కేకేకు అస్వస్థత : నిమ్స్కి తరలింపు | k keshava rao hospitalised in hyderabad | Sakshi
Sakshi News home page

కేకేకు అస్వస్థత : నిమ్స్కి తరలింపు

Published Tue, Aug 18 2015 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

కేకేకు  అస్వస్థత : నిమ్స్కి తరలింపు

కేకేకు అస్వస్థత : నిమ్స్కి తరలింపు

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు నిమ్స్కి తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో కేశవరావు బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. కె. కేశవరావు గతంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోసారి ఆయన రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడ్డుకుంది. ఆ క్రమంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి... సెక్రటరీ జనరల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement