
ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదు
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి ప్యాకేజీలే గతి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక హోదా కోరుకోవడంలో తప్పేమీ లేదని, అయితే కేంద్రం మాత్రం ఇచ్చే పరిస్థితుల్లో లేదని జేసీ సోమవారమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తాను... రాయల తెలంగాణ కోరితే ఎవరు మద్దతు ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయ నిరుద్యోగులే రాయలసీమపై మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.