ఆ స్వేచ్ఛా దేవత కూడా వలసే! | Libertas is also immigrant | Sakshi
Sakshi News home page

ఆ స్వేచ్ఛా దేవత కూడా వలసే!

Published Sat, Feb 25 2017 2:23 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఆ స్వేచ్ఛా దేవత కూడా వలసే! - Sakshi

ఆ స్వేచ్ఛా దేవత కూడా వలసే!

అమెరికా అనగానే కళ్లముందు కనిపించే స్వేచ్ఛా ప్రతిమ.. అత్యంత ప్రముఖ వలస. రోమ్‌ స్వేచ్ఛా దేవత ‘లిబర్టస్‌’ ప్రతిరూపమైన ఈ భారీ విగ్రహాన్ని ఫ్రాన్స్‌ ప్రజలు అమెరికా ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. 1876 నుండి 1884 వరకూ ఎనిమిదేళ్ల పాటు ఈ కాంస్య విగ్రహాన్ని ఫ్రాన్స్‌లోనే నిర్మించారు. ఆ తర్వాత 350 భాగాలుగా చేసి 214 పెట్టెల్లో పెట్టి అమెరికాకు రవాణా చేశారు. అమెరికా చేరుకున్న తర్వాత ఆ విడిభాగాలన్నిటినీ కలిపి 1886లో న్యూయార్క్‌లో ‘లిబర్టీ ఐలండ్‌’లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఈ స్వేచ్ఛా ప్రతిమ ఎత్తు 151 అడుగుల 1 అంగుళం. విగ్రహాన్ని వేదికతో కలిపి చూస్తే 305.1 అడుగులు. విగ్రహం చేతిలో ఉన్న పుస్తకం మీద ‘1776 జూలై 4’ అనే అక్షరాలు చెక్కివుంటాయి. అది అమెరికా స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్న రోజు. ఆ విగ్రహం పాదాల చెంత తెగిపడ్డ సంకెళ్లు ఉంటాయి. ఈమె ‘దేశ బహిష్కృతుల తల్లి’ అని, ఆమె చేతిలోని కాగడా ప్రపంచమంతటికీ స్వాగతం చెప్తోందని అమెరికా కవయిత్రి ఎమ్మా లాజరస్‌ అభివర్ణించారు.

2015 జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో జాతుల శాతాలివీ..: అమెరికా జనాభా ప్రస్తుతం 32.442 కోట్ల మంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో చైనా, భారత్‌ తర్వాత మూడో స్థానంలో ఉంది. 81 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. 2015 జనాభా లెక్కల ప్రకారం అమెరికన్లలో జాతుల శాతం ఇలావుంది...

శ్వేతజాతీయులు 61.6%
నల్ల / ఆఫ్రికా జాతీయులు 13.3%
ఆసియా జాతీయులు 5.6%
ఆదివాసీ అమెరికన్లు 1.4%
ఇతర జాతులు 0.2%
హిస్పానిక్‌ /లాటినో 17.6%
రెండు, మూడు జాతులు 2.6%

   

(చదవండి: కొలంబస్‌ నుంచి హెచ్‌1బీ వరకు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement