
'ఉమ్మడిరాజధానిగా హైదరాబాద్' ఆలోచిస్తాం: కోదండరామ్
హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితి ఇదే విధంగా ఉంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం పునరాలోచిస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఈ నెల 14న జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 30న తెలంగాణవాదుల సభ నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో ఘర్షణ వాతావరణానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరే కారణమని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యం అన్నారు. అయితే పరిస్థితి ఇలాగే ఉంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయం ఆలోచిస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.