హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా చేయడానికి అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ జేఏసీ స్పష్టం చేసింది.
హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా చేయడానికి అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ జేఏసీ స్పష్టం చేసింది. తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా మాత్రమే తాము అంగీకరిస్తామని తెలిపింది. ఈనెల 29వ తేదీన సకల జనుల భేరీ నిర్వహిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు.
అలాగే, తెలంగాణ జిల్లాలలో పది రోజుల పాటు సన్నాహక రణభేరి పేరిట ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అంశంపై పెద్దమనుషుల ఒప్పందం ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుకోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తామని, హైదరాబాద్‌పై ఎలాంటి నిబంధనలు, షరతులకు అంగీకరించేది మాత్రం లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.