sirat Kapoor
-
ఆరేళ్లకు మళ్లీ!
2014లో వచ్చిన ‘జిద్’ అనే హిందీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు సీరత్ కపూర్. ఆ తర్వాత వరుసగా తెలుగులో ‘రన్ రాజా రన్, రాజుగారి గది 2, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి సినిమాలతో బిజీ అయ్యారు. ఆమె నటించిన ‘మా వింత గాధ వినుమా’ లాక్డౌన్లో విడుదలైంది. తొలి హిందీ సినిమా తర్వాత వరుసగా తెలుగు సినిమాలే చేసుకుంటూ వచ్చిన సీరత్ ఆరేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్లో ఓ సినిమా కమిటయ్యారు. ‘మారిచ్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఓ మర్డర్ మిస్టరీలో హీరోయిన్గా నటిస్తున్నారు సీరత్. నసీరుద్దిన్ షా, అనితా, తుషార్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది థియేటర్స్‌లోకి తీసుకొస్తారట. -
బీ ఫిట్
గ్లామర్ ఇండస్ట్రీలో ఫిట్నెస్ కీలకం. ఫిట్‌గా ఉండటానికి గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు స్టార్స్. ఎప్పటికప్పుడు ఆ ఫిట్నెస్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ‘రన్ రాజా రన్, రాజుగారి గది 2, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి సినిమాల్లో నటించిన సీరత్ కపూర్ కూడా ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్. ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తూ తనని తాను ఫిట్‌గా ఉంచుకుంటారామె. ‘బీ ఫిట్’ అన్నది ఆమె మంత్రం. తాజాగా ఓ ఫిట్నెస్ వీడియోను షేర్ చేసుకున్నారు సీరత్. ‘ఈఎంఎస్’ అనే సరికొత్త వర్కౌట్‌ను కొన్ని రోజులుగా సాధన చేస్తున్నారు. ఓ మెషీన్‌ను శరీరానికి అనుసంధానం చేసి వర్కౌట్స్ చేస్తూ అందులో రీడింగ్‌ను గమనించవచ్చు. ఇది కొంచెం కష్టమైన వర్కౌట్ అని, ఇందులో ప్రావీణ్యం సంపాదిస్తున్నాననీ అన్నారామె. ప్రస్తుతం ‘మా వింత గాధ వినుమా’ అనే సినిమాలో నటిస్తున్నారు సీరత్. -
అందర్నీ ఒకేలా చూడాలి!
‘‘అవకాశాల విషయంలో అందర్నీ సమానంగానే చూడాలి. ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్ అని వేరుగా చూడకూడదు’’ అంటున్నారు సీరత్ కపూర్. ప్రస్తుతం బంధుప్రీతి (నెపోటిజమ్), ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్ అనే చర్చ బాలీవుడ్లో తీవ్రంగా నడుస్తోంది. ఈ విషయం మీద ‘రన్ రాజా రన్, కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ హీరోయిన్ సీరత్ కపూర్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘నెపోటిజమ్ ఏ పరిశ్రమలో అయినా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. అది సహజం. కాదనలేం కూడా. కానీ అవకాశాల విషయంలో సమాన న్యాయం ఉండాలి. ప్రతిభను బట్టే అవకాశం ఇవ్వాలి. కేవలం స్టార్ కిడ్స్ మాత్రమే కాకుండా ప్రతిభ ఉన్న ప్రతీ ఒక్కరినీ నిజాయతీగా ప్రోత్సహించాలి. వారసులను, బయటినుంచి వచ్చేవాళ్లను ఒకేలా చూడాలి. అలాంటి వాతావరణం ఏర్పడేలా చేసే బాధ్యత అందరి మీదా ఉంది’’ అన్నారు సీరత్. ‘ప్రస్తుతం ‘మా వింత గాధ వినుమ’ అనే సినిమాలో నటిస్తున్నారు సీరత్. -
సైన్స్... రొమాన్స్!
ఆత్మలు ఉన్నాయా... లేవా! మనిషి బరువు ఎంతున్నా మరణానంతరం 21 గ్రాముల తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. ఈ అంశాలతో దర్శకుడు వీఐ ఆనంద్ తీసిన సైంటిఫిక్, రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి హిట్టయ్యింది. మళ్లీ అలాంటి ఓ వినూత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వీఐ ఆనంద్. అల్లు శిరీష్ హీరోగా లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించనున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ‘‘సైంటిఫిక్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు అల్లు శిరీష్. చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని వీఐ ఆనంద్ తెలిపారు. సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: సతీశ్ వేగేశ్న, రాజేశ్ దండ. -
అతనితో మా లవ్ కొత్తగా ఉంటుంది!
ఆ అమ్మాయి పేరు నీరజ. చూడచక్కగా ఉంటుంది. చూడగానే కుర్రకారు లవ్‌లో పడిపోయేంత అందగత్తె. నీరజకు దీటుగా అంతే అందంగా ఉంటుంది ఇందు. ఈవిడగారి కళ్లల్లోకి చూస్తే కుర్రకారు ఫ్లాట్. ఈ ఇద్దరి సంగతి పక్కన పెట్టి, ఆ కుర్రాడి గురించి చెప్పుకుందాం. ఇతగాడు చాకులాంటివాడు. అమ్మాయిల మనసు దోచుకునేంత హ్యాండ్సమ్గా ఉంటాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు, ఈ అబ్బాయి చేసే సందడితో సాగే చిత్రం ‘కొలంబస్’. ఆ కుర్రాడు సుమంత్ అశ్విన్. నీరజగా సీరత్ కపూర్, ఇందు పాత్రను మిస్తీ చక్రవర్తి చేశారు. ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సీరత్ కపూర్ మాట్లాడుతూ -‘‘ఇందులో కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే అమ్మాయి పాత్ర చేశాను. ఒక కొత్త లవ్‌స్టోరీతో ఈ సినిమా ఉంటుంది. సుమంత్ అశ్విన్ మంచి కో-స్టార్. ‘రన్ రాజా రన్’, ‘టైగర్’ చిత్రాలు నటిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రం ఆ పేరును రెట్టింపు చేస్తుందనే నమ్మకం ఉంది. మొదట్లో తెలుగు భాష తెలియకపోవడంతో చాలా ఇబ్బందిపడ్డా. ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నా. నటనకు అవకాశం ఉండే గ్లామరస్ రోల్స్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి’’ అని చెప్పారు. మరో హీరోయిన్ మిస్తీ చక్రవర్తి మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో చలాకీగా, హుందాగా ఉండే అమ్మాయి పాత్ర చేశాను. కథ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటాయి. అలాగే, ఈ ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుంది. సుమంత్ అశ్విన్‌తో నటించడం కంఫర్టబుల్‌గా అనిపించింది. యూత్, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ‘కొలంబస్’ తర్వాత నాకు తెలుగులో అవకాశాలు పెరుగుతాయనుకుంటున్నాను. ప్రస్తుతం హిందీలో చేసిన ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ విడుదలకు సిద్ధమవుతోంది’’ అన్నారు. -
ఫ్రెండా? లవరా?
‘నీకు కుడి కన్ను కావాలా? ఎడమ కన్ను కావాలా?’ అని ఎవరైనా అడిగితే.. ఏం చెప్పగలం? ఆ కుర్రాడి పరిస్థితి కూడా అంతే. ప్రియురాలా? స్నేహితుడా? తేల్చుకోవాల్సి వచ్చింది. కానీ, ఇద్దరూ కావాలి. ఏం చేస్తాడు? ఈ ఇద్దరి కారణంగా ఆ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘టైగర్’. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సందీప్ కిషన్ కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రమిదని ‘ఠాగూర్’ మధు అంటున్నారు. అందరూ చూడదగ్గ మంచి మాస్ మూవీ ఇదని, అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు. సందీప్ కిషన్ పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని, అద్భుతంగా చేశాడని, ప్రేమ, స్నేహం, యాక్షన్ తదితర అంశాలతో రూపొందిన పూర్తి స్థాయి కమర్షియల్ మూవీ ఇదని ఎన్వీ ప్రసాద్ తెలిపారు. -
ప్రేమాన్వేషణలో...కొలంబస్
అమెరికాను కనుగొన్నది ఎవరు? అనడిగితే ఎవరైనా కొలంబస్ పేరే చెబుతారు. ఇప్పుడు అదే పేరుతో ఓ ప్రేమకథ తయారవుతోంది. ‘కొలంబస్’లా అతను కూడా ప్రేమను అన్వేషిస్తూ అనుకున్నది సాధిస్తాడేమో! సుమంత్ అశ్విన్ , ‘రన్ రాజా రన్’ ఫేం శీరత్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఏకేఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వినీ కుమార్ సహదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘చిన్నదాన నీ కోసం’ ఫేమ్ మిస్తి ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఒక షెడ్యూలు పూర్తయింది. ఈ నెల 21 నుంచి జూన్ 6 వరకూ ఏకధాటిగా మరో షెడ్యూలు జరగనుంది. ఆగస్టు 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘యువతరం, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని సుమంత్ అశ్విన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్ రోషన్, ఎడిటింగ్: కేవీ కృష్ణారె డ్డి, కెమెరా: భాస్కర్ సామల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జి.రాంబాబు, మనోహర్. -
బొబ్బిలిలో ‘టైగర్’!
బొబ్బిలి: సందీప్ కిషన్ హీరోగా, సీరత్ కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ‘టైగర్’ సినిమా క్లైమాక్స్‌ను చారిత్రక బొబ్బిలి రాజుల గెస్టుహౌస్‌లో చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాసు వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఎ న్వీఆర్ సినీ పిక్చర్ బ్యానర్‌పై ఠాగూర్ మధు, ప్రసాద్‌లు చిత్రా న్ని నిర్మిస్తున్నారు. సినిమాలో విలన్‌గా నటిస్తున్న దొర్తె, ముం బైకి చెందిన బాబీలపై సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు గురువారం తీశారు. సినిమాలో టీవీ నటుడు కల్కి రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. మరో ఐదు రోజులు ఇక్కడే షూటింగ్ నిర్వహిస్తారు. సినిమా నిర్మాణానికి, లోకేషన్ పరంగా బొబ్బిలి చాలా బాగుందని, ఇక్కడ తీసిన ప్రతి సినిమా విజయవంతం అవుతుందని వారు తెలిపారు.