మా అబ్బాయి రెండు గిఫ్టులు ఇచ్చాడు | Columbus Movie Success Meet - | Sakshi
Sakshi News home page

మా అబ్బాయి రెండు గిఫ్టులు ఇచ్చాడు

Published Sun, Oct 25 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

మా అబ్బాయి రెండు గిఫ్టులు ఇచ్చాడు

మా అబ్బాయి రెండు గిఫ్టులు ఇచ్చాడు

‘‘ఈ విజయదశమి నాకు మర్చిపోలేని రోజు. 25 ఏళ్ల క్రితం సరిగ్గా అక్టోబర్‌లో నేను సినిమాలు తీయడం మొదలుపెట్టాను. ఈ ఏడాది మా అబ్బాయి ‘కేరింత’, ‘కొలంబస్’ చిత్రాలతో నాకు రెండు మంచి గిఫ్టులు ఇచ్చాడు’’ అని నిర్మాత ఎమ్మెస్ రాజు అన్నారు. సుమంత్ అశ్విన్, శీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి నాయకానాయికలుగా ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ‘కొలంబస్’ చిత్రవిజయోత్సవం శనివారం జరిగింది.
 
 ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ- ‘‘అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ క్రెడిట్ చిత్ర నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్‌కు దక్కుతుంది. ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్లకు నటీనటులకు చాలా థ్యాంక్స్’’ అని నిర్మాత అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘రాజుగారితో పనిచేయడం ఆనందం అనిపించింది. ఆయనతో మరోసారి వర్క్ చేయాలని ఉంది. క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు’’ అని చెప్పారు.
 
  ‘‘ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ద్వితీయార్ధం
 చూస్తున్నప్పుడు ఇంత మంచి సినిమా చేశామా అని చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాను’’ అని సుమంత్ అశ్విన్ చెప్పారు. కథానాయిక శీరత్‌కపూర్, ఎడిటర్ కేవీ కృష్ణారెడ్డి, సంగీతదర్శకుడు జితిన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు రాంబాబు, మను తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement