ప్రేమాన్వేషణలో కొలంబస్ | Columbus in search of love | Sakshi
Sakshi News home page

ప్రేమాన్వేషణలో కొలంబస్

Published Tue, Sep 8 2015 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

ప్రేమాన్వేషణలో కొలంబస్

ప్రేమాన్వేషణలో కొలంబస్

కొలంబస్ అనేవాడు సముద్రంలో ఎక్కడికో వెళుతూ..వెళుతూ అమెరికాను కనిపెట్టేశాడు. కుర్రాళ్లు కూడా అంతే. జీవిత సముద్రంలో ఈదుకుంటూ వెళ్తూ ప్రేమకోసం అన్వేషిస్తుంటారు. ప్రేమ దొరికితే మాత్రం కొలంబస్ కన్నా ఎక్కువ ఆనందపడిపోతారు. అలా డిస్కవరీ ఆఫ్ లవ్ కోసం తపించిన ఓ అందమైన, తెలివైన కుర్రాడి కథే ‘కొలంబస్’. ఇటీవల ‘లవర్స్’, ‘కేరింత’ చిత్రాలతో రెండు భారీ విజయాలు సాధించిన సుమంత్ అశ్విన్ ఇందులో కథానాయకుడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్ కపూర్, ‘చిన్నదాన నీకోసం’ ఫేమ్ మిస్తీ చక్రవర్తి కథానాయికలు. ఏకేఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆర్.సామల దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, ‘‘ఇష్క్’ రచయిత ఆర్.సామల చెప్పిన కథ వినగానే వెంటనే కనెక్టయిపోయా. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యమున్న చిత్రమిది. నా హార్ట్‌కి చాలా దగ్గరగా అనిపించిన సినిమా ఇది. అక్టోబర్‌లో పాటలను, నవంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కేవీ కృష్ణారెడ్డి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement