాని చేయొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని కోరారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి వారు ఈ మేరకు ఒక నివేదిక సమర్పించారు. హైదరాబాద్‌కు ఢిల్లీ తరహా పాలన వద్దని కూడా కోరారు. వారు నివేదికలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి... తెలంగాణ సీఎం నేతృత్వంలో పీపుల్స్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలి కమిటీలో తెలంగాణ, ఆంధ్ర డీజీపీలు సభ్యులుగా ఉండాలి పోలవరాని కంటే ముందు గోదావరిపై 10 డ్యాంలు కట్టేందుకు అనుమతి ఇవ్వాలి ప్రాణహిత - చేవెళ్ల, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌కు జాతీయ హోదా కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలోనూ 371(డి) అధికరణాన్ని కొనసాగించాలి సర్వీసు రిజిస్టర్ ప్రకారమే ఉద్యోగుల, పింఛన్ల స్థానికత గుర్తించాలి విద్యుత్ ఉత్పత్తికి మహబూబ్‌నగర్, కరీంనగర్లో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలి శంకర్పల్లి విద్యుత్ కేంద్రానికి గ్యాస్ పంపిణీ చేయాలి ప్రాజెక్టులపై ఒక మానిటరింగ్ బోర్డు ఏర్పాటు చేయాలి మహబూబ్‌నగర్‌కు వైద్య కళాశాలను కేటాయించాలి తెలంగాణలో వైద్య విశ్వవిద్యాలయం ఒకదాన్ని ఏర్పాటు చేయాలి వరంగల్‌కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి -
మూడేళ్లయితేనే ఒప్పుకుంటాం: కేకే
హైదరాబాద్: మూడేళ్లపాటు మాత్రమే హైదరాబాద్‌ను ఉమ్మడిగా రాజధానిగా ఒప్పుకుంటామని టీఆర్ఎస్ నాయకుడు కె కేశవరావు అన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా శాసన మండలి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్షం పేరిట తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు. ఈ అంశాలతో విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎమ్కు తమ పార్టీ తరపున నివేదిక పంపించినట్టు కేశవరావు తెలిపారు. దేశంలో 28 రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు జరిగాయో, తెలంగాణ విషయంలోనూ అలాంటి విధానమే ఉండాలన్న అంశం నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం. -
అన్ని పోలీసు విభాగాల చీఫ్‌లతో విజయ్‌కుమార్ భేటీ
-
కేంద్రం అజమాయిషీలోనే శాంతిభద్రతలు!
* టాస్క్‌ఫోర్స్‌కు సూచించిన పలువురు ఐపీఎస్‌లు * ఆస్తులు, సిబ్బంది వివరాలపై డీజీపీ నివేదిక * అన్ని పోలీసు విభాగాల చీఫ్‌లతో విజయ్‌కుమార్ భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండటమే మంచిదని కొందరు ఐపీఎస్‌లు కె.విజయ్‌కుమార్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌కు ప్రతిపాదించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో పోలీసులపై ఎవరి అజమాయిషీ ఉండాలనే అంశంపై కేంద్రం నియమిత స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందం.. ఐపీఎస్ అధికారులు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారుల అభిప్రాయాలను కోరింది. విభజన నిర్ణయం నేపథ్యంలో పోలీసుశాఖ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బృందం రెండో భేటీ బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ ఐజీ కార్యాలయంలో జరిగింది. మీడియా హడావుడి ఎక్కువగా ఉండటంతో ఈ మేరకు మార్పు చేశారు. డీజీపీ బి.ప్రసాదరావు, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కే కౌముది, ఆపరేషన్స్ విభాగం అదనపు డీజీ జేవీ రాముడు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ ఎస్.గోపాల్‌రెడ్డి, అప్పా డెరైక్టర్ ఎం.మాలకొండయ్య, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఆర్పీ ఠాకూర్, ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్‌సావంగ్, ఏపీపీఎస్సీ కార్యదర్శి చారుసిన్హా, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ, మాజీ డీజీపీలు పేర్వారం రాములు, కేఆర్ నందన్, రిటైర్డు ఐపీఎస్ అధికారి విజయరామారావు తదితరులు ఎస్టీఎఫ్ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్టీఎఫ్ బృందం కోరిన విధంగా రాష్ట్రంలో పోలీసుశాఖకు సంబంధించిన ఆస్తులు, సిబ్బంది వివరాలను డీజీపీ అందించినట్లు సమాచారం. వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు బృందాలుగా చర్చలు జరిపి ఎస్టీఎఫ్కు నివేదికలు సమర్పించారు. హైదరాబాద్‌లో సిబ్బంది నియామకాలకు అన్ని ప్రాంతాలవారినీ పరిగణనలోకి తీసుకోవాలా? ఆరవ జోన్‌కు మాత్రమే పరిమితం కావాలా? అనే అంశం ప్రభుత్వం తేల్చాల్సి ఉందని కమిషనర్ అనురాగ్‌శర్మ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ పోలీసు సిబ్బంది జీతభత్యాలు ఏ రాష్ట్రం విడుదల చేస్తుందో కూడా తేల్చాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ పరిధి, ఇక్కడ సీమాంధ్రుల భద్రత అంశాలపై అధికారులు గురువారం నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ సమావే శానికి సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), హోంశాఖ ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించారు. కాగా 371 (డి)కి సంబంధించి న్యాయపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. -
ఉమ్మడి రాజధానికి ఒప్పుకోం: టీఆర్ఎస్
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ మంత్రుల వ్యవహారశైలిని టీఆర్ఎస్ తప్పుబట్టింది. టి.మంత్రులు ఎందుకు జైత్రయాత్రలు నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పాలించే సత్తా లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం కిరణ్‌కు చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు. కిరణ్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు కిరణ్‌కుమార్‌రెడ్డి కోల్పోయారని చెప్పారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిన పార్టీలన్నీ ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం దారుణమన్నారు. -
‘ఉమ్మడి’కాదు..తాత్కాలిక రాజధానే
తెలంగాణ జేఏసీ ఏకగ్రీవ నిర్ణయం సీమాంధ్రులు కిరాయిదారులుగానే ఉండాలి సీమాంధ్రకు రాజధానిగా రామోజీ ఫిల్మ్‌సిటీ ఆర్టికల్ 371 (డి)పై లోతైన అధ్యయనం ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ బృందానికి నివేదిక నేడు కూడా జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం వైఎస్సార్ కాంగ్రెస్ సభపై మౌనమే సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అంటే అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. సీమాంధ్రలో రాజధాని ఏర్పాటు చేసుకునేంతవరకు హైదరాబాద్‌ను తాత్కాలిక రాజధానిగా మాత్రమే ప్రకటించాలని ప్రతిపాదించింది. సీమాంధ్రులు హైదరాబాద్‌లో హక్కులతో కాకుండా కేవలం కిరాయిదారుగానే (లీజుపై) ఉండాలని స్పష్టంగా అభిప్రాయపడింది. దీనిపై సమగ్ర నివేదికను మంత్రివర్గ బృందానికి సమర్పించాలని అనుకున్నారు. తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ముందు వివిధ ప్రత్యామ్నాయాలు, పరిష్కార మార్గాలను సూచిస్తూ నివేదించడానికి తెలంగాణ జేఏసీ రెండు రోజులుగా కసరత్తులు చేస్తోంది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం కూడా జరిగింది. ఇదే సమావేశం వరుసగా మూడోరోజైన శుక్రవారం కూడా కొనసాగనుంది. సుమారు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ విభజన సందర్భంగా 12 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణపై అప్పుడే అంతా అయిపోనట్టుగా అనుకోవద్దని, కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయొచ్చునని, అందుకే అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. జేఏసీ ముఖ్యనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, దేవీ ప్రసాద్, రసమయి బాలకిషన్, రఘు, వెంకటరెడ్డి, మాదు సత్యం, మణిపాల్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి (టీఆర్ఎస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), కె.గోవర్ధన్ (న్యూ డెమొక్రసీ) సమావేశానికి హాజరయ్యారు. ఈ నివేదికలపై చర్చల సందర్భంగా టీఆర్ఎస్ నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభపై మౌనం హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభపై ఎవరూ మాట్లాడకూడదని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు. సభకు న్యాయస్థానం అనుమతిని ఇచ్చినందున అనవసరమైన వివాదాలు తలెత్తే విధంగా వ్యాఖ్యానాలు చేయకుండా సంయమనంతో వ్యవహరించాలని తీర్మానించారు. సభా నిర్వహణకోసం ఎలాంటి అనుమతినిచ్చారు, ఎలాంటి పరిమితులను విధించారు, ఇంకా నియమ నిబంధనలేమిటనేదానిపై కొంత అధ్యయనం చేసిన తర్వాతనే మాట్లాడితే మంచిదని భావిస్తున్నారు. శుక్రవారం కూడా జరిగే జేఏసీ స్టీరింగ్ కమిటీ మూడోరోజు సమావేశంలో చర్చించిన తర్వాత వైఖరిని ప్రకటించాలని, అప్పటిదాకా మౌనంగానే ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జేఏసీ ముఖ్య నిర్ణయాలు... రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌పై తకరారు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, ఉమ్మడి రాజధాని అంటే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని జేఏసీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తామంటే అంగీకరించకూడదని, సీమాంధ్రకు పదేళ్ల పాటు ‘తాత్కాలిక రాజధాని’ (టెంపరరీ కేపిటల్) అనే పదాన్ని రాష్ట్ర విభజన బిల్లులో చేర్చేవిధంగా ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ శివార్లలో 17 వందల ఎకరాల్లో విస్తరించిన రామోజీ ఫిల్మ్ సిటీని సీమాంధ్రకు సచివాలయంగా, పరిపాలనా కేంద్రంగా చేసుకుంటే మంచిదని సమావేశం ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. పరిపాలనకు ఒకటే క్యాంపస్ ఉండటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయని, ఘర్షణపూరిత వాతావరణం తలెత్తకుండా ఉంటుందని అభిప్రాయపడింది. సీమాంధ్రకు ఎక్కడికైనా రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని, ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉండటంవల్ల జాతీయస్థాయిలో రవాణాకు అనువుగా ఉంటుందని సూచించింది. ఆర్టికల్ 371 (డి) పేరుతో రాష్ట్ర విభజనను సంక్లిష్టం చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఆ ఆర్టికల్‌ను లోతుగా అధ్యయనం చేసి కేంద్ర మంత్రివర్గ బృందానికి ప్రత్యామ్నాయ నివేదికను సమర్పించాలని నిర్ణయించారు. దీనిని అధ్యయనం చేసే బాధ్యతను సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డికి అప్పగించారు. రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీపై రిటైర్డు ఐఏఎస్ ఎ.కె.గోయల్, ఉద్యోగుల విభజనపై రిటైర్డు ఐఏఎస్ రామలక్ష్మణ్ అధ్యయనం చేసిన నివేదికలను జేఏసీకి అందించారు. సాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ వంటి అన్ని కీలకరంగాలపై నివేదికలను సమర్పించారు. సింగరేణిని కోల్ ఇండియాలో విలీనం చేసే కుట్ర జరుగుతున్నదని, సింగరేణిని కొనసాగిస్తే వచ్చే ఉపయోగాలపైనా అధ్యయనం చేసిన నివేదికను ఈ సమావేశంలో అందించారు. ఉన్నత విద్యలో తెలంగాణ జరిగిన అన్యాయం, తెలంగాణలో విద్యావిధానంపై కత్తి వెంకటస్వామి నివేదికను ఇచ్చారు. అన్ని నివేదికలపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్గ బృందానికి నివేదికను అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
యూటీ అంటే మరో ఉద్యమం తప్పదు
మందమర్రి రూరల్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : హైదరాబా ద్ ఉమ్మడి రాజధాని అంటే మరో ఉద్యమం తప్పదని సీపీఐ శాసనసభ పక్షనేత గుండా మల్లేష్ హెచ్చరించారు. ఆదివా రం ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచి 7వ ఆవిర్భావ సభ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీపీఐ మొదటి నుంచి స్పష్టమైన వైఖరిని కలిగిఉందని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉనికి చాటుకునేం దుకు స్వార్థపూరిత రాజకీయలు చేస్తున్నాయని విమర్శించా రు. సీఎం నాయకత్వంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అలాంటి ప్రతిపాదనలను సీపీఐ అంగీకరించదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ వర్కంగ్ ప్రెసిడెంట్ వై.గట్టయ్య మాట్లాడు తూ సింగరేణి సంస్థ అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులకు తీరని నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని గుర్తింపు సంఘం(టీబీజీకేఎస్) ఎదుర్కోలేక పోతోందని, ఆ యూనియన్ నాయకుల సమయం అంతా గ్రూపు తగాదాలకే సరిపోతోందని విమర్శించారు. ఏఐటీ యూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, మిరి యాల రంగయ్య, కలవేణి శంకర్, స్థానిక నాయకులు ఎన్.కిష్టయ్య మాట్లాడారు. అనంతరం బ్రాంచ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాక్షులుగా ఎన్.కిష్ట య్య, ఎస్.రాజేశం, బ్రాంచి కార్యదర్శిగా సలేంద్ర సత్యనారాయణ, సహయ కార్యదర్శిగా భీమానాథుని సుదర్శన్, కోశాధికారిగా సాదుల బాబు, ప్రచార కార్యదర్శులుగా వెల్ది ప్రభాకర్, ఎం.వెంకటేశ్వర్లు, వొడ్నాల శంకర్, ఎ.సత్యనారాయణ, పి.లింగయ్య, ఆర్.వెంకన్న ఎన్నికయ్యారు. -
ఉమ్మడి రాజధానికి అంగీకరించేది లేదు: తెలంగాణ జేఏసీ
హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా చేయడానికి అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ జేఏసీ స్పష్టం చేసింది. తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా మాత్రమే తాము అంగీకరిస్తామని తెలిపింది. ఈనెల 29వ తేదీన సకల జనుల భేరీ నిర్వహిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. అలాగే, తెలంగాణ జిల్లాలలో పది రోజుల పాటు సన్నాహక రణభేరి పేరిట ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అంశంపై పెద్దమనుషుల ఒప్పందం ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుకోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తామని, హైదరాబాద్‌పై ఎలాంటి నిబంధనలు, షరతులకు అంగీకరించేది మాత్రం లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. -
'ఉమ్మడిరాజధానిగా హైదరాబాద్' ఆలోచిస్తాం: కోదండరామ్
హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితి ఇదే విధంగా ఉంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం పునరాలోచిస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఈ నెల 14న జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 30న తెలంగాణవాదుల సభ నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఘర్షణ వాతావరణానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరే కారణమని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యం అన్నారు. అయితే పరిస్థితి ఇలాగే ఉంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయం ఆలోచిస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. -
కేసిఆర్ వ్యాఖ్యలపై దిగ్విజయ్ స్పందన