ఉమ్మడి రాజధానికి ఒప్పుకోం: టీఆర్ఎస్
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ మంత్రుల వ్యవహారశైలిని టీఆర్ఎస్ తప్పుబట్టింది. టి.మంత్రులు ఎందుకు జైత్రయాత్రలు నిర్వహిస్తున్నారని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పాలించే సత్తా లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం కిరణ్‌కు చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు. కిరణ్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు కిరణ్‌కుమార్‌రెడ్డి కోల్పోయారని చెప్పారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిన పార్టీలన్నీ ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం దారుణమన్నారు.