
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును ఎన్నికల అధికారి అనుమతించిన వ్యవహారాన్ని ఎన్నికల ట్రిబ్యునల్‌లోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత వాటికి సంబంధించి ఏ అభ్యంతరాలున్నా, వాటిపై ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని రాజ్యాంగం, తెలంగాణ మునిసిపాలిటీల చట్ట నిబంధనలు చె బుతున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేశవరావును ఓటు హ క్కు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ తరఫున ఎన్నికైన మోనిరాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మరోసారి విచారణ జరిపారు. రాష్ట్ర ఎన్ని కల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపించారు. ఎన్నికలు ముగిశాక వచ్చిన అభ్యంతరాల విచారణకే ట్రి బ్యునళ్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. జిల్లా జడ్జి స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారన్నారు. తరువాత పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదిస్తూ, ఈ వివాదం ఎన్నికల పి టిషన్ పరిధిలోకి రాదని, అందువల్ల ట్రిబ్యునల్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా అధికరణ 226 కింద హైకోర్టు విచారణ జరపవచ్చునని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వివాదంపై ఎన్నికల ట్రిబ్యున ల్‌ను ఆశ్రయించాలంటూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment