హైదరాబాద్ ఉమ్మడి రాజధానితో ఒరిగేదేమి లేదు: జేసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని జేసీ దివాకర్రెడ్డి శనివారం హైదరాబాద్లో తెలిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే విభజన జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ విషయంలో నిర్ణయం తీసుకునేది సోనియా మాత్రమే అని ఆయన స్ఫష్టం చేశారు. విభజన జరిగితే హైదరాబాద్ నుంచి సీమాంధ్రలో పాలన సాగించలేమని జోస్యం చెప్పారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే సీమాంధ్రకు ఒరిగేదేమి లేదని అభిప్రాయపడ్డారు. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉండే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వధికారులు తెలంగాణ ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందేనని తెలిపారు. రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై సోనియాతో చర్చించేందుకు, ఆమె అపాయింట్ కోరినట్లు జేసీ దివాకర్రెడ్డి తెలిపారు.