తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర పరిస్థితిపై సోమవారం గవర్నర్ తమిళిసైకు వినతి పత్రం అందించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ...మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో దహనకాండపై గవర్నర్‌కు వివరించామని, తమ వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు.