ప్రేమాన్వేషణలో...కొలంబస్ | Sumanth Ashwin's Columbus getting ready | Sakshi
Sakshi News home page

ప్రేమాన్వేషణలో...కొలంబస్

Published Tue, Apr 7 2015 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

ప్రేమాన్వేషణలో...కొలంబస్

ప్రేమాన్వేషణలో...కొలంబస్

అమెరికాను కనుగొన్నది ఎవరు? అనడిగితే ఎవరైనా కొలంబస్ పేరే చెబుతారు. ఇప్పుడు అదే పేరుతో ఓ ప్రేమకథ తయారవుతోంది. ‘కొలంబస్’లా అతను కూడా ప్రేమను అన్వేషిస్తూ అనుకున్నది సాధిస్తాడేమో! సుమంత్ అశ్విన్ , ‘రన్ రాజా రన్’ ఫేం శీరత్ కపూర్ జంటగా నటిస్తున్న  ఈ చిత్రం ద్వారా ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏకేఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశ్వినీ కుమార్ సహదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘చిన్నదాన నీ కోసం’ ఫేమ్ మిస్తి ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
 
 ఇటీవలే ఒక షెడ్యూలు పూర్తయింది. ఈ నెల 21 నుంచి జూన్ 6 వరకూ ఏకధాటిగా మరో షెడ్యూలు జరగనుంది. ఆగస్టు 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘యువతరం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని సుమంత్ అశ్విన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్ రోషన్, ఎడిటింగ్: కేవీ కృష్ణారె డ్డి, కెమెరా: భాస్కర్ సామల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జి.రాంబాబు, మనోహర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement