స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు దాటిన పౌరులకు జీవించే హక్కు లేకుండా పోయిందని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బొజ్జ తారకం అన్నారు. రాజ్యాంగం క ల్పించిన హక్కులు పేదవాడికి అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఎస్‌వికె ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజ్యాంగం-పౌరహక్కులు అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బొజ్జ తారకం మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంతో రాజ్యాంగ హక్కులు సామాన్యులకు అందకుండా పోతున్నాయని అన్నారు. పౌర హక్కుల కోసం ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగం లో ఉన్న ఏ హక్కులు సక్రమంగా అమలు కావడం లేదని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఉదంతం.. దీనికి ఒక ఉదాహరణ అని అన్నారు. యూనివర్సిటీల్లో వెలివాడలు.. జాతికి అవమానకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ అప్పారావు ప్రవర్తన బాధాకరం అని అన్నారు.
కుల విక్ష ఉన్నంత కాలం.. జీడీపీ ఎంత పెరిగినా.. ప్రపంచ దేశాల సరసన భారత్ నిలబడ లేదని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడి రోహిత్ దేశ ముద్దు బిడ్డ అని కన్నింటి పర్వమయ్యాడని అయినప్పటికి ఆయన మృతికి కారణమైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్య మంత్రి వర్సిటీవైపు కన్నెత్తి చూడలేదన్నారు.
రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా కొంత మంది స్వార్థప్రయోజనాల కోసం హరించి వేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. చట్టాలు చట్టబండలుగా మారాయని అన్నారు. దేశంలో అసహనం, ఉగ్రవాదం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌వికె కార్యదర్శి ఎస్.వినయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ చల్లా కొండయ్య కూతురు శోభారాణి, మనువడు శ్రీశాంత్, మనువరాలు అజిత తదితరులు పాల్గొన్నారు.