రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం) నివేదిక ఒక కొలిక్కి వచ్చింది. మంగళవారం హస్తినలో సాగిన జీవోఎం భేటీలు మొత్తం హైదరాబాద్ కేంద్ర బిందువుగా సాగాయి. ఢిల్లీలో చకచకా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా వెనక్కి వెళ్లింది.