టి.కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి:కేకే | keshava rao takes on telangana congress | Sakshi
Sakshi News home page

టి.కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి:కేకే

Published Mon, Mar 17 2014 5:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

టి.కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి:కేకే

టి.కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి:కేకే

హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు(కేకే) మండిపడ్డారు. 'తెలంగాణకు అప్పుడు నై అన్నవారు..ఇప్పుడు సై అంటున్నారు.టి.కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి' అని హెచ్చరించారు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన కేకే..  తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. టి.కాంగ్రెస్ నేతలకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని కేకే విమర్శించారు. తెలంగాణకు కృషి చేసిన ఒక్క కాంగ్రెస్ నేత పేరు చెప్పపని ఆయన సవాల్ విసిరారు.

 

తెలంగాణకు టి.కాంగ్రెస్ నేతలు న్యాయం చేయలేరని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు న్యాయం చేయలేవని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే అది టీఆర్ఎస్ తో నే సాధ్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement