లవ్ డిస్కవరీ! | Columbus movie : Feel Good Love Story | Sakshi
Sakshi News home page

లవ్ డిస్కవరీ!

Published Sun, Sep 27 2015 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

లవ్ డిస్కవరీ!

లవ్ డిస్కవరీ!

కొలంబస్ అమెరికా కనిపెట్టాడు.... ఇదే పేరు పెట్టుకున్న ఓ యువకుడు మాత్రం ప్రేమలో కొత్త కోణాలను అన్వేషించి, లవ్‌కి కొత్త అర్థం చెప్పేశాడు. అదేంటో తెలియాలంటే కొలంబస్ చూడాల్సిందే. ‘డిస్కవరీ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక.  సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్త్రీ చక్రవర్తి నాయకానాయికలుగా ఆర్. సామల దర్శకత్వంలో ఏకేఎస్ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.

నా పాత్ర చాలా లైవ్లీగా, లవ్లీగా ఉంటుంది. యూత్‌కే కాకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. ‘‘యూత్‌ఫుల్  రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా హీరోహీరోయిన్ల పాత్రలు ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement