columbus
-
ఒహియోలో మహానేత రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
కొలంబస్ (ఒహియో): డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఒహాయో రాష్ట్రం లో కొలంబస్ నగరం లో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. వినోద్ రెడ్డి డేగ, ఉదయ కిరణ్ బసిరెడ్డి గారి నాయకత్వం లో చక్రధర్ కోటి రెడ్డి నరేంద్ర రూక, రాజీవ్ రెడ్డి పెనుబోలు, కిషోర్ కుర్రి తిరు గాయం. రామ్ సోనేపల్లి మరియు గోవర్ధన్ ఎర్రగొండ, సుబ్బా రెడ్డి కోవూరు, ప్రశాంత్ తల్లపురెడ్డి, ప్రహ్లాద రెడ్డి కంభం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనది. -
కొలంబస్లో పీవీ శతజయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు అన్నారు. అమెరికాలోని ఓహియో రాష్ట్రం కొలంబస్లో టీఆర్ఎస్ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ మహేశ్ తన్నీరు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేకే ప్రసంగించారు. దివంగత మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలనే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, మారిషస్‌లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ప్రకటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలనే ఆన్లైన్ పిటిషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీవీ కుమార్తెలు వాణీదేవి, సరస్వతితో పాటు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ రీజినల్ కోఆర్డినేటర్ కానుగంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!
ఓహియో/కొలంబస్ : చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు వ్యక్తులకు ఆర్థిక చేయూతనందించాలని ‘గో ఫండ్ మీ’ అనే స్వచ్ఛంద సంస్థ కోరింది. కారు ప్రమాదంలో ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి లోనైన అశోక్ అధికారి, సౌజన్య బండ ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించింది. పెద్ద సంఖ్యలో జనం తమకు తోచినంత సాయం చేస్తే ‘ఆర్థిక అత్యవసర స్థితి’లో ఉన్న ఈ ఇద్దరి ప్రాణాలు నిలుస్తాయని తెలిపింది. ‘ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన అశోక్, వివాహిత సౌజన్య కుంటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దాతలు ముందుకొచ్చి చేయూతనందిస్తే.. వారు కోలుకుంటారు. మీ వంతుగా సాయమందించడంతో పాటు ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేసి చేయండి. ఆపదలో ఉన్నవారికి తమ వంతుగా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇవ్వడమే మా కర్తవ్యం’అని గో ఫండ్ మీ తెలిపింది. మీ వంతు సాయాన్ని ఈ కింది లింక్ ద్వారా అందించండి : https://www.gofundme.com/f/critical-car-crash-ashok-and-soujanya?utm_source=customer&utm_medium=copy_link&utm_campaign=p_cp+share-sheet ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. ఆఫీస్ అనంతరం తన సహోద్యోగులు అశోక్ అధికారి, సౌజన్య బండను ఇళ్ల వద్ద దింపేందుకు నిఖిల్ గోపిషెట్టి తన కారులో ఎక్కించుకొని వెళ్తున్నాడు. అశోక్ ఇంటికి మరో నిముషంలో చేరుతామనగా బెతెల్ రోడ్డు (కొలంబస్)పై వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని రివర్సైడ్ మెథడిస్టు ఆస్పత్రికి తరలించారు. అఖిల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ, అశోక్, సౌజన్య తలకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. మెదడుకు గాయాలు : రివర్సైడ్ మెథడిస్టు ఆస్పత్రి అశోక్, సౌజన్య ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి లోనవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తలకు బలమైన గాయాలతో పాటు సౌజన్యకు మడమ, చెవి భాగంలోనూ గాయాలయ్యాయి. ఆమె శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. అశోక్ వెన్నుపూస, భుజం, పక్కటెముకలు విరిగిపోయాయి. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అమెరికా రావాల్సిందిగా సమాచారమిచ్చాం. -
నిర్విరామ విహారిణి
మనకున్న మహిళా యాత్రికులే తక్కువ. వారిలో నిరంతర యాత్రికురాలు నర్మదారెడ్డి. నర్మదకు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లడం, ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడం, భిన్న సంస్కృతుల ప్రజల జీవనశైలిని ఆకళింపు చేసుకోవడం ఇష్టమైన అభిరుచులు. అనుభవం ఉన్న పర్యాటకులే Ðð ళ్లేందుకు సాహసించని ధ్రువ ప్రాంతాలైన అంటార్కిటికా, ఐస్లాండ్, నార్వేలలో కూడా ఆమె విహరించి వచ్చారు. అజర్బైజాన్, జార్జియా, సైబీరియా, మంగోలియాలతో పాటు చైనా, దక్షిణ కొరియా, మలేషియా, బ్రూనై, బల్గేరియా, రుమేనియా, గ్రీస్, ఇటలీ, క్రొయేషియాలను సందర్శించి అక్కడి విశేషాలను, వసతులను, ఆహారపు అలవాట్ల మూలాలను అధ్యయనం చేశారు. ఆ యాత్ర విశేషాలను తెలుపుతూ ‘ఆగదు మా ప్రయాణం’, ‘కొలంబస్ అడుగు జాడల్లో మా ప్రయాణం’ అనే పుస్తకాలు రాశారు. నర్మద గృహిణిగా ఉంటూనే న్యాయవాద విద్యను అభ్యసించారు. నూటయాభై దేశాలను చుట్టి వచ్చారు. ఇటీవల కొలంబస్ ‘అడుగు జాడల్లో’ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు. మార్క్ ట్వైన్.. కొలంబస్ నర్మద వివాహం అయినప్పటి నుంచి భర్త నోముల ఇంద్రారెడ్డితో కలిసి ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ‘రిసార్ట్ కండోమినియమ్స్ ఇంటర్నేషనల్’ సంస్థ సభ్యులుగా చేరటంతో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ఆమె కల సులువుగా సాకారమైంది. ఇంచుమించు కొలంబస్ నడయాడిన ప్రాంతాలన్నీ ఆమె తిరిగొచ్చారు. చైనాను ‘భూతల స్వర్గం’ అంటారు నర్మద. అక్కడి ప్రజల క్రమశిక్షణ, కట్టుబాట్లు, ట్రైన్లు, శుభ్రమైన రోడ్లు ఏ టూరిస్టును అయినా ఇట్టే ఆకర్షిస్తాయట. గొప్ప అనుభూతిని ఇచ్చింది మాత్రం నైబీరియన్ ట్రైన్ జర్నీ అట. సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి చైనా, రష్యా, మంగోలియా మధ్య ఆరు రోజులు చేసిన ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేనని నర్మద అంటారు. ‘అన్వేషించు, కల గను, సాధించు’ అనే మార్క్ ట్వైన్ సందేశం నుంచి ఆమె స్ఫూర్తి పొందారు. జీవితాన్ని కేరింతలు, తుళ్లింతలతో నవ్వుతూ ఆనందిస్తూ, నలుగురికి చేయూతనిస్తూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఆమె కోరిక. పర్యటనలు, విహారాలతో పాటు జీవిత చరమాంకం వరకు విద్యార్థినిగానే ఉండిపోవాలని ఆమె ఆశ. అందుకే ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చేశారు. ఇప్పుడు పీహెచ్‌డీపై దృష్టి పెట్టారు. నర్మద ట్రావెలర్ మాత్రమే కాదు. మంచి గాయని కూడా. హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమాల్లో తరచూ పాల్గొని పాటలు పాడుతుంటారు. షటిల్ బ్యాట్మింటన్ ప్లేయర్ కూడా. స్టేట్ లెవెల్ పోటీలలో హైదరాబాద్ జట్టు నుంచి విజయం సాధించారు. అంతేకాదు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నర్మదను వరించిన పురస్కారాలు: ∙2015లో ‘ఉమన్ అచీవర్’ అవార్డు ∙ఉమెన్ ఆన్ గో (ప్రపంచాన్ని తిరిగే నిరంతర యాత్రికురాలు) అవార్డు ∙షటిల్ బాడ్మింటన్‌లో స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ –2018 ∙సోషల్ సర్వీస్‌కు గాను ‘స్టార్ మహిళ’ అవార్డు ∙ఎల్ఎల్ఎంలో డిస్టింక్షన్. ఎల్ఎల్బీలో సిల్వర్ మెడల్. నర్మద తిరిగొచ్చిన ప్రదేశాలలో కొన్ని ప్రపంచంలో ఏడు వింతలైన మాచుపీచు, చైనా వాల్, బ్రెజిల్‌లోని రియోలో ఉన్న క్రీస్తు విగ్రహం, తాజ్‌మహల్, చిచెన్ ఇడ్డా (మెక్సికో), కొల్లీజియం (ఇటలీ), జోర్డాన్. అనుకోకుండా చూసినవి మాత్రం ఆమ్స్టర్ డామ్‌లో తూలిప్ మొక్కలు, చైనాలోని టెర్రకోట మ్యూజియం, మంగోలియా ఇసుక సునామీలు, ఇటలీలోని ఒకే రకమైన ఇటుకలతో నిర్మించిన ఆల్బరాబెల్లోలోని పురాతన గ్రామం. ఇక దేశంలో అయితే.. అన్ని ముఖ్యపట్టణాలతో పాటు 18 శక్తి పీఠాలు, వాలీ ఆఫ్ ఫ్లవర్స్, 12 జ్యోతిర్లింగాలు. – కోన సుధాకర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
అదే నేనైతేనా..?
కొలంబస్ సాహసవంతమైన నౌకాయాత్ర చేసి అమెరికాను కనుగొన్నాడు. ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. తిరిగి రాగానే ఆయనకు గౌరవ సూచకంగా అనేక సన్మానాలు, సత్కారాలు చేశారు. అది చూసి ఓర్వలేని కొందరు ఒకరోజు ఒక విందులో ‘‘అదేమంత ఘనకార్యం? ఈ మాత్రానికే ఇంత ఘనమైన సన్మానాలు చేయాలా?’’ అన్నారు. భోజన కార్యక్రమం అయ్యాక కొలంబస్ ఒక ఉడికించిన గుడ్డును బల్లమీద పెట్టి సమావేశంలోని ఎవరైనా సరే గుడ్డును తిన్నగా నిలబెట్టగలరా?’’ అని అడిగాడు. అందరూ ప్రయత్నించారు. కానీ ఆ పని చేయలేకపోయారు. తరువాత కొలంబస్ గుడ్డు పైభాగాన్ని కొద్దిగా వేలితో తొలగించి సమతలంగా చేసి క్షణంలో బల్లమీద నిటారుగా నిలబెట్టాడు. అందరూ అది చూసి ‘ఇదేమంత కష్టమైన పని? మేమూ చేస్తాం’ అని గట్టిగా కేకలు వేశారు. ఆ మాటలకు కొలంబస్ చిరునవ్వు నవ్వుతూ ‘‘చేయగలరు. కానీ, నేను చేసేంతవరకు చేయలేకపోయారు కదా... సూక్ష్మదృష్టి, సమయస్ఫూర్తి లోపించడం వల్ల తేలికైన పనులు కూడా అసంభవమనిపిస్తాయి. గొప్పదనాన్ని ఆపాదించవలసినది శ్రమకు కాదు.. సూక్ష్మబుద్ధికి’’ అని అంటాడు. మనలో కూడా చాలామంది అలానే వ్యవహరిస్తారు. ఎవరైనా ఎంతో కష్టంతో సాధించిన పనిని ‘ఓస్... అదెంత? నేనూ చేసేయగలను అంతకన్నా అందంగా.. అవలీలగా చేసేయగలను’ అంటూ అవతలి వారిని, వారు చేసిన పనిని తేలిగ్గా తీసిపారేస్తారు. అది చాలా తప్పు. వీరు చేయగలిగి ఉంటే అప్పుడే చేసి ఉండొచ్చు కదా, వేరే వాళ్లు చేసిన తర్వాత వారిని తక్కువ చేయడం ఎందుకు? అంటే వాళ్లు చేసి చూపించేదాకా వీళ్లకు దానిని ఎలా చేయాలో తెలియదనైనా అర్థం, లేదంటే అవతలి వారు చేసిన పనిని అభినందించడం అయినా తెలియదని అర్థం. అంతేగా! అది చాలా తప్పు. అలాంటి వారు మనకు నిత్యజీవితంలో చాలామంది చాలా సందర్భాల్లో కనిపిస్తూనే ఉంటారు. ఒక్కోసారి అలాంటి వారిలో మనం కూడా ఉండొచ్చు. అందుకే ఎవరినీ, తేలిగ్గా చూడకూడదు. -
స్వేచ్ఛా గీతికకి సంకెళ్లు
వలస రావొద్దంటున్న ‘వలసల దేశం’ అమెరికా జనమంతా వలసదారులు, వారి వారసులే! ⇒ ఆదివాసీలు కూడా ఆసియా నుంచి వెళ్లినవారే ⇒ కొలంబస్ రాకతో క్యూ కట్టిన యూరోపియన్లు ⇒ ఆఫ్రికా దేశాల నుంచి ‘బానిస’ల నిర్బంధ వలసలు ⇒ మెక్సికో నుంచి వ్యవసాయ కార్మికులు ⇒ ఆధునిక కాలంలో ఆసియా నుంచి వృత్తి నిపుణులు ⇒ శ్వేతజాతీయుల ఆధిక్యం తగ్గుతోందన్న భయంలో అమెరికన్లు ‘‘మీ అలసిన ప్రాణులను, అభాగ్యులైన పేదలను, స్వేచ్ఛా వాయువుల కోసం పరితపిస్తున్న సామాన్య జీవులను, మీ తీరంలోని తిరస్కృతులను, గూడులేని బడుగులను, తుపాను తాకిడికి కకావికలమైన జనాలను నా దగ్గరకు పంపండి. స్వర్ణ ద్వారం పక్కన నేను నా కాగడా ఎత్తి పట్టుకున్నాను!’’ – అంటూ మౌనంగా ఆహ్వానించే ఆ స్వేచ్ఛా ప్రతిమ ప్రపంచ ప్రజలందరికీ సుపరిచితం! వలస జీవుల కలల స్వర్గంగా భాసిల్లే అమెరికా ముఖ ద్వారం న్యూయార్క్ నగర సాగర తీరంలో... ఆకాశాన్నంటుతున్నట్లుండే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ... దేనికి ప్రతిరూపమో చెబుతూ అమెరికా కవయిత్రి ఎమ్మా లాజరస్ రాసిన పద్యంలోని పైనాలుగు చరణాలు ఆ విగ్రహం వద్ద చెక్కి ఉంటాయి. అమెరికా అంటేనే వలస దేశం. అమెరికన్ల జాతి వలసల జాతి. వందల ఏళ్లుగా ఈ ‘కొత్త ప్రపంచం’ ప్రపంచ దేశాల ప్రజలకు గమ్యస్థానంగా కొనసాగుతోంది. ఆ దేశం పుట్టుక, నిర్మాణం, అభివృద్ధి అంతా వలసలతోనే సాగిందని చరిత్ర తేటతెల్లం చేస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఈ స్వేచ్ఛా దేవత కూడా వలసే! అమెరికా అనగానే కళ్లముందు కనిపించే స్వేచ్ఛా ప్రతిమ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ! రోమ్ స్వేచ్ఛా దేవత ‘లిబర్టస్’ ప్రతిరూపమైన ఈ భారీ విగ్రహాన్ని ఫ్రాన్స్ ప్రజలు అమెరికా ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. 1876 నుంచి 1884 వరకూ ఎనిమిదేళ్ల పాటు ఈ కాంస్య విగ్రహాన్ని ఫ్రాన్స్‌లోనే నిర్మించారు. ఆ తర్వాత 350 భాగాలుగా చేసి 214 పెట్టెల్లో పెట్టి అమెరికాకు రవాణా చేశారు. అమెరికా చేరుకున్న తర్వాత ఆ విడిభాగాలన్నిటినీ కలిపి 1886లో న్యూయార్క్‌లో ‘లిబర్టీ ఐలండ్’లో ప్రతిష్టించారు. ఈ స్వేచ్ఛా ప్రతిమ ఎత్తు 151 అడుగుల 1 అంగుళం. విగ్రహాన్ని వేదికతో కలిపి చూస్తే 305.1 అడుగులు. విగ్రహం చేతిలో ఉన్న పుస్తకం మీద ‘1776 జూలై 4’ అనే అక్షరాలు చెక్కి ఉంటాయి. అది అమెరికా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న రోజు. ఆ విగ్రహం పాదాల చెంత తెగిపడ్డ సంకెళ్లు ఉంటా యి. ఈమె ‘దేశ బహిష్కృతుల తల్లి’ అని, ఆమె చేతిలోని కాగడా ప్రపంచమంతటికీ స్వాగతం చెప్తోందని అమెరికా కవయిత్రి ఎమ్మా లాజరస్ అభివర్ణించారు. శ్వేతజాతి వలసలకు ప్రాధాన్యం 1965కు ముందు జర్మనీ నుంచి అత్యధిక మంది వలస వచ్చారు. 1880 నుంచి 1930 వరకూ దాదాపు 50 లక్షల మంది జర్మన్లు అమెరికాకు వచ్చారు. వారిలో అత్యధికులు పశ్చిమ మధ్య ప్రాంతంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వలసల నియంత్రణకు కఠిన చర్యలకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత ఫ్రెడరిక్ ట్రంప్ కూడా ఇలా.. 1885లో అమెరికాకు వలస వచ్చిన జర్మన్ దేశస్తుడే. 1820 నుంచి 1930 వరకూ 35 లక్షల మంది బ్రిటిష్ వాళ్లు, 45 లక్షల మంది ఐరిష్ ప్రజలు అమెరికాకు వచ్చారు. మొత్తంగా 2.5 కోట్ల మంది యూరోపియన్లు.. ఇటాలియన్లు, గ్రీకులు, హంగేరియన్లు, పోలిష్ ప్రజలు తదితరులు వెల్లువలా అమెరికాకు వచ్చారు. వారిలో 24 లక్షల నుంచి 40 లక్షల మంది యూదులు కూడా ఉన్నారు. ఆసియాలోని రష్యా, చైనా, జపాన్, ఇండియా, ఇండోనేసియా తదితర దేశాల నుంచి కూడా కొద్దోగొప్పో శ్రామికులుగా వలసలు వచ్చారు. దక్షిణ, తూర్పు యూరప్‌ల నుంచి (ప్రధానంగా ఇటాలియన్లు, యూదులు) వలస వచ్చేవారు.. జన్యుపరంగా ‘తక్కువ’ జాతి వారని, అమెరికన్ల జీవన ప్రమాణాలకు ముప్పు అవుతారని రాజకీయ నాయకులు ఆందోళన చెందారు. దీంతో మొదటి ప్రపంచ యుద్ధం నాటి నుంచీ 1965 వరకూ.. అమెరికా వలస విధానాన్ని ‘శ్వేతజాతీయు’ల ఆధిక్యానికి అనుగుణంగా మలుచుకున్నారు. ఆ క్రమంలో 1924లో జాతీయ మూలాల ఫార్ములాతో చట్టం చేశారు. ఆయా దేశాల నుంచి వలసలకు నిర్దిష్ట కోటా పరిమితులు నిర్ణయించారు. 1890లో అమెరికాలో ఏ దేశస్తులు ఎక్కువగా ఉన్నారనేది దీనికి ప్రాతిపదిక. ఆసియా వాసులు దేశంలోకి రాకుండా దాదాపుగా నిషేధించారు. ఫలితంగా దేశ జనాభాలో జాతుల నిష్పత్తి 1965 వరకూ మారలేదు. తద్వారా అమెరికాలో శ్వేతజాతీయుల ఆధిక్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చట్టాల కారణంగా అమెరికాలోకి చట్టబద్ధమైన వలసల సంఖ్య పడిపోయింది. అదే సమయంలో అక్రమ వలసలు మొదలయ్యాయి. ఆ అక్రమ వలసలు ఇంతవరకూ ఆగలేదు. మెక్సికో నుంచి శ్రామికులు రెండో ప్రపంచ యుద్ధం కారణంగా శ్రామికుల కొరత ఏర్పడటంతో.. పొరుగు దేశమైన మెక్సికో నుంచి పనుల సీజన్లలో శ్రామికులు వచ్చి పనిచేసి వెళ్లడాన్ని అమెరికా ప్రోత్సహించింది. 1942 నుండి 1964 వరకూ 20 లక్షల మంది మెక్సికో నుంచి అమెరికాకు వలస వచ్చారు. వాళ్లలో అత్యధికులు అమెరికన్ల పొలాల్లో చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేశారు. వారు అమెరికాలోనే స్థిరపడిపోకుండా చూసేందుకు.. వారి వేతనాల్లో పదో వంతును మెక్సికోకు పంపే ఏర్పాట్లు చేశారు. కానీ.. పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్లిన వారిలో చాలా మందికి తమ పదో వంతు వేతనాలు అందలేదు. అయినా చాలా మంది అమెరికాలోనే స్థిరపడిపోయారు. వారి వారసులకు అమెరికన్లు తమ వారిని ఉపయోగించుకున్న తీరు ఇప్పటికీ గుర్తుంది. ఆ దృక్కోణం నుంచే అమెరికన్ల పట్ల, అమెరికాలో అతిథి పనుల పట్ల వారి అభిప్రాయాలు ఉంటాయి. నిర్మించింది బానిసలే.. యూరప్ నుంచి వ్యక్తులుగా, కుటుంబాలుగా అమెరికాకు వలస వచ్చిన వారు విశాల మైదానాలను ఆక్రమించుకున్నారు. ఆ భూముల్లో పొగాకు, పత్తి తదితర వాణిజ్య పంటలను సాగు చేయడానికి అవసరమైన శ్రామికుల కోసం ఆఫ్రికా నుంచి లక్షలాది మందిని బలవంతంగా అమెరికాకు బానిసలుగా తీసుకువచ్చారు. రెండు దశాబ్దాలపాటు ఈ బానిస వ్యాపారం అవిచ్ఛన్నంగా కొనసాగింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుత అమెరికాను ఈ ‘బానిస’లే నిర్మించారు. దక్షిణ అమెరికాలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బానిస శ్రమ శక్తే నిర్మించింది. పారిశ్రామికీకరణ జరిగిన ఉత్తర భాగానికీ ఈ బానిసలే ప్రధాన శ్రామికులయ్యారు. కానీ.. నాడు ఆ బానిసలకు పౌరసత్వం లేదు. సొంత ఆస్తి లేదు. కేవలం కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఇంకో రకంగా చూస్తే.. అమెరికాలో తొలి ‘అక్రమ వలస’లు ఈ ఆఫ్రికన్ల బలవంతపు వలసలే. 1809లో అమెరికా రాజ్యాంగం.. దేశంలోకి బానిసలను అనుమతి లేకుండా ‘దిగుమతి’ చేయడాన్ని (అక్రమ రవాణా చేయడాన్ని) నిషేధించింది. కానీ.. బానిసల నల్లబజారు వ్యాపారం అంతర్యుద్ధం వరకూ కొనసాగింది. ఒక చరిత్రకారుడి అంచనా ప్రకారం బానిసల అక్రమ దిగుమతిని నిషేధించిన తర్వాత కూడా 15 లక్షల మందిని ఆయా దేశాల్లోకి తీసుకొచ్చారు. అమెరికా రాజకీయవేత్తలే కాదు.. అమెరికన్లు సైతం తమను తాము ‘వలసల జాతి’గా అభివర్ణించుకోవడాన్ని ఎంతగానో ఇష్టపడతారు. అక్కడి ఆదివాసీలను మినహాయిస్తే.. ఎవరిని కదిలించినా వారి పూర్వీకుల మూలాలు మరో దేశంలో ఎక్కడో ఉంటాయి. ప్రతి ఒక్కరి కుటుంబా లూ కొన్నేళ్ల కిందట స్వేచ్ఛ కోసమో, మెరుగైన జీవితం కోసమో అమెరికాకు వలస వచ్చిన వారే. ప్రధానంగా యూరప్ దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు, ఆఫ్రికా దేశాలు, చైనా, ఇండియా తదితర ఆసియా దేశాల వలసలతో ప్రస్తుత అమెరికా రూపొందింది. ఈ భిన్న దేశస్తులు, జాతుల వారంతా కలగలసిపోయి ఒక అమెరికన్ జాతిగా రూపొందారు. తమవైన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను రూపొందించుకున్నారు. ప్రపంచంలోనే తొలి ప్రజాస్వా మ్య దేశంగా ఆవిర్భవించారు. ఇప్పటికీ.. అమెరికానే ప్రపంచ ప్రజల గమ్యస్థానంగానే ఉంది. అయితే.. అమెరికాలోకి వలసలను ఆహ్వానించే క్రమంలో చాలాసార్లు కొందరికి ప్రాధాన్యమిచ్చారు. మరికొందరిపై ఆంక్షలు విధించారు. అలా శ్వేతజాతీయుల ఆధిక్యం కొనసాగేలా చూశారు. ఇప్పుడు ఆ శ్వేతజాతీయుల ఆధిక్యం, ఆధిపత్యం తగ్గుతున్న సంకేతాలతో మరోసారి వలసల నియంత్రణ చర్యలకు తెరతీశారు. ఆ క్రమంలోనే వలసలపై కఠినస్వరం వినిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడయ్యారు. కానీ.. ప్రపంచీకరణ పరిణామాలు పెనవేసుకుని ఉన్న అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లోనూ ఈ వలస నియంత్రణ చర్యలు అలజడి, ఆందోళన సృష్టిస్తున్నాయి. వేల ఏళ్లనాడు ఆదివాసీల వలస.. ప్రస్తుత అమెరికా దేశం సహా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలో మానవుల ఉనికే వలసలతో మొదలైంది. తొలిసారి మంచుయుగంలో ఆసియా నుంచి జనం ఈ ఖండాల్లోకి వలస వచ్చారు. వారి వారసులే ప్రస్తుతం అమెరికన్ ఆదివాసీలు. మంచుయుగంలో ఆసియాను అమెరికా ఖండాలతో కలిపిన బేరింగియా అనే ప్రాంతం (ప్రస్తుతం బేరింగ్ జలసంధి ప్రాంతం) మీదుగా రెండు మూడు దఫాలుగా ఆసియా వాసులు అమెరికా ఖండంలోకి ప్రవేశించి క్రమంగా విస్తరించి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని చరిత్రకారుల అంచనా. క్రీస్తు పూర్వం 30 వేల సంవత్సరాల నుంచి 10 వేల సంవత్సరాల మధ్య ఆ తొలి వలస ప్రజలు వచ్చారు. తొలుత వేట ప్రధానంగా జీవించే సంచార జాతుల ప్రజలైన వీరు క్రమంగా స్థిర జనావాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్నుంచి కొన్ని వేల ఏళ్ల పాటు.. ఇటీవలి పదిహేనో శతాబ్దం వరకూ ఆ భూభాగాలకు కానీ, ఆ ప్రజలకు కానీ మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండాపోయింది. ఆ ఖండాలు, జనాల ఉనికే మిగతా ప్రపంచానికి తెలియదు. కొలంబస్ రాకతో యూరోపియన్ల వలస కొత్త మార్గంలో ఇండియా వెళ్లాలని బయల్దేరిన పోర్చుగీసు నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1492లో అనుకోకుండా అమెరికా ఖండం చేరుకోవడంతో ఈ ‘కొత్త ప్రపంచం’ గురించి ప్రపంచానికి తెలిసింది. అక్కడ నివసించే ఆదివాసీలను తొలుత భారతీయులుగా భావించారు. అందుకే వారిని ‘రెడ్ ఇండియన్లు’గా అభివర్ణించారు. ఇప్పుడు ఆదివాసీ అమెరికన్లుగా పిలుస్తున్నారు. అపార ఖనిజ సంపదలు నిక్షిప్తమై ఉన్న విశాలమైన భూభాగాలు కనిపించడంతో.. ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాల నుంచి భారీ ఎత్తున తెల్ల జనాలు ఇక్కడికి వలస రావడం మొదలైంది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఇక్కడ భూభాగాలను ఆక్రమించి వలస రాజ్యాలను ఏర్పాటు చేశాయి. వారి మధ్య ఆధిపత్య పోరాటాలూ సాగాయి. యూరోపియన్ల రాకతో ఆదివాసీలు తీవ్రంగా దెబ్బతిన్నారు. యూరప్ వాసుల క్రౌర్యానికి, యూరప్ నుంచి వచ్చిన వ్యాధులకు ఆదివాసీల్లో చాలా మంది బలైపోయారు. ఒక మైనారిటీగా మిగిలిపోయారు. మెజారిటీగా మారిన యూరప్ వలస ప్రజలు ఆయా దేశాల కాలనీల్లో నివసించేవారు. బ్రిటన్ వలస పాలనలో ఉన్న పలు కాలనీలు.. బ్రిటన్ మీద తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నాయి. తదనంతరం మరికొన్ని కాలనీలూ అందులో కలిశాయి. అలా మొత్తం 50 రాష్ట్రాలతో ప్రస్తుత యూఎస్ఏ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) ఏర్పడింది. అమెరికా జనాభా ప్రస్తుతం 32.442 కోట్ల మంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో చైనా, భారత్ తర్వాత మూడో స్థానంలో ఉంది. 81 శాతం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నా రు. 2015 జనాభా లెక్కల ప్రకారం అమెరికన్లలో జాతుల శాతం ఇలా ఉంది. వృత్తి నిపుణుల కోటాలో ఆసియన్లు అమెరికా వలసల్లో ఆధునిక యుగం 1965లో మొదలైంది. అప్పటికి ఉధృతంగా వచ్చిన పౌర హక్కుల ఉద్యమం ఫలితంగా జాతుల ఆధారంగా వలసల కోటా విధానానికి స్వస్తి చెప్పారు. హార్ట్–సెల్లర్ చట్టం చేసి అమెరికాలో కీలక అవసరమున్న వృత్తి నైపుణ్యం ప్రాతిపదికగా వలస కోటాలు కేటాయించారు. దీంతో.. భారత్, చైనా, కొరియా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వంటి ఆసియా దేశాల నుంచి వలసలు గణనీయంగా పెరిగాయి. ఆఫ్రికా దేశాలతో పాటు మధ్య, దక్షిణ అమెరికాల నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. మొత్తంగా ప్రపంచ దేశాలన్నిటికీ అమెరికా వలస రాజ్యంగా మారింది. ఐక్యరాజ్యసమితి 2013 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస ప్రజల్లో 19.8 శాతం మంది అమెరికాలో నివసిస్తున్నారు. శ్వేతజాతీయుల జనాభా తగ్గుతోందని.. అమెరికాలో నివసిస్తున్న వారిలో మూడో వంతు మంది వలసల ద్వారా వచ్చినవారే. దీంతో వీరు తమను మించిపోతారన్న ఆందోళన అమెరికన్లలో పెరుగుతోంది. నిజానికి అమెరికాకు శతాబ్దం కిందటే వలస వచ్చి స్థిరపడ్డ లాటినోల(లాటిన్ అమెరికా దేశస్తులు) సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే శ్వేతజాతి అమెరికన్లు చాలా మంది.. ఈ లాటినోలు కొత్తగా వలస వచ్చారని, అక్రమంగా వచ్చారని నమ్ముతుంటారు. అలాగే.. విదేశాల్లో జన్మిం చిన అమెరికావాసులు 1970లో ఆ దేశ జనాభాలో 4.7 శాతంగా ఉంటే.. 2015లో అది ఏకంగా 13.7 శాతానికి పెరిగింది. ఇది వలసలు పెరిగిన తీరుకు అద్దం పడుతోంది. అమెరికా జనాభాలో శ్వేతజాతీయులు(మెక్సికో, లాటిన్ అమెరికా మూలాలున్న వారు కాకుండా) 1960 వరకూ 90 శాతంగా ఉండేవారు. ఇప్పుడది 62 శాతానికి పడిపోయింది. తెల్లవారు 2043 కల్లా జనాభాలో సగానికన్నా తగ్గిపోతారని జనాభా లెక్కల బ్యూరో అంచనా. -
ఆ స్వేచ్ఛా దేవత కూడా వలసే!
అమెరికా అనగానే కళ్లముందు కనిపించే స్వేచ్ఛా ప్రతిమ.. అత్యంత ప్రముఖ వలస. రోమ్ స్వేచ్ఛా దేవత ‘లిబర్టస్’ ప్రతిరూపమైన ఈ భారీ విగ్రహాన్ని ఫ్రాన్స్ ప్రజలు అమెరికా ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. 1876 నుండి 1884 వరకూ ఎనిమిదేళ్ల పాటు ఈ కాంస్య విగ్రహాన్ని ఫ్రాన్స్‌లోనే నిర్మించారు. ఆ తర్వాత 350 భాగాలుగా చేసి 214 పెట్టెల్లో పెట్టి అమెరికాకు రవాణా చేశారు. అమెరికా చేరుకున్న తర్వాత ఆ విడిభాగాలన్నిటినీ కలిపి 1886లో న్యూయార్క్‌లో ‘లిబర్టీ ఐలండ్’లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ స్వేచ్ఛా ప్రతిమ ఎత్తు 151 అడుగుల 1 అంగుళం. విగ్రహాన్ని వేదికతో కలిపి చూస్తే 305.1 అడుగులు. విగ్రహం చేతిలో ఉన్న పుస్తకం మీద ‘1776 జూలై 4’ అనే అక్షరాలు చెక్కివుంటాయి. అది అమెరికా స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్న రోజు. ఆ విగ్రహం పాదాల చెంత తెగిపడ్డ సంకెళ్లు ఉంటాయి. ఈమె ‘దేశ బహిష్కృతుల తల్లి’ అని, ఆమె చేతిలోని కాగడా ప్రపంచమంతటికీ స్వాగతం చెప్తోందని అమెరికా కవయిత్రి ఎమ్మా లాజరస్ అభివర్ణించారు. 2015 జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో జాతుల శాతాలివీ..: అమెరికా జనాభా ప్రస్తుతం 32.442 కోట్ల మంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో చైనా, భారత్ తర్వాత మూడో స్థానంలో ఉంది. 81 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. 2015 జనాభా లెక్కల ప్రకారం అమెరికన్లలో జాతుల శాతం ఇలావుంది... శ్వేతజాతీయులు 61.6% నల్ల / ఆఫ్రికా జాతీయులు 13.3% ఆసియా జాతీయులు 5.6% ఆదివాసీ అమెరికన్లు 1.4% ఇతర జాతులు 0.2% హిస్పానిక్ /లాటినో 17.6% రెండు, మూడు జాతులు 2.6% (చదవండి: కొలంబస్ నుంచి హెచ్1బీ వరకు..!) -
కొలంబస్ నుంచి హెచ్1బీ వరకు..!
అమెరికా జనమంతా వలసలు, వలసల వారసులే! ఆదివాసీలు కూడా ఆసియా నుంచి తొలి వలసలు కొలంబస్ రాకతో యూరోపియన్ వలసల వరద ఆఫ్రికా దేశాల నుంచి ‘బానిస’ల నిర్బంధ వలసలు మెక్సికో నుండి వ్యవసాయ కార్మికుల వలసలు ఆధునిక కాలంలో ఆసియా వృత్తి నిపుణుల వలస శ్వేతజాతీయుల ఆధిక్యం తగ్గుతుండటంతో ఆందోళన ‘‘మీ అలసిన ప్రాణులను, అభాగ్యులైన పేదలను, స్వేచ్ఛా వాయువుల కోసం పరితపిస్తున్న సామాన్యజీవులను, మీ తీరంలోని తిరస్కృతులను, గూడులేని బడుగులను, తుపాను తాకిడికి కకావికలమైన జనాలను నా దగ్గరకు పంపండి. స్వర్ణ ద్వారం పక్కన నేను నా కాగడా ఎత్తి పట్టుకున్నాను!’’ - అంటూ మౌనంగానే ఆహ్వానించే ఆ స్వేచ్ఛా ప్రతిమ ప్రపంచ ప్రజలందరికీ సుపరిచితమైనది. వలస జీవుల కలల స్వర్గంగా భాసిల్లే అమెరికా ముఖ ద్వారం న్యూయార్క్ నగర సాగర తీరంలో ఆకాశాన్నంటుతున్నట్లుండే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. దేనికి ప్రతిరూపమో చెప్తూ అమెరికా కవయిత్రి ఎమ్మా లాజరస్ రాసిన పద్యంలోని పై నాలుగు చరణాలూ ఆ విగ్రహం వద్ద చెక్కి ఉంటాయి. అమెరికా అంటేనే వలస దేశం. అమెరికన్ల జాతి వలసల జాతి. వందల ఏళ్లుగా ఈ ‘కొత్త ప్రపంచం’ ప్రపంచ దేశాల ప్రజలకు గమ్య స్థానంగా కొనసాగుతోంది. ఆ దేశం పుట్టుక, నిర్మాణం, అభివృద్ధి అంతా వలసలతోనే సాగిందని చరిత్ర తేటతెల్లం చేస్తోంది. ఆ వివరాలివీ... (సాక్షి నాలెడ్జ్ సెంటర్) అమెరికా రాజకీయవేత్తలే కాదు.. అమెరికన్లు సైతం తమను తాము ‘వలసల జాతి’గా అభివర్ణించుకోవడాన్ని ఎంతగానో ఇష్టపడతారు. అక్కడి ఆదివాసీలను మినహాయిస్తే.. ఎవరిని కదిలించినా వారి పూర్వీకుల మూలాలు మరో దేశంలో ఎక్కడో ఉంటాయి. ప్రతి ఒక్కరి కుటుంబాలూ కొన్నేళ్ల కిందట స్వేచ్ఛ కోసమో, మెరుగైన జీవితం కోసమే అమెరికాకు వలస వచ్చిన వారే. ప్రధానంగా యూరప్ దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు, ఆఫ్రికా దేశాలు, చైనా, ఇండియా తదితర ఆసియా దేశాల వలసలతో ప్రస్తుత అమెరికా రూపొందింది. ఈ భిన్న దేశస్తులు, జాతుల వారంతా కలగలసిపోయి ఒక అమెరికన్ జాతిగా రూపొందారు. తమవైన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను రూపొందించుకున్నారు. ప్రపంచంలోనే తొలి ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించారు. ఇప్పటికీ.. అమెరికానే ప్రపంచ ప్రజల గమ్యస్థానంగానే ఉంది. అయితే.. అమెరికాలోకి వలసలను ఆహ్వానించే క్రమంలో చాలాసార్లు కొందరికి ప్రాధాన్యమిచ్చారు. మరికొందరిపై ఆంక్షలు విధించారు. అలా శ్వేతజాతీయుల ఆధిక్యం కొనసాగాలే చూశారు. ఇప్పుడు ఆ శ్వేతజాతీయుల ఆధిక్యం, ఆధిపత్యం తగ్గుతున్న సంకేతాలతో మరోసారి వలసల నియంత్రణ చర్యలకు తెరతీశారు. ఆ క్రమంలోనే వలసలపై కఠినస్వరం వినిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడయ్యారు. కానీ.. ప్రపంచీకరణ పరిణామాలు పెనవేసుకుని ఉన్న అమెరికాతో పాటు.. ప్రపంచ దేశాల్లోనూ ఈ వలస నియంత్రణ చర్యలు అలజడి, ఆందోళన సృష్టిస్తున్నాయి. వేల ఏళ్లనాడు ఆదివాసీల వలస..: ప్రస్తుత అమెరికా దేశం సహా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలో మానవుల ఉనికే వలసలతో మొదలైంది. తొలిసారి మంచుయుగంలో ఆసియా నుండి జనం ఈ ఖండాలలోకి వలస వచ్చారు. వారి వారసులే ప్రస్తుతం అమెరికన్ ఆదివాసీలు. మంచుయుగంలో ఆసియాను అమెరికా ఖండాలతో కలిపిన బేరింగియా అనే ప్రాంతం (ప్రస్తుతం బేరింగ్ జలసంధి ప్రాంతం) మీదుగా రెండు మూడు దఫాలుగా ఆసియా వాసులు అమెరికా ఖండంలోకి ప్రవేశించి క్రమంగా విస్తరించి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని చరిత్రకారుల అంచనా. క్రీస్తు పూర్వం 30 వేల సంవత్సరాల నుంచి 10 వేల సంవత్సరాల మధ్య ఆ తొలి వలస ప్రజలు వచ్చారు. తొలుత వేట ప్రధానంగా జీవించే సంచార జాతుల ప్రజలైన వీరు క్రమంగా స్థిర జనావాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి కొన్ని వేల ఏళ్ల పాటు.. ఇటీవలి పదిహేనో శతాబ్దం వరకూ ఆ భూభాగాలకు కానీ, ఆ ప్రజలకు కానీ మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండాపోయింది. ఆ ఖండాలు, జనాల ఉనికే మిగతా ప్రపంచానికి తెలియదు. కొలంబస్ రాకతో యూరోపియన్ల వలస : కొత్త మార్గంలో ఇండియా వెళ్లాలని బయల్దేరిన పోర్చుగీసు నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1492లో అనుకోకుండా అమెరికా ఖండం చేరుకోవడంతో ఈ ‘కొత్త ప్రపంచం’ గురించి ప్రపంచానికి తెలిసింది. అక్కడ నివసించే ఆదివాసీలను తొలుత భారతీయులుగా భావించారు. అందుచేత వారిని ‘రెడ్ ఇండియన్లు’గా అభివర్ణించారు. ఇప్పుడు ఆదివాసీ అమెరికన్లుగా పిలుస్తున్నారు. అపార ఖినిజ సంపదలు నిక్షిప్తమై ఉన్న విశాలమైన భూభాగాలు కనిపించడంతో.. ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాల నుంచి భారీ ఎత్తున తెల్ల జనాలు ఇక్కడికి వలసలు రావడం మొదలైంది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఇక్కడ భూభాగాలను ఆక్రమించి వలస రాజ్యాలను ఏర్పాటు చేశాయి. వారి మధ్య ఆధిపత్య పోరాటాలూ సాగాయి. యూరోపియన్ల రాకతో ఆదివాసీలు తీవ్రంగా దెబ్బతిన్నారు. యూరప్ వాసుల క్రౌర్యానికి, యూరప్ నుంచి వచ్చిన వ్యాధులకు ఆదివాసీల్లో చాలా మంది బలైపోయారు. ఒక మైనారిటిగా మిగిలిపోయారు. మెజారిటీగా మారిన యూరప్ వలస ప్రజలు ఆయా దేశాల కాలనీల్లో నివసించేవారు. బ్రిటన్ వలస పాలనలో ఉన్న పలు కాలనీలు.. బ్రిటన్ మీద తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించకున్నాయి. తదనంతరం మరికొన్ని కాలనీలూ అందులో కలిశాయి. అలా మొత్తం 50 రాష్ట్రాలతో ప్రస్తుత యూఎస్ఏ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) ఏర్పడింది. ఆఫ్రికా నల్లవారిని బానిసలుగా తరలింపు..: యూరప్ నుంచి వ్యక్తులుగా, కుటుంబాలుగా అమెరికాకు వలస వచ్చిన వారు విశాల మైదానాలను ఆక్రమించుకున్నారు. ఆ భూముల్లో పొగాకు, పత్తి తదితర వాణిజ్య పంటలను సాగు చేయడానికి అవసరమైన శ్రామికుల కోసం ఆఫ్రికా నుంచి లక్షలాది మందిని బలవంతంగా అమెరికాకు బానిసలుగా తీసుకువచ్చారు. రెండు దశాబ్దాల పాటు ఈ బానిస వ్యాపారం అవిచ్ఛన్నంగా కొనసాగింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుత అమెరికాను ఈ ‘బానిస’లే నిర్మించారు. దక్షిణ అమెరికాలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బానిస శ్రమ శక్తే నిర్మించింది. పారిశ్రామికీకరణ జరిగిన ఉత్తర భాగానికీ ఈ బానిసలే ప్రధాన శ్రామికులయ్యారు. కానీ.. నాడు ఆ బానిసలకు పౌరసత్వం లేదు. సొంత ఆస్తి లేదు. కేవలం కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఇంకో రకంగా చూస్తే.. అమెరికాలో తొలి ‘అక్రమ వలస’లు ఈ ఆఫ్రికన్ల బలవంతపు వలసలే. 1809లో అమెరికా రాజ్యాంగం.. దేశంలోకి బానిసలను అనుమతి లేకుండా ‘దిగుమతి’ చేయడాన్ని (అక్రమ రవాణా చేయడాన్ని) నిషేధించింది. కానీ.. బానిసల నల్లబజారు వ్యాపారం అంతర్యుద్ధం వరకూ కొనసాగింది. ఒక చరిత్రకారుడి అంచనా ప్రకారం బానిసల అక్రమ దిగుమతిని నిషేధించిన తర్వాత కూడా 15 లక్షల మందిని ఆయా దేశాల్లోకి తీసుకొచ్చారు. శ్వేత జాతి వలసలకే ప్రాధాన్యం..: 1965కు ముందు జర్మనీ నుంచి అత్యధిక వలసలు వచ్చారు. 1880 నుంచి 1930 వరకూ దాదాపు 50 లక్షల మంది జర్మన్లు అమెరికాకు వచ్చారు. వారిలో అత్యధికులు పశ్చిమ మధ్య ప్రాంతంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వలసల నియంత్రణకు కఠిన చర్యలకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత ఫ్రెడరిక్ ట్రంప్ కూడా ఇలా.. 1885లో అమెరికాకు వలస వచ్చిన జర్మన దేశస్తుడే. 1820 నుంచి 1930 వరకూ 35 లక్షల మంది బ్రిటిష్ వాళ్లు, 45 లక్షల మంది ఐరిష్ ప్రజలు అమెరికాకు వచ్చారు. మొత్తంగా 2.5 కోట్ల మంది యూరోపియన్లు.. ఇటాలియన్లు, గ్రీకులు, హంగేరియన్లు, పోలిష్ ప్రజలు తదితరులు ఒక వెల్లువలా అమెరికాకు వచ్చారు. వారిలో 24 లక్షల నుంచి 40 లక్షల మంది యూదులు కూడా ఉన్నారు. ఆసియాలోని రష్యా, చైనా, జపాన్, ఇండియా, ఇండొనేసియా తదితర దేశాల నుంచి కూడా కొద్దోగొప్పో శ్రామికులుగా వలసలు వచ్చారు. దక్షిణ, తూర్పు యూరప్‌ల నుంచి - అంటే ప్రధానంగా ఇటాలియన్లు, యూదులు - వచ్చే కొత్త వలసలు.. జన్యుపరంగా ‘తక్కువ’ జాతి వారని, అమెరికన్ల జీవన ప్రమాణాలకు ముప్పు అవుతారని రాజకీయ నాయకులు ఆందోళన చెందడంతో.. మొదటి ప్రపంచ యుద్ధం నాటి నుంచీ 1965 వరకూ.. అమెరికా వలస విధానాన్ని ‘శ్వేతజాతీయు’ల ఆధిక్యానికి అనుగుణంగా మలచుకున్నారు. ఆ క్రమంలో 1924లో జాతీయ మూలాల ఫార్ములాతో చట్టం చేశారు. ఆయా దేశాల నుంచి వలసలకు నిర్దిష్ట కోటా పరిమితులు నిర్ణయించారు. 1890లో అమెరికాలో ఏ దేశస్తులు ఎక్కువగా ఉన్నారనేది దీనికి ప్రాతిపదిక. ఆసియా వాసులు దేశంలోకి రాకుండా దాదాపుగా నిషేధించారు. ఫలితంగా దేశ జనాభాలో జాతుల నిష్పత్తి 1965 వరకూ మారలేదు. తద్వారా అమెరికాలో శ్వేతజాతీయుల ఆధిక్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చట్టాల కారణంగా అమెరికాలోకి చట్టబద్ధమైన వలసల సంఖ్య పడిపోయింది. అదే సమయంలో అక్రమ వలసలు మొదలయ్యాయి. ఆ అక్రమ వలసలు ఇంతవరకూ ఆగలేదు. మెక్సికో నుంచి శ్రామికుల వలస..: రెండో ప్రపంచ యుద్ధం కారణంగా శ్రామికుల కొరత ఏర్పడటంతో.. పొరుగు దేశమైన మెక్సికో నుంచి పనుల సీజన్లలో శ్రామికులు వచ్చి పనిచేసి వెళ్లడాన్ని అమెరికా ప్రోత్సహించింది. 1942 నుండి 1964 వరకూ 20 లక్షల మంది మెక్సికో నుంచి అమెరికాకు వలస వచ్చారు. వాళ్లలో అత్యధికులు అమెరికన్ల పొలాల్లో చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేశారు. వారు అమెరికాలోనే స్థిరపడిపోకుండా చూసేందుకు.. వారి వేతనాల్లో పదో వంతును మెక్సికోకు పంపే ఏర్పాట్లు చేశారు. కానీ.. పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్లిన వారిలో చాలా మందికి తమ పదో వంతు వేతనాలు అందలేదు. అయినా చాలా మంది అమెరికాలోనే స్థిరపడిపోయారు. వారి వారసులకు అమెరికన్లు తమ వారిని ఉపయోగించుకున్న తీరు ఇప్పటికీ గుర్తుంది. ఆ దృక్కోణం నుంచే అమెరికన్ల పట్ల, అమెరికాలో అతిథి పనుల పట్ల వారి అభిప్రాయాలు ఉంటాయి. వృత్తి నిపుణుల కోటాతో ఆసియన్ల వలస: అమెరికా వలసల్లో ఆధునిక యుగం 1965లో మొదలైంది. అప్పటికి ఉధృతంగా వచ్చిన పౌర హక్కుల ఉద్యమం ఫలితంగా జాతుల ఆధారంగా వలసల కోటా విధానానికి స్వస్తి చెప్పారు. హార్ట్-సెల్లర్ చట్టం చేసి అమెరికాలో కీలక అవసరమున్న వృత్తి నైపుణ్యతలు ప్రాతిపదికగా వలస కోటాలు కేటాయించారు. దీంతో.. భారత్, చైనా, కొరియా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వంటి ఆసియా దేశాల నుంచి వలసలు గణనీయంగా పెరిగాయి. ఆఫ్రికా దేశాలతో పాటు మధ్య, దక్షిణ అమెరికాల నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. మొత్తంగా ప్రపంచ దేశాలన్నిటికీ అమెరికా వలస రాజ్యంగా మారింది. ఈనాటికి కూడా.. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతమంది వలసలు అమెరికాలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి 2013 లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలస ప్రజల్లో 19.8 శాతం మంది అమెరికాలో నివశిస్తున్నారు. శ్వేతజాతీయుల జనాభా తగ్గుతోందనే ఆందోళన..: ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారిలో మూడో వంతు మంది వలసలే. దీంతో వలసలు తమను మించిపోతారన్న ఆందోళన అమెరికన్లలో పెరుగుతోంది. నిజానికి అమెరికాకు శతాబ్దం కిందటే వలస వచ్చి స్థిరపడ్డ లాటినోల (లాటిన్ అమెరికా దేశస్తులు) సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే శ్వేతజాతి అమెరికన్లు చాలా మంది ఈ లాటినోలు చాలా మంది కొత్తగా వలస వచ్చారని, అక్రమంగా వలస వచ్చారని నమ్ముతుంటారు. అలాగే.. విదేశాల్లో జన్మించిన అమెరికావాసులు 1970లో ఆ దేశ జనాభాలో 4.7 శాతంగా ఉంటే.. 2015లో అది ఏకంగా 13.7 శాతానికి పెరిగింది. ఇది వలసలు పెరిగిన తీరుకు అద్దం పడుతోంది. అలాగే అమెరికా జనాభాలో శ్వేతజాతీయులు (మెక్సికో, లాటిన్ అమెరికా మూలాలున్న వారు కాకుండా) 1960 వరకూ 90 శాతంగా ఉండేది. ఇప్పుడది 62 శాతానికి పడిపోయింది. తెల్లవారు 2043 కల్లా జనాభాలో సగానికన్నా తగ్గిపోతారని జనాభా లెక్కల బ్యూరో అంచనా. (చదవండి: ఆ స్వేచ్ఛా దేవత కూడా వలసే!) -
మా అబ్బాయి రెండు గిఫ్టులు ఇచ్చాడు
‘‘ఈ విజయదశమి నాకు మర్చిపోలేని రోజు. 25 ఏళ్ల క్రితం సరిగ్గా అక్టోబర్‌లో నేను సినిమాలు తీయడం మొదలుపెట్టాను. ఈ ఏడాది మా అబ్బాయి ‘కేరింత’, ‘కొలంబస్’ చిత్రాలతో నాకు రెండు మంచి గిఫ్టులు ఇచ్చాడు’’ అని నిర్మాత ఎమ్మెస్ రాజు అన్నారు. సుమంత్ అశ్విన్, శీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి నాయకానాయికలుగా ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ‘కొలంబస్’ చిత్రవిజయోత్సవం శనివారం జరిగింది. ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ- ‘‘అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ క్రెడిట్ చిత్ర నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్‌కు దక్కుతుంది. ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్లకు నటీనటులకు చాలా థ్యాంక్స్’’ అని నిర్మాత అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘రాజుగారితో పనిచేయడం ఆనందం అనిపించింది. ఆయనతో మరోసారి వర్క్ చేయాలని ఉంది. క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు’’ అని చెప్పారు. ‘‘ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ద్వితీయార్ధం చూస్తున్నప్పుడు ఇంత మంచి సినిమా చేశామా అని చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాను’’ అని సుమంత్ అశ్విన్ చెప్పారు. కథానాయిక శీరత్‌కపూర్, ఎడిటర్ కేవీ కృష్ణారెడ్డి, సంగీతదర్శకుడు జితిన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు రాంబాబు, మను తదితరులు పాల్గొన్నారు. -
అంజలి సినిమా చూసి ...
‘అంజలి’ సినిమా చూసి..సినీరంగంపై ఆసక్తిపెంచుకున్నా అప్రెంటిస్ స్థాయి నుంచి డెరైక్టర్ స్థాయికి ‘కొలంబస్’ సినిమా డెరైక్టర్ రమేష్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ శుక్రవారం విడుదలైన ‘కొలంబస్’ ఇంటర్వ్యూ ‘నేను పుట్టి, పెరిగిన వరంగల్ జిల్లాయే నా ఆత్మ..నా గురువు. దాని ఒడిలోనే చదువు పాఠాలు..బతుకు పాఠాలు నేర్చుకున్నాను’ అని అంటున్నారు కొలంబస్ సినిమా దర్శకుడు(డెరైక్టర్) రమేష్ సామల. పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాక స్నేహితులతో కలిసి సునీల్ థియేటర్లో సినిమా చూశాక ఆయనకు సినిమాలపై మక్కువ పెరిగింది. ఎలాగైనా సినిమాల్లోకి అడుగిడాలనే ఆ తపన..డిగ్రీ తర్వాత సాకారమైంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో అప్రెంటిస్‌గా మొదలైన రమేష్ ప్రస్థానం నేడు దర్శకుడి స్థాయికి చేరింది. ఆయన దర్శకత్వం వహించిన కొలంబస్ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా వరంగల్‌కు వచ్చిన రమేష్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. - పోచమ్మమైదాన్ సాక్షి : మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి? రమేష్ : మాది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేళీ గ్రామం. వరంగల్‌కు వచ్చినప్పుడల్లా బంధువులు,స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతా. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టానికి కొంతమంది ప్రోత్సాహం చేదోడు తోడై నన్ను ఈస్థాయికి తీసుకెళ్లారు. సాక్షి : సినిమా రంగంలోకే ఎందుకు ప్రవేశించాలనుకున్నారు? రమేష్ : వరంగలే నా ఆత్మ.. నా గురువు. వరంగల్‌లో పుట్టడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా. నాకు స్ఫూర్తి కూడా నా జిల్లానే. నేను పదోతరగతి పరీక్షలు రాశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి వరంగల్‌లోని సునిల్ థియేటర్లో అంజలి సినిమాకు వెళ్లాం. ఆ సినిమా చిత్రీకరించిన పద్ధతిని చూశాక.. ఎలాగైనా సినీరంగంలోకి అడుగిడాలనే తపన కలిగింది. ఆ తపనను డిగ్రీ అయిపోయే వరకు అణచుకున్నాను. చాలామందిలో ఇలాంటి తపనలుంటాయి. అయితే తపనలు నెరవేరాలంటే ఓపిక, ప్రాక్టీస్, కృషి, అధ్యయనం అవసరమని గ్రహించాలి. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అనే పెద్దలమాటను నేటి యువత గ్రహిస్తే విజయూలు ఏ రంగంలోనైనా సొంతం చేసుకోవచ్చు. సాక్షి : సినీరంగంలో మీరు మర్చిపోలేని ఘటన ఏదైనా ఉందా? రమేష్ : నేను సినిమా థియేటర్లను గుడిగా భావిస్తా. ఎందుకంటే నాకు జీవితాన్ని, ఉపాధినిచ్చే పవిత్ర కేంద్రాలవి. అందుకే థియేటర్లకు గుడికి వెళ్లినంత భక్తిగా వెళ్లేవాణ్ని. డిగ్రీ చదివేరోజుల్లో.. ఆ తర్వాత కూడా వరంగల్‌లో నాకు మా ఇంటి కన్నా..అలంకార్ థియేటర్‌తో ఎక్కువ అనుబంధం ఉండేది. ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికొచ్చినా అలంకార్ సినిమా థియేటర్ వద్ద కాసేపు ఆగేవాణ్ని. ఒకరోజు నేనొచ్చే సరికి అలంకార్ థియేటర్ లేదు. ఆ సందర్భంలో నేను నా ప్రాణమిత్రుణ్ని పోగొట్టుకున్నంత బాధపడ్డాను. ఆ ఘటన నాకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. సాక్షి : చదువుకునే రోజుల నుంచీ సినిమాలే మీ ఆసక్తా? రమేష్ : నేను వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో ఇంటర్, డిగ్రీ కేఎన్ఆర్ కళాశాలలో పూర్తిచేశా. పదోతరగతి పరీక్షల తర్వాత అంజలి సినిమా చూసి సినిమాలపై పెంచుకున్న ఆసక్తి డిగ్రీ నాటికి మరింత పెరిగింది. సినిమా నిర్మాణం, దర్శకత్వం, సాంకేతిక అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేవాణ్ని. మిత్రులతో కూడా సినిమాలపై చర్చించేవాణ్ని. ఎవరైనా ఏదైనా రంగంలో ఎదగాలంటే ఆ రంగంపై అధ్యయనం చేయూలి. డిగ్రీ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి సినీ అవకాశాలను వెతికాను. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. సాక్షి : మహా సముద్రంలాంటి సినీరంగంలో అవకాశాలు ఎలా వెతికారు? రమేష్ : మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కష్టాన్ని లెక్కచేయొద్దు..ఇష్టంగా ముందుకుసాగాలి. నేనూ అదే చేశాను. హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత సినీరంగానికి చెందిన స్రవంతి రవికిశోర్‌ను కలిసి పరిచయం చేసుకున్నాను. తర్వాత విజయభాస్కర్‌ను రవి కిశోర్ పరిచయం చేశారు. అప్పుడు విజయభాస్కర్ వెంకటేశ్ హీరోగా ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా తీస్తున్నారు. అందులో నన్ను అప్రెంటిస్‌గా చేర్చుకున్నారు. అక్కడ సినిమా నిర్మాణం, దర్శకత్వం, డైలాగ్ రైటింగ్‌లపై ఓనమాలు నేర్చుకున్నా. సాక్షి : మీరు వివిధస్థాయిల్లో పనిచేసిన సినిమాలేవి? రమేష్ : ఉషాకిరణ్ మూవీస్‌కు విజయభాస్కర్ పరిచయం చేశారు. దీంతో ‘ఇష్టం’ సినిమాలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశమొచ్చింది. ఆపై ‘మన్మధుడు’ సినిమాకూ అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశా. మల్లీశ్వరీ, తుఝే మేరీ ఖసం, జై చిరంజీవ, అతిథి,సలీం, రగడ, అనగనగా ఒక ధీరుడు సినిమాలకు అసోసియేట్ డెరైక్టర్‌గా చేసే అవకాశాలొచ్చాయి. ఇష్క్ సినిమాకు అసోసియేట్ డెరైక్టర్‌గా, రచయితగా పని చేశాను. కొలంబస్ సినిమాకు డెరైక్టర్‌గా,డైలాగ్ రైటర్‌గా చేశాను. సాక్షి : వరంగల్ జిల్లాలో సినీరంగం అభివృద్ధికి అవకాశాలున్నాయూ? రమేష్ : వరంగల్ జిల్లాలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటం బాగా కలిసొచ్చే అంశం. ఇక్కడ మంచి లోకేషన్లున్నాయి. ఖిలా వరంగల్, రామప్ప, లక్నవరం, వేయిస్తంభాల గుడి, భద్రకాళీ అమ్మవారి దేవాలయూలు చక్కటి లొకేషన్లుగా ఉపయోగపడతాయి. నాకు ఎంతో ఇష్టమైన లొకేషన్లు ఇవి. ఎంఎస్ రాజు వర్షం సినిమాలో వరంగల్‌లో ఉన్న లోకేషన్లను పరిచయం చేశారు. తెరపై కొలంబస్ సినిమా ద్వారా వరంగల్‌కు చెందిన నన్ను పరిచయం చేశారు. త్వరలో నేను దర్శకత్వంవహించే సినిమాలను వరంగల్‌లో కొంత భాగం షూటింగ్ నిర్వహిస్తా. సాక్షి: సినీరంగంలోకి ప్రవేశించాలనుకునే యువతకు మీరిచ్చే సందేశమేంటి? రమేష్: కొత్తగా సినీరంగంలోకి రావాలనుకునే వారు మొట్టమొదట అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. నటన..డెరైక్షన్..మ్యూజిక్..డైలాగ్ రైటింగ్..ఎడిటింగ్..ఇలా ఏ విభాగమైనా కావొచ్చు. అవగాహన పెంచుకోవాలి. ఇంటర్నెట్లో..నిపుణుల పర్యవేక్షణలో ఎంచుకున్న విభాగంపై అధ్యయనం చేయూలి. ఎంచుకున్న సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలి. ఆ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి. అవగాహన లేకుండా అవకాశాలు కావాలంటే కష్టం. సాక్షి : మీ దర్శకత్వంలో విడుదలైన కొలంబస్ సినిమా గురించి చెప్పండి.. రమేష్ : కొలంబస్ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శుక్రవారం 150 థియేటర్లలో విడుదలైంది. సుమంత్ అశ్విన్ హీరోగా, హీరోయిన్లుగా సీర త్ కపూర్, మీస్తి చక్రవర్తిలు నటించారు. సంగీత దర్శకునిగా జీతన్‌ను పరిచయం చేశాను. తొలిసారి నేను దర్శకత్వం వహించిన సినిమా విడుదలవడం ప్రత్యేకమైన ఆనందాన్నిచ్చింది. నేను భాగం పంచుకున్న ప్రతి సినిమాను వరంగల్‌కే వచ్చి చూస్తా. అందుకే కొలంబస్ సినిమాను సైతం చూసేందుకు శుక్రవారం వరంగల్‌కే వచ్చాను. ఫ్రెండ్స్‌తో కలిసి ఆనందంగా ఫిల్మ్ చూశా. -
లవ్... కొలంబస్
కెమేరా: భాస్కర్ సామల, నిర్మాతలు: అశ్వనీకుమార్ సహదేవ్, ఎస్.సి.కపాడియా, దర్శకత్వం: ఆర్.సామల కొలంబస్... ఈ పేరు చెప్పగానే కొత్త ప్రదేశం కనిపెట్టిన నౌకాయాత్రికుడు గుర్తొస్తాడు. కాకపోతే, కొలంబస్ కనిపెట్టాలనుకున్నది వేరు. కనుక్కున్నది వేరు. ఇండియాను కనిపెట్టేందుకు ప్రయాణం మొదలుపెట్టి, చివరకు అమెరికాను కనుక్కున్నాడు. దీన్నే ప్రేమకు అన్వయిస్తూ అల్లుకున్న కథ - ఈ ‘కొలంబస్’ సినిమా. ఒకరి ప్రేమను గెల్చుకోవడానికి ప్రయత్నించిన హీరో ఆ ‘డిస్కవరింగ్ లవ్...’ జర్నీలో ఎక్కడకు చేరాడన్నది స్టోరీ. కథ ఏమిటంటే... అశ్విన్ (సుమంత్ అశ్విన్) రెండేళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తుంటాడు. ఇందు (మిస్తీ చక్రవర్తి) అనే ప్రేమికురాలి పేరునూ, ఆమెతో ప్రేమనూ కలవరిస్తూ, పలవరిస్తుంటాడు. గమ్మత్తేమిటంటే, అసలు అతను జైలులో పడడానికే కారణం - ఆ ప్రేమికురాలు. జైలు నుంచి బయటికొచ్చిన హీరో తన స్నేహితులెవరూ తెలియదని చెప్పినా, కనిపించని హీరోయిన్ అడ్రస్, ఫోన్ల కోసం అన్వేషణ సాగిస్తుంటాడు. ఆ క్రమంలో అతనికి మరో హీరోయిన్‌తో పరిచయమవుతుంది. పేరు- నీరజ అలియాస్ నీరూ (సీరత్ కపూర్). తగాదాగా మొదలైన ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారుతుంది. ప్రేమికురాలికి మళ్ళీ దగ్గరవడానికి హీరో, నీరూ సాయం తీసుకుంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో ఇందుతో హీరో ప్రేమ ఒకప్పుడు దెబ్బతినడానికి కారణం మాజీ క్లాస్మేట్ వంశీ (రోషన్). ఆ కథ అంతా విన్న నీరూ, హీరో ప్రేమ గెలవడానికి స్నేహం కొద్దీ సాయపడడం మొదలుపెడుతుంది. ప్రేమికురాలి దగ్గరే హీరోకు ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. వంశీ మీద ఇందుకు అనుమానం కలిగేందుకు సినిమా హాలులో బాత్రూమ్ దగ్గర సన్నిహితంగా మెలగడం దగ్గర నుంచి అన్నీ చేస్తుంది. ఫలితంగా వంశీ మీద అనుమానం పెరిగి, హీరోతో పెళ్ళికి ప్రేమికురాలు ఇందు సిద్ధపడుతుంది. కానీ, అక్కడే మరో ట్విస్ట్. అదేమిటి, స్నేహం కోసం హారతి కర్పూరంగా మారిన నీరూ కథ ఏమైందన్నది మిగతా సినిమా. రెండు గంటల చిల్లర నిడివే... ఉన్న చిన్న సినిమా ఇది. కాకపోతే, సినిమా నిండా సీన్లు, ఎపిసోడ్లు అనేకం. ఫస్టాఫ్ అంతా హీరో మొదలు అన్ని పాత్రల పరిచయం, దూరమైన ప్రేమికురాలు ఇందు ఆచూకీ కనుక్కోవడానికి అతను చేసే ప్రయత్నాల చుట్టూరానే తిరుగుతుంది. అసలు కథ సెకండాఫ్. హీరో ఫ్లాష్‌బ్యాక్ తెలిశాక హీరోకు సాయపడేందుకు నీరూ త్యాగాల పరంపర మొదలయ్యాక విషయం చిక్కబడుతుంది. ప్రేక్షకులకు కూడా అక్కడ నుంచే రెండో హీరోయిన్ క్యారెక్టర్ మీద సానుభూతి మొదలవుతుంది. ఆ పైన హీరో తన అసలు సిసలు ప్రేమను ఎవరి దగ్గర పొందాడన్నది ఓపెన్‌మైండ్‌తో చూడాల్సిన మిగతాకథ. ప్రేమ, కాస్తంత హీరోయిజమ్, కావాల్సినంత చలాకీదనం నిండిన పాత్ర సుమంత్ అశ్విన్ చేశారు. ‘చిన్నదాన నీ కోసం’ ఫేమ్ మిస్తీ చేసిన ఇందు పాత్ర మందు, చిందు తరహా వేషం. ‘నేను సక్సెస్ఫుల్ వ్యక్తిని ప్రేమించాలనుకున్నానే కానీ, ప్రేమను సక్సెస్ చేసుకోవాలనుకోలేదు’ అని వాపోయే డైలాగే ఆమె క్యారెక్టరైజేషన్‌కూ, కథకూ కీలకం. కథ సాగుతున్న కొద్దీ స్క్రిప్ట్‌లో, యాక్షన్‌లో ముఖ్యమైనది నీరూ పాత్ర. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్‌తో దాన్ని బాగా చేయించారు. చివరలో ఎయిర్పోర్ట్ సీన్ ఆ క్యారెక్టరైజేషన్‌కు ఎమోషనల్ క్లైమాక్స్. నవ యువ రక్తం వైపే... సంగీతం, ఆర్ట్, కెమేరా వర్క్ - ఇలా ముఖ్య విభాగాలన్నిటిలో మొగ్గుచూపారు. ఆ సంగతి తెరపై కనిపిస్తుంది. మాటల రచన, దర్శకత్వ బాధ్యత చేపట్టిన ఆర్. సామలకు ఇది తొలి డెరైక్షన్ చాన్స్. బాక్సాఫీస్ లవ్‌స్టోరీలెన్నో అందించిన ఎం.ఎస్. రాజు ఆ ప్యాట్రన్‌లో, చాలారోజులకు ఇప్పుడు కథ, స్క్రీన్‌ప్లే, క్రియేటివ్ సూపర్‌విజన్‌లతో అందించిన ఫిల్మ్ ఇది. ‘ఒక్కడు’లో మహేశ్ తరహాలో ఈ ఫిల్మ్‌లోనూ హీరోతో సెంటిమెంటల్ గా కబడ్డీ ఆటగాడిగా తెరపై కూత పెట్టించారు. ఇలాంటి సక్సెస్ఫుల్ ఫార్ములా సెంటిమెంట్లన్నీ బాక్సాఫీస్ వద్ద కొలంబస్ లవ్ జర్నీకి కలిసొస్తాయేమో చూడాలి. షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే. మొత్తం వర్కింగ్ డేస్ 55 రోజులు.ఇలియానా, రకుల్ ప్రీత్సింగ్లకు డబ్బింగ్ చెప్పే హరిత ఇందులో సీరత్ కపూర్‌కు గళమిచ్చారు. మిస్తీ చక్రవర్తికి గాయని శ్రావణ భార్గవి చెప్పారు. కథ, స్క్రీన్‌ప్లే, క్రియేటివ్ సూపర్విజన్ చేసిన ఎమ్మెస్ రాజు చివరలో తెరపై మెరుస్తారు. -
ఇదో ఇంట్రస్టింగ్ ప్రేమకథ
‘‘టైటిల్, ట్రైలర్ చూస్తుంటే వెరీ ఇంట్రస్టింగ్ లవ్ ప్లాట్లా అనిపిస్తోంది. ఇలాంటి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్ ఎప్పుడొచ్చినా ఆదరణ ఉంటుంది. సుమంత్ అశ్విన్‌కిది వండర్ఫుల్ ఫిల్మ్ అవుతుంది. సినిమా సినిమాకీ అతను బాగా ఎదుగుతున్నాడు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. సుమంత్ అశ్విన్, సీరత్‌కపూర్, మిస్తీ కాంబినేషన్లో ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ‘కొలంబస్’ చిత్రం బిగ్ ఆడియో సీడీని శనివారం హైదరాబాద్‌లో వెంకటేశ్ ఆవిష్కరించారు. నిర్మాతగా అశ్వనీ కుమార్ ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని సీనియర్ దర్శకుడు బి. గోపాల్ ఆకాంక్షించారు. సుమంత్ అశ్విన్ చాలా నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన నటుడని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రశంసించారు. ఈ నెల 22న దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అశ్వనీకుమార్ సహదేవ్ ప్రకటించారు. అమెరికాను కొలంబస్ కనిపెడితే, తనలాంటి వారిని ఎమ్మెస్ రాజు కనిపెడుతున్నారని దర్శకుడు ఆర్. సామల సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఎగ్జైటింగ్ కథాంశమిదని సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఎమ్మెస్ రాజు, సురేశ్ కపాడియా, దర్శకుడు అడివి సాయికిరణ్, ఛాయాగ్రాహకుడు భాస్కర్ సామల, నాయికలు సీరత్ కపూర్, మిస్తీ, చీఫ్ అసోసియేట్ డెరైక్టర్ ఇంద్రసేనా తదితరులు మాట్లాడారు. -
లవ్ డిస్కవరీ!
కొలంబస్ అమెరికా కనిపెట్టాడు.... ఇదే పేరు పెట్టుకున్న ఓ యువకుడు మాత్రం ప్రేమలో కొత్త కోణాలను అన్వేషించి, లవ్‌కి కొత్త అర్థం చెప్పేశాడు. అదేంటో తెలియాలంటే కొలంబస్ చూడాల్సిందే. ‘డిస్కవరీ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్త్రీ చక్రవర్తి నాయకానాయికలుగా ఆర్. సామల దర్శకత్వంలో ఏకేఎస్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నా పాత్ర చాలా లైవ్లీగా, లవ్లీగా ఉంటుంది. యూత్‌కే కాకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. ‘‘యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా హీరోహీరోయిన్ల పాత్రలు ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల. -
ప్రేమాన్వేషణలో కొలంబస్
కొలంబస్ అనేవాడు సముద్రంలో ఎక్కడికో వెళుతూ..వెళుతూ అమెరికాను కనిపెట్టేశాడు. కుర్రాళ్లు కూడా అంతే. జీవిత సముద్రంలో ఈదుకుంటూ వెళ్తూ ప్రేమకోసం అన్వేషిస్తుంటారు. ప్రేమ దొరికితే మాత్రం కొలంబస్ కన్నా ఎక్కువ ఆనందపడిపోతారు. అలా డిస్కవరీ ఆఫ్ లవ్ కోసం తపించిన ఓ అందమైన, తెలివైన కుర్రాడి కథే ‘కొలంబస్’. ఇటీవల ‘లవర్స్’, ‘కేరింత’ చిత్రాలతో రెండు భారీ విజయాలు సాధించిన సుమంత్ అశ్విన్ ఇందులో కథానాయకుడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్ కపూర్, ‘చిన్నదాన నీకోసం’ ఫేమ్ మిస్తీ చక్రవర్తి కథానాయికలు. ఏకేఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆర్.సామల దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, ‘‘ఇష్క్’ రచయిత ఆర్.సామల చెప్పిన కథ వినగానే వెంటనే కనెక్టయిపోయా. ఎంటర్టైన్మెంట్తో ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యమున్న చిత్రమిది. నా హార్ట్‌కి చాలా దగ్గరగా అనిపించిన సినిమా ఇది. అక్టోబర్‌లో పాటలను, నవంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కేవీ కృష్ణారెడ్డి. -
కొలంబస్లో తిరుపతి..
న్యూయార్క్: అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన కొలంబస్ నగరంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నారు. ఇందులో గ్రానైట్ రాయితో చేసిన స్వామివారి 8 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే ఇది అమెరికాలో రెండో బాలాజీ టెంపుల్ కానుంది. మొదటి దేవాలయాన్ని 1994లో ‘భారతీయ హిందూ టెంపుల్’ పేరుతో నిర్మించారు. ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెంపుల్’ పేరుతో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ ఆలయంలో కనీసం 1000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తామని దేవాలయ కమిటీ అధికార ప్రతినిధి గణేష్ వత్యమ్ తెలిపారు. గుడి గోపురాన్ని ఇత్తడి లేదా రాగి లోహాలతో తయారు చేయిస్తామని అన్నారు. దీని కోసం శిల్పులను భారత్ నుంచే రప్పిస్తున్నామని చెప్పారు. ఈ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. -
అమెరికాలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు
-
ప్రేమాన్వేషణలో...కొలంబస్
అమెరికాను కనుగొన్నది ఎవరు? అనడిగితే ఎవరైనా కొలంబస్ పేరే చెబుతారు. ఇప్పుడు అదే పేరుతో ఓ ప్రేమకథ తయారవుతోంది. ‘కొలంబస్’లా అతను కూడా ప్రేమను అన్వేషిస్తూ అనుకున్నది సాధిస్తాడేమో! సుమంత్ అశ్విన్ , ‘రన్ రాజా రన్’ ఫేం శీరత్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏకేఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వినీ కుమార్ సహదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘చిన్నదాన నీ కోసం’ ఫేమ్ మిస్తి ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఒక షెడ్యూలు పూర్తయింది. ఈ నెల 21 నుంచి జూన్ 6 వరకూ ఏకధాటిగా మరో షెడ్యూలు జరగనుంది. ఆగస్టు 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘యువతరం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని సుమంత్ అశ్విన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్ రోషన్, ఎడిటింగ్: కేవీ కృష్ణారె డ్డి, కెమెరా: భాస్కర్ సామల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జి.రాంబాబు, మనోహర్. -
ప్రేమ కోసం ‘కొలంబస్’గా...
యువ హీరో సుమంత్ అశ్విన్ ఈ ఏడాది ఒకటికి, రెండు సినిమాల్లో తెరపై మెరవనున్నారు. మునుపటి చిత్రాల నుంచి బాక్సాఫీస్ పాఠాలు నేర్చుకున్న ఈ కథానాయకుడు ఇప్పటికే ‘దిల్’ రాజు నిర్మాతగా, అడివి సాయి కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కేరింత’లో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే ‘కొలంబస్’ అనే కొత్త చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేశారు. ఈ వినోదాత్మక ప్రేమకథకు దర్శకుడు కొత్తవాడని భోగట్టా. -
ఆరోజు ఆకాశాన వెయ్యి ఇంద్రధనస్సులు!
‘నా అమెరికా ప్రయాణం’... అని చాలామంది యాత్రా కథనాలు రాశారు. ఎవరి పర్యటన వారికి ప్రత్యేకమే. అలాగే నా పర్యటనలోనూ ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి అమెరికాలో పర్యటించినప్పుడే స్వాతంత్య్ర వేడుకలను కూడా వీక్షించాను. మన జాతీయ వేడుక గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు రానున్నారు. ఈ సందర్భంగా నా అమెరికా పర్యటన, అక్కడి స్వాతంత్య్ర వేడుకలు గురించి నా అనుభూతులను మీతో పంచుకుంటున్నాను... మా అబ్బాయి సునీల్ సీనియర్ ఇంజనీర్‌గా కొలంబస్ ఇండియానాలో పనిచేస్తున్నాడు. మా కోడలు డేటా సైంటిస్టు. వారితో గడపడానికి నేను, నా భార్య అమెరికా వెళ్లాం. జూలై 4వ తేదీ అమెరికా స్వాతంత్య్రదినోత్సవం. ముందురోజు ఉదయమే మేము కొలంబస్ నుంచి వాషింగ్టన్కు బయలుదేరాం. మా ప్రయాణం ఇండియానా, ఓహియో రాష్ట్రాల గుండా సాగింది. అవి రెండూ మిడ్వెస్ట్ ప్రాంతంలోని వ్యవసాయ రాష్ట్రాలు. మొక్కజొన్న ప్రధాన పంట. రైతుల ఇళ్లు విశాలమైన వ్యవసాయ క్షేత్రాల మధ్య అక్కడక్కడా విసిరేసినట్లున్నాయి. అక్కడక్కడా గాలిమరలు కనిపిస్తున్నాయి. ఓహియో నది ఒడ్డున ‘వీలింగ్’ అనే అందమైన పట్టణం ఉంది. పెన్సిల్వేనియా, పిట్స్బర్గ్, మరీ పెద్దవి కాని చిన్న చిన్న గుట్టల్లాంటి కొండలు, పచ్చిక బయళ్లు, చిన్న చిన్న లోయలు... చెయ్యి తిరిగిన చిత్రకారుడు వేసిన అద్భుతమైన చిత్రంలా కనిపిస్తోంది ‘అపలాబియన్’ పర్వతశ్రేణి. నయనమనోహరంగా, నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో కొన్ని మైళ్లు వెళ్లాక ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఓ గుజరాతీకుటుంబం ఉంది. వాళ్లు అదే ప్రదేశంలో రెండు తరాలుగా వ్యాపారం చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాం. మేరీల్యాండ్ రాష్ట్రం మీదుగా సాగిన ప్రయాణం సుమారు పదిన్నర గంటల గడిచాక వాషింగ్టన్కు చేరింది. ఆ రోజు జూలై 4వ తేదీ. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశం, ఆ దేశ రాజధాని నగరంలో స్వాతంత్య్రదినోత్సవాల హడావిడి కనిపిస్తోంది. అమెరికా కూడా మనలాగే బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి చెందింది. మనకంటే సుమారుగా నూటా డెబ్భై ఏళ్ల ముందు 1776 జూలై 4వ తేదీన వారికి స్వాతంత్య్రం వచ్చింది. మేమంతా నగరం నడిబొడ్డున ఉన్న నేషనల్ మాల్‌కు వెళ్లాం. ఆ మాల్ ఒక ఊరంత ఉంది. తూర్పున కేపిటల్ నుంచి పశ్చిమాన ఫొటోమాక్ నది వరకు రెండు మైళ్ల దూరం విస్తరించి ఉంది. మాల్‌కు ఓ పక్క ప్రతిష్ఠాత్మకమైన ‘కేపిటల్ భవనం’. అమెరికా చట్టసభలు సెనెట్, కాంగ్రెస్ ఇక్కడే ఉన్నాయి. మరోపక్క అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసభవనం ‘వైట్‌హౌస్’ ఉంది. కేపిటల్ భవనానికి సమీపంలోనే ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉంది. జార్జి వాషింగ్టన్, జెఫర్సన్, లింకన్, రూజ్వెల్ట్ వంటి ప్రభావశీలురైన అమెరికా అధ్యక్షుల స్మారక చిహ్నాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్మిత్సోనియన్ అమెరికన్ ఆర్ట్ మ్యూజియం, అమెరికా హిస్టరీ మ్యూజియం, విమాన అంతరిక్ష మ్యూజియం, నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, నేచురల్ హిస్టరీ మ్యూజియం వంటి అనేక కట్టడాలు ఉన్నాయి. వేడుకలను చూడడానికి వచ్చిన వారితో మాల్ సందడిగా పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. కొద్దిసేపటికి కాన్స్టిట్యూషన్ అవెన్యూలో స్వాతంత్య్ర దినోత్సవ కవాతు మొదలైంది. రోడ్డుకు ఇరువైపుల ప్రజలు కిక్కిరిసి ఉన్నారు. కొంతమంది నిలబడి, కొందరు చెట్లనీడన కూర్చుని ఉన్నారు. వృద్ధులు మడతకుర్చీల్లో ఉన్నారు. మన జాతీయ పండుగల్లో ఉన్నట్లే అమెరికాలో కూడా అనేక అలంకారాలతో శకటాల ఊరేగింపు జరిగింది. వరుసగా కొన్ని నాట్యబృందాలు, జిమ్నాస్టిక్స్, సర్కస్ ఫీట్లు, కౌబాయ్ ప్రదర్శన జరిగింది. కొంతమంది నేల మీద కృత్రిమ గుర్రంలా నర్తించారు. మరికొంత మంది పిల్లలు, పెద్దలు నక్షత్రాల్లా దుస్తులు ధరించి నడిచారు. ఆ వెనుక స్వింగ్ డాన్స్ బృందం, రకరకాల మోడళ్ల సైకిళ్లతో విన్యాసాలు జరిగాయి. ఆ వెనుక సుమారు పాతిక మంది చిన్న పిల్లాడిని పోలిన పెద్ద బెలూన్ను మోసుకెళ్లారు. దాని పేరు ‘లిటిల్ బిగ్బోయ్’. ఈస్ట్ డాన్స్, కదం తొక్కుతున్న అశ్విక దళం... ఇలా ఎన్నో ప్రదర్శనలు సాగిపోయాయి. చివరగా ఒక శకటం వచ్చింది. అది భారతీయ దేవాలయాల నమూనాలో ఉన్న ఇస్కాన్ వారి శకటం. ఊహించకపోవడంతో అది ఇంకా ఆశ్చర్యపరిచింది. ఎంతో వైభవంగా జరిగిన పెరేడ్‌ను రెండుగంటల సేపు చూశాం. ముందస్తుగా అనుమతి తీసుకోకపోవడంతో వైట్‌హౌస్‌లోకి వెళ్లే అవకాశం రాలేదు. వైట్‌హౌస్‌లోకి వెళ్లాలంటే ఆరు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లోపలికి వెళ్తే ఒబామా జాతినుద్దేశించి ప్రసంగించడం, మిషెల్‌తో కలిసి అందరికీ షేక్‌హ్యాండ్ ఇస్తూ కలివిడిగా తిరగడం వంటివన్నీ దగ్గర నుంచి చూడవచ్చు. కాన్స్టిట్యూషన్ అవెన్యూ నుంచి కేపిటల్ భవనానికి వెళ్లాం. ఆ మహా నిర్మాణం రెండు శతాబ్దాలుగా ప్రపంచంలోని స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా వెలుగొందుతోంది. పాత సెనెట్ చాంబర్, నేషనల్ స్టాట్యూటరీ హాల్, రొటుండా ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ మ్యూజియాలు ఎంత ఎక్కువగా ఉంటాయో, వాటి నిర్వహణ ఎంత బాగుంటుందో, వాటిని చూడడానికి వచ్చే వారి సంఖ్య కూడా అదేస్థాయిలో ఉంటుంది. సాయంత్రానికి నేషనల్ మాల్లో కోలాహలం మరీ ఎక్కువైంది. స్మిత్సోనియన్ ఫోక్లైఫ్ ఫెస్టివల్ జోరుగా సాగుతోంది. కొంతమంది స్వచ్ఛంద సేవకులు పర్యాటకులకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. ఇస్కాన్ వారు తినుబండారాలు అందిస్తున్నారు. అమెరికన్ నేవీబ్యాండ్ వారి సంగీతకచేరి ఆకట్టుకుంటోంది. చీకటి పడే సమయానికి మేము వాషింగ్టన్ మాన్యుమెంట్ గ్రౌండ్స్‌కు చేరాం. అక్కడా జనసందోహమే. ఆరు నెలల పసిబిడ్డ నుంచి పండు ముదుసలి వరకు అన్ని వయసుల వాళ్లూ ఉన్నారు. అక్కడ వైభవంగా జరిగే బాణాసంచా చూడడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా రాత్రి 9.10 నిమిషాలకు బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి. ఆకాశమంతా వెలుగులతో నిండిపోయింది. వెయ్యి ఇంద్రధనుస్సులు ఒక్కసారిగా విరిసిన అనుభూతి కలిగింది. దాదాపుగా ఇరవై నిమిషాల పాటు సాగిన బాణాసంచా వెలుగులు చూసి ఆనందంగా అందరం గమ్యస్థానాల వైపు పయనించాం. - కలగర వెంకట్రావు, హైదరాబాద్ -
తెలుసు..కానీ ఏమీ తెలియదు!
సర్వే ‘సమాచార యుగంలో ఉన్నాం’ అని గొప్పగా చెప్పుకుంటాంగానీ, కొన్ని విషయాల్లో మన జ్ఞానం అంతంతమాత్రమేనని ఇటీవల ఒక సర్వే నిరూపించింది. ‘‘గొప్ప అన్వేషకుడిగా కొలంబస్కు ఎందుకు పేరు?’’ అని అడిగితే బ్రిటన్‌లో 70 శాతం మంది తెల్లముఖం వేశారు. కొందరు ‘‘అతడి గురించి తెలుసు’’ అన్నా వివరాలు మాత్రం చెప్పలేకపోయారు. కొలంబస్ విజయాల గురించి తప్పుగా చెప్పారు. ‘‘కొలంబస్ ఏ దేశస్థుడు?’’ అని అడిగితే- ‘‘ఏ దేశమో ఏమిటి? మనవాడే కదా’’ అన్నారు కొందరు ఆయన ఇటలీయుడనే విషయాన్ని మరచి! ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి ‘మార్క్‌టై్వన్ సృష్టించిన గొప్ప పాత్ర’ అన్నారు. బ్రిటన్‌కు చెందిన ఒక ట్రావెల్ కంపెనీ ఈ సర్వేను నిర్వహించింది. ‘‘ప్రపంచ ప్రసిద్ధ ప్రయాణాలు మన జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. అయితే... ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లారు? అనేది మాత్రం అందరూ చెప్పలేకపోవచ్చు’’ అంటున్నారు ట్రావెల్ కంపెనీ వాళ్లు. ‘‘గుర్తుంటేనేం లేకుంటేనేం... ఆ అన్వేషకుల కృషి మనల్ని ఎంతో ప్రభావితం చేసింది. వాళ్లు మనకంటూ ఒక మార్గం ఏర్పరిచారు. ఆ అన్వేషణ స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది’’ అన్నాడు ఒక ప్రయాణ ప్రేమికుడు. అది సరేగానీ, బిబిసిలో ఏ ఎడ్వెంచర్ ప్రోగ్రాం గురించి అడిగినా ఠకీమని చెప్పే బ్రిటన్ ప్రజలు కొలంబస్ గురించి ఇన్ని రకాలుగా చెప్పడం ఏమిటి అనేది ఒక వింత! -
ఉసిరే అని తింటే.. ఉసురు తీస్తుంది
చూడ్డానికి ఉసిరి కాయలా కనిపిస్తోంది కదా అని దీన్ని తింటే.. ఉసురు తీస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టుగా పేరొందిన మాంచినీల్ చెట్టు పండు. చెట్టు పేరులో మంచి ఉంది గానీ.. ఇది మహా చెడ్డది. ఎందుకంటే.. పండు తినడం సంగతి సరే.. సమీపంలోకి వెళ్లినా.. ఒళ్లు మంటలు పుడతాయి. చెట్టు కొమ్మలు, ఆకుల నుంచి కారే తెల్లటిపాలు వంటిది చర్మంపై పడితే బొబ్బలు తేలతాయి. మంటల్లో మనల్ని ఫ్రై చేస్తున్నట్టు ఉంటుంది. చెట్టు బెరడును కాల్చిన పొగ కళ్లను తాకితే.. తాత్కాలికంగా.. ఒక్కోసారి శాశ్వతంగా అంధత్వం వచ్చే ప్రమాదముంది. అందుకే ఈ చెట్టు ఉన్న చోట్ల డేంజర్ బోర్డులు పెడతారు. ఇంతకీ ఈ చెట్టు ఏయే ప్రాంతాల్లో ఉందో చెప్పలేదు కదూ.. అమెరికాలోని ఫ్లోరిడా, కరేబియన్ దీవులు, బహమాస్. దీని చరిత్ర ఎంత గొప్పదంటే.. అమెరికాను కనుగొన్న కొలంబస్ ఈ చెట్టు పండుకు ‘డెత్ ఆపిల్’ అని పేరు పెట్టాడు. అప్పట్లో విషప్రయోగం ద్వారా పేరొందిన యుద్ధ వీరులను చంపడానికి ‘మాంచినీల్’ ఎంతో సహాయపడిందట!