హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే మరో ఉద్యమం తప్పదని సీపీఐ శాసనసభ పక్షనేత గుండా మల్లేష్ హెచ్చరించారు.
మందమర్రి రూరల్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : హైదరాబా ద్ ఉమ్మడి రాజధాని అంటే మరో ఉద్యమం తప్పదని సీపీఐ శాసనసభ పక్షనేత గుండా మల్లేష్ హెచ్చరించారు. ఆదివా రం ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచి 7వ ఆవిర్భావ సభ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీపీఐ మొదటి నుంచి స్పష్టమైన వైఖరిని కలిగిఉందని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉనికి చాటుకునేం దుకు స్వార్థపూరిత రాజకీయలు చేస్తున్నాయని విమర్శించా రు.
సీఎం నాయకత్వంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అలాంటి ప్రతిపాదనలను సీపీఐ అంగీకరించదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ వర్కంగ్ ప్రెసిడెంట్ వై.గట్టయ్య మాట్లాడు తూ సింగరేణి సంస్థ అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులకు తీరని నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని గుర్తింపు సంఘం(టీబీజీకేఎస్) ఎదుర్కోలేక పోతోందని, ఆ యూనియన్ నాయకుల సమయం అంతా గ్రూపు తగాదాలకే సరిపోతోందని విమర్శించారు. ఏఐటీ యూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, మిరి యాల రంగయ్య, కలవేణి శంకర్, స్థానిక నాయకులు ఎన్.కిష్టయ్య మాట్లాడారు. అనంతరం బ్రాంచ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాక్షులుగా ఎన్.కిష్ట య్య, ఎస్.రాజేశం, బ్రాంచి కార్యదర్శిగా సలేంద్ర సత్యనారాయణ, సహయ కార్యదర్శిగా భీమానాథుని సుదర్శన్, కోశాధికారిగా సాదుల బాబు, ప్రచార కార్యదర్శులుగా వెల్ది ప్రభాకర్, ఎం.వెంకటేశ్వర్లు, వొడ్నాల శంకర్, ఎ.సత్యనారాయణ, పి.లింగయ్య, ఆర్.వెంకన్న ఎన్నికయ్యారు.