హామీలను వారి దృష్టికి తీసుకెళ్లండి | Minister KTR holds TRS Parliamentary Meeting | Sakshi
Sakshi News home page

హామీలను వారి దృష్టికి తీసుకెళ్లండి

Published Sat, Nov 16 2019 8:14 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని గతంలో కేంద్ర మం త్రులు హామీ ఇచ్చారని, కానీ చాలా కాలంగా పెం డింగ్‌లో ఉన్న వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ఎంపీలకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న వినతులకు పరిష్కారం దక్కేలా చొరవ తీసుకుని కేంద్ర మంత్రులకు గుర్తు చేయాలని కోరారు. తెలంగాణ భవన్‌లో శుక్ర వారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో తొలిసారి కేటీఆర్‌ అధ్యక్షత వహిం చారు. హైదరాబాద్‌లో రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల విస్తరణ కోసం రక్షణ భూముల బదలాయింపు, ఫార్మాసిటీకి సూత్రప్రాయంగా నిమ్జ్‌ హోదా దక్కినందున నిధుల సాధన వంటి తక్షణ అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఐఐఎం వంటి విద్యా సంస్థలతో పాటు బయ్యా రం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు తదితరాలను ఫాలో అప్‌ చేయాలన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement