పాలేరులో సీపీఎం అభ్యర్థికి సీపీఐ మద్దతు | CPI to support the CPM candidate in Paleru | Sakshi
Sakshi News home page

పాలేరులో సీపీఎం అభ్యర్థికి సీపీఐ మద్దతు

Published Mon, Apr 25 2016 6:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

CPI to support the CPM candidate in Paleru

పాలేరు స్థానానికి పోటీచేస్తున్న సీపీఎం అభ్యర్థికి మద్దతునివ్వాలని సీపీఐ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం మఖ్దూంభవన్‌లో జరిగిన ఆ పార్టీ కార్యదర్శి వర్గభేటీలో నిర్ణయించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ ఎన్నికల్లో  దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరిత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ  చేయనున్నారు. సుచరిత అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ వామపక్షాలను కోరినా.. తమ స్వంత అభ్యర్థిని బరిలో దించేందుకే కమ్యునిస్టు పార్టీలు మొగ్గు చూపాయి. ఈ మేరకు ఇవాళ సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement