సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించారని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. అమెరికాలోని ఓహియో రాష్ట్రం కొలంబస్‌లో టీఆర్‌ఎస్ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ మహేశ్ తన్నీరు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేకే ప్రసంగించారు. దివంగత మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలనే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, మారిషస్‌లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ప్రకటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలనే ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీవీ కుమార్తెలు వాణీదేవి, సరస్వతితో పాటు టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ రీజినల్ కోఆర్డినేటర్ కానుగంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment