కేంద్ర హోంశాఖకు సీఎస్ రాజీవ్‌ శర్మ లేఖ | telangana-cs-rajiv-sharma-write-to-letter-union-home-ministry | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 9 2014 2:34 PM | Last Updated on Thu, Mar 21 2024 5:48 PM

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. హైదరాబాద్లో గవర్నర్కు అధికారాలపై చర్చ జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కేంద్రం జోక్యంపై రాజీవ్ శర్మ ఈ భేటీలో అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్పై అధికారాన్ని వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఈ సందర్భంగా సీఎస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం ...తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ ఆదేశాలను అమలు చేయబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement